| Title | ప్రొద్దాయెనిక | proddAyenika |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 35, 187 | |
| పల్లవి pallavi | ప్రొద్దాయెనిక చాలురా | proddAyenika chAlurA |
| చరణం charaNam 1 | పావడ చెఱగు చేయి పట్టు కొనేవు పోవలె మ్రొక్కేనురా | pAvaDa che~ragu chEyi paTTu konEvu pOvale mrokkEnurA |
| చరణం charaNam 2 | అత్తరు మెడ బూసి అడ్డగించేవురా అత్తింటి కోడలురా | attaru meDa bUsi aDDaginchEvurA attinTi kODalurA |
| చరణం charaNam 3 | కోపగించి పొయ్యేవు బాలచంద్ర సామి రేపు నను గూడరా | kOpaginchi poyyEvu bAlachandra sAmi rEpu nanu gUDarA |
Category: Javali
#489 మరపు రాదే marapu rAdE
| Title | మరపు రాదే | marapu rAdE |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 171 | |
| పల్లవి pallavi | మఱపు రాదే చెలి వర గోప బాలుని వగలు | ma~rapu rAdE cheli vara gOpa bAluni vagalu |
| చరణం charaNam 1 | కాంత వినవే చంద్ర కాంతపు మేడలో కాంతుడు నేనేకాంత మాడినది | kAnta vinavE chandra kAntapu mEDalO kAntuDu nEnEkAnta mADinadi |
| చరణం charaNam 2 | ఇద్దరు గూడి నిలువు టద్దము లోపల సుద్దులు తేలించి రతి సుద్దు లాడినది | iddaru gUDi niluvu Taddamu lOpala suddulu tElinchi rati suddu lADinadi |
| చరణం charaNam 3 | వాసిగ నను పంతి చేసెడి వేళలో నాయాసపు చెమటలు తీసి వేసినది | vAsiga nanu panti chEseDi vELalO nAyAsapu chemaTalu tIsi vEsinadi |
| చరణం charaNam 4 | చిత్తజు కేళికి యత్నమై యున్న నాకు ముత్య సరము లిచ్చి ముద్దు పెట్టినది | chittaju kELiki yatnamai yunna nAku mutya saramu lichchi muddu peTTinadi |
#488 ఈ మరుబారికి I marubAriki
| Title | ఈ మరుబారికి | I marubAriki |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 163 | |
| పల్లవి pallavi | ఈ మరుబారికి తాళగలేనే స్మర మోహన సుందరు బాసి | I marubAriki tALagalEnE smara mOhana sundaru bAsi |
| చరణం charaNam 1 | తమినాటిన చిత్తము నెంచుచు ఈ శ్రమ నంతయు నా కరుణాగ్రణి తో సమయ మఱచుట దెల్పవే కృప సల్పవే కామినీ మణి సామి లేక యామిని నేనేమి సేయుదు | taminATina chittamu nenchuchu I Srama nantayu nA karuNAgraNi tO samaya ma~rachuTa delpavE kRpa salpavE kAminI maNi sAmi lEka yAmini nEnEmi sEyudu |
| చరణం charaNam 2 | మదిరాక్షిరొ శ్రీ హృదయేశుని నా సదనంబున కేగుదు రాయని యే సుదతి బోధన చేసెనో మది రోసెనో సదయుడై నం గదియునని నే నిదుర లేకే యెదురు చూచితి | madirAkshiro SrI hRdayESuni nA sadanambuna kEgudu rAyani yE sudati bOdhana chEsenO madi rOsenO sadayuDai nan gadiyunani nE nidura lEkE yeduru chUchiti |
| చరణం charaNam 3 | మలయాద్రి తటి నిలయా నిలునిచే కలకాలము నే చెలి యింత వెతను తలచినను కృప రాదటే పలువాదటే బాలరో శ్రీ బాలచంద్రుని కేళిలో నే నోలలాడగ | malayAdri taTi nilayA nilunichE kalakAlamu nE cheli yinta vetanu talachinanu kRpa rAdaTE paluvAdaTE bAlarO SrI bAlachandruni kELilO nE nOlalADaga |
#487 రా రమ్మనే rA rammanE
