#688 కులము లోన kulamu lOna

Titleకులము లోనkulamu lOna
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసింధుభైరవిsindhubhairavi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviకులము లోన గొల్ల దాన
పయసు లోన చిన్న దాన
వలచి నిన్నే తలచు దాన
ఏలుకోర వేణుగోపాల బాల
kulamu lOna golla dAna
payasu lOna chinna dAna
valachi ninnE talachu dAna
ElukOra vENugOpAla bAla
చరణం
charaNam 1
నీలవర్ణ జాలమేలా నిమిషమైన తాళజాలరా
మనసు నీపై నిలిపినాను మమత దీర అధర మీర
కమనీయ నేత్ర విమల గాత్ర నవనీత చోర నంద కిశోర
nIlavarNa jAlamElA nimishamaina tALajAlarA
manasu nIpai nilipinAnu mamata dIra adhara mIra
kamanIya nEtra vimala gAtra navanIta chOra nanda kiSOra

#687 సరసుని యెడబాసి sarasuni yeDabAsi

Titleసరసుని యెడబాసిsarasuni yeDabAsi
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaతిశ్ర ఏకtiSra Eka
పల్లవి pallaviసరసుని యెడబాసి సరసిజ నయనsarasuni yeDabAsi sarasija nayana
అనుపల్లవి anupallaviమరులు యెటులు తాళి మరుగు జేయుదునేmarulu yeTulu tALi marugu jEyudunE
చరణం
charaNam 1
చిరుత ప్రాయము నాడే చెలిమి జేసితినే
మరచెదనా యని యెంచ మరులెచ్చె గదవే
chiruta prAyamu nADE chelimi jEsitinE
marachedanA yani yencha marulechche gadavE
చరణం
charaNam 2
మరుకేళి జత గూడి మనసిచ్చి కలియ
సరసిజాసను డేల మరచె నన్నిలను
marukELi jata gUDi manasichchi kaliya
sarasijAsanu DEla marache nannilanu
చరణం
charaNam 3
ఇల శ్రీ వెంకటనాధ యిక నేచ తగదు
కలయ రమ్మని బల్క కరుణించ మనవే
ila SrI venkaTanAdha yika nEcha tagadu
kalaya rammani balka karuNincha manavE
చరణం
charaNam 4
చెలి నీ పేరిటి లక్ష్మి వలచిన దన్నుచు
పలుమారు మది మెచ్చి బతిమాలె ననవె
cheli nI pEriTi lakshmi valachina dannuchu
palumAru madi mechchi batimAle nanave

#686 చలమేలర chalamElara

Title చలమేలర chalamElara
Written By??
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaనాటకురంజిnATakuranji
తాళం tALaఆదిAdi
Previously Posted At396
పల్లవి pallaviచలమేలర నాపై జలజ నేత్రుడా పిలిచిన పలుకకchalamElara nApai jalaja nEtruDA pilichina palukaka
అనుపల్లవి anupallaviకలకాలము నీ చెలిమి జేయ నే దలచి వలచి వచ్చియుంటి నంతటkalakAlamu nI chelimi jEya nE dalachi valachi vachchiyunTi nantaTa
చరణం
charaNam 1
నీ సరసములు నీటులు నీ సొగసు నీ చతురత
నీ హొయలు నీ గుణములు నీ సరిసమ రసికుల నే నరసి జూడ దొరక లేక మరులు మించి మొరలిడ
nI sarasamulu nITulu nI sogasu nI chaturata
nI hoyalu nI guNamulu nI sarisama rasikula nE narasi jUDa doraka lEka marulu minchi moraliDa
చరణం
charaNam 2
సారసరిపుని కోరు చకోర గతి నిను నమ్ముచు
సారెకును నీ మరుగున జేరదలచి చెలులతో
మనసార నా విచారమెల్ల చెవియార దెల్పియు బ్రోవక
sArasaripuni kOru chakOra gati ninu nammuchu
sArekunu nI maruguna jEradalachi chelulatO
manasAra nA vichAramella cheviyAra delpiyu brOvaka
?? A third charaNam is also available in the jAvaLi by paTTAbhirAmayya, in an earlier post. ఇంతకు ముందు ప్రచురించిన దానిలో, పట్టాభిరామయ్య గారి ఈ జావళీకి మూడో చరణము కూడా ఉన్నది.

