#749 సరగున నిటురారా saraguna niTurArA

Titleసరగున నిటురారాsaraguna niTurArA
Written Byతచ్చూరు శింగరాచార్యులు
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaయమన్yaman
తాళం tALaతిశ్ర లఘువుtiSra laghuvu
Previously Posted At444
పల్లవి pallaviసరగున నిటురారా మరియాదటరా వినురా
మరుని బారి కోర్వలేక మరులైతిరా సామి నీకు
సరివారలు నవ్వగ జేయుట న్యాయము గాదుర
నే నెఱనమ్మిన దాననురా
saraguna niTurArA mariyAdaTarA vinurA
maruni bAri kOrvalEka marulaitirA sAmi nIku
sarivAralu navvaga jEyuTa nyAyamu gAdura
nE ne~ranammina dAnanurA
చరణం
charaNam 1
బాస లొసగి ఇటు నను నెడబాయ నగునా
నను నెడబాయ నగునా
మోస మెందుకు చేసేవురా మది నెంచర
యీ తనువే నీ సొమ్ముగ చేకొనరా
bAsa losagi iTu nanu neDabAya nagunA
nanu neDabAya nagunA
mOsa menduku chEsEvurA madi nenchara
yI tanuvE nI sommuga chEkonarA
చరణం
charaNam 2
ప్రాణ నాథ రాజగోపాల చలమా రాజగోపాల
మాన మెంచ వదేమిర నా యెడ నేరము లేమిర
నే నిను జూడక తాళనురా
prANa nAtha rAjagOpAla chalamA rAjagOpAla
mAna mencha vadEmira nA yeDa nEramu lEmira
nE ninu jUDaka tALanurA

#748 సరిగ కొంగు sariga kongu

Titleసరిగ కొంగుsariga kongu
Written Byఘనం కృష్ణ అయ్యర్ghanam kRshNa ayyar
Bookhttps://karnatik.com/c18059.shtml
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసరిగ కొంగు ముసుగు దానితో వాడు సైగ జేసినది కంటివేమోsariga kongu musugu dAnitO vADu saiga jEsinadi kanTivEmO
చరణం
charaNam 1
తిరిగి తిరిగి జూచుకొని సొగసుగ దేవుడైన మన్నారు రంగడుtirigi tirigi jUchukoni sogasuga dEvuDaina mannAru rangaDu
Audio Linkshttps://soundcloud.com/gnanaprasuna-vudali/sariga-kongu-musugudani-sung
https://www.youtube.com/watch?v=J_XUkpfoUtE

#747 సొగసు కాడా sogasu kADA

Titleసొగసు కాడాsogasu kADA
Written Byచత్రపురిchatrapuri
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
Previously Posted At96
పల్లవి pallaviసొగసు కాడా నీ వగలు మాని రారాsogasu kADA nI vagalu mAni rArA
చరణం
charaNam 1
తగదురా యిటు సేయా పగతి జాణారాయాtagadurA yiTu sEyA pagati jANArAyA
చరణం
charaNam 2
తుమ్మెద లొక్కాసారి ఝుమ్మ ఝుమ్మని మ్రోయా
సమ్మ దూడయి మరూడమ్ములు నేయ తాళా
tummeda lokkAsAri jhumma jhummani mrOyA
samma dUDayi marUDammulu nEya tALA
చరణం
charaNam 3
చక్కగా కౌగాలించి చెక్కిలీ ముద్దూలిడి
చక్కెరా కెమ్మోవి నొక్క నివ్వరా నేడు
chakkagA kaugAlinchi chekkilI muddUliDi
chakkerA kemmOvi nokka nivvarA nEDu
jAvaLi at 97 has more charaNams

#746 మై డియర్ కమ్ my dear come

Titleమై డియర్ కమ్my dear come
Written Byకరూర్ శివరామయ్యkarUr SivarAmayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviమై డియర్ కమ్ వరువాయ్ యీ వేళmy dear come varuvAy yI vELa
చరణం
charaNam 1
నిన్ను జూచి చాల దివస ఆయెతె
నీ నా మనసు యింపైన
కాల హరణ మింక
బెల తింగళు బసల్ల వాయితె
కులుకు తళుకు గల కమ్ బిరాన
వెల్ ఐ షల్ సింగ్ శివరాముని సాంగ్స్
ninnu jUchi chAla divasa Ayete
nI nA manasu yimpaina
kAla haraNa minka
bela tingaLu basalla vAyite
kuluku taLuku gala kam&^ birAna
well I shall sing SivarAmuni songs

చతుర్భాషా జావళి chaturbhAshA jAvaLi – words from Telugu, Tamil, Kannada, and English appear in the lyrics. ఈ జావళిలో తెలుగు, తమిళం, కన్నడ, మరియు ఆంగ్ల భాషా పదాలు ఉన్నాయి.

