#795 ఇన్నాళ్ళవలె innALLavale

Titleఇన్నాళ్ళవలెinnALLavale
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaతోడిtODi
తాళం tALa
పల్లవి pallaviఇన్నాళ్ళవలె గాదమ్మ మా గోపాలుడు
ఎన్నెన్నొ నేర్చినాడమ్మా
innALLavale gAdamma mA gOpAluDu
ennenno nErchinADammA
చరణం
charaNam 1
నన్ను కనుల మూసి నా చెంతనుండి
సన్నుతాంగి మోసి చప్పరించెనె
nannu kanula mUsi nA chentanunDi
sannutAngi mOsi chapparinchene
చరణం
charaNam 2
పదరాకనూ వాగు గోపాలుడు నను జూడ
మదిరాక్షిరొ దాని మమత జేర్చుకొనెనె
padarAkanU vAgu gOpAluDu nanu jUDa
madirAkshiro dAni mamata jErchukonene
చరణం
charaNam 3
కొదమ గుబ్బల పైని కోకాడు దలగింప
కదిలి నే నడిగితె తుద నన్ను గూడెనె
kodama gubbala paini kOkADu dalagimpa
kadili nE naDigite tuda nannu gUDene

#794 యేమొ చెలియా yEmo cheliyA

Titleయేమొ చెలియాyEmo cheliyA
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకమాస్kamAs
తాళం tALa
పల్లవి pallaviయేమొ చెలియా మోసమాయె యేమి చేతునే
ఓ చెలియా నేనేమి చేతునే
చెలియా నేనేమి చేతునే
yEmo cheliyA mOsamAye yEmi chEtunE
O cheliyA nEnEmi chEtunE
cheliyA nEnEmi chEtunE
చరణం
charaNam 1
ప్రేమ పాత్రుడైన సామి యిక యేమొ దయలేక
సుందరాంగుడైన నా సఖుడెందుకో రాడాయెనయ్యో
prEma pAtruDaina sAmi yika yEmo dayalEka
sundarAnguDaina nA sakhuDendukO rADAyenayyO
చరణం
charaNam 2
గరపురీశుడైన (?) సామి కరుణ తోనె నాదు కరము బట్టి
సరస మాడి మరులు చేసి పోయెనయ్యో
garapurISuDaina (?) sAmi karuNa tOne nAdu karamu baTTi
sarasa mADi marulu chEsi pOyenayyO

#793 మగడొచ్చి magaDochchi

Titleమగడొచ్చిmagaDochchi
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALa
పల్లవి pallaviమగడొచ్చి పిలచేడు పోయి వత్తుర ప్రీతి
మరువ కుండుర నా సామి
magaDochchi pilachEDu pOyi vattura prIti
maruva kunDura nA sAmi
చరణం
charaNam 1
పగవారు జూచిన పలు విధముల నన్ను
నగుబాటు జేతురు వగపూల బాలను నా
pagavAru jUchina palu vidhamula nannu
nagubATu jEturu vagapUla bAlanu nA
చరణం
charaNam 2
సరసాన నీ వదనము అర నిమిష మైనను
దర్శించకుంటె భరియింప ప్రాణముల్
sarasAna nI vadanamu ara nimisha mainanu
darSinchakunTe bhariyimpa prANamul
చరణం
charaNam 3
సరగూన వచ్చి నీ పరితాప మార్చెద
నెరదాత వైనట్టి వరద వేణుగోపాల
saragUna vachci nI paritApa mArcheda
neradAta vainaTTi varada vENugOpAla

#792 నా హృదయ nA hRdaya

Titleనా హృదయ nA hrudaya
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaసురటsuraTa
తాళం tALa
పల్లవి pallaviనా హృదయ ఫలకమున యా నాతి రూపు
రేఖా విలాసములు నాటి పోయెగా
nA hRdaya phalakamuna yA nAti rUpu
rEkhA vilAsamulu nATi pOyegA
చరణం
charaNam 1
చీమ చిటుకుమన్న మరల
చెలియ వచ్చెనని యెంతొ
యేమేమో తీరుల నెంచు చుంటినిగా
chIma chiTukumanna marala
cheliya vachchenani yento
yEmEmO tIrula nenchu chunTinigA
చరణం
charaNam 2
ఆ హొయలును ఆ నడలు
ఆ పలుకులు ఆ కులుకులు
ఆహా నా మదికి మరపు రాక యుండెగా
A hoyalunu A naDalu
A palukulu A kulukulu
AhA nA madiki marapu rAka yunDegA

