#306 ఇంత వేగపడిన imta vEgapaDina

Titleఇంత వేగపడినimta vEgapaDina
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaకమాచిkamAchi
తాళం tALaరూపకrUpaka
1ఇంత వేగపడిన కార్యమెట్టులౌనురా
రవంతవేళజూచి ముద్దులాడ దగునురా
imta vEgapaDina kAryameTTulaunurA
ravamtavELajUchi muddulADa dagunurA
2మెత్తని పానుపున మగని మెల్లనె నిద్రింపజేసి
యత్తమామ లెఱుగకుండ వత్తును పోరా
mettani pAnupuna magani mellane nidrimpajEsi
yattamAma le~rugakunDa vattunu pOrA
3మరదులు గ్రామాంతరమ్ములరిగి రాడబిడ్డలింక
పొరుగిండ్లకు నాటలాడబోదురు గదరా
maradulu grAmAmtarammularigi rADabiDDalimka
porugimDlaku nATalADabOduru gadarA
4దాపున మా పూలదోట లోపల నీవుండుము
గడెసేపులోనె బాగాల్ గొని చేరవత్తురా
dApuna mA pUladOTa lOpala nIvumDumu
gaDesEpulOne bAgAl goni chEravatturA
5చెన్ను మీర గబ్బిట యజ్ఞన్న కవి నేలినట్టి
చిన్ని కృష్ణ మదిని నేర మెన్నబోకురా
chennu mIra gabbiTa yajnanna kavi nElinaTTi
chinni kRshNa madini nEra mennabOkurA

#305 వాల్‌గంటి vAl^gamTi

Titleవాల్‌గంటిvAl^gamTi
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaరూపకrUpaka
1వాల్‌గంటి సోయగంబునెన్న వశముగాదురా
ఘల్ ఘల్ రవంపు నడలు హంసగతుల గేరురా
vAl^gamTi sOyagambunenna vaSamugAdurA
ghal ghal ravampu naDalu hamsagatula gErurA
2తొగవిందునకు నెమ్మోమునకతి దూరము గదరా
వరకుందనంపు జాయ ముద్దుగుల్కు మేనురా
togavimdunaku nemmOmunakati dUramu gadarA
varakundanampu jAya muddugulku mEnurA
3ప్రోయాలు తళ్కుమేల్ పాలిండ్లు పూలచెండ్లురా
ప్రాయంపుటింతి మధ్యము గన్పట్టదు గదరా
prOyAlu taLkumEl pAlinDlu pUlachenDlurA
prAyampuTimti madhyamu gan&paTTadu gadarA
4అర చందమామ నేలు నెన్నుదురు గల చెలిరా
మరువంపు మొల్ల మొగ్గల పల్వరుస పొలతిరా
ara chandamAma nElu nennuduru gala chelirA
maruvampu molla moggala palvarusa polatirA
5జలజాతనేత్ర గబ్బిట యజ్ఞన్న కవినుతా
వలరేని గన్న మేల్పుమిన్న వనిత నేలరా
వాల్‌గంటి సోయగంబుల
jalajAtanEtra gabbiTa yajnanna kavinutA
valarEni ganna mElpuminna vanita nElarA
vAl^gamTi sOyagambula

