#317 వగలాడి vagalADi

TitleవగలాడిvagalADi
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఅటaTa
పల్లవి pallaviవగలాడి దిగులిడ నోర్వగదే వోvagalADi diguliDa nOrvagadE vO
అనుపల్లవి anupallaviచిగురుబోడిరో జాలమా యిది శీలమా
తగు తగునే యిది తగువగునె తమి
దగిలి రతులను దిగియ జేయవె ఓ
chigurubODirO jAlamA yidi SIlamA
tagu tagunE yidi taguvagune tami
dagili ratulanu digiya jEyave O
చరణం
charaNam 1
కలిగి మిటారీ లలిత బింబాధరీ
వలపుల దేర్పవే వల రాచకేళిలో నీ
వలపు నిలుపగ రాదటే మర్యాదటే కలకలమ్ముగ
నలగి మన్మధ కళల దేరగ గలయ రాగదే
kaligi miTArI lalita bimbAdharI
valapula dErpavE vala rAchakELilO nI
valapu nilupaga rAdaTE maryAdaTE kalakalammuga
nalagi manmadha kaLala dEraga galaya rAgadE
చరణం
charaNam 2
కోపము దేలే ఆపలేనే మోహము నే పగవాడన నీకు దెలియదటే
నీ రూపురేఖలు నిక్కమా తమి దక్కుమా
పాపరాధుడగామ మోహోద్దీప తాపము బాపివేయవే
kOpamu dElE ApalEnE mOhamu nE pagavADana nIku deliyadaTE
nI rUpurEkhalu nikkamA tami dakkumA
pAparAdhuDagAma mOhOddIpa tApamu bApivEyavE
చరణం
charaNam 3
పల్లవ పాణీ పుల్లాబ్జలోచనీ
యుల్లము నీపయి నల్లన నిల్పెగదే ఓ
మల్లెపువ్వుల బంతిరొ మరుదంతిరో
సల్లలిత ద్విభాషి కులభవ పుల్లకవి నుత పల్లవీమణి
pallava pANI pullAbjalOchanI
yullamu nIpayi nallana nilpegadE O
mallepuvvula bantiro marudantirO
sallalita dvibhAshi kulabhava pullakavi nuta pallavImaNi

#316 ఎడబాసి eDabAsi

TitleఎడబాసిeDabAsi
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaచక్రవాకంchakravAkam
తాళం tALaఅటaTa
పల్లవి pallaviఎడబాసి గడియోర్వజాలనురా జోడెడబాసిeDabAsi gaDiyOrvajAlanurA jODeDabAsi
చరణం
charaNam 1
గొడవలింతకు హెచ్చినన్ మదినొచ్చినన్ పడకకును
రాకున్న నిన్నొక గడియైనను విడువజాలనురా ||జోడెడ||
goDavalimtaku hechchinan madinochchinan paDakakunu
rAkunna ninnoka gaDiyainanu viDuvajAlanurA ||jODeDa||
చరణం
charaNam 2
ఇటులారడి సేయుట ముచ్చటగా దెతులైనను చెంగట
నుంచుట మేలు తటపటాయించుట సదా మరలుటగురా
గుటుకు గుటుకున గ్రుక్కలూరించుటలు తగవగు నటరా నీ ||జోడెడ||
iTulAraDi sEyuTa muchchaTagA detulainanu chengaTa
numchuTa mElu taTapaTAyimchuTa sadA maraluTagurA
guTuku guTukuna grukkalUrinchuTalu tagavagu naTarA nI ||jODeDa||
చరణం
charaNam 3
సరివారలు మెచ్చనీ మెచ్చకపోనీ గురివెలి జేసిన నిరసన గాదటరా
నీ సరసమెరిగిన దాన నీ దానరా
సరిసరిరా నీ మురిపెమునల గురుతెరుగుదుర నా దొరవునీ ||జోడెడ||
sarivAralu mechchanI mechchakapOnI guriveli jEsina nirasana gAdaTarA
nI sarasamerigina dAna nI dAnarA
sarisarirA nI muripemunala guruterugudura nA doravunI ||jODeDa||
చరణం
charaNam 4
కలకాలము రవ్వల పాలయినన్
చలమెల్లను నిష్ఫలములయ్యెనురా నా
వలపు తెలిసిన పాడవు వగకాడవు
పలు విధమ్ముల నలరువిలుతుని పనులలోపల మెలగునీ ||జోడెడ||
kalakAlamu ravvala pAlayinan
chalamellanu nishphalamulayyenurA nA
valapu telisina pADavu vagakADavu
palu vidhammula nalaruvilutuni panulalOpala melagunI ||jODeDa||
చరణం
charaNam 5
మకరధ్వజ జనక నాకిక ప్రాపకమైతివి తేలిక సేయకురా
చంపక ముకుళ సమవాసికా
శోభన ముఖా ప్రకటమైన ద్విభాషికుల
పుల్లకవి సన్నుతి నికర నీ ||జోడెడ||
makaradhvaja janaka nAkika prApakamaitivi tElika sEyakurA
champaka mukuLa samavAsikA
SObhana mukhA prakaTamaina dvibhAshikula
pullakavi sannuti nikara nI ||jODeDa||