#791 చెఱగు మాసె che~ragu mAse

Titleచెరగు మాసెcheragu mAse
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALa
పల్లవి pallaviచెఱగు మాసె నేమి సేతురా
దరి జేరనైన వీలు గాదురా
కొఱమాలిన దైవమక్కట నెలకు సరిగ
మూడు నాళ్ళు చెలితనము చూడరాదు
che~ragu mAse nEmi sEturA
dari jEranaina vIlu gAdurA
ko~ramAlina daivamakkaTa nelaku sariga
mUDu nALLu chelitanamu chUDarAdu
చరణం
charaNam 1
మురిపెము గల మొదటి రతిలో
ముచ్చటైన దీర లేదు
మరి యొక తరి కూడుదమని
మురియుచుండ నింతలోనె
muripemu gala modaTi ratilO
muchchaTaina dIra lEdu
mari yoka tari kUDudamani
muriyuchunDa nintalOne
చరణం
charaNam 2
మృదుల హృదయ నౌపురీశ
మదిని చింత యింతగాదు
మరిచెద రెండ్నాళ్ళకు నీ
ముదము తీర కలియు దాన
mRdula hRdaya naupurISa
madini chinta yintagAdu
maricheda renDnALLaku nI
mudamu tIra kaliyu dAna

#790 శివ దీక్షా Siva dIkshA

Titleశివ దీక్షాSiva dIkshA
Written Byఘనం శీనయ్యghanam SInayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకురంజి
తాళం tALa
పల్లవి pallaviశివ దీక్షా పరురాలనురా యేరSiva dIkshA parurAlanurA yEra
అనుపల్లవి anupallaviశీలమంతైనన్ విడువ జాలనురా నే
శీలమంతైనన్ విడువ జాలనురా
SIlamantainan viDuva jAlanurA nE
SIlamantainan viDuva jAlanurA
చరణం
charaNam 1
శివశివ గురునాజ్ఞ మీరనురా నే
శ్రీ వైష్ణవుడంటె చేరనురా
SivaSiva gurunAjna mIranurA nE
SrI vaishNavuDanTe chEranurA
చరణం
charaNam 2
వడిగ వచ్చి మఠము చొరవకురా
శివార్చన వేళ తలుపు తెరవకురా
మడుగు దాన్ని శరగు ముట్టకురా
మాటిమాటికి నోరు మూయకురా
vaDiga vachchi maThamu choravakurA
SivArchana vELa talupu teravakurA
maDugu dAnni Saragu muTTakurA
mATimATiki nOru mUyakurA
Dance video athttps://www.youtube.com/watch?v=uu_sxwbrbnk

Edited on 10 Dec 2025 : https://guruguha.org/tag/siva-deeksha/ says this jAvaLi was composed by Ghanam Seenayya. Adi tALa also mentioned there. Added dance video link. The mentioned page has a few audio recordings too

Edited on 11 Dec 2025 – found 2 more ‘complete’ lyrics at https://www.octavesonline.com/post/shiva-diksaparu-p-lyrics and https://www.rasikas.org/forums/viewtopic.php?p=363055#p363055

Titleశివ దీక్షాSiva deekshA
Written Byఘనం శీనయ్యghanam SInayya
Book
రాగం rAgaకురంజిkuranji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviశివ దీక్షా పరురాలనురా
నే శీలమెంతైన విడువజాలనురా
Siva dIkshA parurAlanurA
nE SIlamentaina viDuvajAlanurA
అనుపల్లవి anupallaviశివశివా గురునాజ్ఞ మీరనురా
నే శ్రీ వైష్ణవుడంటే చేరనురా
SivaSivA gurunAjna mIranurA
nE SrI vaishNavuDanTE chEranurA
చరణం
charaNam 1
వడిగ వచ్చి మఠము జొరవకురా
శివార్చన వేళ తలుపు దెరవకురా
మడుగు కావి చెరగు దియ్యకురా
నన్ను మాటి మాటికి నోరుముయ్యకురా
(*OR* మాటిమాటికి నీవు నోరు మూయకురా)
vaDiga vacchi maThamu joravakurA
SivArchana vELa talupu deravakurA
maDugu kAvi cheragu diyyakurA
nannu mATi mATiki nOrumuyyakurA
(*OR* mATimATiki nIvu nOru mUyakurA)
చరణం
charaNam 2
పంచాక్షరీ జప శీలనురా
కూకి పలుకులు నే విన జాలనురా
కొంచెపు వగలు నే నెంచనురా
నీకె మ్రొక్కెదు రుద్రాక్ష సరులు తెంచకురా
panchAksharI japa SIlanurA
kUki palukulu nE vina jAlanurA
konchepu vagalu nE nencanurA
nIke mrokkedu rudrAksha sarulu tenchakurA
చరణం
charaNam 3
అబ్బ (అజ్జ?) జూచి చన్ను లదమకురా
నా సజ్జను గొలుసు బట్టి గదియకు రా
బుజ్జగించకు పసిగోలనురా
నా కెమ్మోవి నొక్కకు భక్తురాలనురా
abba (ajja?) jUci channu ladamakurA
nA sajjanu golusu baTTi gadiyaku rA
bujjaginchaku pasigOlanurA
nA kemmOvi nokkaku bhakturAlanurA
చరణం
charaNam 4
మోము మోమును బట్టి జేర్చకురా నీ నామము తోడ బూతి గూర్చకురా
వేమరు తొడ భిక్ష వేడకురా
పోపోరా మన్నారు రంగమల్లాడకురా
mOmu mOmunu baTTi jErchakurA nI nAmamu tODa bUti gUrchakurA
vEmaru toDa bhiksha vEDakurA
pOpOrA mannAru rangamallADakurA

