| Title | నాటికి నేడా | nATiki nEDA |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | కన్నడ | kannaDa |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | నాటికి నేడా నీదు సందర్శనము కూటమి గోరిన నా తోటి గూడెదనని | nATiki nEDA nIdu samdarSanamu kUTami gOrina nA tOTi gUDedanani |
| చరణం charaNam 1 | సరిలేర నీపై తగు మురిపెము తీర్పక విరహాగ్ని ముంపగ తరము గాదు సామి | sarilEra nIpai tagu muripemu tIrpaka virahAgni mumpaga taramu gAdu sAmi |
| చరణం charaNam 2 | అల్లన ద్విభాషికుల పుల్లకవీంద్ర పాల నల్లని గోపబాల చల్లగ జాలమేల | allana dvibhAshikula pullakavIndra pAla nallani gOpabAla challaga jAlamEla |
Tag: Telugu
#326 నా ప్రియా nA priyA
| Title | నా ప్రియా | nA priyA |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | ??? | ??? |
| తాళం tALa | ??? | ??? |
| పల్లవి pallavi | నా ప్రియా మరుకేళి నేలవేలరావే | nA priyA marukELi nElavElarAvE |
| అనుపల్లవి anupallavi | యేలవేలరా జాలమికేలరా చాలరా తాళ యీవేళ అవురవుర మరుకేళీ నేలుము | yElavElarA jAlamikElarA chAlarA tALa yIvELa avuravura marukELI nElumu |
| చరణం charaNam 1 | కమ్మని మోవిచ్చి కౌగలింపుమురా యిమ్ముగ రమ్ము వేగమ్ము ముద్దిమ్ము మరుకేళినేలు | kammani mOvichchi kaugalimpumurA yimmuga rammu vEgammu muddimmu marukELinElu |
| చరణం charaNam 2 | కారణమేమో గారడి సేయుట నేరములేంతే నేరితరము మరుకేళీనేలు | kAraNamEmO gAraDi sEyuTa nEramulEmtE nEritaramu marukELInElu |
| చరణం charaNam 3 | సూర్యతేజ నిన్ జూచినది మొదలు కార్యము నీదేయని కాచి యుంటిరా మరుకేళీ నేలవేలరా | sUryatEja nin jUchinadi modalu kAryamu nIdEyani kAchi yunTirA marukELI nElavElarA |
| చరణం charaNam 4 | అల్లన ద్విభాషి పుల్లకవి వరద మొల్లని యుల్లాసమెల్ల రంజిల్ల మరుకేళినేలము | allana dvibhAshi pullakavi varada mollani yullAsamella ramjilla marukELinElamu |
#325 విరిబోణి viribONi
| Title | విరిబోణి | viribONi |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | బిళహరి | biLahari |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | విరిబోణి వగల్ చూడరా | viribONi vagal chUDarA |
| అనుపల్లవి anupallavi | పాణులు పల్లవ రాగశ్రేణికలురా శృంగార వేణిరా దృక్కులు మరుబాణము లౌరౌరా | pANulu pallava rAgaSrENikalurA SRngAra vENirA dRkkulu marubANamu lauraurA |
| చరణం charaNam 1 | సుందరా నీ పొందుకై నీవందారిలోపల చాలా అందగాడవందిరా అది బందరు వగలాడిరా | sundarA nI pondukai nIvamdArilOpala chAlA andagADavandirA adi bandaru vagalADirA |
| చరణం charaNam 2 | సల్లలిత శ్రీ ద్విభాషి పుల్లకవి వల్లభుని యెల్లా సన్మానించిన శ్రీ మల్లు దొరరాయ | sallalita SrI dvibhAshi pullakavi vallabhuni yellA sanmAninchina SrI mallu dorarAya |
#324 హా సఖా hA sakhA
| Title | హా సఖా | hA sakhA |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | హిందుస్థానీ తోడి | hindusthAnI tODi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | హా సఖా నిను యే సఖీమణి గాసి మందు రాసెరా రాసెరా విడదీసెరా శహబాసురా యెంతజేసెరా | hA sakhA ninu yE sakhImaNi gAsi mandu rAserA rAserA viDadIserA SahabAsurA yemtajEserA |
