#644 కొమ్మరో వాని kommarO vAni

Titleకొమ్మరో వానిkommarO vAni
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviకొమ్మరో వాని కెంత బిగువే
పిలచిన పలుక కున్నాడేమి సేయుదునే
kommarO vAni kenta biguvE
pilachina paluka kunnADEmi sEyudunE
చరణం
charaNam 1
అంతరంగున కెదురేగి తెచ్చి వానికి
ఆకుమడు పొసగితే హుం పొమ్మనెనే
antaranguna kedurEgi techchi vAniki
AkumaDu posagitE hum pommanenE
చరణం
charaNam 2
పదయుడ కెదనానుచు పోట్లాడితే
తిరిగి తిరిగి జూచుచు హుం పొమ్మనెనే
padayuDa kedanAnuchu pOTlADitE
tirigi tirigi jUchuchu hum pommanenE
చరణం
charaNam 3
ధర్మపురీశునితో నే సమరసి తీర్చితే
నపుడు వాడు హుం పొమ్మనెనే
dharmapurISunitO nE samarasi tIrchitE
napuDu vADu hum pommanenE

#643 పరులన్న మాట parulanna mATa

Titleపరులన్న మాటparulanna mATa
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviపరులన్న మాట నమ్మవద్దు ప్రాణ నాయకాparulanna mATa nammavaddu prANa nAyakA
అనుపల్లవి anupallaviమోము జూప మ్రొక్కితే మర్మమేమిరా
మాయలాడి బోధనము బాగ జేసెరా
mOmu jUpa mrokkitE marmamEmirA
mAyalADi bOdhanamu bAga jEserA
చరణం
charaNam 1
మందయాన ఎవతె నీకు మందు బెట్టెరా
ముందు దెల్పు మిపుడు మోవి విందు బెట్టరా
mandayAna evate nIku mandu beTTerA
mundu delpu mipuDu mOvi vindu beTTarA
చరణం
charaNam 2
ధర్మపురిని స్థిరముగ నెలకొన్న సామిగా
ధర్మమున నేలుకోరా నిన్ను మ్రొక్కేరా
dharmapurini sthiramuga nelakonna sAmigA
dharmamuna nElukOrA ninnu mrokkErA
AV Linkhttps://www.youtube.com/watch?v=0nU_PkGb_jM

#642 ఏమందునే EmandunE

TitleఏమందునేEmandunE
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏమందునే ముద్దు బాలామణి చెలి
ఏమని విన్నవింతునే ఓ చెలి
EmandunE muddu bAlAmaNi cheli
Emani vinnavintunE O cheli
అనుపల్లవి anupallaviచెలియ పల్కులు చెలువునకు దెల్పితినే
చెలియ మైమరచితినే
cheliya palkulu cheluvunaku delpitinE
cheliya maimarachitinE
చరణం
charaNam 1
మును నను గలసి మర్మము లెరిగిన
శ్రీ ధర్మపురీశు డున్నాడే ఓ చెలి
munu nanu galasi marmamu lerigina
SrI dharmapurISu DunnADE O cheli

#641 వాని పొందు vAni pondu

Titleవాని పొందుvAni pondu
Written Byధర్మపురి సుబ్బరాయర్ ?dharmapuri subbarAyar ?
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
Previously Posted At265 ?
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviవాని పొందు చాలు వద్దనే వనితామణి అలvAni pondu chAlu vaddanE vanitAmaNi ala
అనుపల్లవి anupallaviచానమాటలేల దాని సదనమే సతమనుచు నుండెడిchAnamATalEla dAni sadanamE satamanuchu nunDeDi
చరణం
charaNam 1
కమ్మవిల్తు డేయు అమ్ముల పోటున
రొమ్మున నాటిన కమ్మ వ్రాసిచ్చిన
కొమ్మ నంపి వేగతోడి తెమ్మని నే దాని పొమ్మని బల్కిన
kammaviltu DEyu ammula pOTuna
rommuna nATina kamma vrAsichchina
komma nampi vEgatODi temmani nE dAni pommani balkina
AV Linkhttps://www.youtube.com/watch?v=H8YreNmzwRs
? We pubslihed this before as a jAvaLi by Sri chinnayya. As per mudra in second charanam, it appears to be written by him only. ఇంతకు ముందు ఈ జావళి శ్రీ చిన్నయ్య గారిచే రచియింపబడినట్లు మేము ప్రచురించాము. రెండవ చరణం లోని ముద్ర ప్రకారం చిన్నయ్య గారి జావళి అనే అనిపిస్తోంది.

