| Title | నిమిషాము యుగమాయె | nimishAmu yugamAye |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | మధ్యమావతి | madhyamAvati |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | నిమిషాము యుగమాయె నిలువ శక్యము గాదు నీ వేగితివి కదవే | nimishAmu yugamAye niluva Sakyamu gAdu nI vEgitivi kadavE |
| అనుపల్లవి anupallavi | తమకాముచే మది తహతహ లాయేను తడవు సేయక వేగమే నాసామి | tamakAmuchE madi tahataha lAyEnu taDavu sEyaka vEgamE nAsAmi |
| చరణం charaNam 1 | పన్నుగ ప్రాణాము పాలించె దొరయా నా ప్రాణానాధుని దేగదే వేవేగామె | pannuga prANAmu pAlinche dorayA nA prANAnAdhuni dEgadE vEvEgAme |
| చరణం charaNam 2 | తడవు సేసితే నాడు తనువు దారబోసి తరలే దానని దెల్పవే నాసామిని | taDavu sEsitE nADu tanuvu dArabOsi taralE dAnani delpavE nAsAmini |
| చరణం charaNam 3 | పడతి బోధన విని పగబట్టి నిటుసేయ బాడిగాదని దెల్పవే నాసామిని | paDati bOdhana vini pagabaTTi niTusEya bADigAdani delpavE nAsAmini |
| చరణం charaNam 4 | శ్రీ నరసాపుర వాసా శీఘ్రమే రమ్మాని చెయి బట్టి బతిమాలవే బీరాన | SrI narasApura vAsA SIghramE rammAni cheyi baTTi batimAlavE bIrAna |
Tag: Telugu
#604 చెలికాడ నినుబాసి chelikADa ninubAsi
| Title | చెలికాడ నినుబాసి | chelikADa ninubAsi |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | బేగడా | bEgaDA |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | చెలికాడ నినుబాసి బలవంతమున నత్త ఇలుజేరా నను బంపిరి నాసామి | chelikADa ninubAsi balavantamuna natta ilujErA nanu bampiri nAsAmi |
| అనుపల్లవి anupallavi | కలనైనా యెడబాయా జాలని మనకిట్టి గతి గలిగె నేమందు నా సామి | kalanainA yeDabAyA jAlani manakiTTi gati galige nEmandu nA sAmi |
| చరణం charaNam 1 | కాళ్ళాడకను చాలా కలవార పడి నేడు కదలీ పోవుచు నుంటిగా నాసామి | kALLADakanu chAlA kalavAra paDi nEDu kadalI pOvuchu nunTigA nAsAmi |
| చరణం charaNam 2 | వలవల కన్నీరు వరదలై పారగ తల వ్రాసెనిటు దైవమూ నాసామి | valavala kannIru varadalai pAraga tala vrAseniTu daivamU nAsAmi |
| చరణం charaNam 3 | ఎన్నాళ్ళ కొస్తునూ ఇల నరసాపుర వాసా నన్నూ నీ మదినుంచుము నాసామి | ennALLa kostunU ila narasApura vAsA nannU nI madinunchumu nAsAmi |
#603 రొక్కామిచ్చి rokkAmichchi
| Title | రొక్కామిచ్చి | rokkAmichchi |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | రొక్కామిచ్చితె నీయక్కా మరియొక్కాతే నీవే శాశ్వతమటవె | rokkAmichchite nIyakkA mariyokkAtE nIvE SASvatamaTave |
| అనుపల్లవి anupallavi | నిక్కూచు నీలిగేవు నింత సుక్కవ రక్కాసి వలె ముఖము ముదిబురించేవేమే | nikkUchu nIligEvu ninta sukkava rakkAsi vale mukhamu mudiburinchEvEmE |
| చరణం charaNam 1 | నీ శిరసుపై నెగిరేటి చెలియా లెల్లా నన్ను రాతిరి వేళా రమ్మని బతిమాలుచు నాతి నా మెడ పుష్పా మాలికల్ ధరియించి చేతికి విడెమిచ్చి చెయి బట్టి వేడుచు | nI Sirasupai negirETi cheliyA lellA nannu rAtiri vELA rammani batimAluchu nAti nA meDa pushpA mAlikal dhariyinchi chEtiki viDemichchi cheyi baTTi vEDuchu |