#745 వలపు తాళ valapu tALa

Titleవలపు తాళvalapu tALa
Written Byస్వాతి తిరునాళ్svAti tirunAL
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఅఠాణaTHANa
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviవలపు తాళ వశమా నా సామికి
చలము సేయ న్యాయమా
valapu tALa vaSamA nA sAmiki
chalamu sEya nyAyamA
అనుపల్లవి anupallaviఅలరు విల్తుని సమానుడౌ శ్రీ పద్మనాభుడు
నెలత ఇపుడు నిన్ను నిరాకరించెనే
alaru viltuni samAnuDau SrI padmanAbhuDu
nelata ipuDu ninnu nirAkarinchenE
చరణం
charaNam 1
చిరుత ప్రాయము నాడే చిగురు బోణి వాని
కరుణా సాగరుడని కలికి చాల నమ్మితి
మరుని బాణము చాత మగువ నా మనసెంతో
పరవశ మాయెనే భాగ్య మిటు లాయెనే
chiruta prAyamu nADE chiguru bONi vAni
karuNA sAgaruDani kaliki chAla nammiti
maruni bANamu chAta maguva nA manasentO
paravaSa mAyenE bhAgya miTu lAyenE
చరణం
charaNam 2
ఇలను నా ప్రాణేశు డే మానినితో గూడి
జలజాక్షి మితి మీరి సరసా లాడు చున్నాడో
పలుమారు నను జూచి పలుకు లాడిన దెల్ల
తెలియ వచ్చెనే ఓ చెలియరో ఈ వేళ
ilanu nA prANESu DE mAninitO gUDi
jalajAkshi miti mIri sarasA lADu chunnADO
palumAru nanu jUchi paluku lADina della
teliya vachchenE O cheliyarO I vELa
చరణం
charaNam 3
సోమ కిరణము చాత సొగసైన నిన్నటి రేయి
రామ రామ నాకు రమణి యుగ మాయెనే
కామకేళిలో నన్ను కలసి యుండిన విభుడు
నా మీద నున్న నెనరు నాతి మరచె నేమో
sOma kiraNamu chAta sogasaina ninnaTi rEyi
rAma rAma nAku ramaNi yuga mAyenE
kAmakELilO nannu kalasi yunDina vibhuDu
nA mIda nunna nenaru nAti marache nEmO
In anupallavi, could it be “nannu nirAkarinchenE”?

#744 ఇంత మోడి inta mODi

Titleఇంత మోడిinta mODi
Written Byస్వాతి తిరునాళ్svAti tirunAL
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviఇంత మోడి యాలర నా సామి నన్నేలుకోర వేగమేinta mODi yAlara nA sAmi nannElukOra vEgamE
అనుపల్లవి anupallaviపంతమా నాపై శ్రీ పద్మనాభ సామిpantamA nApai SrI padmanAbha sAmi
చరణం
charaNam 1
అలిగి యుండుటకు అయ్యో ఏమి కారణ మయ్యలూ నా మీదరా
తలిరుబోణులు నీకేమి బోధించిరో తాళరాదు విరహ మీవేళ సామి
aligi yunDuTaku ayyO Emi kAraNa mayyalU nA mIdarA
talirubONulu nIkEmi bOdhinchirO tALarAdu viraha mIvELa sAmi
చరణం
charaNam 2
క్షణము యుగ మాయెనే నాపై నీకు కరుణ లేక పోయెనే
పణతు లందరు నన్ను జూచి నవ్వేరు ప్రాణ నాథుడ నిన్నే నమ్మినాను
kshaNamu yuga mAyenE nApai nIku karuNa lEka pOyenE
paNatu landaru nannu jUchi navvEru prANa nAthuDa ninnE namminAnu
చరణం
charaNam 3
సోము డనల మాయెనే నీతో గూడి సురత సుఖము లేని
కాముని కన్న చక్కని పద్మనాభ కౌగిలించి కలయరా నాసామి
sOmu Danala mAyenE nItO gUDi surata sukhamu lEni
kAmuni kanna chakkani padmanAbha kaugilinchi kalayarA nAsAmi

#743 సారమైన sAramaina

TitleసారమైనsAramaina
Written Byస్వాతి తిరునాళ్svAti tirunAL
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaబిహాగ్bihAg
తాళం tALaరూపకrUpaka
Previously Published At713
పల్లవి pallaviసారమైన మాటలంత చాలు చాలురా సామిsAramaina mATalanta chAlu chAlurA sAmi
అనుపల్లవి anupallaviసారసాక్ష మీకెంతో సంతోషము మేలు మేలుsArasAksha mIkentO santOshamu mElu mElu
చరణం
charaNam 1
సోము డుదయ మాయెనే మీ సుదతికి మహా భయ మాయెనే
కామ కోటి సుందరా మా భాగ్య మిటు లాయెనే
sOmu Dudaya mAyenE mI sudatiki mahA bhaya mAyenE
kAma kOTi sundarA mA bhAgya miTu lAyenE
చరణం
charaNam 2
మరునాథుని శర భంగము గావోదూ నీకు మాయందు దయ కానరాద
విరహమైన వారధిలో మునికాయుందానన్నతో
marunAthuni Sara bhangamu gAvOdU nIku mAyandu daya kAnarAda
virahamaina vAradhilO munikAyundAnannatO
చరణం
charaNam 3
మనవి వినర సామి నిన్ను నమ్మియున్నాను మరేమి
ఘనుడైన శేషునిపై వెలయు శ్రీ పద్మనాభ
manavi vinara sAmi ninnu nammiyunnAnu marEmi
ghanuDaina SEshunipai velayu SrI padmanAbha

