#702 మరుబారి కోర్వ marubAri kOrva

Titleమరుబారి కోర్వmarubAri kOrva
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookhttps://karnatik.com/c26055.shtml
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaదేశాదిdESAdi
పల్లవి pallaviమరుబారి కోర్వ జాలరా ఒనరా(?) నా సామిmarubAri kOrva jAlarA onarA(?) nA sAmi
అనుపల్లవి anupallaviమరుని బారికి నేమని తాళుదురా జార శిఖామణి రాmaruni bAriki nEmani tALudurA jAra SikhAmaNi rA
చరణం
charaNam 1
చెంత రమ్మని ఎంతని వేడుదురా నే పంతము సేయకురాchenta rammani entani vEDudurA nE pantamu sEyakurA

#701 మహరాజుగా రమ్మనే maharAjugA rammanE

Titleమహరాజుగా రమ్మనేmaharAjugA rammanE
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookhttps://karnatik.com/c16938.shtml
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఏకEka
పల్లవి pallaviమహరాజుగా రమ్మనే మగువరో వానిmaharAjugA rammanE maguvarO vAni
అనుపల్లవి anupallaviఅంకమనేటికి అందరి రీతిని పంకజ నేత్రునీవేళankamanETiki andari rItini pankaja nEtrunIvELa
చరణం
charaNam 1
కొందరి రీతిని కుంతువలాడుచు ముందటిదేమో మానినామాkondari rItini kuntuvalADucu mundaTidEmO mAninAmA
చరణం
charaNam 2
ధరణిలోన శ్రీ ధర్మపురీశుని చేరినట్టేమో సుదనమోdharaNilOna SrI dharmapurISuni chErinaTTEmO sudanamO

#700 మహరాజుగా రమ్మనే maharAjugA rammanE

Titleమహరాజుగా రమ్మనేmaharAjugA rammanE
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookhttps://karnatik.com/c16937.shtml
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviమహరాజుగా రమ్మనే మగువరో వానికిmaharAjugA rammanE maguvarO vAniki
అనుపల్లవి anupallaviమహరాజుగ రమ్మనె సహజుడై మా ఇంటికిmaharAjuga rammane sahajuDai mA inTiki
చరణం
charaNam 1
ధరణి లోన శ్రీ ధర్మపురీశునికి
చేర నేడే సుదినమే
dharaNi lOna SrI dharmapurISuniki
chEra nEDE sudinamE

#699 ఎందుకు వలచితినే enduku valachitinE

Titleఎందుకు వలచితినేenduku valachitinE
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookhttps://karnatik.com/c16929.shtml
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఎందుకు వలచితినే ఓ సఖియాenduku valachitinE O sakhiyA
అనుపల్లవి anupallaviఎందుకు వలచితి ఇందు బింబానన
సందుల తిరిగే పాదారవిందునకు
enduku valachiti indu bimbAnana
sandula tirigE pAdAravindunaku
చరణం
charaNam 1
కలకాలము నాదు కౌగిట లోపల మెలగి
యిపుడు దాని వలలో చిక్కిన వానికి
kalakAlamu nAdu kaugiTa lOpala melagi
yipuDu dAni valalO chikkina vAniki
చరణం
charaNam 2
సరసిజాక్షి వాని సరసము దెలిసెను
ఎరుగ దాని యింట విందారగించిన వానికి
sarasijAkshi vAni sarasamu delisenu
eruga dAni yinTa vindAraginchina vAniki
చరణం
charaNam 3
చలచిత్తుడైన శ్రీ ధర్మపురీశుని
చిలుక బూరుగమాని ఫలము గాచిన రీతి
chalachittuDaina SrI dharmapurISuni
chiluka bUrugamAni phalamu gAchina rIti