#685 మాయలాడి mAyalADi

TitleమాయలాడిmAyalADi
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమాయలాడి మందు బెట్టి వాని నెడ బాయించెనే భామినిmAyalADi mandu beTTi vAni neDa bAyinchenE bhAmini
అనుపల్లవి anupallaviసయ్యాట లాడి మే ముయ్యాల లూగేటి ఒయ్యారము జూచియేsayyATa lADi mE muyyAla lUgETi oyyAramu jUchiyE
చరణం
charaNam 1
మంచముపై నా సామి మంచి మాటలాడి కరముంచి వర్ణించి
గోరుంచి ఉబ్బించి దూషించే విధాలు గనియే
manchamupai nA sAmi manchi mATalADi karamunchi varNinchi
gOrunchi ubbinchi dUshinchE vidhAlu ganiyE
చరణం
charaNam 2
సుందరుడు యేకాంతమందు నిత్యానందమని పందాలతో
మోవి విందనుకంటే మా యందంబులను గనియే
sundaruDu yEkAntamandu nityAnandamani pandAlatO
mOvi vindanukanTE mA yandambulanu ganiyE

#684 మోసజేసెనే mOsajEsenE

TitleమోసజేసెనేmOsajEsenE
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaతోడిtODi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At264
పల్లవి pallaviమోస జేసెనే వాడు బలు మోసజేసెనేmOsa jEsenE vADu balu mOsajEsenE
అనుపల్లవి anupallaviపలుమారు నాతో బాసలాడుచు బలుpalumAru nAtO bAsalADuchu balu
చరణం
charaNam 1
విరిశయ్యపై సరసంబుతో కరమీడ్చి కౌగిట జేర్చి
యా విరిబోణి నెంచి వేగ లేచి యేగుచు
viriSayyapai sarasambutO karamIDchi kaugiTa jErchi
yA viribONi nenchi vEga lEchi yEguchu
చరణం
charaNam 2
కడు ప్రీతి నాయెడ జేర్చి జాడల మాట లాడుచు
నుండగా నెడబాసి ఈడ చెడపాలు జేసి బలు
kaDu prIti nAyeDa jErchi jADala mATa lADuchu
nunDagA neDabAsi IDa cheDapAlu jEsi balu
చరణం
charaNam 3
సమ కేళిలో సరస మివ్వగన్ రమియించి రంజిలు
చుండెడి సమయం బెరింగి శ్యామరాజ సోముడు
sama kELilO sarasa mivvagan ramiyinchi ranjilu
chunDeDi samayam beringi SyAmarAja sOmuDu
This is a jAvaLi by SrI chinnayya. ఇది శ్రీ చిన్నయ్య గారిచే రచింపబడిన జావళి.

#683 జాణతనము jANatanamu

TitleజాణతనముjANatanamu
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaవిలోమ చాపుvilOma chApu
పల్లవి pallaviజాణ తనము మాటలు చాలు నిలుపరాjANa tanamu mATalu chAlu niluparA
అనుపల్లవి anupallaviప్రాణనాధ నీదు మనో భావమును గంటినిరాprANanAdha nIdu manO bhAvamunu ganTinirA
చరణం
charaNam 1
మాయలాడి మాటలచే మహిమలన్ని గంటినిరా
పాయ జాలనంచు నాతో భావమును గంటినిరా
mAyalADi mATalachE mahimalanni ganTinirA
pAya jAlananchu nAtO bhAvamunu ganTinirA
Alternate text / పాఠాంతరముతోయజాక్షి నంచు నాతో భావమను గంటినిరాtOyajAkshi nanchu nAtO bhAvamanu ganTinirA
A more recent book published the pallavi as “jANatanapu mATalu” – which sounds more correct! ఒక కొత్త పుస్తకములో దీని పల్లవి “జాణతనపు మాటలు” గ ప్రచురించారు. అదే సరి అని అనిపిస్తోంది.

