| Title | మరులు మించేరా | marulu minchErA |
| Written By | బాలమురళికృష్ణ | bAlamuraLikRshNa |
| Book | https://www.karnatik.com/c9018.shtml | |
| రాగం rAga | జంజూటి | janjUTi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | మరులు మించేరా సఖా నిన్ను విడనాడలేరా సఖా | marulu minchErA sakhA ninnu viDanADalErA sakhA |
| అనుపల్లవి anupallavi | విరిసిన సుమమా కురిసిన వెన్నెల మరల వచ్చెదనని తరలి పోబోకురా సఖా | virisina sumamA kurisina vennela marala vaccedanani tarali pObOkurA sakhA |
| చరణం charaNam 1 | కన్నుల కరవు తీరెను కనినంత నీ రూపు మిన్నుల విహరించెను మదియానందము సఖా | kannula karavu tIrenu kaninanta nI rUpu minnula viharincenu madiyAnandamu sakhA |
Category: Lyrics
#703 కనుకొంటిని kanukonTini
| Title | కనుకొంటిని | kanukonTini |
| Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
| Book | https://www.karnatik.com/c4002.shtml | |
| రాగం rAga | దేశీయ తోడి | dESIya tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కనుకొంటిని తేటతెల్ల మిక కలికిరో వాని మర్మమిట్టిదని | kanukonTini tETatella mika kalikirO vAni marmamiTTidani |
| అనుపల్లవి anupallavi | వినవే అల వగలాడి బోధనకు లోబడియున్న నతడని | vinavE ala vagalADi bOdhanaku lObaDiyunna nataDani |
| చరణం charaNam 1 | మాటలాడ పోతే మగువరో నాతో మారు బల్క కున్న దేమోయని యుంటి మాటిమాటికా పోడి నింటనుండి చేడి యిందు వచ్చి జూచే జాడలచే | mATalADa pOtE maguvarO nAtO mAru balka kunna dEmOyani yunTi mATimATikA pODi ninTanunDi chEDi yindu vachchi jUchE jADalachE |
| చరణం charaNam 2 | విరహానల తాపము తాళక నా ఉరము జేర్చి కౌగలించు కొంటిని తరుణి నన్ను గూడని వెంకటేశ్వరుడప్పు డనుకొన్న మాటలచే | virahAnala tApamu tALaka nA uramu jErchi kaugalinchu konTini taruNi nannu gUDani venkaTESvaruDappu Danukonna mATalachE |
#702 మరుబారి కోర్వ marubAri kOrva
| Title | మరుబారి కోర్వ | marubAri kOrva |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | https://karnatik.com/c26055.shtml | |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | దేశాది | dESAdi |
| పల్లవి pallavi | మరుబారి కోర్వ జాలరా ఒనరా(?) నా సామి | marubAri kOrva jAlarA onarA(?) nA sAmi |
| అనుపల్లవి anupallavi | మరుని బారికి నేమని తాళుదురా జార శిఖామణి రా | maruni bAriki nEmani tALudurA jAra SikhAmaNi rA |
| చరణం charaNam 1 | చెంత రమ్మని ఎంతని వేడుదురా నే పంతము సేయకురా | chenta rammani entani vEDudurA nE pantamu sEyakurA |
#701 మహరాజుగా రమ్మనే maharAjugA rammanE
| Title | మహరాజుగా రమ్మనే | maharAjugA rammanE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | https://karnatik.com/c16938.shtml | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | మహరాజుగా రమ్మనే మగువరో వాని | maharAjugA rammanE maguvarO vAni |
| అనుపల్లవి anupallavi | అంకమనేటికి అందరి రీతిని పంకజ నేత్రునీవేళ | ankamanETiki andari rItini pankaja nEtrunIvELa |
| చరణం charaNam 1 | కొందరి రీతిని కుంతువలాడుచు ముందటిదేమో మానినామా | kondari rItini kuntuvalADucu mundaTidEmO mAninAmA |
| చరణం charaNam 2 | ధరణిలోన శ్రీ ధర్మపురీశుని చేరినట్టేమో సుదనమో | dharaNilOna SrI dharmapurISuni chErinaTTEmO sudanamO |
#700 మహరాజుగా రమ్మనే maharAjugA rammanE
| Title | మహరాజుగా రమ్మనే | maharAjugA rammanE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | https://karnatik.com/c16937.shtml | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | మహరాజుగా రమ్మనే మగువరో వానికి | maharAjugA rammanE maguvarO vAniki |
| అనుపల్లవి anupallavi | మహరాజుగ రమ్మనె సహజుడై మా ఇంటికి | maharAjuga rammane sahajuDai mA inTiki |
| చరణం charaNam 1 | ధరణి లోన శ్రీ ధర్మపురీశునికి చేర నేడే సుదినమే | dharaNi lOna SrI dharmapurISuniki chEra nEDE sudinamE |
#699 ఎందుకు వలచితినే enduku valachitinE
| Title | ఎందుకు వలచితినే | enduku valachitinE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | https://karnatik.com/c16929.shtml | |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఎందుకు వలచితినే ఓ సఖియా | enduku valachitinE O sakhiyA |
| అనుపల్లవి anupallavi | ఎందుకు వలచితి ఇందు బింబానన సందుల తిరిగే పాదారవిందునకు | enduku valachiti indu bimbAnana sandula tirigE pAdAravindunaku |
