| Title | పోయి రమ్మనే | pOyi rammanE |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 26 | |
| పల్లవి pallavi | పోయి రమ్మనే పొలతిరో సామిని పొగడే చెలి యింటికి | pOyi rammanE polatirO sAmini pogaDE cheli yinTiki |
| చరణం charaNam 1 | ఒంటిగా నిన్న దానింటిలో జూచి నా వంటి చెలి దెల్పెనే కంటినని నాతో | onTigA ninna dAninTilO jUchi nA vanTi cheli delpenE kanTinani nAtO |
| చరణం charaNam 2 | వెలదిరో మును వనజాసను డేమని వ్రాసెనో ఏ పెనుగొనుటేలను | veladirO munu vanajAsanu DEmani vrAsenO E penugonuTElanu |
| చరణం charaNam 3 | వెలదిరో చక్కని సురపురి సూనుతో మదనుని కేళిలో మనసీయ నంటే | veladirO chakkani surapuri sUnutO madanuni kELilO manasIya nanTE |
Category: Javali
#509 పోపోవే చెలియా pOpOvE cheliyA
| Title | పోపోవే చెలియా | pOpOvE cheliyA |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 22, 161 | |
| పల్లవి pallavi | పోపోవే చేలియా రాపేలే | pOpOvE chEliyA rApElE |
| చరణం charaNam 1 | అక్కర వేళలో దక్కిన విటుల కెక్కడి మమత | akkara vELalO dakkina viTula kekkaDi mamata |
| చరణం charaNam 2 | జారులు సమరతి తీఱిన వెనుక దూఱేదే మరియాద | jArulu samarati tI~rina venuka dU~rEdE mariyAda |
| చరణం charaNam 3 | వాసిగ నను శ్రీనివాసుడు గూడి మోసము చేసెనే | vAsiga nanu SrInivAsuDu gUDi mOsamu chEsenE |
#508 నాపై ప్రేమ nApai prEma
| Title | నాపై ప్రేమ | nApai prEma |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 99 | |
| పల్లవి pallavi | నాపై ప్రేమ లేని జాడ నాడే తెలిసెను పోపో పోరా | nApai prEma lEni jADa nADE telisenu pOpO pOrA |
| పాపి సవతి మాయలలో జిక్కి గోపాల నీ కొనగోరంతైన | pApi savati mAyalalO jikki gOpAla nI konagOrantaina | |
| చరణం charaNam 1 | ఎందాక జూచిన ఈ మగజాతి ఇంతుల నేలేదాక ఈ ప్రీతి సందేహమా మాట ప్రఖ్యాతి సరసుల లక్షణమా యీ రీతి | endAka jUchina I magajAti intula nElEdAka I prIti sandEhamA mATa prakhyAti sarasula lakshaNamA yI rIti |
| చరణం charaNam 2 | మోహమందు మోసమిందు ఏ వేళ బుద్ధులు నీయందు ఏల కలిగెనో ఇక నేమందు స్నేహము జేసినదే బలు పొందు | mOhamandu mOsamindu E vELa buddhulu nIyandu Ela kaligenO ika nEmandu snEhamu jEsinadE balu pondu |
#507 తలచి తాళగ talachi tALaga
| Title | తలచి తాళగ | talachi tALaga |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 12 | |
| పల్లవి pallavi | తలచి తాళగ లేనే ఓ చెలియ నే | talachi tALaga lEnE O cheliya nE |
| చరణం charaNam 1 | కస్తూరి విడెమిచ్చి కరికర గతి చూపి కుస్తరించి నన్ను కొసరి వేడిన లీల | kastUri viDemichchi karikara gati chUpi kustarinchi nannu kosari vEDina lIla |
| చరణం charaNam 2 | కనుల చెక్కుల మోవి చనుల కంఠము బలమున ముక్కు నాభి చుంబనము జేసిన వాని | kanula chekkula mOvi chanula kanThamu balamuna mukku nAbhi chumbanamu jEsina vAni |
