#757 చిత్తము రాదె chittamu rAde

Titleచిత్తము రాదెchittamu rAde
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఏకEka
Previously Posted At387
పల్లవి pallaviచిత్తము రాదె యాలనె నాపైనchittamu rAde yAlane nApaina
చరణం
charaNam 1
అంతరంగము తోను కాంతుడు నను గూడి
పంతము యాలనే చెంత రాడాయనే
antarangamu tOnu kAntuDu nanu gUDi
pantamu yAlanE chenta rADAyanE
చరణం
charaNam 2
సరసుడు రాడాయ సకియరొ యేమి సేతు
మరచినాడె నన్ను మగువరో యీ వేళ
sarasuDu rADAya sakiyaro yEmi sEtu
marachinADe nannu maguvarO yI vELa
చరణం
charaNam 3
కాముని బారికి కలికి నే నోర్వను
మమతెందు బోయనో మంగళపురి వాసునికి
kAmuni bAriki kaliki nE nOrvanu
mamatendu bOyanO mangaLapuri vAsuniki

#756 వాని పొందు vAni pondu

Titleవాని పొందుvAni pondu
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaదేశి కాపిdESi kApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవాని పొందు చాలునే వనజాక్షిరో నేడుvAni pondu chAlunE vanajAkshirO nEDu
చరణం
charaNam 1
సరసుడనుచు నేను సరస మాడితి గాని
సారసాక్షుల తోను సరసము పెంచను
sarasuDanuchu nEnu sarasa mADiti gAni
sArasAkshula tOnu sarasamu penchanu
చరణం
charaNam 2
సదయు డనుచు నేను సకియ కోరితి గాని
సుదతుల పాలాయ చెలియ నేనేమి సేతు
sadayu Danuchu nEnu sakiya kOriti gAni
sudatula pAlAya cheliya nEnEmi sEtu
చరణం
charaNam 3
ప్రేమ మరచె నేడు మంగళపురి వాసుడు
ఆ మగువ పొందు జేరీ మమతలు మరచెను
prEma marache nEDu mangaLapuri vAsuDu
A maguva pondu jErI mamatalu marachenu

#755 సామిగా నాపై sAmigA nApai

Titleసామిగా నాపైsAmigA nApai
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaదేశి కాపిdESi kApi
తాళం tALaఏకEka
పల్లవి pallaviసామిగా నాపై చాలుర మోహముsAmigA nApai chAlura mOhamu
చరణం
charaNam 1
మట్టు దెలిసెను లేరా మాయకాడ అవురా
మాటలు చాలుర మొగవాడ వైతివి
maTTu delisenu lErA mAyakADa avurA
mATalu chAlura mogavADa vaitivi
చరణం
charaNam 2
మాయదారికి నీవు మరులైతి వేమిరా
ఆయలేర దెలిశా అవుర బాగాయ
mAyadAriki nIvu marulaiti vEmirA
AyalEra deliSA avura bAgAya
చరణం
charaNam 3
మంగళపురి వాస మమతెందు బోయర
మంగళాంగిని గూడిన మోహమెటు బోయర
mangaLapuri vAsa mamatendu bOyara
mangaLAngini gUDina mOhameTu bOyara

#754 మొగవారిని నమ్మరాదె mogavArini nammarAde

Titleమొగవారిని నమ్మరాదెmogavArini nammarAde
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaపూర్వీ కల్యాణిpUrvI kalyANi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమొగవారిని నమ్మరాదె
మగువ సామి రాడాయ
mogavArini nammarAde
maguva sAmi rADAya
చరణం
charaNam 1
కులుకుచూ నాతోను కలసి మెలసి యుండిన
పలుకు లెందు బోయనో పణతిరో నేడు
kulukuchU nAtOnu kalasi melasi yunDina
paluku lendu bOyanO paNatirO nEDu
చరణం
charaNam 2
వెలదిరో అలనాడు వుపరతి వ్యాళలో
అలసి కౌగిలించిన అక్కరెందు బోయనో
veladirO alanADu vuparati vyALalO
alasi kaugilinchina akkarendu bOyanO
చరణం
charaNam 3
వర మంగళపురీశుని వలపెందుంచి నాడో
మరియాదె వానికి మమతెందు బోయనో
vara mangaLapurISuni valapendunchi nADO
mariyAde vAniki mamatendu bOyanO