#304 కోమలాంగి kOmalAmgi

TitleకోమలాంగిkOmalAmgi
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaకేదారగౌళkEdAragauLa
తాళం tALaఆదిAdi
1కోమలాంగి తాళకున్నదిరా
తామరస విలోచన
kOmalAmgi tALakunnadirA
tAmarasa vilOchana
2సామిరాగదర కామినిక గనగ నా
మనోజుని శరానలంబునకు
sAmirAgadara kAminika ganaga nA
manOjuni SarAnalambunaku
3చందనగంధి నీయందనురాగము జెందియున్నదిర
సుందర శరీర యెందరైన నిన్ను బోలరంచు నీ
యందంబు చందంబు డెందంబునందలచి
chandanagandhi nIyamdanurAgamu jemdiyunnadira
sumdara SarIra yemdaraina ninnu bOlaramchu nI
yamdambu chamdambu Demdambunamdalachi
4కూరిమి మీరగ వారిజముఖిని జేరి
సుఖింపర శ్రీ రుక్మిణీలోల వేరు
సేయ మేరగాదు వేవేగమే రార
సారెకు నీ రాక నారయుచు
kUrimi mIraga vArijamukhini jEri
sukhimpara SrI rukmiNIlOla vEru
sEya mEragAdu vEvEgamE rAra
sAreku nI rAka nArayuchu
5వావిగ గబ్బిట వంశజ యజ్ఞన సేవిత
నీకై యాసించి యున్నదిర యే
విధాననైన దాని గ్రీడింపు
భావింప మీవేళ శ్రీవేణుగోపాలక
vAviga gabbiTa vamSaja yajnana sEvita
nIkai yAsimchi yunnadira yE
vidhAnanaina dAni grIDimpa
bhAvimpu mIvELa SrIVENugOpAlaka

#303 హాయికల్గెనురా hAyikalgenurA

Titleహాయికల్గెనురాhAyikalgenurA
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaరూపకrUpaka
1హాయికల్గెనురా చాలగ ||హా||
నామది ||హా||
నీయొయ్యారంపు పాటల
hAyikalgenurA chAlaga ||hA||
nAmadi ||hA||
nIyoyyArampu pATala
2నీయెడ బాళిని నేను రాగానెరా
వేయని ముద్దిడి యెదను జేర్చి
వేయి మోరీలు జేయు బిగికౌగిలీయ నీవెంతో
nIyeDa bALini nEnu rAgAnerA
vEyani muddiDi yedanu jErchi
vEyi mOrIlu jEyu bigikaugilIya nIvemtO
3మారశతోజ్వలాకార నేనయ్యెడ కోరి
సుగంధము కూర్మిబూయ గారామున
నీ తీరౌ మోవిసుధారసమీయ
mAraSatOjvalAkAra nEnayyeDa kOri
sugamdhamu kUrmibUya gArAmuna
nI tIrau mOvisudhArasamIya
4మక్కువ నేను నీ చెక్కిలి గొట్టగ
చక్కలిగింతలు చాలగొల్పి
చొక్కింపు గోట నొక్కుచు
బాలిండ్లెక్కుడు బెనగ
makkuva nEnu nI chekkili goTTaga
chakkaligimtalu chAlagolpi
chokkimpu gOTa nokkuchu
bAlimDlekkuDu benaga
5ఆరసి గబ్బిట యజ్ఞన సత్కవి వారక
బ్రోచెడి శౌరి నేడు చారు నానా
బంధోచాతురీ మారునికేళి
Arasi gabbiTa yajnana satkavi vAraka
brOcheDi Sauri nEDu chAru nAnA
bamdhOchAturI mArunikELi

#302 ఏమి పల్కెనే Emi palkenE

Titleఏమి పల్కెనేEmi palkenE
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaతోడిtODi
తాళం tALaరూపకrUpaka
1ఏమి పల్కెనే శ్రీ సఖు ||డేమి ||అల్లవా||డేమి ||
మోమాటమేమిలేక తెల్పగదె చెలి
Emi palkenE SrI sakhuDEmi allavADEmi
mOmATamEmilEka telpagade cheli
2నేవ్రాయుచీటి జూచెనా నిరసించి పాఱవైచెనా
యేవైన నుల్లసమ్ములాడెనా చెలి
nEvrAyuchITi jUchenA nirasimchi pA~ravaichenA
yEvaina nullasammulADenA cheli
3ఆ కాంత యింటనుండెనా అన్యాలయమున నుండెనా
నీకేమియైన భూషలిచ్చెనా చెలి
A kAmta yimTanunDenA anyAlayamuna numDenA
nIkEmiyaina bhUshalichchenA cheli
4ననుబాయనంచు జెప్పెనా నినుజూచి వేఱేడాగెనా
మనసిచ్చి మారుజాబు వ్రాసెనా చెలి
nanubAyanamchu jeppenA ninujUchi vE~rEDAgenA
manasichchi mArujAbu vrAsenA cheli
5ఇటు నేవత్తుననియెనా అటు నన్ను రమ్మనియెనా
పటు గబ్బిట శ్రీ యజ్ఞనార్చితుడు హరి
iTu nEvattunaniyenA aTu nannu rammaniyenA
paTu gabbiTa SrI yajnanArchituDu hari

