#767 సామిని రమ్మనవె sAmini rammanave

Titleసామిని రమ్మనవెsAmini rammanave
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసామిని రమ్మనవెsAmini rammanave
చరణం
charaNam 1
సారసాక్షుని సరగున పిలువవె
సరస మాడుటకు సమయము యిది
sArasAkshuni saraguna piluvave
sarasa mADuTaku samayamu yidi
చరణం
charaNam 2
మంద గమనరొ మదనుని కేళికి
సుందరాంగుని సుదతిరొ నేడు
manda gamanaro madanuni kELiki
sundarAnguni sudatiro nEDu
చరణం
charaNam 3
మంగళ పురీశుని మమతలు మరువను
పంకజాక్షిరో ప్రేమతో నేడు
mangaLa purISuni mamatalu maruvanu
pankajAkshirO prEmatO nEDu

#766 ఎందుకు రాడాయ enduku rADAya

Titleఎందుకు రాడాయenduku rADAya
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaదేశి తోడిdESi tODi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఎందుకు రాడాయ యవరే మన్నారుenduku rADAya yavarE mannAru
అనుపల్లవి anupallaviసందేహమేలనే సఖియరో యీ వ్యాళsandEhamElanE sakhiyarO yI vyALa
చరణం
charaNam 1
మందయాన నాపై మత్సర మేలనే
యిందు వచ్చి నేడు పొంద వద్దంటిన
mandayAna nApai matsara mElanE
yindu vachchi nEDu ponda vaddanTina
చరణం
charaNam 2
కలికిరొ యీ వ్యాళ కోరియున్నానే
తొలి జేసిన బాస తెలుసుకో లేడాయ
kalikiro yI vyALa kOriyunnAnE
toli jEsina bAsa telusukO lEDAya
చరణం
charaNam 3
మనసు దెలిసి రాడే మంగళపురి వాసుడు
చిన్ననాటి చెలిమి చైగూడక పోయ
manasu delisi rADE mangaLapuri vAsuDu
chinnanATi chelimi chaigUDaka pOya

#765 కమలాక్షి వేగమె kamalAkshi vEgame

Titleకమలాక్షి వేగమెkamalAkshi vEgame
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఖరహరప్రియkharaharapriya
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviకమలాక్షి వేగమె కాంతుని తోడి త్యావేkamalAkshi vEgame kAntuni tODi tyAvE
చరణం
charaNam 1
మనసు నిలువదాయ మద గజ గామిని
నేనింత సైరిస లేను నారీమణి పిలువవే
manasu niluvadAya mada gaja gAmini
nEninta sairisa lEnu nArImaNi piluvavE
చరణం
charaNam 2
నా ప్రాణనాథుడు నన్నెడబాసె నేడు
నా ప్రాప్తి కేమనవచ్చు నాగావేణి రమ్మనవే
nA prANanAthuDu nanneDabAse nEDu
nA prApti kEmanavachchu nAgAvENi rammanavE
చరణం
charaNam 3
మనసిందు లేదాయ మంగళపురి వాసునికి
నిన్నటి వ్యాళ నుంచి నిదుర కంటికి రాదాయ
manasindu lEdAya mangaLapuri vAsuniki
ninnaTi vyALa nunchi nidura kanTiki rAdAya

#764 సామీ రాడాయనె sAmI rADAyane

Titleసామీ రాడాయనెsAmI rADAyane
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaహరి కాంభోజిhari kAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసామీ రాడాయనెsAmI rADAyane
అనుపల్లవి anupallaviసరసుడు లేని ఈ సొగసెవ్వరు జూచేరేsarasuDu lEni I sogasevvaru jUchErE
చరణం
charaNam 1
సారసాక్షి రమ్మనుచు సరసముతో నన్ను
కరుణతో లాలించి నా కరుణెందు బోయెనో
sArasAkshi rammanuchu sarasamutO nannu
karuNatO lAlinchi nA karuNendu bOyenO
చరణం
charaNam 2
క్షణ మాత్రమైన వుపేక్షణము చాయక నన్ను
క్షణ క్షణము లాలించిన సరసమెందు బోయెనో
kshaNa mAtramaina vupEkshaNamu chAyaka nannu
kshaNa kshaNamu lAlinchina sarasamendu bOyenO
చరణం
charaNam 3
సురత కేళిలో నను సొక్కి సోలించిన
వర మంగళ పురీశుని వలపెందు బోయెనో
surata kELilO nanu sokki sOlinchina
vara mangaLa purISuni valapendu bOyenO

