#654 తారుమారు tArumAru

TitleతారుమారుtArumAru
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaనాటకురంజిnATakuranji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviతారుమారు లాడేవేమే బజారిtArumAru lADEvEmE bajAri
అనుపల్లవి anupallaviనేరమెంచకనే కౌగలించ మంటేnEramenchakanE kaugalincha manTE
చరణం
charaNam 1
అంబుజాక్షిరో నే సంబ్రముగ
నీదు బింబాధర చుంబనంబు లివ్వమంటే
anbujAkshirO nE sambramuga
nIdu bimbAdhara chumbanambu livvamanTE
చరణం
charaNam 2
మోడి సేయక నాతోడ బల్కి కడు వేడుకన్
కర్పూర విడెమివ్వమంటే
mODi sEyaka nAtODa balki kaDu vEDukan
karpUra viDemivvamanTE
చరణం
charaNam 3
ప్రీతి మీరగనే సాదరంబుతో నీదు
లేత గుబ్బల నాచేతి కివ్వమంటే
prIti mIraganE sAdarambutO nIdu
lEta gubbala nAchEti kivvamanTE
చరణం
charaNam 4
తాళలేనే బాలికామణి నీ
తాళవనేశుని యేలుకోమంటే
tALalEnE bAlikAmaNi nI
tALavanESuni yElukOmanTE

#653 పారిపోవలెరా pAripOvalerA

TitleపారిపోవలెరాpAripOvalerA
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaరూపకrUpaka
Previously Posted At89
పల్లవి pallaviపారిపోవలెరా నీరజాప్తుడు వెడలెరాpAripOvalerA nIrajAptuDu veDalerA
అనుపల్లవి anupallaviనారీమణులు దారిని గని దూరేరు గనుకnArImaNulu dArini gani dUrEru ganuka
చరణం
charaNam 1
దూరిపోయిన క్రూరుడౌ మగడూరు జేరి యేమారడించెనే
ఆ రీతుల విచారించు కొర కేరా నేనిపుడే
dUripOyina krUruDau magaDUru jEri yEmAraDinchenE
A rItula vichArinchu kora kE rA nEnipuDE
చరణం
charaNam 2
భావమా గుణ భావముల్ తెలిసే విధమనే పాలిడించును
కేళితో నీకే దయనుచు కేరా నేనిపుడే
bhAvamA guNa bhAvamul telisE vidhamanE pAliDinchunu
kELitO nIkE dayanuchu kErA nEnipuDE

#652 తెలిసె వగలెల్ల telise vagalella

Titleతెలిసె వగలెల్లtelise vagalella
Written Byపట్టాభిరామయ్య??paTTAbhirAmayya??
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaఆదిAdi
Previously Posted At267
పల్లవి pallaviతెలిసె వగలెల్ల బాగాయెరా
బల్కేవు ఏలాగు సహింతురా
telise vagalella bAgAyerA
balkEvu ElAgu sahinturA
చరణం
charaNam 1
నన్నే నిరాకరించి ఏవేళ సవతితో
ఉల్లాస సల్లాప మోహమాట పాట చాలు
nannE nirAkarinchi EvELa savatitO
ullAsa sallApa mOhamATa pATa chAlu
చరణం
charaNam 2
శుకముల రవముల పికముల కలకల
రవములనే తాళ శ్యామరాజ ఈ పలుకు
Sukamula ravamula pikamula kalakala
ravamulanE tALa SyAmarAja I paluku
?? Identical lyrics were published as a jAvaLi by SrI chinnayya earlier. ఇంతకు ముందు ఇదే సాహిత్యము శ్రీ చిన్నయ్య గారి జావళిగా ప్రచురించడ మైనది.

#651 ఏమి మాయము Emi mAyamu

Titleఏమి మాయముEmi mAyamu
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఏమి మాయము జేసి పోతివి శ్యామ సుందరాంగ నాతోEmi mAyamu jEsi pOtivi SyAma sundarAnga nAtO
అనుపల్లవి anupallaviనా మనో భావంబులెల్ల వేమారు నే వెరిగియు నాయెడnA manO bhAvambulella vEmAru nE verigiyu nAyeDa
చరణం
charaNam 1
నీరు దాగిపుడే పారి వచ్చేనని తీరుగ తీరున జోరుగ బల్కేవే
సారి నోరూరగ దారి జూచెటటు క్రూర వేరె మీరిపోయె కొన
nIru dAgipuDE pAri vachchEnani tIruga tIruna jOruga balkEvE
sAri nOrUraga dAri jUcheTaTu krUra vEre mIripOye kona
చరణం
charaNam 2
మంగళ స్నానము రంగుగ జేసే ఉప్పొంగుచు
నీ మృదు అంగ సంగముతో కౌగలించేనని
వంగి వంగి శ్రీ మంగళాంగుడౌ తాళవనేశుని
mangaLa snAnamu ranguga jEsE upponguchu
nI mRdu anga sangamamutO kaugalinchEnani
vangi vangi SrI mangaLAnguDau tALavanESuni