#698 దిరిదిల్దానిం ధీం diridildAnim dhIm

Titleదిరిదిల్దానిం ధీంdiridildAnim dhIm
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookhttps://karnatik.com/c16924.shtml
రాగం rAgaసెంజురుటిsenjuruTi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviదిరిదిల్దానిం ధిం ధీంత దిరినా దిర్దర్ దానీం
ధీం ధింత దిరినా దిర్దిదానీ ధీంధీంత దిరినా
diridildAnim dhim dhImta dirinA dirdar dAnIm
dhIm dhimta dirinA dirdidAnI dhImdhImta dirinA
అనుపల్లవి anupallaviతదియనరే తదియనరే తదరె దానీదానీ ధీంధీం
తాదిరనవే దిర్దర్దాని ధీంధీం తదిరినా దిరనా దిరనా దిరనా
tadiyanarE tadiyanarE tadare dAnIdAnI dhImdhIm
tAdiranavE dirdardAni dhImdhIm tadirinA diranA diranA diranA
చరణం
charaNam 1
చెలియాలా పోపో పొమ్మనవే యిక యాల
పోపో పొమ్మనవే వాని
cheliyAlA pOpO pommanavE yika yAla
pOpO pommanavE vAni
చరణం
charaNam 2
పో తగదనవే తగదనవే తగదె వాని చాలు
పో మునుపెనసిన విభుడైతే మేలాయె
తానాతొం దిరినా తానాతొం దిరినా తానాతొం దిరి
చా చెలిసఖుడిక అలదాని పాలాయె
తానాతొందిరినా తానాతొందిరినా తానాతొందిరి దా
ధరను ధర్మపురి నివాసునివ్యాల తానా
pO tagadanavE tagadanavE tagade vAni chAlu
pO munupenasina vibhuDaitE mElAye
tAnAtom dirinA tAnAtom dirinA tAnAtom diri
chA chelisakhuDika aladAni pAlAye
tAnAtomdirinA tAnAtomdirinA tAnAtomdiri dA
dharanu dharmapuri nivAsunivyAla tAnA

#697 అలవాని నమ్మరాదే alavAni nammarAdE

Titleఅలవాని నమ్మరాదేalavAni nammarAdE
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Book
రాగం rAgaఆనందభైరవిAnandabhairavi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఅలవాని నమ్మరాదేalavAni nammarAdE
చరణం
charaNam 1
ఎప్పడి కెట్లాడినట లాడుచు మెప్పులకై నుప్పటిల్లు కన్నులeppaDi keTlADinaTa lADuchu meppulakai nuppaTillu kannula
చరణం
charaNam 2
కోప తాపములను కొనియాడగ చూపులకై చిరు నవ్వుచుండుkOpa tApamulanu koniyADaga chUpulakai chiru navvucunDu
చరణం
charaNam 3
శేష పాన్పున భూషణుడై నటు వేషములను కొని మీసము దిప్పినSEsha pAn&puna bhUshaNuDai naTu vEshamulanu koni mIsamu dippina
చరణం
charaNam 4
లీల తోడ నన్నేలు ధర్మపురి నీలమేఘ శ్యామలాంగుడౌlIla tODa nannElu dharmapuri nIlamEgha SyAmalAnguDau

#696 ఎవతె evate

Titleఎవతెevate
Written Byగర్భపురి?garbhapuri?
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఏకEka
పల్లవి pallaviఎవతె తాళునురా ఈ నడతలevate tALunurA I naDatala
చరణం
charaNam 1
కలకాలమునగు గాసి బెట్టుచును
కాంతను కౌగిట కోరుచు జేర్చితే
kalakAlamunagu gAsi beTTuchunu
kAntanu kaugiTa kOruchu jErchitE
చరణం
charaNam 2
దాతలలో నెరదాత వైన
ధరలో గర్భపురీశుని నడతల
dAtalalO neradAta vaina
dharalO garbhapurISuni naDatala

#695 ఎంతని నినునే entani ninunE

Titleఎంతని నినునేentani ninunE
Written Byగర్భపురి?garbhapuri?
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఎంత నిను నే వేడుదురా సామిenta ninu nE vEDudurA sAmi
అనుపల్లవి anupallaviఎంతటికైన దయా రాదేమిరా నా దొర సామిentaTikaina dayA rAdEmirA nA dora sAmi
చరణం
charaNam 1
నిదుర కంటికి రాదురా నిన్నెడబాసి
మదనుడు శరము వేయ మరువకున్న దొర
nidura kanTiki rAdurA ninneDabAsi
madanuDu Saramu vEya maruvakunna dora
చరణం
charaNam 2
చక్కని గుబ్బలు ఉప్పొంగిన విర
గ్రక్కున చెక్కిలి నొక్కి కౌగిలించమని
chakkani gubbalu uppongina vira
grakkuna chekkili nokki kaugilinchamani
చరణం
charaNam 3
ఎందుకు జాలము సేయుదురా నీవు
ముందు నను గూడిన శ్రీ గర్భపురీశా ధీరా
enduku jAlamu sEyudurA nIvu
mundu nanu gUDina SrI garbhapurISA dhIrA