#314 చెలువుని తోడితేవె cheluvuni tODitEve

Titleచెలువుని తోడితేవెcheluvuni tODitEve
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaకేదారగౌళkEdAragauLa
తాళం tALaఅటaTa
1చెలువుని తోడి తేవె కలహంస గమనరొ
వల రాచకేళికి వలపించి పూశయ్యకు
cheluvuni tODi tEve kalahamsa gamanaro
vala rAchakELiki valapimchi pUSayyaku
2దవ్వుల జూచినానే నవ్వు మొగము వాడే
జవ్వనమయిన వాడే వహ్వరి తగిన జోడే
davvula jUchinAnE navvu mogamu vADE
javvanamayina vADE vahvari tagina jODE
3కామిని వాని మోము శోమునితో సమము
కాముని సుందరము కనగల్గెనే మోహము
kAmini vAni mOmu SOmunitO samamu
kAmuni sumdaramu kanagalgenE mOhamu
4తారక వేగోరులు హారాణి పల్తీరులు
చేరావె కన్బారులు నీరదముల్ కురులు
tAraka vEgOrulu hArANi paltIrulu
chErAve kan&bArulu nIradamul kurulu
5తీరైన పలుకులు తేనియ లొలుకులు
తోరంపు చూడ్కులు మారుని పూముల్కులు
tIraina palukulu tEniya lolukulu
tOrampu chUDkulu mAruni pUmulkulu
6కాపాడుమా దేహము కాకున్న చేద్రోహము
చూపగదే స్నేహము ఆపలేనే మోహము
kApADumA dEhamu kAkunna chEdrOhamu
chUpagadE snEhamu ApalEnE mOhamu
7ద్విభాషి పుల్లకవి ప్రాభవుడౌ భారవి
శోభిత గుణ పద్మనాభునీ శ్రీవిభుని
dvibhAshi pullakavi prAbhavuDau bhAravi
SObhita guNa padmanAbhunI SrIvibhuni

#313 పంతమా నాపై pamtamA nApai

Titleపంతమా నాపైpamtamA nApai
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaబిళహరిbiLahari
తాళం tALaఅటaTa
పల్లవి pallaviపంతమా నాపై వన్నెకాడా
కాంతుడెంతో గాసిజేసె
pamtamA nApai vannekADA
kAmtuDemtO gAsijEse
చరణం
charaNam 1
వలచి నిను కోరి వచ్చినందుకా
పలుచ జేసి పలుకకున్నావు
valachi ninu kOri vachchinamdukA
palucha jEsi palukakunnAvu
చరణం
charaNam 2
అల్లదాని యిల్లు చేరిన నీ
యెల్ల రెరుగు నీ యుల్లాసిల్లేవు
alladAni yillu chErina nI
yella rerugu nI yullAsillEvu
చరణం
charaNam 3
కమ్మ కెమ్మోవి కందిన గురుతులు
కమ్మ దలచి యిట్లు గారడి చేసేవు
kamma kemmOvi kamdina gurutulu
kamma dalachi yiTlu gAraDi chEsEvu
చరణం
charaNam 4
శేషశయన ద్విభాషి పుల్లకవిపోషా
గోపాల పోరాటమేరా
SEshaSayana dvibhAshi pullakavipOshA
gOpAla pOrATamErA