#753 మాట్లాడరా సామి mATlADarA sAmi

Titleమాట్లాడరా సామిmATlADarA sAmi
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaదేశి తోడిdESi tODi
తాళం tALaఏకEka
పల్లవి pallaviమాట్లాడరా సామి మనసు నిల్వదురాmATlADarA sAmi manasu nilvadurA
అనుపల్లవి anupallaviకుటిలాము మానరా నే కోరి యున్నానురాkuTilAmu mAnarA nE kOri yunnAnurA
చరణం
charaNam 1
కోరిన వ్యాళలో కోర్కె లీడేరదాయె
కరుణ ఇంతైన నాపై తమకు లేదాయగా
kOrina vyALalO kOrke lIDEradAye
karuNa intaina nApai tamaku lEdAyagA
చరణం
charaNam 2
నా సామి నను నీవు నెడబాయకురా
కుసుమ శరములకు కరగి యున్నానురా
nA sAmi nanu nIvu neDabAyakurA
kusuma Saramulaku karagi yunnAnurA
చరణం
charaNam 3
మంగళపురి వాస మనసు దెలిసి నేడు
శృంగార సేకర సొంపుతో నేలరా
mangaLapuri vAsa manasu delisi nEDu
SRngAra sEkara somputO nElarA

#752 తెలిసెను యిపుడు telisenu yipuDu

Titleతెలిసెను యిపుడుtelisenu yipuDu
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఖరహరప్రియkharaharapriya
తాళం tALaఆదిAdi
Previously Published At401
పల్లవి pallaviతెలిసెను యిపుడు లేరా కులుకులాడి పొద్దుtelisenu yipuDu lErA kulukulADi poddu
చరణం
charaNam 1
మాట జూడబోతే మధురము మనసులో మత్సరము
ఇదేటి ప్రేమ సామి నీకు ఇది మొగవారికి తగును
mATa jUDabOtE madhuramu manasulO matsaramu
idETi prEma sAmi nIku idi mogavAriki tagunu
చరణం
charaNam 2
ప్రీతి అందె వుంచి దాని ప్రేమతో నేలినా
రీతి తెలిసి వచ్చెను ఖ్యాతి పొగడేరు సకులు
prIti ande vunchi dAni prEmatO nElinA
rIti telisi vachchenu khyAti pogaDEru sakulu
చరణం
charaNam 3
సరస మంగళపురి వాస సురత సుక మెందుబోయా
మరచిందు వచ్చితి వీరా మగువ దండించును పోరా
sarasa mangaLapuri vAsa surata suka mendubOyA
marachindu vachchiti vIrA maguva danDinchunu pOrA

#751 భామరో సామినీ bhAmarO sAminI

Titleభామరో సామినీbhAmarO sAminI
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviభామరో సామినీ బాసి యుండలేనూbhAmarO sAminI bAsi yunDalEnU
చరణం
charaNam 1
యేమని దెల్పుదూ యే చోట నున్నాడో
మమతెందు బోయనో మనుపరో సామికి
yEmani delpudU yE chOTa nunnADO
mamatendu bOyanO manuparO sAmiki
చరణం
charaNam 2
సదయుని ప్రేమా సతమని యుంటినె
సుదతుల పాలాయ చెలియరో నేడూ
sadayuni prEmA satamani yunTine
sudatula pAlAya cheliyarO nEDU
చరణం
charaNam 3
మాటలు మధురము మంగళపురి వాసునికి
యేటి ప్రేమలే యిది యేమని జెపుదు
mATalu madhuramu mangaLapuri vAsuniki
yETi prEmalE yidi yEmani jepudu