| చరణం charaNam 1 | హాయిగా నిను డాయవచ్చిన దాయగా కడుమాయగా ఆయెగా కడుమాయగా యిది నాయమా నా నాయకా | hAyigA ninu DAyavachchina dAyagA kaDumAyagA AyegA kaDumAyagA yidi nAyamA nA nAyakA |
| చరణం charaNam 2 | వంచల నను కించ పరచుట మంచి గాదని యెంచెరా దయయుంచి మది మరలించరా | vamchala nanu kimcha parachuTa manchi gAdani yemcherA dayayunchi madi maralimcharA |
| చరణం charaNam 3 | నెమ్మదిని నిను నమ్మి యుంటిర కమ్మ విల్తుని కేళికే కమ్మ విల్తుని కేళికీ సరసమ్ము గలనీ పాలికీ | nemmadini ninu nammi yumTira kamma viltuni kELikE kamma viltuni kELikI sarasammu galanI pAlikI |
| చరణం charaNam 4 | వాసిగా ద్విభాషి పుల్లకవీశ సన్నుత వేగరా యీశ సన్నుత వేగరార దయా సుధారస సాగరా | vAsigA dvibhAshi pullakavISa sannuta vEgarA yISa sannuta vEgarAra dayA sudhArasa sAgarA |
#323 మానినీ మణిరో mAninI maNirO
| Title | మానినీ మణిరో | mAninI maNirO |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | దర్బారు | darbAru |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మానినీ మణిరో వాని మనసు కరుగదాయనే మనసు కరుగదాయెనా మనవి వినడాయెనే | mAninI maNirO vAni manasu karugadAyanE manasu karugadAyenA manavi vinaDAyenE |
| చరణం charaNam 1 | అత్తరు పన్నీరు గంధమలది రారమ్మంటినే అలది రారమ్మంటినే నా యనుగుకాడవంటినే | attaru pannIru gandhamaladi rArammanTinE aladi rArammanTinE nA yanugukADavanTinE |
| చరణం charaNam 2 | కావిమోవి దొండపండు కాన్కగైకొమ్మంటినే కాన్కగైకొమ్మంటినే బిగికౌగిలి యిమ్మంటినే | kAvimOvi donDapanDu kAn&kagaikommanTinE kAn&kagaikommanTinE bigikaugili yimmanTinE |
| చరణం charaNam 3 | వింతగ చన్గవ పూల బంతులాడమంటినే బంతులాడమంటినే నే నీకింత గూడదంటినే | vintaga chan&gava pUla bantulADamanTinE bantulADamanTinE nE nIkinta gUDadanTinE |
| చరణం charaNam 4 | కోరి పిలువగానే శుక్రవారమన్నట్లాయనే శుక్రవారమన్నట్లాయనే సరివారిలో నగుబాట్లాయనే | kOri piluvagAnE SukravAramannaTlAyanE SukravAramannaTlAyanE sarivArilO nagubATlAyanE |
| చరణం charaNam 5 | పొడిమాటలచే కోర్కెదీరిపోవునే ఎవ్వరికైన పోవునె యెవ్వరికైన ఆ భోగ దేవేంద్రునికైన | poDimATalachE kOrkedIripOvunE evvarikaina pOvune yevvarikaina A bhOga dEvEndrunikaina |
| చరణం charaNam 6 | భువిలోన ద్విభాషి పుల్లకవి రాజవరదుడె కవి రాజవరదుడే నన గవయదగు గోపాలుడే | bhuvilOna dvibhAshi pullakavi rAjavaraduDe kavi rAjavaraduDE nana gavayadagu gOpAluDE |
#322 మహరాజును maharAjunu
| Title | మహరాజును | maharAjunu |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | అఠాణా | aThANA |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మహరాజును జూచితివా సఖీ యీ || | maharAjunu jUchitivA sakhI yI || |
| అనుపల్లవి anupallavi | మహిళా సరసీరుహ బాణుడే యీ || | mahiLA sarasIruha bANuDE yI || |
| చరణం charaNam 1 | సఖి కబ్బెనెకో మహిమలకు మదనుడు గదే సుఖ రహి గదే యహహ యీతని సరి సరసులీ మహిని లేరనుటె నిజము | sakhi kabbenekO mahimalaku madanuDu gadE sukha rahi gadE yahaha yItani sari sarasulI mahini lEranuTe nijamu |
| చరణం charaNam 2 | నవనీతము కన్నను మార్గవ మీ నవ మోహనుడెందము నెంచినచో యివిద వానిని గంటివే వినియుంటివే నవరసాయుత పల్లవీ మన నయన జలరుహ చంద్రుడే | navanItamu kannanu mArgava mI nava mOhanuDendamu nenchinachO yivida vAnini ganTivE viniyunTivE navarasAyuta pallavI mana nayana jalaruha chandruDE |