| Title | రా రమ్మనే | rA rammanE |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రా రమ్మనే రమ్మనే సామిని ఇటు | rA rammanE rammanE sAmini iTu |
| రతిపతి బాధ యిక రమణి యోర్వజాల | ratipati bAdha yika ramaNi yOrvajAla | |
| చరణం charaNam 1 | చెలి యెదురుగ నే బలిమితో బలికిన పలుకులు మదినిక తలచ వలదు ఇటు | cheli yeduruga nE balimitO balikina palukulu madinika talacha valadu iTu |
| చరణం charaNam 2 | పరిపరి విధముల పంతగించితినని విరసము సలుపుట తరము గాదు ఇటు | paripari vidhamula pantaginchitinani virasamu salupuTa taramu gAdu iTu |
| చరణం charaNam 3 | నెఱనమ్మినదని నెలత ననుచు కనికరము గలిగి శ్రీ తిరుపతీశు నిటు | ne~ranamminadani nelata nanuchu kanikaramu galigi SrI tirupatISu niTu |
#486 పో పొమ్మనే పొమ్మనే వాని pO pommanE pommanE vAni
| Title | పో పొమ్మనే పొమ్మనే వాని | pO pommanE pommanE vAni |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | ఆది | Adi |
| Previously posted at | 38, 185 | |
| పల్లవి pallavi | పో పొమ్మనే పొమ్మనే వాని పొందేలనే మనకు అచటికి | pO pommanE pommanE vAni pondElanE manaku achaTiki |
| పాపపు మోహము పాలు చేసి ఆ పాపి యిల్లు చేరేనే ప్రొద్దాయెనా | pApapu mOhamu pAlu chEsi A pApi yillu chErEnE proddAyenA | |
| చరణం charaNam 1 | ఇన్ని దినములు వాడిందు రాకుండి చిన్నపుచ్చినాడే నలుగురిలో ఏమందునే | inni dinamulu vADindu rAkunDi chinnapuchchinADE nalugurilO EmandunE |
| చరణం charaNam 2 | రంగడు నాతో రంగుగా గూడి రంగము నెలకొనెనే నిర్దయుడె | rangaDu nAtO rangugA gUDi rangamu nelakonenE nirdayuDe |
#485 పో పొమ్మనే పొమ్మనే pO pommanE pommanE
| Title | పో పొమ్మనే పొమ్మనే | pO pommanE pommanE |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted at | 7 | |
| పల్లవి pallavi | పో పొమ్మనే పొమ్మనే భామరో వాని | pO pommanE pommanE bhAmarO vAni |
| పొలతిరో చెలువుని పొగడే దానింటికి | polatirO cheluvuni pogaDE dAninTiki | |
| చరణం charaNam 1 | కలకాలము నను కలిసిన స్నేహము తలచని వాని పొందు తగదు తగదు వాని | kalakAlamu nanu kalisina snEhamu talachani vAni pondu tagadu tagadu vAni |
| చరణం charaNam 2 | పగదానిని తా పొగడుచు నాతో జగడము సేయువాని చెలిమి చాలు చాలు | pagadAnini tA pogaDuchu nAtO jagaDamu sEyuvAni chelimi chAlu chAlu |
| చరణం charaNam 3 | వర భీమేశుని వంచన తెలిసెను మఱి మఱి నాపై వట్టి మమత యికేల | vara bhImESuni vanchana telisenu ma~ri ma~ri nApai vaTTi mamata yikEla |
#484 మమత మరవకురా mamata maravakurA
| Title | మమత మరవకురా | mamata maravakurA |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | మమత మఱవకురా నా సామి | mamata ma~ravakurA nA sAmi |
| చరణం charaNam 1 | మును నను గూడిన మోహమిదేరా కనికర మెంత లేదురా సామిగా నీ | munu nanu gUDina mOhamidErA kanikara menta lEdurA sAmigA nI |