#506 చెలియా కాంతుడు cheliyA kAntuDu
| Title | చెలియా కాంతుడు | cheliyA kAntuDu |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 34 | |
| పల్లవి pallavi | చెలియా కాంతుడు నన్నెడ బాసి చాల నన్నిటు చేసెనే గాసి | cheliyA kAntuDu nanneDa bAsi chAla nanniTu chEsenE gAsi |
| మరుడు నా యురమునను శరము లేయ | maruDu nA yuramunanu Saramu lEya | |
| చరణం charaNam 1 | మందమగు మారుతము డాయ విరహము నేనెటు సైతునే సఖియ ఒంటిగా నేనుండనాయె | mandamagu mArutamu DAya virahamu nEneTu saitunE sakhiya onTigA nEnunDanAye |
| చరణం charaNam 2 | వెన్నెల గాయగ మిగుల తాపమాయెనే అన్నమని సైచ దాయెనే కన్నులకు నిదుర రాదే ఓ మగువా కామిని బోధన లాయెనే | vennela gAyaga migula tApamAyenE annamani saicha dAyenE kannulaku nidura rAdE O maguvA kAmini bOdhana lAyenE |
| చరణం charaNam 3 | మరుని కేళిలో నన్ను గూడెనే మానినిరో దానితో గూడెనే ధరగిరి సామికి న్యాయము నటవే తాళను వానిక రమ్మనవే ఓ | maruni kELilO nannu gUDenE mAninirO dAnitO gUDenE dharagiri sAmiki nyAyamu naTavE tALanu vAnika rammanavE O |
#505 చిన్నదానరా chinnadAnarA
| Title | చిన్నదానరా | chinnadAnarA |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 15, 119 | |
| పల్లవి pallavi | చిన్నదానరా నే | chinnadAnarA nE |
| కన్ను దోయి కింపు దోచే కన్నెలు లేరేమిరా నే | kannu dOyi kimpu dOchE kannelu lErEmirA nE | |
| చరణం charaNam 1 | మగని మోము జూచి చాల దిగులు చెంది యున్న నాపై పొగరు మాటలాడి నన్ను అగడు సేతు రేమిరా నే | magani mOmu jUchi chAla digulu chendi yunna nApai pogaru mATalADi nannu agaDu sEtu rEmirA nE |
| చరణం charaNam 2 | చెక్కు నొక్కి ముదమున చను ముక్కు నులిమి గావరమున గ్రక్కున నను కౌగిలించి పక్క జేర్తు రేమిరా నే | chekku nokki mudamuna chanu mukku nulimi gAvaramuna grakkuna nanu kaugilinchi pakka jErtu rEmirA nE |
| చరణం charaNam 3 | రత్నపురి నిలయుడ ప్రయత్నముతో నన్ను గూడి రత్న సరాలిచ్చేనని రవ్వ సేతువేమిరా నే | ratnapuri nilayuDa prayatnamutO nannu gUDi ratna sarAlichchEnani ravva sEtuvEmirA nE |
#504 చానరో వాని బాసి chAnarO vAni bAsi
| Title | చానరో వాని బాసి | chAnarO vAni bAsi |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 10 | |
| పల్లవి pallavi | చానరో వాని బాసి నేనెటువలె సైతునే | chAnarO vAni bAsi nEneTuvale saitunE |
| దాని బోధనలు వినుట మానడేమి సేతునే | dAni bOdhanalu vinuTa mAnaDEmi sEtunE | |
| చరణం charaNam 1 | సన్నుతాంగి సరసుడని చాల నమ్మి యుంటినే నిన్న దాని యింట జేరి యున్న వగలు వింటినే | sannutAngi sarasuDani chAla nammi yunTinE ninna dAni yinTa jEri yunna vagalu vinTinE |