#789 మోహనాంగి mOhanAngi

TitleమోహనాంగిmOhanAngi
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaతోడిtODi
తాళం tALa
పల్లవి pallaviమోహనాంగి మదన రేఖ పీల కుంతలాmOhanAngi madana rEkha pIla kuntalA
చరణం
charaNam 1
రావె వేగ కౌగిలీవె రాజ సుందరీrAve vEga kaugilIve rAja sundarI
చరణం
charaNam 2
మోము మోము కదియ జేర్చి ముద్దొసంగవేmOmu mOmu kadiya jErchi muddosangavE
చరణం
charaNam 3
ఏల నాలసించెదవె తాళ జాలనెEla nAlasinchedave tALa jAlane

#788 మోడి జేసే mODi jEsE

Titleమోడి జేసేmODi jEsE
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకమాచ్kamAch
తాళం tALa
Previously Published At719, 707, 676
పల్లవి pallaviమోడి జేసే వేలరా యీడుకాడ
నే పాడి సరస మాడి నీతో ముద్దాడినాను
mODi jEsE vElarA yIDukADa
nE pADi sarasa mADi nItO muddADinAnu
చరణం
charaNam 1
వయ్యారి మాటలతో సయ్యాట లాడుచును
మోహాన రా ప్రియ యన నిన్నే చేయీడ్చితి
vayyAri mATalatO sayyATa lADuchunu
mOhAna rA priya yana ninnE chEyIDchiti
చరణం
charaNam 2
తాళ వశమొ మొర లాలించి నాతొ
సమ కేళిం గలసి దేలించుమ గోరితి
tALa vaSamo mora lAlinchi nAto
sama kELim galasi dElinchuma gOriti

#787 కొమ్మరొ వాని kommaro vAni

Titleకొమ్మరొ వానిkommaro vAni
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకమాచ్kamAch
తాళం tALa
Previously Published At644
పల్లవి pallaviకొమ్మరొ వానికెంత బిగువె
పిలచిన పలుకడు యేమి చేతునే
kommaro vAnikenta biguve
pilachina palukaDu yEmi chEtunE
చరణం
charaNam 1
సదయుడురో దానాడుచు పోట్లాడి తిరిగి
తిరిగి నన్ చూచుచు పొమ్మనే
sadayuDurO dAnADuchu pOTlADi tirigi
tirigi nan chUchuchu pommanE
చరణం
charaNam 2
తాండవ కృష్ణుడు తగిన వల్లభుడు
దారిలో జూచి నన్ తాకి పోయెనే
tAnDava kRshNuDu tagina vallabhuDu
dArilO jUchi nan tAki pOyenE

#786 ఊరకె పక్కకు Urake pakkaku

Titleఊరకె పక్కకుUrake pakkaku
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviఊరకె పక్కకు రమ్మంటె వచ్చునా
ఊరివారి పడుచు
Urake pakkaku rammanTe vachchunA
UrivAri paDuchu
అనుపల్లవి anupallaviఏరా దాని జూచి ఎంతెంతొ ఏచేవు
ఎంచరాని దెల్ల ఎంచితె ఏమౌనో
ErA dAni jUchi entento EchEvu
encharAni della enchite EmaunO
చరణం
charaNam 1
మమత తోను ఆ మగువను చేయి బట్టి
మాటిమాటికి మళ్ళీ వచ్చేవురా
విడరాదు దాశరథి రాముడు మును
విలు ద్రుంచి సీతను పెళ్ళాడ లేదా
mamata tOnu A maguvanu chEyi baTTi
mATimATiki maLLI vachchEvurA
viDarAdu dASarathi rAmuDu munu
vilu drunchi sItanu peLLADa lEdA