#640 స్మర సుందరాంగుని smara sundarAnguni

Titleస్మర సుందరాంగునిsmara sundarAnguni
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
Previously Posted at583
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviస్మర సుందరాంగుని సరి యెవ్వరే
సరస కోటిలోన వజీరుహమీరె
smara sundarAnguni sari yevvarE
sarasa kOTilOna vajIruhamIre
చరణం
charaNam 1
ఆడిన మాటకు అడ్డము బలుకడే
ఏ చేడియలను కనుల జూడడే
ADina mATaku aDDamu balukaDE
E chEDiyalanu kanula jUDaDE
చరణం
charaNam 2
వీనుల కింపుగ వీణ వాయించి అలి
వేణి నే పాడగ శాభాషిచ్చునే
vInula kimpuga vINa vAyinchi ali
vENi nE pADaga SAbhAshichchunE
చరణం
charaNam 3
ధరణిలో రతిదేల్చు ఉదార శ్రీ
ధర్మపురాధిపు డైనట్టి మా
dharaNilO ratidElchu udAra SrI
dharmapurAdhipu DainaTTi mA

#639 నారీమణి nArImaNi

TitleనారీమణిnArImaNi
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviనారీమణి నీకైనదిరా జారచోర – మాnArImaNi nIkainadirA jArachOra – mA
అనుపల్లవి anupallaviధీర వినరా శ్రీ ధర్మపురాధిప మా చక్కనిdhIra vinarA SrI dharmapurAdhipa mA chakkani
చరణం
charaNam 1
బోటి నేర్పిన రతి పాటలు సైయాటలేవ
ధూటియ సరిసాటిల పాటియన కాదట మా
bOTi nErpina rati pATalu saiyATalEva
dhUTiya sarisATila pATiyana kAdaTa mA
చరణం
charaNam 2
మారు బల్కెరు గని మానిని గదరా కామినీ
తారాధిప నీ బావ కాదనరె సరసకు
mAru balkeru gani mAnini gadarA kAminI
tArAdhipa nI bAva kAdanare sarasaku
చరణం
charaNam 3
మారవీరుని విరి శరముల కోర్వదిక
రారా సరగునను చేకోరా మరుకేళికి – మా
mAravIruni viri Saramula kOrvadika
rArA saragunanu chEkOrA marukELiki – mA
AV Linkhttps://www.youtube.com/watch?v=7WSxRQ3D-Bw

#638 మరుబారి marubAri

TitleమరుబారిmarubAri
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమరుబారి తాళలేనురా ఔరా నాసామిmarubAri tALalEnurA aurA nAsAmi
చరణం
charaNam 1
మరుని బారికి నెంతని తాళుదురా నే
జార శిఖామణి రారా
maruni bAriki nentani tALudurA nE
jAra SikhAmaNi rArA
చరణం
charaNam 2
చెంత రమ్మని నేనెంతని వేడుదురా నే
పంతము సేయకు రారా
chenta rammani nEnentani vEDudurA nE
pantamu sEyaku rArA

#637 అది నీపై adi nIpai

Titleఅది నీపైadi nIpai
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaయమునా కల్యాణి (యమన్)yamunA kalyANi (yaman)
తాళం tALaదేశాదిdESAdi
పల్లవి pallaviఅది నీపై మరులు కొన్నదిరాadi nIpai marulu konnadirA
చరణం
charaNam 1
రామ రఘురామ అభిరామ రామ
రామ నీ సమమును కానకలేరా
rAma raghurAma abhirAma rAma
rAma nI samamunu kAnakalErA
చరణం
charaNam 2
దాతలలో నెఱదాతవౌ శ్రీ
ధర్మపురీశ తామస మేలనురా
dAtalalO ne~radAtavau SrI
dharmapurISa tAmasa mElanurA

#636 ఇది నీకు idi nIku

Titleఇది నీకుidi nIku
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
Previously Posted At565
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఇది నీకు మరియాదగా ఏరా నా సామిidi nIku mariyAdagA ErA nA sAmi
అనుపల్లవి anupallaviఇది నీకు మరియాదగా దానింటికి పోయి
అలసి సొలసి గూడి ఇందు రావైతి వయ్యో
idi nIku mariyAdagA dAninTiki pOyi
alasi solasi gUDi indu rAvaiti vayyO
చరణం
charaNam 1
పట్టె మంచము బిగి పట్టించి నా పడ
కింట పవ్వళించమని వేడితే నాతో
సద్దు సేయక మువ్వ సుదతి యింటికి పోయి
వట్టి నేలలో పవ్వళించితి వయ్యో
paTTe manchamu bigi paTTinchi nA paDa
kinTa pavvaLinchamani vEDitE nAtO
saddu sEyaka muvva sudati yinTiki pOyi
vaTTi nElalO pavvaLinchiti vayyO
Lyrics posted in 565 had 2 more charaNam. ఇంతకు ముందు ప్రచురించిన 565 లో ఇంకొక రెండు చరణములు కలవు.

#635 ప్రాణ సఖుడిటు prANa sakhuDiTu

Titleప్రాణ సఖుడిటుprANa sakhuDiTu
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసెంజురుటిsenjuruTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviప్రాణ సఖుడిటు జేసెనే సఖిprANa sakhuDiTu jEsenE sakhi
చరణం
charaNam 1
ఇదిగొ వచ్చెదనని ఇతవులాడి
అల దానిల్లటు జేరెనే సఖి
idigo vachchedanani itavulADi
ala dAnillaTu jErenE sakhi
చరణం
charaNam 2
నన విలుతుని కేళికి బిలిచితే వాడు
అనరాని మాట్లాడెనే (సఖి)
nana vilutuni kELiki bilichitE vADu
anarAni mATlADenE (sakhi)
చరణం
charaNam 3
మును నను కలసి మర్మము లెరిగిన
ధర్మపురి వాసుడు నన్ను మరచెనే (సఖి)
munu nanu kalasi marmamu lerigina
dharmapuri vAsuDu nannu marachenE (sakhi)
Audio Linkhttps://www.youtube.com/watch?v=gyKjHyfOMfY