| చరణం charaNam 3 | రమణీయ మనోరమణీగన చిత్తము తత్తరమె తను కించుగదే కమల శరసౌందర్యుడే గుణధుర్యుడే రమణులను దనియింప నింతటి రసికుడీ యిల గలడటే | ramaNIya manOramaNIgana chittamu tattarame tanu kinchugadE kamala SarasaundaryuDE guNadhuryuDE ramaNulanu daniyimpa nimtaTi rasikuDI yila galaDaTE |
| చరణం charaNam 4 | గడు సుందరము గడు సుందరమున్గములే ప్రియుడు న్గమలాత్మజుడే తొడవు లీతని గుణములు రిపురణములు కుడి యెడమ లేదడుగు నర్ధులకిడు నెడల తడవుడిగి యిడు | gaDu sundaramu gaDu sundaramun&gamulE priyuDu n&gamalAtmajuDE toDavu lItani guNamulu ripuraNamulu kuDi yeDama lEdaDugu nardhulakiDu neDala taDavuDigi yiDu |
| చరణం charaNam 5 | సుకరమ్ముగ కీర్తికలా లాస ద్విభాషి కులీనుడు పుల్లకవి వినుతుడే సకల సుకళాలోలుడే గోపాలుడే మకుట మానిత రావు వంశకుమార సూర్య రాయవరుడౌ | sukarammuga kIrtikalA lAsa dvibhAshi kulInuDu pullakavi vinutuDE sakala sukaLAlOluDE gOpAluDE makuTa mAnita rAvu vamSakumAra sUrya rAyavaruDau |
#321 వగలాడి హొయల్ vagalADi hoyal
| Title | వగలాడి హొయల్ | vagalADi hoyal |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | దర్బారు | darbAru |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | వగలాడి హొయల్ జూడరా | vagalADi hoyal jUDarA |
| చరణం charaNam 1 | తొగలరాయు గేరుమోము మిగుల మించు మీరు గోము సుగుణ గుణవంతారాలు యిది నిగురు గమ్మిన నిప్పురా | togalarAyu gErumOmu migula minchu mIru gOmu suguNa guNavantArAlu yidi niguru gammina nippurA |
| చరణం charaNam 2 | సుందరి నిను కోరి భువి నందరి లోపల చాల అందగాడవందిరా యది బందరు హొయలాడిరా | sundari ninu kOri bhuvi nandari lOpala chAla andagADavandirA yadi bandaru hoyalADirA |
| చరణం charaNam 3 | చిలకల కొలికిరా ముద్దు గులుకు పలుకులెల్ల తేనె లొలుకు వలపుల కలకిర యది తళుకు మన్మధ ములికిర | chilakala kolikirA muddu guluku palukulella tEne loluku valapula kalakira yadi taLuku manmadha mulikira |
| చరణం charaNam 4 | సల్లలిత శ్రీ ద్విభాషి పుల్లకవి పల్లవుని యొల్ల సన్మానించి యేలు నల్లని శ్రీకృష్ణ | sallalita SrI dvibhAshi pullakavi pallavuni yolla sanmAninchi yElu nallani SrIkRshNa |
#320 నేరమా సామీ nEramA sAmI
| Title | నేరమా సామీ | nEramA sAmI |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | ??? | ??? |
| తాళం tALa | ??? | ??? |
| పల్లవి pallavi | నేరమా సామీ నాపై నేరమా కోరితిర నిను పాడిగ పర సారసాక్షులు గూడగ | nEramA sAmI nApai nEramA kOritira ninu pADiga para sArasAkshulu gUDaga |
| చరణం charaNam 1 | దారిగాదని నుడివి నిను నాయాధారమని కడు వేడగా నా వాదమా సామీ నాతో వాదమా చేదుయయ్యెనే బెల్లము మర్యాద వాయునే యుల్లము యేది యున్నను తెల్లము నీ మీది తమితో నుండి గదనా | dArigAdani nuDivi ninu nAyAdhAramani kaDu vEDagA nA vAdamA sAmI nAtO vAdamA chEduyayyenE bellamu maryAda vAyunE yullamu yEdi yunnanu tellamu nI mIdi tamitO nunDi gadanA |
| చరణం charaNam 2 | యొల్లవా సౌందర్య గణిగా పల్లవా చెల్లునే సరసునకిది నా వల్లభుడ నీవని మది నుల్లసింపుచు నుంటి వేగమె పల్లవాగ్రణి రమ్ముకేళికి | yollavA saundarya gaNigA pallavA chellunE sarasunakidi nA vallabhuDa nIvani madi nullasimpuchu nunTi vEgame pallavAgraNi rammukELiki |