#740 నిన్ను బాసి ninnu bAsi

Titleనిన్ను బాసిninnu bAsi
Written Byమైసూరు వాసుదేవాచారిmaisUru vAsudEvAchAri
Bookజావళి రవళిjAvaLi ravaLi
రాగం rAgaయదుకుల కాంభోజిyadukula kAmbhOji
తాళం tALaఆదిAdi
Previously Published At381
పల్లవి pallaviనిన్ను బాసి నిమిషమైన
నేనెంటు జీవింతును రామ
ninnu bAsi nimishamaina
nEnenTu jIvintunu rAma
చరణం
charaNam 1
నన్ను విడచుట న్యాయమా నీకు
నా పాలి దేవ వాసుదేవ
nannu viDachuTa nyAyamA nIku
nA pAli dEva vAsudEva
చరణం
charaNam 2
నీ మనసు కరగదేమిరా
నీ పాదములనే నమ్మితిని
nI manasu karagadEmirA
nI pAdamulanE nammitini
చరణం
charaNam 3
కన్న తండ్రి నాపై కరుణ జూపురా
నిన్నే కోరియున్న వాడనురా
kanna tanDri nApai karuNa jUpurA
ninnE kOriyunna vADanurA
Sounds very similar to 381, but not entirely!

#736 ఎటువలె వచ్చితివో eTuvale vachchitivO

Titleఎటువలె వచ్చితివోeTuvale vachchitivO
Written Byషాహాజీ మహరాజ్shAhAjI maharAj
Bookజావళి రవళిjAvaLi ravaLi
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఎటువలె వచ్చితివో ఓ చెలియరొ
చిటుకు పొటుకు మనక చీకటి వేళలొ ఒంటిగాను
eTuvale vachchitivO O cheliyaro
chiTuku poTuku manaka chIkaTi vELalo onTigAnu
అనుపల్లవి anupallaviఇంటివారి నేమరించి ఎవరికి తెలియక
వెంట నెవరు లేక వీధి వెంట కులుకుచును
inTivAri nEmarinchi evariki teliyaka
venTa nevaru lEka vIdhi venTa kulukuchunu
చరణం
charaNam 1
సుదతి త్యాగామృత ఘటేశ్వరుని పొందు కోరి
మద కరేణువలె ముసి ముసి నవ్వుచు
sudati tyAgAmRta ghaTESvaruni pondu kOri
mada karENuvale musi musi navvuchu

#732 సరసుడ నీకిది sarasuDa nIkidi

Titleసరసుడ నీకిదిsarasuDa nIkidi
Written By
Bookగడ్డిభుక్త సీతారాంgaDDibhukta sItArAM
రాగం rAgaఅఠాణాaTHANA
తాళం tALaతిశ్ర ఆదిtiSra Adi
పల్లవి pallaviసరసుడ నీకిది మేర సమయము మంచిది రారాsarasuDa nIkidi mEra samayamu manchidi rArA
చరణం
charaNam 1
రేయి పగలు నీదు రూపము
కనుల కద్దు కొన వలెనని
నిరతము జూచు చుంటిని
నిజముగ ప్రియ సఖ
rEyi pagalu nIdu rUpamu
kanula kaddu kona valenani
niratamu jUchu chunTini
nijamuga priya sakha
చరణం
charaNam 2
నీ కొరకునై నాదు
మేనిపై నాస విడిచి
నీదు మోము గాంచుటెన్నడో
యని మురియు చుంటి
nI korakunai nAdu
mEnipai nAsa viDichi
nIdu mOmu gAnchuTennaDO
yani muriyu chunTi
చరణం
charaNam 3
నా బటువైన గుబ్బలపై
నీదు గోరు లుంతువని
ఎంతో యాస తోడ యెదురు
చూపులు చూచుచుంటి
nA baTuvaina gubbalapai
nIdu gOru luntuvani
entO yAsa tODa yeduru
chUpulu chUchuchunTi
చరణం
charaNam 4
నీదు చల్లని చూపులు
నాపై ప్రసరింప జేయుటకై
నీదు పాద సరోజములకు
మ్రొక్కు లిడుచుంటి నా ప్రియ
nIdu challani chUpulu
nApai prasarimpa jEyuTakai
nIdu pAda sarOjamulaku
mrokku liDuchunTi nA priya