#750 సామి యిందు sAmi yindu

Titleసామి యిందుsAmi yindu
Written Byసంగీతం వెంకట రమణయ్యsangItam venkaTa ramaNayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఆదిAdi
Previously Posted At400
పల్లవి pallaviసామి యిందు రాడాయ
సకియరొ తోడి త్యావే
sAmi yindu rADAya
sakiyaro tODi tyAvE
చరణం
charaNam 1
మోహమెటు దాతునె ముదితారో యీ వ్యాళ
మోహనాంగుడు రాడె మరచెనెమొ చెలియ
mOhameTu dAtune muditArO yI vyALa
mOhanAnguDu rADe marachenemo cheliya
చరణం
charaNam 2
వలచిన వ్యాళలో వెలదిరో నన్ను
తలచక యున్నాడు తరుణిరొ నేడు
valachina vyALalO veladirO nannu
talachaka yunnADu taruNiro nEDu
చరణం
charaNam 3
మగువరొ నేడు మంగళ పురీశునికి
తగునె యీ నడత తలచక యున్నాడు
maguvaro nEDu mangaLa purISuniki
tagune yI naData talachaka yunnADu

#749 సరగున నిటురారా saraguna niTurArA

Titleసరగున నిటురారాsaraguna niTurArA
Written Byతచ్చూరు శింగరాచార్యులు
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaయమన్yaman
తాళం tALaతిశ్ర లఘువుtiSra laghuvu
Previously Posted At444
పల్లవి pallaviసరగున నిటురారా మరియాదటరా వినురా
మరుని బారి కోర్వలేక మరులైతిరా సామి నీకు
సరివారలు నవ్వగ జేయుట న్యాయము గాదుర
నే నెఱనమ్మిన దాననురా
saraguna niTurArA mariyAdaTarA vinurA
maruni bAri kOrvalEka marulaitirA sAmi nIku
sarivAralu navvaga jEyuTa nyAyamu gAdura
nE ne~ranammina dAnanurA
చరణం
charaNam 1
బాస లొసగి ఇటు నను నెడబాయ నగునా
నను నెడబాయ నగునా
మోస మెందుకు చేసేవురా మది నెంచర
యీ తనువే నీ సొమ్ముగ చేకొనరా
bAsa losagi iTu nanu neDabAya nagunA
nanu neDabAya nagunA
mOsa menduku chEsEvurA madi nenchara
yI tanuvE nI sommuga chEkonarA
చరణం
charaNam 2
ప్రాణ నాథ రాజగోపాల చలమా రాజగోపాల
మాన మెంచ వదేమిర నా యెడ నేరము లేమిర
నే నిను జూడక తాళనురా
prANa nAtha rAjagOpAla chalamA rAjagOpAla
mAna mencha vadEmira nA yeDa nEramu lEmira
nE ninu jUDaka tALanurA

#748 సరిగ కొంగు sariga kongu

Titleసరిగ కొంగుsariga kongu
Written Byఘనం కృష్ణ అయ్యర్ghanam kRshNa ayyar
Bookhttps://karnatik.com/c18059.shtml
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసరిగ కొంగు ముసుగు దానితో వాడు సైగ జేసినది కంటివేమోsariga kongu musugu dAnitO vADu saiga jEsinadi kanTivEmO
చరణం
charaNam 1
తిరిగి తిరిగి జూచుకొని సొగసుగ దేవుడైన మన్నారు రంగడుtirigi tirigi jUchukoni sogasuga dEvuDaina mannAru rangaDu
Audio Linkshttps://soundcloud.com/gnanaprasuna-vudali/sariga-kongu-musugudani-sung
https://www.youtube.com/watch?v=J_XUkpfoUtE