#593 రామ రామ ప్రాణసఖి rAma rAma prANasakhi

Titleరామ రామ ప్రాణసఖిrAma rAma prANasakhi
Written By
Book
రాగం rAgaఆహిరిAhiri
తాళం tALaఝంపjhampa
పల్లవి pallaviరామ రామ ప్రాణ సఖి నెడబాసి
రాము డెటువలె దాళెనో ముందు
తామర సాక్షిని దలంచితే నా గుండె
తల్లడంబందె నేమందు నయ్యయ్యో
rAma rAma prANa sakhi neDabAsi
rAmu DeTuvale dALenO mundu
tAmara sAkshini dalanchitE nA gunDe
tallaDambande nEmandu nayyayyO
చరణం
charaNam 1
కలికి చిలుక పలుకు లీలాగున నతనికి
కర్ణ శూలములై యుండలేదో
నెల రాయడతని పాలిటికి నీలాగున
నిప్పుల కుప్పయై యుండలేదో
kaliki chiluka paluku lIlAguna nataniki
karNa SUlamulai yunDalEdO
nela rAyaDatani pAliTiki nIlAguna
nippula kuppayai yunDalEdO
చరణం
charaNam 2
తెలియకను రాతిరి పగలు నీ తీరునను
దిగులు మదిలో దోచదాయ నేమో
చెలియ నెడబాసి నప్పటి నుండి నా మనసు
చిందర వందరై యున్న దయ్యాయ్యో
teliyakanu rAtiri pagalu nI tIrunanu
digulu madilO dOchadAya nEmO
cheliya neDabAsi nappaTi nunDi nA manasu
chindara vandarai yunna dayyAyyO
చరణం
charaNam 3
వరుడు పగవాడగుచు నీలాగు నాడల్ల
మనుజేశు నలయించడాయె నేమో
కెరలి యా గండ కోయిలు నాద మీలాగు
ఖేదమై యతని బాధించలేదో
varuDu pagavADaguchu nIlAgu nADalla
manujESu nalayinchaDAye nEmO
kerali yA ganDa kOyilu nAda mIlAgu
khEdamai yatani bAdhinchalEdO
చరణం
charaNam 4
విరివిగా నాతని కాహార నిద్రాదులును
విరసంబు గాక నింపాయనేమో
విరిబోణి నెడబాసి నది మొదలు నేనిట్లు
వెడవిల్తు బారి పాలైతి నయ్యయ్యో
virivigA nAtani kAhAra nidrAdulunu
virasambu gAka nimpAyanEmO
viribONi neDabAsi nadi modalu nEniTlu
veDaviltu bAri pAlaiti nayyayyO
చరణం
charaNam 5
వేమారు నావలెను దన సతికి నాతడును
వేడగను నమ్మికలు నియ్యలే
కామినీ మణి వద్ద లేనప్పు డతనికి
కనుగవల నీరిట్టు గ్రమ్మ లేదో
vEmAru nAvalenu dana satiki nAtaDunu
vEDaganu nammikalu niyyalE
kAminI maNi vadda lEnappu Dataniki
kanugavala nIriTTu gramma lEdO
చరణం
charaNam 6
తామసపు ప్రేమ చేత నతడు నావలె గాక
ధైర్యంబు దెచ్చుకొని యుండెనేమో
కామించి నను మువ్వ గోపాల రమ్మనుచు
కలసిన చెలి కనుల గప్పె నయ్యయ్యో
tAmasapu prEma chEta nataDu nAvale gAka
dhairyambu dechchukoni yunDenEmO
kAminchi nanu muvva gOpAla rammanuchu
kalasina cheli kanula gappe nayyayyO

