| Title | సామి నెడబాసి | sAmi neDabAsi |
| Written By | తచ్చూరు సింగరాచార్యులు | tachchUru singarAchAryulu |
| Book | ||
| రాగం rAga | దేవ మనోహరి | dEva manOhari |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | సామి నెడబాసి నేనెట్లు సైరింతునే కోమలీ శ్రీ కోమలీ శ్రీ కోమలీ శ్రీ రాజగోపాల | sAmi neDabAsi nEneTlu sairintunE kOmalI SrI kOmalI SrI kOmalI SrI rAjagOpAla |
| చరణం charaNam 1 | మరుడురమున విరిశరముల నేసెనే సరసిజాక్షి ఇదే సమయము రమ్మనవే | maruDuramuna viriSaramula nEsenE sarasijAkshi idE samayamu rammanavE |
| చరణం charaNam 2 | కలువల దొర పగ నాపై గావించెనే కలికిరో తమి నిలుప నా తరమటే | kaluvala dora paga nApai gAvinchenE kalikirO tami nilupa nA taramaTE |
| చరణం charaNam 3 | సింగర సుతుడు మోసము జేసెనే అంగనామణి ఇపుడైనను బిలువవే | singara sutuDu mOsamu jEsenE anganAmaNi ipuDainanu biluvavE |
Category: Lyrics
#376 ముందటివలె mundaTivale
| Title | ముందటివలె | mundaTivale |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | ముందటివలె నన్ను ప్రేమించకుంటే అందగాడా నిను వదలనురా | mundaTivale nannu prEminchakunTE andagADA ninu vadalanurA |
| కందర్ప జనక నీ దర్పములెందుకు అందమా నీకిది చందమా | kandarpa janaka nI darpamulenduku andamA nIkidi chandamA | |
| పుట్టిల్లు వదలి నేనెట్లు వచ్చితిరా కట్టకడకు నా చెయి విడిచితివయ్యో | puTTillu vadali nEneTlu vachchitirA kaTTakaDaku nA cheyi viDichitivayyO | |
| మట్ట మాయము జేసినట్టి వేణుగోపా లెట్ల నిను నమ్ముదు తెలియదేమి సేతురా | maTTa mAyamu jEsinaTTi vENugOpA leTla ninu nammudu teliyadEmi sEturA | |
#375 సరసకు రారాయని sarasaku rArAyani
స్వరపద జావళీ svarapada jAvaLI
| Title | సరసకు రారాయని | sarasaku rArAyani |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బరావు | dharmapuri subbarAyar / subbarAvu |
| Book | ||
| రాగం rAga | శుధ్ధ దేశి | Sudhdha dESi |
| తాళం tALa | ?? | ?? |
| పల్లవి pallavi | సరసకు రారాయని నే పిలిచితే కరుణమింతైన లేదా సామీ | sarasaku rArAyani nE pilichitE karuNamintaina lEdA sAmI |
| చరణం charaNam 1 | ధరపురీశ సరసిజనిభ నేత్ర నిదుర రాదు పర వనితనే గాదుర | dharapurISa sarasijanibha nEtra nidura rAdu para vanitanE gAdura |
| చరణం charaNam 2 | కరమున కౌగిట సేయుట కెందుకు బిగువ మగువాయనితి వపుడు బిలువా | karamuna kaugiTa sEyuTa kenduku biguva maguvAyaniti vapuDu biluvA |
| చరణం charaNam 3 | ఒక ముద్దీయ గలిగితె సుఖ మెప్పటికిది యని మిక్కిలి ప్రీతితో తరుణుల గురుతుంచి చన్నులను గోరెదవు | oka muddIya galigite sukha meppaTikidi yani mikkili prItitO taruNula gurutunchi channulanu gOredavu |
#374 ఎక్కడున్నావు ekkaDunnAvu
| Title | ఎక్కడున్నావు | ekkaDunnAvu |
| Written By | మైసూరు సదాశివయ్య | maisUru sadASivayya |
| Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
| రాగం rAga | అఠాణా | aThANA |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఎక్కడున్నావు నా చక్కని సామి ఇక్షు చాపుని చేత చిక్కినే నొందితి | ekkaDunnAvu nA chakkani sAmi ikshu chApuni chEta chikkinE nonditi |