#301 వినవే సామి చేసిన vinavE sAmi chEsina

Titleవినవే సామి చేసినvinavE sAmi chEsina
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaతోడి tODi
తాళం tALaరూపకrUpaka
1వినవే సామి చేసిన పనులన్ దెలిపెద చెలిvinavE sAmi chEsina panulan delipeda cheli
2కనుల నిండ నే నిదురగొని
నటులుండిన వేళను
చనవున గడపినవన్నియు
kanula ninDa nE niduragoni
naTulunDina vELanu
chanavuna gaDapinavanniyu
3నిన్న రేయి పాన్పు నిండు వెన్నెలలో వైచి
పండి యున్న వేళ నాదుపైని వన్నెకాడు
సన్నజాజులిన్ని చల్లె నెలనవ్వున
ninna rEyi pAn&pu ninDu vennelalO vaichi
panDi yunna vELa nAdupaini vannekADu
sannajAjulinni challe nelanavvuna
4మేలైన గదంబు రోజ పాళి నలది
పెదవి తేనె గ్రోలి ముద్దు బెట్టి గోపాలుడు
సుఖలీలల ననుదేలించెనె నీలవేణి
mElaina gadambu rOja pALi naladi
pedavi tEne grOli muddu beTTi gOpAluDu
sukhalIlala nanudElimchene nIlavENi
5ఇల గబ్బిట యజ్ఞనాఖ్యు గృపమీర నేలినట్టి
నలికాక్షుడిట్లు జేసి వెలలేనివి గల మానికముల
హారము నెలమి నొసగె
ila gabbiTa yajnanAkhyu gRpamIra nElinaTTi
nalikAkshuDiTlu jEsi velalEnivi gala mAnikamula hAramu nelami nosage

#300 వానిజూడు మెందున్నాడో vAnijUDu memdunnADO

Titleవానిజూడు మెందున్నాడోvAnijUDu memdunnADO
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaనాటకురంజిnATakuramji
తాళం tALaఆదిAdi
1వానిజూడు మెందున్నాడో సఖియvAnijUDu memdunnADO sakhiya
2నాణెంపు బల్కుల దేనెలొల్కువాడేnANempu balkula dEnelolkuvADE
3నిద్దమైన చెక్కుతద్దముల సౌరు
ముద్దుగారు మోము మోవికెంపు వాడే
niddamaina chekkutaddamula sauru
muddugAru mOmu mOvikempu vADE
4బంగారు దువ్వలువ వల్లెవాటు వైచి
సంగీతమ్ము జేయు చహలు గల్గువాడే
bamgAru duvvaluva vallevATu vaichi
samgItammu jEyu chahalu galguvADE
5చల్లని చూపుల సత్కవిత్కముల
పెల్లైన యీవుల పేరు బొందువాడే
challani chUpula satkavitkamula
pellaina yIvula pEru bomduvADE
6అనయము గబ్బిట యజ్ఞన్న కవీంద్ర
వినుతుడైన రంగ విభుడింక రాడాయె
anayamu gabbiTa yajnanna kavIndra
vinutuDaina ramga vibhuDimka rADAye