| చరణం charaNam 2 | చెలియారో నేనొస్తె చేరి మాటాడవు పలుకారించే దాకా తల యెత్తవు కాసులు మ్రోగితే కలకల నవ్వేవు వేశ్య కైన నీయట్టి టక్కులు దెలియవే | cheliyArO nEnoste chEri mATADavu palukArinchE dAkA tala yettavu kAsulu mrOgitE kalakala navvEvu vESya kaina nIyaTTi Takkulu deliyavE |
| చరణం charaNam 3 | నిదుర బోవగ జూచి నిను గలసే దెరుగావు మదనుని కొంటే మోమృదువానవు కొదువేమి శ్రీ నరసాపుర వాసుడని దెలిసె పదరక నికమీద వదిగి యుండవె చెలి | nidura bOvaga jUchi ninu galasE derugAvu madanuni konTE mOmRduvAnavu koduvEmi SrI narasApura vAsuDani delise padaraka nikamIda vadigi yunDave cheli |
#602 ఇచ్చెద నిచ్చెదనని ichcheda nichchedanani
| Title | ఇచ్చెద నిచ్చెదనని | ichcheda nichchedanani |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | ఇచ్చెద నిచ్చెదనని యిన్ని దినములు జర్చి యిచ్చితి విక చాలు మెచ్చ వచ్చునురా | ichcheda nichchedanani yinni dinamulu jarchi yichchiti vika chAlu mechcha vachchunurA |
| అనుపల్లవి anupallavi | మచ్చికల్ మగ నీ కన్నను చెడ్డ తెగువా యిచ్చితివిక రూక | machchikal maga nI kannanu cheDDa teguvA yichchitivika rUka |
| చరణం charaNam 1 | నాలుగు దినముల నుండి నిదురయిన బోనీక పగలు రేయి యదిగా పనులెల్లా జర్పి యెల్లా వారిలో నను అల్లార పరచి యొక చెల్లాని రూక నా చేతి కియ్య వచ్చేవు | nAlugu dinamula nunDi nidurayina bOnIka pagalu rEyi yadigA panulellA jarpi yellA vArilO nanu allAra parachi yoka chellAni rUka nA chEti kiyya vachchEvu |
| చరణం charaNam 2 | సరిసరి యిక చాలు పరులింటె బహు సిగ్గు దారీ జూచిక నీదు యూరికి పోరా తేరాగ వచ్చితె తెల్లవార్లును జర్పి ఇంకా మా వాడొకడు న్నాడను సామ్యముగా | sarisari yika chAlu parulinTe bahu siggu dArI jUchika nIdu yUriki pOrA tErAga vachchite tellavArlunu jarpi inkA mA vADokaDu nnADanu sAmyamugA |
| చరణం charaNam 3 | వేషగాడ నరసాపుర వేణుగోపాల ఆశ బెట్టి రట్టు పరచి తెల్లవారులా మోసగించి యెన్నో ముచ్చటల్ సల్పి యొక సీపావు రూకా నా చెంగూన గట్టితి | vEshagADa narasApura vENugOpAla ASa beTTi raTTu parachi tellavArulA mOsaginchi yennO muchchaTal salpi yoka sIpAvu rUkA nA chengUna gaTTiti |
#600 వేళగాదురా vELagAdurA
| Title | వేళగాదురా | vELagAdurA |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వేళగాదురా తాళుతాళరా | vELagAdurA tALutALarA |
| అనుపల్లవి anupallavi | చాలు చాలురా మేలాయెనురా | chAlu chAlurA mElAyenurA |
| చరణం charaNam 1 | వేళ గాని వేళా ఎమిర యీగోలా వల్లా గాదీ వేళా వాకిటుంటి వేళా | vELa gAni vELA emira yIgOlA vallA gAdI vELA vAkiTunTi vELA |
| చరణం charaNam 2 | అంటరాకు రాకుర ఆవలుండర ఇంటానున్నవారు వింటారు యీపోరు | anTarAku rAkura AvalunDara inTAnunnavAru vinTAru yIpOru |
| చరణం charaNam 3 | మంకు తనమేలా మళ్లిరా గోపాలా వెంకట స్వామిపాలా ఏమయ్యా యీ గోలా | manku tanamElA maLlirA gOpAlA venkaTa swAmipAlA EmayyA yI gOlA |
#599 వేళ యిదేగానా vELa yidEgAnA
| Title | వేళ యిదేగానా | vELa yidEgAnA |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వేళ యిదేగానా వేగరావే జాణా | vELa yidEgAnA vEgarAvE jANA |
| అనుపల్లవి anupallavi | తాళజాల లేను తడవు శేయగాను | tALajAla lEnu taDavu SEyagAnu |