| చరణం charaNam 2 | సదయుడు మదనుని బారికి ముదముతో నను ద్రోసెనే వదలక తన ప్రాయమెల్ల సుదతి పాలు చేసెనే | sadayuDu madanuni bAriki mudamutO nanu drOsenE vadalaka tana prAyamella sudati pAlu chEsenE |
| చరణం charaNam 3 | వాసవ నుతుడైన శ్రీనివాసుడు నను గూడెనే బాసలెల్ల మఱచి యా దోసకారి గూడెనే | vAsava nutuDaina SrInivAsuDu nanu gUDenE bAsalella ma~rachi yA dOsakAri gUDenE |
#503 కాముని విరి శరముల kAmuni viri Saramula
| Title | కాముని విరి శరముల | kAmuni viri Saramula |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 29 | |
| పల్లవి pallavi | కాముని విరి శరముల బారికి నే నేమని సహింతునే | kAmuni viri Saramula bAriki nE nEmani sahintunE |
| చరణం charaNam 1 | సామి రాడాయనే నిమిష మేడాయనే నా మనవి తెలియ బలికే ప్రేమ సఖి లేదాయనే | sAmi rADAyanE nimisha mEDAyanE nA manavi teliya balikE prEma sakhi lEdAyanE |
| చరణం charaNam 2 | బాలరో ఈ చలమేలనే వానికి ఏ లలనా మణి బోధించె నేమో నను మఱచెనే | bAlarO I chalamElanE vAniki E lalanA maNi bOdhinche nEmO nanu ma~rachenE |
| చరణం charaNam 3 | భామరో కాముని కేళి నన్నేలిన సామి ధర గిరి నిలయునిపై ప్రేమ యెటు మఱతునే | bhAmarO kAmuni kELi nannElina sAmi dhara giri nilayunipai prEma yeTu ma~ratunE |
#502 ఏలరా నాపై ElarA nApai
| Title | ఏలరా నాపై | ElarA nApai |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మిశ్రము | miSramu |
| Previously Posted At | 155 | |
| పల్లవి pallavi | ఏలరా నాపై చాలురా మోహము | ElarA nApai chAlurA mOhamu |
| బాలా మణితో ఏమో బాసలు చేసితివట | bAlA maNitO EmO bAsalu chEsitivaTa | |
| చరణం charaNam 1 | ఆపెను గూడి రతి అనుభవించితి వేమో మాపటి వేళలో రాపు జేసేవట | Apenu gUDi rati anubhavinchiti vEmO mApaTi vELalO rApu jEsEvaTa |
| చరణం charaNam 2 | అలరు బోణితో నీవు అలగిన దేమో చెలికాడ నను గూడి బలిమి జేసేవట | alaru bONitO nIvu alagina dEmO chelikADa nanu gUDi balimi jEsEvaTa |
| చరణం charaNam 3 | హితవుతో పార్థసారథి నన్ను గూడితే అతివలు చూచితే అపరాధమవును | hitavutO pArthasArathi nannu gUDitE ativalu chUchitE aparAdhamavunu |
#501 ఎందుకు వాడలగి enduku vADalagi
| Title | ఎందుకు వాడలగి | enduku vADalagi |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఎందుకు వాడలగి రాడు మందగమన | enduku vADalagi rADu mandagamana |
| సుందర వేంకటేశుడు వాడెందు బోయెనో | sundara vEnkaTESuDu vADendu bOyenO | |
| చరణం charaNam 1 | చపల నేత్రి యనుచు నన్ను చేర కున్నాడే అపకారికా చెలికానికి ఉపము దెలుపవే | chapala nEtri yanuchu nannu chEra kunnADE apakArikA chelikAniki upamu delupavE |
| చరణం charaNam 2 | కుటిల కుంతలి యనుచు నన్ను కూడ కున్నాడే విటునికి మఱి బాసలిచ్చి వితము దెలుపవే | kuTila kuntali yanuchu nannu kUDa kunnADE viTuniki ma~ri bAsalichchi vitamu delupavE |