#763 మనసెట్ల సైరింతు manaseTla sairintu

Titleమనసెట్ల సైరింతుmanaseTla sairintu
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమనసెట్ల సైరింతు మద గజ గామినీmanaseTla sairintu mada gaja gAminI
అనుపల్లవి anupallaviపణతిరొ నా సామిని పిలువావె మానినీpaNatiro nA sAmini piluvAve mAninI
చరణం
charaNam 1
విరహ మెచ్చి ప్రాయము వ్యర్థమాయను నేడు
మరుని శరములకు మగువరొ తాళజాలరా
viraha mechchi prAyamu vyarthamAyanu nEDu
maruni Saramulaku maguvaro tALajAlarA
చరణం
charaNam 2
పంచబాణుడు వచ్చె నేడు ప్రాణ నాథుడు రాడాయ
వంచ న్యాలనే సామికి వారిజాక్షి పిలువావె
panchabANuDu vachche nEDu prANa nAthuDu rADAya
vancha nyAlanE sAmiki vArijAkshi piluvAve
చరణం
charaNam 3
మరచి పోయి నాడేమో మంగళపురి వాసుడు
సరస మాడుటకు సఖియరొ తోడి త్యావె
marachi pOyi nADEmO mangaLapuri vAsuDu
sarasa mADuTaku sakhiyaro tODi tyAve

#762 ఎందుకు రాడాయ enduku rADAya

Titleఎందుకు రాడాయenduku rADAya
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaఆదిAdi
Previously Posted At402
పల్లవి pallaviఎందుకు రాడాయ ఎవరేమన్నారుenduku rADAya evarEmannAru
చరణం
charaNam 1
సరసుని ప్రేమ సతమని యుంటినె
కరుణ మరచెనె కలికిరో నేడు
sarasuni prEma satamani yunTine
karuNa marachene kalikirO nEDu
చరణం
charaNam 2
చందన పరిమళ ఆనందముగా యుంటినే
సుందరాంగుడు రాడాయ మందయాన ఈ వ్యాళ
chandana parimaLa AnandamugA yunTinE
sundarAnguDu rADAya mandayAna I vyALa
చరణం
charaNam 3
కోరిన వ్యాళలో కోపము యాలనే
వర మంగళ పురీశుని వేగమె పిలువవె
kOrina vyALalO kOpamu yAlanE
vara mangaLa purISuni vEgame piluvave

#761 మోహనాకార యని mOhanAkAra yani

Titleమోహనాకార యనిmOhanAkAra yani
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaదేశి తోడిdESi tODi
తాళం tALaఏకEka
పల్లవి pallaviమోహనాకార యని మనవి జేసిన రాడేmOhanAkAra yani manavi jEsina rADE
అనుపల్లవి anupallaviమోహమెటు దీరును మగువ నే తాళానుmOhameTu dIrunu maguva nE tALAnu
చరణం
charaNam 1
మనవి జేసుకు పోతె మోమోర జేసేను
మన్నాన జేసేది మగువరొ తగునా
manavi jEsuku pOte mOmOra jEsEnu
mannAna jEsEdi maguvaro tagunA
చరణం
charaNam 2
నా సామినీ బాసీ నే తాళలేను
నా సరివారిలో నను చౌక జేసెను
nA sAminI bAsI nE tALalEnu
nA sarivArilO nanu chauka jEsenu
చరణం
charaNam 3
రాతిరి నను గూడీ రాడాయ నేడు
నాతిని జేరి నను మరచె నేడు
rAtiri nanu gUDI rADAya nEDu
nAtini jEri nanu marache nEDu
చరణం
charaNam 4
సరసూడు లేని ఈ సొగసేలనె మనకు
ఓర్వజాలను సామి ఇందు రాడాయనె
sarasUDu lEni I sogasElane manaku
OrvajAlanu sAmi indu rADAyane
చరణం
charaNam 5
కాయజు కేళిలో కలియుట సమయము
మాయకాడె వాడు మంగళపురి వాసుడు
kAyaju kELilO kaliyuTa samayamu
mAyakADe vADu mangaLapuri vAsuDu