| అనుపల్లవి anupallavi | ఊరకుండ ఇంక మేరగాదుర మేరుధీర రారా కౌగలించరా ఊరకుండ ఇంక మేరగాదుర మేరుధీర | UrakunDa inka mEragAdura mErudhIra rArA kaugalimcharA UrakunDa inka mEragAdura mErudhIra |
| — మధ్యమ కాలం — తాపసాదులకు మోహము వచ్చితే ధ్యానము సేయుట సాధ్యమా యిక పాపి మారుడు నాపై వెడలి నేను సైరించుట వశమా ఎంత వేడినా పంతమేలరా కంతురూప శ్రీకృష్ణ రాజేంద్ర | — madhyama kAlam — tApasAdulaku mOhamu vachchitE dhyAnamu sEyuTa sAdhyamA yika pApi mAruDu nApai veDali nEnu sairinchuTa vaSamA enta vEDinA pantamElarA kanturUpa SrIkRshNa rAjEndra | |
| సదాశివుని మూడో కన్నులలో కూడ ఇంతటి తాపము లేదు కాదేమిరా నారీమణిని బాధ దీర్చకు ఎవరున్నారురా నిను వినా గతి మాకురా | sadASivuni mUDO kannulalO kUDa intaTi tApamu lEdu kAdEmirA nArImaNini bAdha dIrchaku evarunnArurA ninu vinA gati mAkurA | |
| — మధ్యమ కాలము తపసాదులకు వలె — పూలపాన్పుపై పొరలుచు నిన్నే కలసి మెలయుటకు వలచితిరా తాళజాల నీ అధరామృతముల చెలిమితో నాకొసగుమురా వలపుతో మీసలు తిరువుతొ రతిని సలిపి ఆసలు దీర్చురా వ్యత దీర్చరా నెరవేర్చురా ఇంటిలో ఎవరు లేరురా ఎనిన | — madhyama kAlamu tapasAdulaku vale — pUlapAn&pupai poraluchu ninnE kalasi melayuTaku valachitirA tALajAla nI adharAmRtamula chelimitO nAkosagumurA valaputO mIsalu tiruvuto ratini salipi Asalu dIrchurA vyata dIrcharA neravErchurA inTilO evaru lErurA enina | |
| AV Link | https://www.youtube.com/watch?v=75BCdVa_ahI |
#373 సిగ్గు లేదేమి siggu lEdEmi
| Title | సిగ్గు లేదేమి | siggu lEdEmi |
| Written By | unknown | |
| Book | unknown | |
| రాగం rAga | బేగడ | bEgaDa |
| తాళం tALa | ఖండ చాపు | khanDa chApu |
| పల్లవి pallavi | సిగ్గు లేదేమిరా నీకు కొంతైన | siggu lEdEmirA nIku kontaina |
| అనుపల్లవి anupallavi | ముగ్గులన్ని వేయుచున్నపుడే దాచుకొని దగ్గులు జేసి సైగలన్ని జేయుటకు | muggulanni vEyuchunnapuDE dAchukoni daggulu jEsi saigalanni jEyuTaku |
| చరణం charaNam 1 | వగవగగా మాట్లాడి నన్నేమరించి నగలు నాట్యాలన్ని దోచేయుట మృగనయనినే కాదు నాతో నీదేమి వాదు మొగుడున్నాడింటిలో ముగుద నీకంటితో | vagavagagA mATlADi nannEmarinchi nagalu nATyAlanni dOchEyuTa mRganayaninE kAdu nAtO nIdEmi vAdu moguDunnADinTilO muguda nIkanTitO |
#372 వారిజాక్షి vArijAkshi
| Title | వారిజాక్షి | vArijAkshi |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | ||
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వారిజాక్షి నా మనవిని వినవే | vArijAkshi nA manavini vinavE |
| అనుపల్లవి anupallavi | సారమైన సంసార శరధిలో సారెకు వచ్చిన సారసవదన | sAramaina samsAra SaradhilO sAreku vachchina sArasavadana |
| చరణం charaNam 1 | చిరకాలము సంతోషముగా సరసము లాడుట కెంత వింత స్మరతాపములను దీర్చకుండుట సరిగాదే (నీకు) తాళవనలోలుని | chirakAlamu santOshamugA sarasamu lADuTa kenta vinta smaratApamulanu dIrchakunDuTa sarigAdE (nIku) tALavanalOluni |
#371 ఏమిత్తునే EmittunE