#592 పూసదారము pUsadAramu

TitleపూసదారముpUsadAramu
Written By
Book
రాగం rAgaతోడిtODi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviపూసదారము రీతి పొందిన చెలిని బాపె
దోసకారి దైవము
pUsadAramu rIti pondina chelini bApe
dOsakAri daivamu
అనుపల్లవి anupallaviఆసలూరగ మది అనుదినమును
చెంత వాసమై యున్నట్టి
వనిత రత్నము వంటి
AsalUraga madi anudinamunu
chenta vAsamai yunnaTTi
vanita ratnamu vanTi
చరణం
charaNam 1
చిన్న నాటి మొదలు చెలిమి యొనర్చుచు
ఎన్నడైన నిన్ను ఎడబాయ ననుచునా
కన్నుల గమ్ముక కలసి మెలసి నట్టి
ఎన్న దగిన మంచి యువిద ముత్యము వంటి
chinna nATi modalu chelimi yonarchuchu
ennaDaina ninnu eDabAya nanuchunA
kannula gammuka kalasi melasi naTTi
enna dagina manchi yuvida mutyamu vanTi
చరణం
charaNam 2
అద్దంపు చెక్కిలి ఆననంబున జేర్చి
ముద్దు ఒసంగుమని
ముదుముతో మనసాటి ఒద్దిక గలదాని
నూరదించు చున్నట్టి
సుద్దులు దెల్పిన సుదతి బంగారు వంటి
addampu chekkili Ananambuna jErchi
muddu osangumani
mudumutO manasATi oddika galadAni
nUradinchu chunnaTTi
suddulu delpina sudati bangAru vanTi
చరణం
charaNam 3
సామి బాల గోపాల సదయుడవై నన్ను
కాము కేళిలోన కరగించె
sAmi bAla gOpAla sadayuDavai nannu
kAmu kELilOna karaginche

#591 కాశికి పొయ్యెనే kASiki poyyenE

Titleకాశికి పొయ్యెనేkASiki poyyenE
Written By
Book
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaచాపుchApu
Previously Posted At55
పల్లవి pallaviకాశికి పొయ్యెనే నీ వల్లనే ఓసోసి నామది నున్నయట్టి నీదు
ఆశలెల్ల నిరాశ చేసుక ఇదో
kASiki poyyenE nI vallanE OsOsi nAmadi nunnayaTTi nIdu
ASalella nirASa chEsuka idO
చరణం
charaNam 1
ఏ తీరు నైనను ప్రీతి సేయుదువని
పాతకి నే చాల భ్రమసి తిరుగుచుంటి
రాతి మనసు గల నాతి నీవనుచు
నే తెలియక మోసపోతి నయ్యయ్యో
E tIru nainanu prIti sEyuduvani
pAtaki nE chAla bhramasi tiruguchunTi
rAti manasu gala nAti nIvanuchu
nE teliyaka mOsapOti nayyayyO
చరణం
charaNam 2
చక్కగాను నాతో సంతోషముగ నీవు ఒక్క మాటాడితే
తక్కువటేనకు ఇక్కడ భ్రాంతిచే ఇల్లాలిని బాసి
దిక్కు దెసయు లేక తిరిగి తిరిగి రోసి
chakkagAnu nAtO santOshamuga nIvu okka mATADitE
takkuvaTEnaku ikkaDa bhrAntichE illAlini bAsi
dikku desayu lEka tirigi tirigi rOsi
చరణం
charaNam 3
ముద్దుగుమ్మ మనమిద్దఱు గూడున్న
ముద్దు నటేశ్వర మూర్తికే తెలుసును
సుద్దు లెంచకున్న సుదతి నీ వనుచును
సద్దు చేసిన ఆతో పలుకవు గనుక నే
muddugumma manamidda~ru gUDunna
muddu naTESwara mUrtikE telusunu
suddu lenchakunna sudati nI vanuchunu
saddu chEsina AtO palukavu ganuka nE

