| Title | ఎంతని నినునే | entani ninunE |
| Written By | గర్భపురి? | garbhapuri? |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఎంత నిను నే వేడుదురా సామి | enta ninu nE vEDudurA sAmi |
| అనుపల్లవి anupallavi | ఎంతటికైన దయా రాదేమిరా నా దొర సామి | entaTikaina dayA rAdEmirA nA dora sAmi |
| చరణం charaNam 1 | నిదుర కంటికి రాదురా నిన్నెడబాసి మదనుడు శరము వేయ మరువకున్న దొర | nidura kanTiki rAdurA ninneDabAsi madanuDu Saramu vEya maruvakunna dora |
| చరణం charaNam 2 | చక్కని గుబ్బలు ఉప్పొంగిన విర గ్రక్కున చెక్కిలి నొక్కి కౌగిలించమని | chakkani gubbalu uppongina vira grakkuna chekkili nokki kaugilinchamani |
| చరణం charaNam 3 | ఎందుకు జాలము సేయుదురా నీవు ముందు నను గూడిన శ్రీ గర్భపురీశా ధీరా | enduku jAlamu sEyudurA nIvu mundu nanu gUDina SrI garbhapurISA dhIrA |
Category: Lyrics
#694 నీరజముఖి nIrajamukhi
| Title | నీరజముఖి | nIrajamukhi |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | నీరజ ముఖి యా రేడు మాడువరె ప్రియ జార నెందని సదవె | nIraja mukhi yA rEDu mADuvare priya jAra nendani sadave |
| చరణం charaNam 1 | సాకువ దణిత పైరణి నిలదే ఆలోకర బళిసదరె | sAkuva daNita pairaNi niladE AlOkara baLisadare |
| చరణం charaNam 2 | సతియ గుణాగణ సరశి తెళియదె వతి హితత్య జసిదరే | satiya guNAgaNa saraSi teLiyade vati hitatya jasidarE |
| చరణం charaNam 3 | వర భీమేశన వాంఛనయెల్లీ పర తరుణి రొనొలసిదరె | vara bhImESana vAnChanayellI para taruNi ronolasidare |
#693 మాతాడ బారదేనో mAtADa bAradEnO
| Title | మాతాడ బారదేనో | mAtADa bAradEnO |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | మాతాడ బారదేనో మారమణనే | mAtADa bAradEnO mAramaNanE |
| అనుపల్లవి anupallavi | ప్రీతి గొలిద ప్రాణ నాథనే నీవొందు | prIti golida prANa nAthanE nIvondu |
| చరణం charaNam 1 | అంగళ బెలదింగళ్ బిసిలాగి తోర్పుదే భృంగద రవకేళి భీతి యాగుదే సామి | angaLa beladingaL bisilAgi tOrpudE bhRngada ravakELi bhIti yAgudE sAmi |
| చరణం charaNam 2 | మంద మారుత బందు మరుళు మాడితు సామి అందవుళ్ళ దేహ కాంతిగుంది సామి | manda mAruta bandu maruLu mADitu sAmi andavuLLa dEha kAntigundi sAmi |
| చరణం charaNam 3 | కామ శరవు యెన్న కాయకె తగిలితు నామగిరి నరహరిగే న్యాయవేనో | kAma Saravu yenna kAyake tagilitu nAmagiri naraharigE nyAyavEnO |
| AV Link | link1, link2 |
#692 ఏమి మేము Emi mEmu
| Title | ఏమి మేము | Emi mEmu |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
| తాళం tALa | ఆది (తిశ్రగతి) | Adi (tiSragati) |
| పల్లవి pallavi | ఏమి మేము సానివారము కుంభిని పూర్ణ సోమలింగ తమకు న్యాయమా | Emi mEmu sAnivAramu kumbhini pUrNa sOmalinga tamaku nyAyamA |
| అనుపల్లవి anupallavi | నా మనోహరుండు నేను కాముకేళి నుండువేళ కావరమున వచ్చి నన్ను కామినీ రమ్మని యెదవు | nA manOharunDu nEnu kAmukELi nunDuvELa kAvaramuna vachchi nannu kAminI rammani yedavu |
| చరణం charaNam 1 | ఇంటి మగను వలెను వెంటను భయము లేక జంట బాయవేమి సేతురా కాని వాడు నా మగండు కత్తి చేతను మరువడిపుడు నీవు నేను పట్టుబడిన పూని హాని పరచునోయి | inTi maganu valenu venTanu bhayamu lEka janTa bAyavEmi sEturA kAni vADu nA maganDu katti chEtanu maruvaDipuDu nIvu nEnu paTTubaDina pUni hAni parachunOyi |