#299 వనజాక్షుని బాయలేనే vanajAkshuni bAyalEnE

Titleవనజాక్షుని బాయలేనేvanajAkshuni bAyalEnE
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaహిందుస్తానీ కాఫీhindustAnI kAfI
తాళం tALaఆదిAdi
1వనజాక్షుని బాయలేనే సఖీvanajAkshuni bAyalEnE sakhI
2వెనుకనె వచ్చి నా కనుదోయిని మూసి
తను నన్నెఱుంగమన్నాడే
venukane vachchi nA kanudOyini mUsi
tanu nanne~rungamannADE
3కడు ముద్దు పాటల గరగించి నన్ను
తన తొడపైని నుంచుకొన్నాడే
kaDu muddu pATala garagimchi nannu
tana toDapaini nunchukonnADE
4మమతమీర నాతో మనసిచ్చి మాటాడుచు
తమలంబు నొసంగినాడే
mamatamIra nAtO manasichchi mATADuchu
tamalambu nosamginADE
5ఘన సన్నిభాంగుడే గబ్బిట యజ్ఞన్న
హృద్వనజ ప్రపూజితాంగుడే
ghana sannibhAmguDE gabbiTa yajnanna
hRdvanaja prapUjitAmguDE

#298 ఈ మోహమెట్టోర్తురా I mOhameTTOrturA

Titleఈ మోహమెట్టోర్తురాI mOhameTTOrturA
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
1ఈ మోహమెట్టోర్తురా
వేగ ప్రేమ జూచి యేలుకోర
I mOhameTTOrturA
vEga prEma jUchi yElukOra
2నీ మీదను నా మానసమేమారక చిక్కెగదరా మేనున గరుపాటులు వేమారును గల్గెనురnI mIdanu nA mAnasamEmAraka chikkegadarA mEnuna garupATulu vEmArunu galgenura
3పిక్కటాలు వక్షోజము లెక్కుడుగ పొంగారెర
మక్కువగ నీ కౌగిలి యొక్కపరి నీగదర
pikkaTAlu vakshOjamu lekkuDuga pomgArera
makkuvaga nI kaugili yokkapari nIgadara
4దట్టమగు చెమ్మటలు బుట్టి మదిగట్టి చెడి
గుట్టు విడి వెచ్చనగు నిట్టూర్పులు వచ్చెనుర
daTTamagu chemmaTalu buTTi madigaTTi cheDi
guTTu viDi vechchanagu niTTUrpulu vachchenura
5ఇంతంతనని కోర్కెలు స్వాంతమున గంతులిడె
వింతలుగ శ్రీ గబ్బిట యజ్ఞేశనుత
imtamtanani kOrkelu svAmtamuna gamtuliDe
vimtaluga SrI gabbiTa yajnESanuta

#297 చాలు పోపోరా chAlu pOpOrA

Titleచాలు పోపోరాchAlu pOpOrA
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaఆదిAdi
1చాలు పోపోరా యేరా నీ
చందమెల్ల దెలిసెరా
జాడలెల్ల దెలిసెరా
chAlu pOpOrA yErA nI
chandamella deliserA
jADalella deliserA
2నీ నయ వినయమెల్ల నేడు దెలిసె
మ్రొక్కకు నీకే నిష్టమటరా
nI naya vinayamella nEDu delise
mrokkaku nIkE nishTamaTarA
3ఎందుకు నన్నంటెదు నా డెందము
పరిశోధింప నిందు వచ్చితే యేరా
enduku nannamTedu nA Dendamu
pariSOdhimpa nindu vachchitE yErA
4ఆ లతాంగి మైత్రి సౌఖ్య లీలలిందు
జూపింప గోపాల వచ్చితే యేరా
A latAMgi maitri soukhya lIlalimdu
jUpimpa gOpAla vachchitE yErA
5బిసరుహలోచన గబ్బిట యజ్ఞనాప్త
దాని బసకె వేంచేయరా
bisaruhalOchana gabbiTa yajnanApta
dAni basake vEmchEyarA