#312 కోపమేలరా kOpamElarA

TitleకోపమేలరాkOpamElarA
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaయదుకుల కాంభోజిyadukula kAmbhOji
తాళం tALaఅటaTa
పల్లవి pallaviకోపమేలరా నాపైని నా మనోహరా
ఆపరాని మోహ విరహ తాప మందుచుంటిరా
ఇంత కోపమేలరా
kOpamElarA nApaini nA manOharA
AparAni mOha viraha tApa manduchunTirA
inta kOpamElarA
చరణం
charaNam 1
సంతతంబు నిన్నె కోరి చెంత చేరి యుంటిరా
వింత కౌగిలింతతో మరింత వలపుమించెరా యింత
samtatambu ninne kOri chemta chEri yunTirA
vimta kaugilimtatO marinta valapumincherA yimta
చరణం
charaNam 2
హెవెన్ మన్యు నుండి నీకు లెటర్స్ బంపగా
నెవర్ మైండ్ లవర్ ఫ్రెండ్‌ని యువర్ విల్‌గాగ వయు రావైతివి
heven manyu numDi nIku leTars bampagA
nevar mainD lavar frenD^ni yuvar vil^gAga vayu rAvaitivi
చరణం
charaNam 3
పొదన్ పొదన్ గదల్చి తుమ్మెదల్ రొదల్ మొదల్పగా
మొదల్ మరుండెదన్ శరాల్ గుదుల్ గుదుల్ గుదుల్ గదున్చెరా
podan podan gadalchi tummedal rodal modalpagA
modal marunDedan SarAl gudul gudul gudul gadun&cherA
చరణం
charaNam 4
ఆస బాస జేసి యీని రాస నీ విలాసమా
కేశవా ద్విభాషి పుల్లకవీశ మద్వికాసమా
Asa bAsa jEsi yIni rAsa nI vilAsamA
kESavA dvibhAshi pullakavISa madvikAsamA