| చరణం charaNam 1 | కలకాలము నాదు కౌగిట లోపల మెలగి యిపుడు దాని వలలో చిక్కిన వానికి | kalakAlamu nAdu kaugiTa lOpala melagi yipuDu dAni valalO chikkina vAniki |
| చరణం charaNam 2 | సరసిజాక్షి వాని సరసము దెలిసెను ఎరుగ దాని యింట విందారగించిన వానికి | sarasijAkshi vAni sarasamu delisenu eruga dAni yinTa vindAraginchina vAniki |
| చరణం charaNam 3 | చలచిత్తుడైన శ్రీ ధర్మపురీశుని చిలుక బూరుగమాని ఫలము గాచిన రీతి | chalachittuDaina SrI dharmapurISuni chiluka bUrugamAni phalamu gAchina rIti |
#698 దిరిదిల్దానిం ధీం diridildAnim dhIm
| Title | దిరిదిల్దానిం ధీం | diridildAnim dhIm |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | https://karnatik.com/c16924.shtml | |
| రాగం rAga | సెంజురుటి | senjuruTi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | దిరిదిల్దానిం ధిం ధీంత దిరినా దిర్దర్ దానీం ధీం ధింత దిరినా దిర్దిదానీ ధీంధీంత దిరినా | diridildAnim dhim dhImta dirinA dirdar dAnIm dhIm dhimta dirinA dirdidAnI dhImdhImta dirinA |
| అనుపల్లవి anupallavi | తదియనరే తదియనరే తదరె దానీదానీ ధీంధీం తాదిరనవే దిర్దర్దాని ధీంధీం తదిరినా దిరనా దిరనా దిరనా | tadiyanarE tadiyanarE tadare dAnIdAnI dhImdhIm tAdiranavE dirdardAni dhImdhIm tadirinA diranA diranA diranA |
| చరణం charaNam 1 | చెలియాలా పోపో పొమ్మనవే యిక యాల పోపో పొమ్మనవే వాని | cheliyAlA pOpO pommanavE yika yAla pOpO pommanavE vAni |
| చరణం charaNam 2 | పో తగదనవే తగదనవే తగదె వాని చాలు పో మునుపెనసిన విభుడైతే మేలాయె తానాతొం దిరినా తానాతొం దిరినా తానాతొం దిరి చా చెలిసఖుడిక అలదాని పాలాయె తానాతొందిరినా తానాతొందిరినా తానాతొందిరి దా ధరను ధర్మపురి నివాసునివ్యాల తానా | pO tagadanavE tagadanavE tagade vAni chAlu pO munupenasina vibhuDaitE mElAye tAnAtom dirinA tAnAtom dirinA tAnAtom diri chA chelisakhuDika aladAni pAlAye tAnAtomdirinA tAnAtomdirinA tAnAtomdiri dA dharanu dharmapuri nivAsunivyAla tAnA |
#697 అలవాని నమ్మరాదే alavAni nammarAdE
| Title | అలవాని నమ్మరాదే | alavAni nammarAdE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | ||
| రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | అలవాని నమ్మరాదే | alavAni nammarAdE |
| చరణం charaNam 1 | ఎప్పడి కెట్లాడినట లాడుచు మెప్పులకై నుప్పటిల్లు కన్నుల | eppaDi keTlADinaTa lADuchu meppulakai nuppaTillu kannula |
| చరణం charaNam 2 | కోప తాపములను కొనియాడగ చూపులకై చిరు నవ్వుచుండు | kOpa tApamulanu koniyADaga chUpulakai chiru navvucunDu |
| చరణం charaNam 3 | శేష పాన్పున భూషణుడై నటు వేషములను కొని మీసము దిప్పిన | SEsha pAn&puna bhUshaNuDai naTu vEshamulanu koni mIsamu dippina |
| చరణం charaNam 4 | లీల తోడ నన్నేలు ధర్మపురి నీలమేఘ శ్యామలాంగుడౌ | lIla tODa nannElu dharmapuri nIlamEgha SyAmalAnguDau |
#696 ఎవతె evate
| Title | ఎవతె | evate |
| Written By | గర్భపురి? | garbhapuri? |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | ఎవతె తాళునురా ఈ నడతల | evate tALunurA I naDatala |
| చరణం charaNam 1 | కలకాలమునగు గాసి బెట్టుచును కాంతను కౌగిట కోరుచు జేర్చితే | kalakAlamunagu gAsi beTTuchunu kAntanu kaugiTa kOruchu jErchitE |
| చరణం charaNam 2 | దాతలలో నెరదాత వైన ధరలో గర్భపురీశుని నడతల | dAtalalO neradAta vaina dharalO garbhapurISuni naDatala |
#695 ఎంతని నినునే entani ninunE
| Title | ఎంతని నినునే | entani ninunE |
| Written By | గర్భపురి? | garbhapuri? |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఎంత నిను నే వేడుదురా సామి | enta ninu nE vEDudurA sAmi |
| అనుపల్లవి anupallavi | ఎంతటికైన దయా రాదేమిరా నా దొర సామి | entaTikaina dayA rAdEmirA nA dora sAmi |
| చరణం charaNam 1 | నిదుర కంటికి రాదురా నిన్నెడబాసి మదనుడు శరము వేయ మరువకున్న దొర | nidura kanTiki rAdurA ninneDabAsi madanuDu Saramu vEya maruvakunna dora |
| చరణం charaNam 2 | చక్కని గుబ్బలు ఉప్పొంగిన విర గ్రక్కున చెక్కిలి నొక్కి కౌగిలించమని | chakkani gubbalu uppongina vira grakkuna chekkili nokki kaugilinchamani |
| చరణం charaNam 3 | ఎందుకు జాలము సేయుదురా నీవు ముందు నను గూడిన శ్రీ గర్భపురీశా ధీరా | enduku jAlamu sEyudurA nIvu mundu nanu gUDina SrI garbhapurISA dhIrA |