#590 అత్తవారా నన్ను attavArA nannu

Titleఅత్తవారా నన్నుattavArA nannu
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviఅత్తవారా నన్ను పిలువ వచ్చినారు
రాగోపాల వట్టి మాటలు గావుర సామి
వూరికే పయనంబు నేడు
attavArA nannu piluva vachchinAru
rAgOpAla vaTTi mATalu gAvura sAmi
vUrikE payanambu nEDu
చరణం
charaNam 1
సుందరాంగ నిన్నెడ బాయుట కన్న
కిన్నత లేదురా యేమి సైతుర ముద్దుల సామి
మా మదనుని యింటనండే అత్త
ఆడబడుచు మరదు యండును పుండుటకే
ముగాదు ఎటుల సైతుర ముద్దుల సామి
మనసు కుక యేమి తేలదు
sundarAnga ninneDa bAyuTa kanna
kinnata lEdurA yEmi saitura muddula sAmi
mA madanuni yinTananDE atta
ADabaDuchu maradu yanDunu punDuTakE
mugAdu eTula saitura muddula sAmi
manasu kuka yEmi tEladu

#589 హాహా ప్రేమ సఖుడా hAhA prEma sakhuDA

Titleహాహా ప్రేమ సఖుడాhAhA prEma sakhuDA
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviహాహా ప్రేమ సఖుడా హాహా ప్రియ సఖుడా
సరిగాదు నన్నెడబాసి పోవ
hAhA prEma sakhuDA hAhA priya sakhuDA
sarigAdu nanneDabAsi pOva
చరణం
charaNam 1
మదనుని కేళికి మరిమరి పిలువ
సరిగాదు నన్నెడబాయ సఖుడా
సుందరాంగ నిన్నే చాలగ నమ్మితి
అలకేలరా నాపై మరుకేళికి సఖుడా
madanuni kELiki marimari piluva
sarigAdu nanneDabAya sakhuDA
sundarAnga ninnE chAlaga nammiti
alakElarA nApai marukELiki sakhuDA
చరణం
charaNam 2
వగలాడి చెవిక్కి వేళ మీరరా
సరిగాదు నన్నెడ బాసి పోవ
వాసిగ విజయ నగర పురమున
వెలసిన వాస సన్నుత నరవాస రూపత
vagalADi chevikki vELa mIrarA
sarigAdu nanneDa bAsi pOva
vAsiga vijaya nagara puramuna
velasina vAsa sannuta naravAsa rUpata

#588 కలికి మణిరో kaliki maNirO

Titleకలికి మణిరోkaliki maNirO
Written By
Book
రాగం rAga
తాళం tALa
Previously Posted At416
పల్లవి pallaviకలికి మణిరో కాంతా మణిరో కమలాకరుడు కానరాడే
వాని బాసి మనసు యొక్క నిమిషమయిన నిలువగలదే
kaliki maNirO kAntA maNirO kamalAkaruDu kAnarADE
vAni bAsi manasu yokka nimishamayina niluvagaladE
చరణం
charaNam 1
తరుణి వాని తలపు మాని తొలగిన నేమొ తోడిని గదా
వాసిగ గుంటూరు పురమున వెలసిన దాసుని బ్రోచెడు
వాసుదేవుడు వేణు గోపాలుడు
taruNi vAni talapu mAni tolagina nEmo tODini gadA
vAsiga gunTUru puramuna velasina dAsuni brOcheDu
vAsudEvuDu vENu gOpAluDu

#587 సరి యేమి sari yEmi

Titleసరి యేమిsari yEmi
Written By
Book
రాగం rAgaఅఠాణాaThANA
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసరియేమి సారసాక్షి నీకిది
కరమిచ్చి చేర పిలచిన
కరుణా రసంబే లేకుండుట
sariyEmi sArasAkshi nIkidi
karamichchi chEra pilachina
karuNA rasambE lEkunDuTa
చరణం
charaNam 1
మదిరాక్షి నీదు మోని హృదయంబు గానలేకనే
ముదమంది మోవియాన రాగ
పెదవివ్వకనే బిగువుల్ జేయుట
madirAkshi nIdu mOni hRdayambu gAnalEkanE
mudamandi mOviyAna rAga
pedavivvakanE biguvul jEyuTa