#682 నీరజాక్షి nIrajAkshi

Titleనీరజాక్షిnIrajAkshi
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaదేశీయ తోడిdESIya tODi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviనీరజాక్షి నిను బాసి నే నూరి కేమిక బోదునేnIrajAkshi ninu bAsi nE nUri kEmika bOdunE
చరణం
charaNam 1
ప్రాణ నాయకి నిన్ను నేనిటు కానకుండుట కాదటే
మానినీ మనసుంచవే నీ యాన దీనుడనై నే
prANa nAyaki ninnu nEniTu kAnakunDuTa kAdaTE
mAninI manasunchavE nI yAna dInuDanai nE
చరణం
charaNam 2
చందమామ బోలు నీ ముఖ చంద మెన్నడు జూతునే మది
ముందు దోచద ఎందుక నీ పొందు జేసితి నయ్యెయ్యో
chandamAma bOlu nI mukha chanda mennaDu jUtunE madi
mundu dOchada enduka nI pondu jEsiti nayyeyyO

#681 నిను గానక ninu gAnaka

Titleనిను గానకninu gAnaka
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaహమీర్ కల్యాణిhamIr kalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviనిను గానక యుండిన నీరజాక్షికి
కను గానదా ఏమిరా కమల నయన
ninu gAnaka yunDina nIrajAkshiki
kanu gAnadA EmirA kamala nayana
అనుపల్లవి anupallaviదినకరు నెడబాసిన వనజము వలె
వనిత మోమున కన్నుల్ వాడ బారెనురా
dinakaru neDabAsina vanajamu vale
vanita mOmuna kannul vADa bArenurA
చరణం
charaNam 1
జిత శత మన్మథ వితరణ శాలి
సతతము దాని బలు విధముల నేలిన
jita Sata manmatha vitaraNa SAli
satatamu dAni balu vidhamula nElina

#680 ఇంతిరో intirO

TitleఇంతిరోintirO
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaత్రిశ్ర ఏకtriSra Eka
పల్లవి pallaviఇంతిరో వాని మనసెంత చిన్న బోయెనో
ఎంత చిన్న బోయెనో
intirO vAni manasenta chinna bOyenO
enta chinna bOyenO
అనుపల్లవి anupallaviకాంతుని కౌగింటలోన కలయ నె నుండు రననొkAntuni kauginTalOna kalaya ne nunDu ranano
చరణం
charaNam 1
తరుణిరో అర గడియ నన్ను తాళనివ్వని మారుని
విరి శరముల గాసికి యెంత తత్తళించెనో
taruNirO ara gaDiya nannu tALanivvani mAruni
viri Saramula gAsiki yenta tattaLinchenO

#679 మేరగాదు mEragAdu

TitleమేరగాదుmEragAdu
Written By??
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఅఠాణaThANa
తాళం tALaఆదిAdi
Previously Published At250
పల్లవి pallaviమేరగాదు లేచిరారా ఏరా నా సామిmEragAdu lEchirArA ErA nA sAmi
అనుపల్లవి anupallaviనారీమణి కోరి నిన్ను దారి చూచుచున్నదిరాnArImaNi kOri ninnu dAri chUchuchunnadirA
చరణం
charaNam 1
కుందకారి నిబ్బరించినంత నేడు నొప్పించుట అందమా
నీకు చందమా అందమని సంతనోర్వ ఏ వేళను తాళనురా
kundakAri nibbarinchinanta nEDu noppinchuTa andamA
nIku chandamA andamani santanOrva E vELanu tALanurA
?? This is a jAvaLi by Sri chinnayya, as published before. ఇది శ్రీ చిన్నయ్య గారిచే రచింపబడిన జావళి.