#650 ఏమి సేయుదు Emi sEyudu

Titleఏమి సేయుదుEmi sEyudu
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏమి సేయుదునటే ఏణాక్షిEmi sEyudunaTE ENAkshi
అనుపల్లవి anupallaviనోము ఫలమేమొ నాసామి కేసతి
నానామ మంటే కాకనే మేమన్నదో గాన
nOmu phalamEmo nAsAmi kEsati
nAnAma manTE kAkanE mEmannadO gAna
చరణం
charaNam 1
సరసుడు నన్నే సదా సరసమాడే సైకల
సారసాక్షి విని దూరనేమో గాన
sarasuDu nannE sadA sarasamADE saikala
sArasAkshi vini dUranEmO gAna
చరణం
charaNam 2
మేడపై మేమిర్వురు జోడు గూడే కడు
వేడుకెల్ల నాచేడె చెరిచెనే
mEDapai mEmirvuru jODu gUDE kaDu
vEDukella nAchEDe cherichenE
చరణం
charaNam 3
మొలక నవ్వుతోను మై పులకరించేలిన
తాళవనీశుని చాలించెనే సవతి
molaka navvutOnu mai pulakarinchElina
tALavanISuni chAlinchenE savati

15 May 2021: Minor correction

#649 రారా నమ్మినారా rArA namminArA

Titleరారా నమ్మినారాrArA namminArA
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaకాపిkApi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviరారా నమ్మినారా నా చై కోరాదటరా సామిగrArA namminArA nA chai kOrAdaTarA sAmiga
అనుపల్లవి anupallaviసారెకు నేనీ రాక నే గోరుచు వేసారి తిటుsAreku nEnI rAka nE gOruchu vEsAri tiTu
చరణం
charaNam 1
నీరజ వైరి తన క్రూర కిరణాలతో బీరుచు
నాపై వెన్నెల బోరున గాచెరా ప్రియ
nIraja vairi tana krUra kiraNAlatO bIruchu
nApai vennela bOruna gAcherA priya
చరణం
charaNam 2
సామి నేనీ తీరున కామియై యుండ పెను
పామువలె కాముండిటు వేమారు శరముల్వేసె
sAmi nEnI tIruna kAmiyai yunDa penu
pAmuvale kAmunDiTu vEmAru SaramulvEse
చరణం
charaNam 3
బాల నే తాళనురా తాలవనేశ మరుకేళి
సుఖ లీలలో నన్నేలి రతి తేలించుమీ
bAla nE tALanurA tAlavanESa marukELi
sukha lIlalO nannEli rati tElinchumI

#648 కోపమెటుల kOpameTula

TitleకోపమెటులkOpameTula
Written Byపట్టాభిరామయ్య??paTTAbhirAmayya??
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaకేదారగౌళkEdAragauLa
తాళం tALaరూపకrUpaka
Previously Posted At253
పల్లవి pallaviకోపమెటుల రాక యుండునురా కోమలాంగ నీపైkOpameTula rAka yunDunurA kOmalAnga nIpai
అనుపల్లవి anupallaviపాపి యింటనే కాపురమై నీ రూపము
కంటికి జూపక యుండిన
pApi yinTanE kApuramai nI rUpamu
kanTiki jUpaka yunDina
చరణం
charaNam 1
నిన్నటి రాత్రి నిన్నిటు రమ్మని విన్నప మిచ్చి మా కన్యను బంపితే
చిన్ననాటి నా నేస్తము నెంచకా చిన్నది మెచ్చన నన్న మాటలు విన
ninnaTi rAtri ninniTu rammani vinnapa michchi mA kanyanu bampitE
chinnanATi nA nEstamu nenchakA chinnadi mechchana nanna mATalu vina
చరణం
charaNam 2
కాసుకు కాని యా దాసితోను పరిహాస మాడుచు నుల్లాసమై పయ్యెద
దీసి తిన్నగ మూసి ముద్దిడు నీ సరసంబులు మోసము నేలిన
kAsuku kAni yA dAsitOnu parihAsa mADuchu nullAsamai payyeda
dIsi tinnaga mUsi muddiDu nI sarasambulu mOsamu nElina
చరణం
charaNam 3
వేమరు వేడిన నీ మనసంత యా రామపాల్ జేసి విరాముడై వేడ్కతో
కాముకేళి యా లేమ గూడిన చామ భూపాల నే నీ మమతలు విన
vEmaru vEDina nI manasanta yA rAmapAl jEsi virAmuDai vEDkatO
kAmukELi yA lEma gUDina chAma bhUpAla nE nI mamatalu vina
Audio Linkhttps://www.youtube.com/watch?v=YVryeUtO9R8
??From the “chAma bhUpAla” mudra, this may be a jAvaLi by Sri Chinniah. “చామ భూపాల” ముద్ర వలన ఇది శ్రీ చిన్నయ్య గారు రాసిన జావళి అనిపిస్తోంది.