#760 పిలచితె ప్రేమ pilachite prEma

Titleపిలచితె ప్రేమpilachite prEma
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaదేశి కాపిdESi kApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviపిలచితె ప్రేమ లేదాయ పొలతిరో నేడుpilachite prEma lEdAya polatirO nEDu
చరణం
charaNam 1
మార మోహనాంగునికి మనసిందు లేదాయ
గారడము జేసుట ఘనమేమే సామికీ
mAra mOhanAnguniki manasindu lEdAya
gAraDamu jEsuTa ghanamEmE sAmikI
చరణం
charaNam 2
కలికిరో నా సామి కలసిట్లు జేసితె
పలచన గాదటె పణతుల లోను
kalikirO nA sAmi kalasiTlu jEsite
palachana gAdaTe paNatula lOnu
చరణం
charaNam 3
మరచినాడె ఈ వ్యాళ మంగళపురి వాసుడు
పరమాప్త మని యుంటినె ప్రాణేశుని నేను
marachinADe I vyALa mangaLapuri vAsuDu
paramApta mani yunTine prANESuni nEnu

#759 పిలచితె నేను pilachite nEnu

Titleపిలచితె నేనుpilachite nEnu
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaపూర్వీ కల్యాణిpUrvI kalyANi
తాళం tALaరూపకrUpaka
Previously Published At392
పల్లవి pallaviపిలచితె నేను బల్కవేమి దేమిరాpilachite nEnu balkavEmi dEmirA
అనుపల్లవి anupallaviకాని దాని మాట వినీ కరుణ మరచె దేమిరాkAni dAni mATa vinI karuNa marache dEmirA
చరణం
charaNam 1
మంచి వాడవని నేను మరులైతిని గదరా
కొంచ కాడ అవులేరా కోర్కె దీరదాయా
manchi vADavani nEnu marulaitini gadarA
koncha kADa avulErA kOrke dIradAyA
చరణం
charaNam 2
మనసు తెలియకను మగువ పొందు జేరితివి
కనికర మింతైన లేక కలసిట్లు జేసితివి
manasu teliyakanu maguva pondu jEritivi
kanikara mintaina lEka kalasiTlu jEsitivi
చరణం
charaNam 3
మారుని బారికి మనసు సైరిసదాయ
మరచేది న్యాయమా మంగళపురి శ్రీనివాస
mAruni bAriki manasu sairisadAya
marachEdi nyAyamA mangaLapuri SrInivAsa

#758 చాలుర నీ పొందు chAlura nI pondu

Titleచాలుర నీ పొందుchAlura nI pondu
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaమాయామాళవ గౌళmAyAmALava gauLa
తాళం tALaఏకEka
పల్లవి pallaviచాలుర నీ పొందు సరసిజ నయన
చాలు చాలు యింక సామిగ వినరా
chAlura nI pondu sarasija nayana
chAlu chAlu yinka sAmiga vinarA
చరణం
charaNam 1
వేడుకొని అది వేగామె పిలచితె
మోది జేసి యిందు మోహనాంగిని గూడితివి
vEDukoni adi vEgAme pilachite
mOdi jEsi yindu mOhanAngini gUDitivi
చరణం
charaNam 2
యంతని వినవింతు పంతము యాలరా
కాంతుడ నీ పొందు చింతకు లోనైతి
yantani vinavintu pantamu yAlarA
kAntuDa nI pondu chintaku lOnaiti
చరణం
charaNam 3
ముచ్చు వగలు దాచు మంగళపురి వాస
మోసము జేసుట మేరగాదు పోరా
muchchu vagalu dAchu mangaLapuri vAsa
mOsamu jEsuTa mEragAdu pOrA