| చరణం charaNam 2 | వెరువకా మా పెరటి లోపలా సన్నజాజుల విరుల తోట మరుగు నీడల మరుగు నుండి నన్ను బిలచి మరుని కేళి గూడినావు యిరుగు పొరుగు వారు జూచిన పరువు మరువు బోవు నోయి | veruvakA mA peraTi lOpalA sannajAjula virula tOTa marugu nIDala marugu nunDi nannu bilachi maruni kELi gUDinAvu yirugu porugu vAru jUchina paruvu maruvu bOvu nOyi |
#691 ఇద్దరి పొందేల iddari pondEla
| Title | ఇద్దరి పొందేల | iddari pondEla |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 331, 207 | |
| పల్లవి pallavi | ఇద్దరి పొందేలరా స్వామి ఇక దానింటికే పోరా అల దానింటికే పోరా | iddari pondElarA svAmi ika dAninTikE pOrA ala dAninTikE pOrA |
| అనుపల్లవి anupallavi | సద్దేల చేసేవు స్వామిక నేనోర్వ వద్దిక నీవు రావద్దురా వద్దురా | saddEla chEsEvu svAmika nEnOrva vaddika nIvu rAvaddurA vaddurA |
| చరణం charaNam 1 | కన్నులు ఎరుపేమిరా చెక్కులు కాటుక నలుపేమిరా కన్నుల విలుకాని కయ్యాన మెలిగిన చిన్నెవై తోచెర చెప్పుర చెప్పుర | kannulu erupEmirA chekkulu kATuka nalupEmirA kannula vilukAni kayyAna meligina chinnevai tOchera cheppura cheppura |
| చరణం charaNam 2 | నాజోలి నీకేలరా ఆ బ్రహ్మ నిన్నెట్టు పుట్టించెరా ఏ జాము దానింట నీ జాడ నే జూడ బేజారి బేజారి నేజెల్ల నేజెల్ల | nAjOli nIkElarA A brahma ninneTTu puTTincherA E jAmu dAninTa nI jADa nE jUDa bEjAri bEjAri nEjella nEjella |
#690 మధురా నగరిలో madhurA nagarilO
| Title | మధురా నగరిలో | madhurA nagarilO |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మధురా నగరిలో చల్ల నమ్మ బోదు దారి విడువుము కృష్ణా కృష్ణా | madhurA nagarilO challa namma bOdu dAri viDuvumu kRshNA kRshNA |
| అనుపల్లవి anupallavi | మాపటి వేళకు తప్పక వచ్చెద పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా | mApaTi vELaku tappaka vachcheda paTTaku kongu gaTTigAnu kRshNA |
| చరణం charaNam 1 | కొసరి కొసరి నాతో సరసము లాడకు రాజ మార్గమిది కృష్ణా తలవని తలపిది చేర వచ్చు కృష్ణా విడు విడు నా చెయ్యి కృష్ణా కృష్ణా | kosari kosari nAtO sarasamu lADaku rAja mArgamidi kRsHNA talavani talapidi chEra vachchu kRshNA viDu viDu nA cheyyi kRshNA kRshNA |
#689 మావల్ల గాదమ్మా mAvalla gAdammA
| Title | మావల్ల గాదమ్మా | mAvalla gAdammA |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | మాండ్ | mAnD |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మావల్ల గాదమ్మా దేవి యశోదా నీ సుతు చర్యలు మాటిమాటికి దెల్ప | mAvalla gAdammA dEvi yaSOdA nI sutu charyalu mATimATiki delpa |
| అనుపల్లవి anupallavi | మంగళాంగిరో బాల కృష్ణుడు బల్ గారడి విద్యలు ఘనముగ నేర్చెను | mangaLAngirO bAla kRshNuDu bal gAraDi vidyalu ghanamuga nErchenu |
| చరణం charaNam 1 | పాల్ పెరుగు వెన్న మీగడ భాండము గుర్తు తెలియకనే మాయము జేసెను | pAl perugu venna mIgaDa bhAnDamu gurtu teliyakanE mAyamu jEsenu |
| చరణం charaNam 2 | కన్య నన్ను జూచి కన్ను సైగ జేసి ఎన్నరాని పను లెన్నెన్నో చేసె | kanya nannu jUchi kannu saiga jEsi ennarAni panu lennennO chEse |