#311 మందయాన mandayAna

TitleమందయానmandayAna
Written Byద్విభాష్యం పుల్లకవిdvibhAshyam pullakavi
BookdvibhAshyamNoBook
రాగం rAgaఅఠాణaThANa
తాళం tALaఅటaTa
పల్లవి pallaviమందయాన నీ పొందుగోరి
నను బంపింది రార సామీ
mandayAna nI pondugOri
nanu bampimdi rAra sAmI
చరణం
charaNam 1
మందయాన నీ పొందుగోరినది పసందు మీరిన అందగత్తెర
సందడించి రతులందమంద నందరసము పొలుపొందజేయ విను
గొందువనుచు నీయందు చాల భ్రమ జెంది నాతొ దెల్పింది నన్ను బంపింది
వహ్వ పూసింది నిన్ను రమ్మంది సుందరరాచెందొవ విందుచే
కందియుందిరా నీయందు ప్రేమచే చిందర వందర చెందం పొందర
mandayAna nI pondugOrinadi pasandu mIrina andagattera
samdaDimchi ratulamdamamda namdarasamu polupomdajEya vinu
gomduvanuchu nIyamdu chAla bhrama jemdi nAto delpindi nannu bampindi
vahva pUsindi ninnu rammandi sundararAchendova vinduchE
kandiyundirA nIyandu prEmachE chindara vandara chendam pondara
చరణం
charaNam 2
బాలకురులు నీలాలు కనులు మీవాలు పలువరుస జాలు మంచి ముత్యాలు
మోవి పగడాలు జురిడీలు గావు మురిడీలు చేతుల పిడేలు
బాడగలశీల చెవులు చెక్రాలు మాటలు వరాలు చెక్కగద
వీలు నెలయు కపురాలు కవకుదగు పాలు వయసు నీపాలు
తనువు జిగి జాళువా సుమీ బాల నీవు రతినేల గాదగు
లీలలమరిన గోలర మేలుగ నేలర కేళిని
bAlakurulu nIlAlu kanulu mIvAlu paluvarusa jAlu manchi mutyAlu
mOvi pagaDAlu juriDIlu gAvu muriDIlu chEtula piDElu
bADagalaSIla chevulu chekrAlu mATalu varAlu chekkagada
vIlu nelayu kapurAlu kavakudagu pAlu vayasu nIpAlu
tanuvu jigi jALuvA sumI bAla nIvu ratinEla gAdagu
lIlalamarina gOlara mEluga nElara kELini
చరణం
charaNam 3
సుళ్ళు సిరులొసంకళ్ళు బొరులు దిళ్ళు దాని పాలిళ్ళు మొల్ల
పూచెళ్ళు చెలువమగు వళ్ళు కెరటముల జాళ్ళు బాహువుల
నీళ్ళు తామరల తూళ్ళు కిసలములు వేళ్ళు తారకలు గోళ్ళు
పిక్కలు మొసళ్ళు కలికి మీగాళ్ళ సౌరు తాబేళ్ళ సరి
పదారేళ్ళ వయసురా యేళ్ళ కొలది వేయి నోళ్ళ నుతించి
న వల్ల గాదు పెరుమాళ్ళ కృపనయిన
suLLu sirulosamkaLLu borulu diLLu dAni pAliLLu molla
pUcheLLu cheluvamagu vaLLu keraTamula jALLu bAhuvula
nILLu tAmarala tULLu kisalamulu vELLu tArakalu gOLLu
pikkalu mosaLLu kaliki mIgALLa sauru tAbELLa sari
padArELLa vayasurA yELLa koladi vEyi nOLLa nutimchi
na valla gAdu perumALLa kRpanayina
చరణం
charaNam 4
బోటి చక్కెరల పేటి యెల్ల రతితోవి కూటమికి సాటియై
తగు వధూటి సుందరా బోటి గుబ్బలు కొనగోట మీట
నెంతొ పాటమౌర నీవాటల పాటల కూటమి గూడర
bOTi chakkerala pETi yella ratitOvi kUTamiki sATiyai
tagu vadhUTi sundarA bOTi gubbalu konagOTa mITa
nemto pATamaura nIvATala pATala kUTami gUDara
చరణం
charaNam 5
కంబుకౌను సుముఖంబు చందురుని సఖంబు గళము
శంఖంబు కన్నుల సుఖంబు దానియందంబు మోవి
బింబంబు పలుకు మధురంబు మేని నా సంబు
సుతల పుష్పంబు నుదుట తిలకంబు హొయల్
గల కంబుకంఠిరా డింబుమీర సురతంబు లందు
సారంబు గలది పూనంబగు చుంబునలంబ విజృంభిత
kambukaunu sumukhambu chamduruni sakhambu gaLamu
Samkhambu kannula sukhambu dAniyamdambu mOvi
bimbambu paluku madhurambu mEni nA sambu
sutala pushpambu nuduTa tilakambu hoyal
gala kambukamThirA DimbumIra suratambu lamdu
sArambu galadi pUnambagu chumbunalamba vijRmbhita
చరణం
charaNam 6
శేష శయన ద్విభాషి పుల్లకవి పోష సుందరీ
భూషితాంగ సంతోష హృదయ మృదుభాషకు ప్రియా
వాసి మీద దానితో సురతములను జేసి మెలగుము
వికాస ముఖాసర నాదయారస
SEsha Sayana dvibhAshi pullakavi pOsha sundarI
bhUshitAmga samtOsha hRdaya mRdubhAshaku priyA
vAsi mIda dAnitO suratamulanu jEsi melagumu
vikAsa mukhAsara nAdayArasa

#310 చంచలాక్షి chamchalAkshi

Titleచంచలాక్షిchamchalAkshi
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaఆదిAdi
1చంచలాక్షి నిన్వరించి నన్ను బంచెరchamchalAkshi nin&varimchi nannu banchera
2యెంచగ గ్రొమ్మించు మించు జెలి మంచి మేనుyemchaga gromminchu minchu jeli manchi mEnu
3అంచలు భ్రమించు నడలంచు వచియించవచ్చు
కాంచనాంబర దాని గాంచిన మోహించె ఔర
anchalu bhraminchu naDalanchu vachiyinchavachchu
kAnchanAmbara dAni gAmchina mOhinche aura
4పంచశర రూపశర పంచకముల బల్మరు
పంచబాణుదించు బోడి బొంచి యేసి ముంచెనుర
panchaSara rUpaSara panchakamula balmaru
panchabANudimchu bODi bonchi yEsi munchenura
5చంచరీక వేణి దొడ్డి పంచాది గదిలో పట్టి
మంచమున శయనించి తపించెను రకింతచేత
chancharIka vENi doDDi panchAdi gadilO paTTi
manchamuna Sayanimchi tapinchenu rakintachEta
6అంచితముగ నిన్ను బూజించు యజ్ఞన్నకవి
గాంచి పోషించు కృష్ణ వేంచేసి కరంచుమిక
anchitamuga ninnu bUjinchu yajnannakavi
gAmchi pOshinchu kRshNa vEmchEsi karamchumika
This is the last jAvaLi from the book by SrI gabbiTa yajnanArAyaNa SAstri