| Title | ఏమిత్తునే | EmittunE |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | uknown | |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమిత్తునే చెలియా నీకు నేనేమిత్తునే | EmittunE cheliyA nIku nEnEmittunE |
| అనుపల్లవి anupallavi | కామిని నీతో నేనేమేమో జేసిన సామి నీవే గతియని నాతో వచ్చిన నీకేమిత్తునే | kAmini nItO nEnEmEmO jEsina sAmi nIvE gatiyani nAtO vachchina nIkEmittunE |
| చరణం charaNam 1 | తాళవనుని మనవ్యాలకించి సుర తాలన్ని జేయుట కాలంబమైతివే చాలక కూడి ముద్దాడి మాటాడి చిర కాలము సుఖమిచ్చే లోలాక్షి నీకు నేనేమిత్తునే | tALavanuni manavyAlakinchi sura tAlanni jEyuTa kAlambamaitivE chAlaka kUDi muddADi mATADi chira kAlamu sukhamichchE lOlAkshi nIku nEnEmittunE |
#370 ఏది మంచి సుఖము Edi manchi sukhamu
వైరాగ్య జావళి – vairAgya jAvaLi
| Title | ఏది మంచి సుఖము | Edi manchi sukhamu |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ప్రతాప శేఖర | pratApa SEkhara |
| పల్లవి pallavi | ఏది మంచి సుఖము పరాత్పరా మానవులకు సదా కాలము | Edi manchi sukhamu parAtparA mAnavulaku sadA kAlamu |
| అనుపల్లవి anupallavi | మోదమో వేదాంతమో స్వాంతమైన కాముసుఖమో తెలియలేనైతిరా | mOdamO vEdAntamO svAntamaina kAmusukhamO teliyalEnaitirA |
| చరణం charaNam 1 | కామము తగదనవారు కొంత కాలములో కామ వశమయ్యెదరు కామహరుడే కామాక్షికి ప్రియుడై కామించినాడే తలవనాధినాధ | kAmamu tagadanavAru konta kAlamulO kAma vaSamayyedaru kAmaharuDE kAmAkshiki priyuDai kAminchinADE talavanAdhinAdha |
#369 వయసులంత vayasulanta
| Title | వయసులంత | vayasulanta |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
| Book | ||
| రాగం rAga | ద్విజావంతి | dvijAvanti |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | వయసులంత పనికి రాదుగదరా భయము లేనివాడే పురుషుడు | vayasulanta paniki rAdugadarA bhayamu lEnivADE purushuDu |
| అనుపల్లవి anupallavi | చిరుత ప్రాయముండగ మంచి చిరునవ్వు లేనివానికి | chiruta prAyamunDaga manchi chirunavvu lEnivAniki |
| చరణం charaNam 1 | మనసుంటే తనువు తిరుగును మొరుగును మనసుండేవాడు మానవుడు మనసులేక తనువు దెంచితె ఘనము కాదు ధరపురీశ | manasunTE tanuvu tirugunu morugunu manasunDEvADu mAnavuDu manasulEka tanuvu denchite ghanamu kAdu dharapurISa |
#368 ఔరరా భళిరా aurarA bhaLirA
| Title | ఔరరా భళిరా | aurarA bhaLirA |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | ||
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఔరరా భళిరా రాజకుమారా తీరని మోహమిదేరా తామసించకురా | aurarA bhaLirA rAjakumArA tIrani mOhamidErA tAmasinchakurA |
| చరణం charaNam 1 | తీయని మాటలతో సుయనే మారుతములో పయ్యద రా స్వైర విహారము చయ్యని కాలము వ్యర్థము గదరా సయ్యాట పాటలకు సమయమిదేర | tIyani mATalatO suyanE mArutamulO payyada rA svaira vihAramu chayyani kAlamu vyarthamu gadarA sayyATa pATalaku samayamidEra |
| చరణం charaNam 2 | ఊగుమా రాగముతో ఉయ్యల బాగుగా నుండుటకు బాధలా జాగుసేయక వేవేగము నన్నేలు ఈ గతి సుదతికి తాళవనేశుడ | UgumA rAgamutO uyyala bAgugA nunDuTaku bAdhalA jAgusEyaka vEvEgamu nannElu I gati sudatiki tALavanESuDa |