| చరణం charaNam 3 | రోషమా విటరాయ నీకిది వేషమా నా దోషమేమియు లేదురా మృదు భాషణ ప్రియ శ్రీధరా భూషితాగమవాసి యగు ద్వి భాషి పుల్లకవీశనుత నా | rOshamA viTarAya nIkidi vEshamA nA dOshamEmiyu lEdurA mRdu bhAshaNa priya SrIdharA bhUshitAgamavAsi yagu dvi bhAshi pullakavISanuta nA |
#319 వన్నెలాడి vannelADi
| Title | వన్నెలాడి | vannelADi |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | బేగడ | bEgaDa |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | వన్నెలాడి విన్నవించవే | vannelADi vinnavinchavE |
| అనుపల్లవి anupallavi | మొన్నటి పున్నమ రేయి కన్నులార నిన్నే జూచి యెన్నరాని మోహముచే నున్నదనుచును | monnaTi punnama rEyi kannulAra ninnE jUchi yennarAni mOhamuchE nunnadanuchunu |
| చరణం charaNam 1 | శారి కాకేరాళి రవ దారుణము కోర్వక నీదారి జూచుచుండె దయోదార యనుచును | SAri kAkErALi rava dAruNamu kOrvaka nIdAri jUchuchunDe dayOdAra yanuchunu |
| చరణం charaNam 2 | సుందరా నీయందు తమిజంది యాసజెంది గాసియుందిర తొందర రతులందు దన్పుమని | sundarA nIyandu tamijandi yAsajendi gAsiyundira tondara ratulandu dan&pumani |
| చరణం charaNam 3 | జోడుగూడ వీడని పూబోడి వానితోడ మాటలాడి తెమ్మనెగవ కూడు మనుచును | jODugUDa vIDani pUbODi vAnitODa mATalADi temmanegava kUDu manuchunu |
| చరణం charaNam 4 | భాసురమగు దుర్గాడ వాసుడు ద్విభాషి పుల్లకవీశ పోష దోషనాశ శ్రీయనుచు | bhAsuramagu durgADa vAsuDu dvibhAshi pullakavISa pOsha dOshanASa SrIyanuchu |
#318 రారా మనవి rArA manavi
| Title | రారా మనవి | rArA manavi |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | నాటకురంజి | nATakuranji |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | రారా మనవి చేకోరా లేచి రారా రారా మనవి చేకోరా మానినీ చిత్తచోరా రాజకుమార వీరా నిన్నే కోరినదిరా మేలౌరా లేలేరా రారా రాజాగేర | rArA manavi chEkOrA lEchi rArA rArA manavi chEkOrA mAninI chittachOrA rAjakumAra vIrA ninnE kOrinadirA mElaurA lElErA rArA rAjAgEra |
| చరణం charaNam 1 | మోము చంద్రునితో సమము సంపెంగ నాసికము కెమ్మోవి పగడము శంఖము కంధరము ప్రేమము కామము దీర్పుము క్షేమము | mOmu chandrunitO samamu sampenga nAsikamu kemmOvi pagaDamu Sankhamu kandharamu prEmamu kAmamu dIrpumu kshEmamu |
| చరణం charaNam 2 | ఆరు పున్నాగమును గేరు దంతముంచి డారు మల్లె మొగ్గలు మీరు, కన్యకామణి డయరు కన్నుల కర్వుదీరు మై తీరు రంగారు బంగారు నుంగేరు | Aru punnAgamunu gEru damtamunchi DAru malle moggalu mIru, kanyakAmaNi Dayaru kannula karvudIru mai tIru ramgAru bangAru nungEru |
| చరణం charaNam 3 | విళ్ళు కన్బొమ్మలు పాలిళ్ళు మల్లెపువ్వుల చెళ్ళు రిక్కలగమి గోళ్ళు బాహువుల్ తిమ్మి తూళ్ళు మీగాళ్ళు తాబేళ్ళు చెవ్రేళ్ళు చిగుళ్ళు | viLLu kan&bommalu pAliLLu mallepuvvula cheLLu rikkalagami gOLLu bAhuvul timmi tULLu mIgALLu tAbELLu chevrELLu chiguLLu |
| చరణం charaNam 4 | ఈశా ద్విభాషి పుల్లకవీశా మానినీ మనోల్లాసా భాస్కరసుప్రకాశా భవనాశా జగధీశా దరహాసా లక్ష్మీశా | ISA dvibhAshi pullakavISA mAninI manOllAsA bhAskarasuprakASA bhavanASA jagadhISA darahAsA lakshmISA |