#309 చాలు చాలు chAlu chAlu

Titleచాలు చాలుchAlu chAlu
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకrUpaka
1చాలు చాలు నీదు చెల్మి జాడదెలిసె మానినీchAlu chAlu nIdu chelmi jADadelise mAninI
2వ్రాలబోకు కాళ్ళపైని లేలే హంసగామినీvrAlabOku kALLapaini lElE hamsagAminI
3గులాబి పువ్వు విడచి మోదుగు విరి గొన్నరీతిగా
బలారె వాని గూడితిగ భామా నే నీకేటికే
gulAbi puvvu viDachi mOdugu viri gonnarItigA
balAre vAni gUDitiga bhAmA nE nIkETikE
4అల్ల వయసు ఠీపులు నీయందె మొల్చినవటే
యెల్ల చానలకు లేవే యీ గోటు నీకేటికే
alla vayasu ThIpulu nIyamde molchinavaTE
yella chAnalaku lEvE yI gOTu nIkETikE
5ఇందిరేశ్వరుండ నీ నా పొందు నీకు గల్గునే
అందులకే యేగు యజ్ఞనాప్తునకు తగుదువే
imdirESvarumDa nI nA pomdu nIku galgunE
amdulakE yEgu yajnanAptunaku taguduvE

#308 అయ్యయో ayyayO

Titleఅయ్యయోayyayO
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaహిందూస్తానీ కాఫీhimdUstAnI kAfI
తాళం tALaచాపుchApu
1అయ్యయో సైపగలేనేayyayO saipagalEnE
2చయ్యన నేగి రమాసఖునిటు రమ్మనేchayyana nEgi ramAsakhuniTu rammanE
3మదిరాక్షి వినవే మకరాంకుడురువడి
పదునగు శరముల నెదపై గ్రుచ్చెనే
madirAkshi vinavE makarAmkuDuruvaDi
padunagu Saramula nedapai gruchchenE
4అల్లజాబిల్లి వేడి మంతకంతకు నొడలెల్ల గ్రాగుచు విస్తరిల్లుచు నుండెనేallajAbilli vEDi mamtakamtaku noDalella grAguchu vistarilluchu numDenE
5వరగబ్బిట యజ్ఞన వంద్యుని బాయజాల
హరినిటు దేవే మణీహారమిచ్చెదనే
varagabbiTa yajnana vandyuni bAyajAla
hariniTu dEvE maNIhAramichchedanE

#307 చిన్న ముద్దీరా chinna muddIrA

Titleచిన్న ముద్దీరాchinna muddIrA
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaహిందూస్తాని కాఫీhimdUstAni kAfI
తాళం tALaఆదిAdi
1చిన్నముద్దీరా నాసామిchinnamuddIrA nAsAmi
2కన్నుల పండువుగా నిను గనగనె
వెన్నవలెను మది వేగ గరగురా
kannula panDuvugA ninu ganagane
vennavalenu madi vEga garagurA
3సరసత నీవొకసారి మాటాడిన
బొరి బొరి మేన బులక లెచ్చురా
sarasata nIvokasAri mATADina
bori bori mEna bulaka lechchurA
4అమ్మకచెల్ల నిన్నంటిన మాత్రనె
కమ్మని కోర్కెలు గలుగుచుండురా
ammakachella ninnanTina mAtrane
kammani kOrkelu galuguchumDurA
5కమలా ప్రియ శ్రీ గబ్బిట యజ్ఞన
నమిత చరణ విడనాడజాలరా
kamalA priya SrI gabbiTa yajnana
namita charaNa viDanADajAlarA