#692 ఏమి మేము Emi mEmu

Titleఏమి మేముEmi mEmu
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఆనందభైరవిAnandabhairavi
తాళం tALaఆది (తిశ్రగతి)Adi (tiSragati)
పల్లవి pallaviఏమి మేము సానివారము
కుంభిని పూర్ణ సోమలింగ తమకు న్యాయమా
Emi mEmu sAnivAramu
kumbhini pUrNa sOmalinga tamaku nyAyamA
అనుపల్లవి anupallaviనా మనోహరుండు నేను కాముకేళి నుండువేళ
కావరమున వచ్చి నన్ను కామినీ రమ్మని యెదవు
nA manOharunDu nEnu kAmukELi nunDuvELa
kAvaramuna vachchi nannu kAminI rammani yedavu
చరణం
charaNam 1
ఇంటి మగను వలెను వెంటను భయము లేక
జంట బాయవేమి సేతురా కాని వాడు నా మగండు
కత్తి చేతను మరువడిపుడు
నీవు నేను పట్టుబడిన పూని హాని పరచునోయి
inTi maganu valenu venTanu bhayamu lEka
janTa bAyavEmi sEturA kAni vADu nA maganDu
katti chEtanu maruvaDipuDu
nIvu nEnu paTTubaDina pUni hAni parachunOyi
చరణం
charaNam 2
వెరువకా మా పెరటి లోపలా సన్నజాజుల విరుల తోట
మరుగు నీడల మరుగు నుండి నన్ను బిలచి మరుని కేళి గూడినావు
యిరుగు పొరుగు వారు జూచిన పరువు మరువు బోవు నోయి
veruvakA mA peraTi lOpalA sannajAjula virula tOTa
marugu nIDala marugu nunDi nannu bilachi maruni kELi gUDinAvu
yirugu porugu vAru jUchina paruvu maruvu bOvu nOyi

#691 ఇద్దరి పొందేల iddari pondEla

Titleఇద్దరి పొందేలiddari pondEla
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
Previously Posted At331, 207
పల్లవి pallaviఇద్దరి పొందేలరా స్వామి ఇక
దానింటికే పోరా అల దానింటికే పోరా
iddari pondElarA svAmi ika
dAninTikE pOrA ala dAninTikE pOrA
అనుపల్లవి anupallaviసద్దేల చేసేవు స్వామిక నేనోర్వ
వద్దిక నీవు రావద్దురా వద్దురా
saddEla chEsEvu svAmika nEnOrva
vaddika nIvu rAvaddurA vaddurA
చరణం
charaNam 1
కన్నులు ఎరుపేమిరా చెక్కులు కాటుక నలుపేమిరా
కన్నుల విలుకాని కయ్యాన మెలిగిన చిన్నెవై తోచెర చెప్పుర చెప్పుర
kannulu erupEmirA chekkulu kATuka nalupEmirA
kannula vilukAni kayyAna meligina chinnevai tOchera cheppura cheppura
చరణం
charaNam 2
నాజోలి నీకేలరా ఆ బ్రహ్మ నిన్నెట్టు పుట్టించెరా
ఏ జాము దానింట నీ జాడ నే జూడ బేజారి బేజారి నేజెల్ల నేజెల్ల
nAjOli nIkElarA A brahma ninneTTu puTTincherA
E jAmu dAninTa nI jADa nE jUDa bEjAri bEjAri nEjella nEjella
This is a jAvaLi by dAsu SrIrAmulu, as per previous posts. ఇంతకు ముందు ప్రచురించబడిన జావళీల ఆధారంగా ఇది దాసు శ్రీరాములు గారి జావళి.