| చరణం charaNam 3 | ధూర్త గోపాలుడు పదుగురు చూడ నా అధరము నొక్కెను | dhUrta gOpAluDu paduguru chUDa nA adharamu nokkenu |
#688 కులము లోన kulamu lOna
| Title | కులము లోన | kulamu lOna |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సింధుభైరవి | sindhubhairavi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | కులము లోన గొల్ల దాన పయసు లోన చిన్న దాన వలచి నిన్నే తలచు దాన ఏలుకోర వేణుగోపాల బాల | kulamu lOna golla dAna payasu lOna chinna dAna valachi ninnE talachu dAna ElukOra vENugOpAla bAla |
| చరణం charaNam 1 | నీలవర్ణ జాలమేలా నిమిషమైన తాళజాలరా మనసు నీపై నిలిపినాను మమత దీర అధర మీర కమనీయ నేత్ర విమల గాత్ర నవనీత చోర నంద కిశోర | nIlavarNa jAlamElA nimishamaina tALajAlarA manasu nIpai nilipinAnu mamata dIra adhara mIra kamanIya nEtra vimala gAtra navanIta chOra nanda kiSOra |
#687 సరసుని యెడబాసి sarasuni yeDabAsi
| Title | సరసుని యెడబాసి | sarasuni yeDabAsi |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | తిశ్ర ఏక | tiSra Eka |
| పల్లవి pallavi | సరసుని యెడబాసి సరసిజ నయన | sarasuni yeDabAsi sarasija nayana |
| అనుపల్లవి anupallavi | మరులు యెటులు తాళి మరుగు జేయుదునే | marulu yeTulu tALi marugu jEyudunE |
| చరణం charaNam 1 | చిరుత ప్రాయము నాడే చెలిమి జేసితినే మరచెదనా యని యెంచ మరులెచ్చె గదవే | chiruta prAyamu nADE chelimi jEsitinE marachedanA yani yencha marulechche gadavE |
| చరణం charaNam 2 | మరుకేళి జత గూడి మనసిచ్చి కలియ సరసిజాసను డేల మరచె నన్నిలను | marukELi jata gUDi manasichchi kaliya sarasijAsanu DEla marache nannilanu |
| చరణం charaNam 3 | ఇల శ్రీ వెంకటనాధ యిక నేచ తగదు కలయ రమ్మని బల్క కరుణించ మనవే | ila SrI venkaTanAdha yika nEcha tagadu kalaya rammani balka karuNincha manavE |
| చరణం charaNam 4 | చెలి నీ పేరిటి లక్ష్మి వలచిన దన్నుచు పలుమారు మది మెచ్చి బతిమాలె ననవె | cheli nI pEriTi lakshmi valachina dannuchu palumAru madi mechchi batimAle nanave |
#686 చలమేలర chalamElara
| Title | చలమేలర | chalamElara |
| Written By | ?? | |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | నాటకురంజి | nATakuranji |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 396 | |
| పల్లవి pallavi | చలమేలర నాపై జలజ నేత్రుడా పిలిచిన పలుకక | chalamElara nApai jalaja nEtruDA pilichina palukaka |
| అనుపల్లవి anupallavi | కలకాలము నీ చెలిమి జేయ నే దలచి వలచి వచ్చియుంటి నంతట | kalakAlamu nI chelimi jEya nE dalachi valachi vachchiyunTi nantaTa |
| చరణం charaNam 1 | నీ సరసములు నీటులు నీ సొగసు నీ చతురత నీ హొయలు నీ గుణములు నీ సరిసమ రసికుల నే నరసి జూడ దొరక లేక మరులు మించి మొరలిడ | nI sarasamulu nITulu nI sogasu nI chaturata nI hoyalu nI guNamulu nI sarisama rasikula nE narasi jUDa doraka lEka marulu minchi moraliDa |
| చరణం charaNam 2 | సారసరిపుని కోరు చకోర గతి నిను నమ్ముచు సారెకును నీ మరుగున జేరదలచి చెలులతో మనసార నా విచారమెల్ల చెవియార దెల్పియు బ్రోవక | sArasaripuni kOru chakOra gati ninu nammuchu sArekunu nI maruguna jEradalachi chelulatO manasAra nA vichAramella cheviyAra delpiyu brOvaka |