| చరణం charaNam 1 | మారుని బారి మరిమారి మీరి చేరితి నిన్ను కోరి జెయి జేర్చు దయ మీరి | mAruni bAri marimAri mIri chEriti ninnu kOri jeyi jErchu daya mIri |
| చరణం charaNam 2 | తమకా మోర్వజాల తరుణి మణి యివ్వేళా మమత చేత చాలా మరగితినే బాలా | tamakA mOrvajAla taruNi maNi yivvELA mamata chEta chAlA maragitinE bAlA |
| చరణం charaNam 3 | నిలువజాల బాలా నీమీద నీవేళా మదిగోరె చాలా మానినీ చలమేలా | niluvajAla bAlA nImIda nIvELA madigOre chAlA mAninI chalamElA |
| చరణం charaNam 4 | సరసకు రావే చేరా దీసుకోవే వర నరసాపుర వాసుడనుకోవె | sarasaku rAvE chErA dIsukOvE vara narasApura vAsuDanukOve |
#598 సాహించలేనే sAhinchalEnE
| Title | సాహించలేనే | sAhinchalEnE |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | ||
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సాహించలేనే సఖియా కూడుదాం రావె | sAhinchalEnE sakhiyA kUDudAm rAve |
| అనుపల్లవి anupallavi | కూడుదాం రావే మనమాడుదాం రావే సరికాదే సరికాదే | kUDudAm rAvE manamADudAm rAvE sarikAdE sarikAdE |
| చరణం charaNam 1 | సరిసరి యిది కాదే మరి మరి వేడబోదే ఇదియే వేళా ఇదియే వేళా ఇదియే వేళా సహిం దినదినము నిన్నూ కోరి మనసునెంతో ఆశ దూరి కరిగితి కరిగితి కరిగితి వేడుదు నే నిన్ను | sarisari yidi kAdE mari mari vEDabOdE idiyE vELA idiyE vELA idiyE vELA sahim dinadinamu ninnU kOri manasunentO ASa dUri karigiti karigiti karigiti vEDudu nE ninnu |
#597 తననన తందిరనాని tananana tandiranAni
| Title | తననన తందిరనాని | tananana tandiranAni |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | ||
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | తననన తందిర నాని తోందాదాని దింతా | tananana tandira nAni tOndAdAni dintA |
| తనదిమి కుకుందరిత నదిందిమి థీం ఏల్లి ఏల్లి థీంతా తోంతా థీంత్తాన తనన | tanadimi kukundarita nadindimi thIm Elli Elli thImtA tOmtA thImttAna tanana | |
| నిమిషము నిన్ను బాసి నిలుప జాలరా సామి | nimishamu ninnu bAsi nilupa jAlarA sAmi | |
| ఆలస్యమేలా నిదే సమయామురా దిన దినము నిన్నే మనమున దలచితి అలచితిరా సొలచితిరా బిలిచితి రారా ఏరా | AlasyamElA nidE samayAmurA dina dinamu ninnE manamuna dalachiti alachitirA solachitirA bilichiti rArA ErA | |
| చేర దీసి నను గారవించక | chEra dIsi nanu gAravinchaka | |
| తామసమేలరా తాళజాలరా సామి కామముచే మది కరగి కరగేనిక జాలమేలా నిలజాలానురా | tAmasamElarA tALajAlarA sAmi kAmamuchE madi karagi karagEnika jAlamElA nilajAlAnurA | |
| నిది వేళారా వలచితిరా సొలచితిరా దలచితిరా బిలచితి రారా ఏరా శ్రీధర నరసాపుర విహార సపనిసారి గరి సారిగరి సనిధగరిని సానిసరి సగరిరిస నిసరిగరిరిస గరిరి గరిససారిగ సారిగరి సనిధ మగరిరిస గరిసగరిస నిధస నిధపమ | nidi vELArA valachitirA solachitirA dalachitirA bilachiti rArA ErA SrIdhara narasApura vihAra sapanisAri gari sArigari sanidhagarini sAnisari sagaririsa nisarigaririsa gariri garisasAriga sArigari sanidha magaririsa garisagarisa nidhasa nidhapama |
#594 ఏమి సేతు యెటుల సైతు Emi sEtu yeTula saitu