| చరణం charaNam 2 | తలచితే మదిలో తాళగ లేరా వలపు నిలుప చాలరా సామిగా నీ | talachitE madilO tALaga lErA valapu nilupa chAlarA sAmigA nI |
| చరణం charaNam 3 | సదయ భీమేశ నా సరసకు రారా ఇది మంచి సమయమురా సామిగా నీ | sadaya bhImESa nA sarasaku rArA idi manchi samayamurA sAmigA nI |
#483 చక్కని సామి chakkani sAmi
| Title | చక్కని సామి | chakkani sAmi |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగు | byAgu |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 41 | |
| పల్లవి pallavi | చక్కని సామి మాట్లాడవదేరా చలమిటు నాతో సేయకురా | chakkani sAmi mATlADavadErA chalamiTu nAtO sEyakurA |
| చరణం charaNam 1 | కలకాలము సలిపిన నేస్తము చెలువుడ మఱచుట తగునేరా | kalakAlamu salipina nEstamu cheluvuDa ma~rachuTa tagunErA |
| చరణం charaNam 2 | రారా నన్నిటు రాపు జేసేవురా రచ్చకు మది నేనోర్వనురా | rArA nanniTu rApu jEsEvurA rachchaku madi nEnOrvanurA |
| చరణం charaNam 3 | ఏలిన ప్రీతి నీకేమాయెనురా ఎంతని నిన్ను నే వేడుదురా | Elina prIti nIkEmAyenurA entani ninnu nE vEDudurA |
| చరణం charaNam 4 | ఏనా సవతి నీకేమి బోధించెరా ఎందుకు నాపై కోపమురా | EnA savati nIkEmi bOdhincherA enduku nApai kOpamurA |
| చరణం charaNam 5 | సారోదారుడౌ సదయ భీమేశ సరసతో నన్ను గూడవదేమిరా | sArOdAruDau sadaya bhImESa sarasatO nannu gUDavadEmirA |
#482 వాని నెడబాసి vAni neDabAsi
| Title | వాని నెడబాసి | vAni neDabAsi |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | వాని నెడవాసి నేనెటులోర్తునే చెలి | vAni neDavAsi nEneTulOrtunE cheli |
| కాని వారితో గూడి కనబడడే చెలి | kAni vAritO gUDi kanabaDaDE cheli | |
| చరణం charaNam 1 | నిశ్చలముగ నన్ను నిండు కౌగలించి మచ్చిక చేసేది మఱచె గదే చెలి | niSchalamuga nannu ninDu kaugalinchi machchika chEsEdi ma~rache gadE cheli |
| చరణం charaNam 2 | ధర వెలయు శ్రీ రంగధాముడు నను గూడి నిరతము బాయనని ఏచెగదే చెలి | dhara velayu SrI rangadhAmuDu nanu gUDi niratamu bAyanani EchegadE cheli |
#481 నీ మోహమిదేనా nI mOhamidEnA
| Title | నీ మోహమిదేనా | nI mOhamidEnA |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగు | byAgu |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 8 | |
| పల్లవి pallavi | నీ మోహమిదేనా నెల కొక్కసారి ఇందు వచ్చి నిలుచుట గాన | nI mOhamidEnA nela kokkasAri indu vachchi niluchuTa gAna |
| చరణం charaNam 1 | తీఱని మమత మదికి తెలిసెను నాడీ ఏ తీరున నే నడచుకొన్న ఎప్పటి జాడే | tI~rani mamata madiki telisenu nADI E tIruna nE naDachukonna eppaTi jADE |
| చరణం charaNam 2 | ఆయెలేర ఏమి ఇక ఆయెనిందాక ఏమేమో బొంకితివి నాతో ఎంచ పరాక | AyelEra Emi ika AyenindAka EmEmO bonkitivi nAtO encha parAka |
| చరణం charaNam 3 | ఇకనైన కరుణించి మా యిల్లు చూడరాదా మకరాంక జనకుడైన గోపాల ఈ వేళ | ikanaina karuNinchi mA yillu chUDarAdA makarAnka janakuDaina gOpAla I vELa |