#586 మరులు కొన్నదిరా marulu konnadirA

Titleమరులు కొన్నదిరాmarulu konnadirA
Written By
Book
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమరులు కొన్నదిరా మానినీ మణి నీపై
పరిపరి విధముల పరితపించుచు నీపై
marulu konnadirA mAninI maNi nIpai
paripari vidhamula paritapinchuchu nIpai
చరణం
charaNam 1
ధరను లోనీకు తగిన వల్లభుడని
తరుణి మిక్కిలి నిన్ను తలచి తలచి చాలా
వనజ నేత్రుడౌ శ్రీనివాస నాయక నిన్ను
వల్లగ నీ మాటలు ఎల్లపుడును ఎద
dharanu lOnIku tagina vallabhuDani
taruNi mikkili ninnu talachi talachi chAlA
vanaja nEtruDau SrInivAsa nAyaka ninnu
vallaga nI mATalu ellapuDunu eda
చరణం
charaNam 2
మరచితివా నన్ను మగువా
గురుతెరుగా మువ్వ గోపాలుడగు గాన
marachitivA nannu maguvA
guruterugA muvva gOpAluDagu gAna
చరణం
charaNam 3
పాటల ధారీ మువ్వ గోపాల
మంచి తేట ముత్యము లేరలు తీసుకో గొనిన
నాటి వరకింత నేటికి దీరదు
pATala dhArI muvva gOpAla
manchi tETa mutyamu lEralu tIsukO gonina
nATi varakinta nETiki dIradu

#585 పోవే పోపోవే చెలియా pOvE pOpOvE cheliyA

Titleపోవే పోపోవే చెలియాpOvE pOpOvE cheliyA
Written Byధర్మపురి?dharmapuri?
Book
రాగం rAgaయమునా కల్యాణిyamunA kalyANi
తాళం tALaచాపుchApu
Previously Posted At473
పల్లవి pallaviపోవే పోపోవే చెలియా
వేగ పోవే పోపోవే చెలియా
పోవే వానిటు వేగలేవ చెలియా
pOvE pOpOvE cheliyA
vEga pOvE pOpOvE cheliyA
pOvE vAniTu vEgalEva cheliyA
చరణం
charaNam 1
మదనుడు పదను శరము లెద నేయ
మదన సదన మింక పదనించె గదవె
madanuDu padanu Saramu leda nEya
madana sadana minka padaninche gadave
చరణం
charaNam 2
ననబోణి వినవే వనజ వైరి యిపుడు
నను బాధించెది న్యాయమౌనటవే
nanabONi vinavE vanaja vairi yipuDu
nanu bAdhinchedi nyAyamaunaTavE
చరణం
charaNam 3
సరసుడైన ధర్మ పురమున నెలకొన్న
పర వాసుదేవుని తేవే చెలియా
sarasuDaina dharma puramuna nelakonna
para vAsudEvuni tEvE cheliyA

#584 అరమరికగా aramarikagA

TitleఅరమరికగాaramarikagA
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviఅరమరికగా నా మాట ఆదరించ వదేమిరాaramarikagA nA mATa Adarincha vadEmirA
చరణం
charaNam 1
సమయమిదే కాదుర నా సామి నాతో మాటలాడsamayamidE kAdura nA sAmi nAtO mATalADa
చరణం
charaNam 2
పట్ట పగలు వెన్నెలలో విత్తముగ గాయుచున్నవిpaTTa pagalu vennelalO vittamuga gAyuchunnavi
చరణం
charaNam 3
బొట్టుగట్టిన వాడింట అడ్డన యున్నానురాboTTugaTTina vADinTa aDDana yunnAnurA