| Title | ఏమి సేతు యెటుల సైతు | Emi sEtu yeTula saitu |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | గుల్రోజ్ | gulrOj |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఏమి సేతు యెటుల సైతు సామి రాడాయే | Emi sEtu yeTula saitu sAmi rADAyE |
| అనుపల్లవి anupallavi | కోమలాంగి వానికేమో కోపమాయెను | kOmalAngi vAnikEmO kOpamAyenu |
| చరణం charaNam 1 | నిమిష మొక్క యుగము దోచె నీరజయానా సమయమిదే స్వామి రాక జాడ గానమే | nimisha mokka yugamu dOche nIrajayAnA samayamidE swAmi rAka jADa gAnamE |
| చరణం charaNam 2 | మరుని వేధ కోర్వజాల మంద యానరో సరసుల కింతై నాపై జాలి లేదాయె | maruni vEdha kOrvajAla manda yAnarO sarasula kintai nApai jAli lEdAye |
| చరణం charaNam 3 | నరసాపు ర్నివాసుడనియు నమ్మి యుంటి నేమర్పు రాని మరుబారి మప్పి బాసెనే | narasApu rnivAsuDaniyu nammi yunTi nEmarpu rAni marubAri mappi bAsenE |
#593 రామ రామ ప్రాణసఖి rAma rAma prANasakhi
| Title | రామ రామ ప్రాణసఖి | rAma rAma prANasakhi |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ఆహిరి | Ahiri |
| తాళం tALa | ఝంప | jhampa |
| పల్లవి pallavi | రామ రామ ప్రాణ సఖి నెడబాసి రాము డెటువలె దాళెనో ముందు తామర సాక్షిని దలంచితే నా గుండె తల్లడంబందె నేమందు నయ్యయ్యో | rAma rAma prANa sakhi neDabAsi rAmu DeTuvale dALenO mundu tAmara sAkshini dalanchitE nA gunDe tallaDambande nEmandu nayyayyO |
| చరణం charaNam 1 | కలికి చిలుక పలుకు లీలాగున నతనికి కర్ణ శూలములై యుండలేదో నెల రాయడతని పాలిటికి నీలాగున నిప్పుల కుప్పయై యుండలేదో | kaliki chiluka paluku lIlAguna nataniki karNa SUlamulai yunDalEdO nela rAyaDatani pAliTiki nIlAguna nippula kuppayai yunDalEdO |
| చరణం charaNam 2 | తెలియకను రాతిరి పగలు నీ తీరునను దిగులు మదిలో దోచదాయ నేమో చెలియ నెడబాసి నప్పటి నుండి నా మనసు చిందర వందరై యున్న దయ్యాయ్యో | teliyakanu rAtiri pagalu nI tIrunanu digulu madilO dOchadAya nEmO cheliya neDabAsi nappaTi nunDi nA manasu chindara vandarai yunna dayyAyyO |
| చరణం charaNam 3 | వరుడు పగవాడగుచు నీలాగు నాడల్ల మనుజేశు నలయించడాయె నేమో కెరలి యా గండ కోయిలు నాద మీలాగు ఖేదమై యతని బాధించలేదో | varuDu pagavADaguchu nIlAgu nADalla manujESu nalayinchaDAye nEmO kerali yA ganDa kOyilu nAda mIlAgu khEdamai yatani bAdhinchalEdO |
| చరణం charaNam 4 | విరివిగా నాతని కాహార నిద్రాదులును విరసంబు గాక నింపాయనేమో విరిబోణి నెడబాసి నది మొదలు నేనిట్లు వెడవిల్తు బారి పాలైతి నయ్యయ్యో | virivigA nAtani kAhAra nidrAdulunu virasambu gAka nimpAyanEmO viribONi neDabAsi nadi modalu nEniTlu veDaviltu bAri pAlaiti nayyayyO |
| చరణం charaNam 5 | వేమారు నావలెను దన సతికి నాతడును వేడగను నమ్మికలు నియ్యలే కామినీ మణి వద్ద లేనప్పు డతనికి కనుగవల నీరిట్టు గ్రమ్మ లేదో | vEmAru nAvalenu dana satiki nAtaDunu vEDaganu nammikalu niyyalE kAminI maNi vadda lEnappu Dataniki kanugavala nIriTTu gramma lEdO |
| చరణం charaNam 6 | తామసపు ప్రేమ చేత నతడు నావలె గాక ధైర్యంబు దెచ్చుకొని యుండెనేమో కామించి నను మువ్వ గోపాల రమ్మనుచు కలసిన చెలి కనుల గప్పె నయ్యయ్యో | tAmasapu prEma chEta nataDu nAvale gAka dhairyambu dechchukoni yunDenEmO kAminchi nanu muvva gOpAla rammanuchu kalasina cheli kanula gappe nayyayyO |