#647 నన్ను చులకన nannu chulakana

Titleనన్ను చులకనnannu chulakana
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaవసంతvasanta
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviనన్ను చులకన జేసె వినవే నా సామిnannu chulakana jEse vinavE nA sAmi
అనుపల్లవి anupallaviవెనుకటి నెనరుల తనమది నునుచగ venukaTi nenarula tanamadi nunuchaga
చరణం
charaNam 1
అను దినమును సరి వనిత లెదుట
పెను కనికరము జూపి శ్లాఘన సలిపిన దొర
anu dinamunu sari vanita leduTa
penu kanikaramu jUpi SlAghana salipina dora
చరణం
charaNam 2
పరిపరి విధముల సరస మాడక నాతో
అర నిమిష ముండని సరసుడే దూరోవిని
paripari vidhamula sarasa mADaka nAtO
ara nimisha munDani sarasuDE dUrOvini
చరణం
charaNam 3
పలుకు పలుకును మొలక నవ్వు నవ్వి మై
పులకరింప జేసేలు అల తాలవనేశుడు
paluku palukunu molaka navvu navvi mai
pulakarimpa jEsElu ala tAlavanESuDu

#646 నీ లాలన nI lAlana

Titleనీ లాలనnI lAlana
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaథన్యాసిthanyAsi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviనీ లాలన చాలు నిల్పరా శ్రీ తాలవాధిపnI lAlana chAlu nilparA SrI tAlavAdhipa
అనుపల్లవి anupallaviచాల వేడి నా యిరు కాళ్ళకు మ్రొక్కుచు బల్కెడిchAla vEDi nA yiru kALLaku mrokkuchu balkeDi
చరణం
charaNam 1
నిన్న రేతిరాడిన మాటలు మనసార నే వినియుండగా
మానిని నీ కనులాన నిన్నేమన లేదను
ninna rEtirADina mATalu manasAra nE viniyunDagA
mAnini nI kanulAna ninnEmana lEdanu
చరణం
charaNam 2
కుటిలాత్మ నీవటు మార్గ కాపటికుడని నేనటు పోవగా
వెంట వచ్చి కంటి కట్టు విప్పి చనులంటెడి
kuTilAtma nIvaTu mArga kApaTikuDani nEnaTu pOvagA
venTa vachchi kanTi kaTTu vippi chanulanTeDi
చరణం
charaNam 3
మితిలేక నే నతియాసతో రతికేళికి బతిమాలగా
నాతి రావేయని చేతులీడ్చి నను బిలిచేటి
mitilEka nE natiyAsatO ratikELiki batimAlagA
nAti rAvEyani chEtulIDchi nanu bilichETi

#645 ఈలాగున IlAguna

TitleఈలాగునIlAguna
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaదర్బార్darbAr
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఈలాగున నుండవచ్చునా ఓ నీలవేణి
తాళవన లోలుని వ్యాకుల మెల్ల తెలిసి నీవిపు (డీలాగున)
IlAguna nunDavachchunA O nIlavENi
tALavana lOluni vyAkula mella telisi nIvipu (DIlAguna)
చరణం
charaNam 1
అంగనామణి నీదు భృంగ కుంతలములు కని నీ
అంగ సంగ మెటు గల్గునని కుంగుచుండు నా
ఇంగితం బెరింగి నన్ను కౌంగలించి నాదు తనువు
ఉప్పొంగ మాటలాడి పెద్ద పంగ నామముడను దలచి
anganAmaNi nIdu bhRnga kuntalamulu kani nI
anga sanga meTu galgunani kunguchunDu nA
ingitam beringi nannu kaungalinchi nAdu tanuvu
upponga mATalADi pedda panga nAmamuDanu dalachi
చరణం
charaNam 2
కీరవాణి నాకై ఇంటి దూరమనుచు పేరిడి
గాన కుండునటు లేమార జేయుచు చేరి
నాదు శయ్యపై వెయ్యారు వగచి వెరువకనుచు
ధీరతరముతో వేమారు మూరవేసి ముదము చెరచి
kIravANi nAkai inTi dUramanuchu pEriDi
gAna kunDunaTu lEmAra jEyuchu chEri
nAdu Sayyapai veyyAru vagachi veruvakanuchu
dhIrataramutO vEmAru mUravEsi mudamu cherachi