#296 మారుబారి కోర్వజాలరా mArubAri kOrvajAlarA

Titleమారుబారి కోర్వజాలరాmArubAri kOrvajAlarA
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
Bookశృంగార జావళ్ళుSRmgAra jAvaLLu
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
1మారుబారి కోర్వజాలరా
శ్రీమానినీ మనోహరా
mArubAri kOrvajAlarA
SrImAninI manOharA
2నీరేజు సూన కఠోర బాణమ్ములురోరుహముం దాకెరాnIrEju sUna kaThOra bANammulurOruhamum dAkerA
3ఇందీవరాప్తుని యెండ వేడిమికి
కందుచు మేనెల్ల గ్రాగుటె కాకయా
మందానిలుడు పల్మారు గగుర్పాటు
లొందింప సాగించెరా
indIvarAptuni yenDa vEDimiki
kanduchu mEnella grAguTe kAkayA
mamdAniluDu palmAru gagurpATu
lomdimpa sAgimcherA
4శారికా కీర మయూర మధు వ్రత
పారావతనిక రారావములకు
తోరంబుగా మది తృళ్ళిపడుచు మహారాటమున్ జెందెరా
SArikA kIra mayUra madhu vrata
pArAvatanika rArAvamulaku
tOrambugA madi tRLLipaDuchu mahArATamun jemderA
5చయ్యన గబ్బిట సత్కుల జని యజ్ఞయ్యను బ్రోచెడి జలజనయన యా గయ్యాళి జేరి నన్నెయ్యడ నేచుట లయ్యయ్యొ యిది మేరాchayyana gabbiTa satkula jani yajnayyanu brOcheDi jalajanayana yA gayyALi jEri nanneyyaDa nEchuTa layyayyo yidi mErA

#295 సామాజాయా sAmAjAyA

TitleసామాజాయాsAmAjAyA
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaఅటaTa
1సామాజాయా నారో సామినిటకు
రమ్మనవె చన వెడయ
sAmAjAyA nArO sAminiTaku
rammanave chana veDaya
2చలం బిటులమిది దలంచ వలదనిchalam biTulamidi dalamcha valadani
3మారుని విరిశర బారి కోర్వదనిmAruni viriSara bAri kOrvadani
4జాలామేల రతికేళీ నేలుటకుjAlAmEla ratikELI nEluTaku
5చిన్నారాయ రామ
చిన్నారాయ నృప
శీలుని కడువడి
chinnArAya rAma
chinnArAya nRpa
SIluni kaDuvaDi
This ends list of jAvaLis by this poet.

#294 ఏరసామి పలుమారు ErasAmi palumAru

Titleఏరసామి పలుమారుErasAmi palumAru
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaసింధు కమాచిsindhu kamAchi
తాళం tALaఆదిAdi
1ఏరసామి పలుమారు వేడినను
కూరుమి రాదా కోమలి మీదా
ErasAmi palumAru vEDinanu
kUrumi rAdA kOmali mIdA
2స్మరుడురువడి విరిశరములురము దూయా
మారుత మొలయా మానిని సైచక మంద
మారుత మొలయా మానిని సైచక
smaruDuruvaDi viriSaramuluramu dUyA
mAruta molayA mAnini saichaka mamda
mAruta molayA mAnini saichaka
3సరసిజముఖి నిటు సరకు గొనవిదేరా
సరగున రారా సమయమురా యిది
సరగున రారా సమయమిదేరా
sarasijamukhi niTu saraku gonavidErA
saraguna rArA samayamurA yidi
saraguna rArA samayamidErA
4చెలియ నిను వలసి దలచి సొలసె గదరా
చిన్నారాయా భూపాలా
రామచిన్నారాయా భూపాలా
cheliya ninu valasi dalachi solase gadarA
chinnArAyA bhUpAlA
rAmachinnArAyA bhUpAlA

#293 పాకశాసనదేవ pAkaSAsanadEva

Titleపాకశాసనదేవ (కృతి)pAkaSAsanadEva (kRti)
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaయదుకుల కాంభోజిyadukula kAmbhOji
తాళం tALaత్రిపుటtripuTa
1పాకశాసనదేవ లోకార్చిత పాద
లోకాబాంధవ చంద్రా లోచన యుగళా
గోకుల వర్ధన గోపీచేలన చోర
మాకభయమొసగి మాధవ బ్రోవరా
pAkaSAsanadEva lOkArchita pAda
lOkAbAndhava chandrA lOchana yugaLA
gOkula vardhana gOpIchElana chOra
mAkabhayamosagi mAdhava brOvarA
2ఘోర సురారిని గూల్చి ప్రహ్లాదుని
కోర్కెలెల్లను కొనగూర్చకలేదా
పోరున ధీరకుంభీరమును బట్టి జీరి
వారణమును జేరి గావగలేదా
ghOra surArini gUlchi prahlAduni
kOrkelellanu konagUrchakalEdA
pOruna dhIrakumbhIramunu baTTi jIri
vAraNamunu jEri gAvagalEdA
3పక్షపాతము మాని రక్షణ సేయుము
కక్ష బూనుట బాడి గాదు దాసునిపై
పక్షివాహన లోకాధ్యక్షౌ కౌస్తుభ పక్షపాండవ పుత్ర పక్షా నినుగొల్తు
pakshapAtamu mAni rakshaNa sEyumu
kaksha bUnuTa bADi gAdu dAsunipai
pakshivAhana lOkAdhyakshau kaustubha pakshapAnDava putra pakshA ninugoltu
4జాలమేల కనక చేలా నను వేగ పాలనసేయుము
పావనశీలా యాలగాసరిమునుకు
చేలుని కరుణను నేలిన విజయ గోపాలా గానలోలా
jAlamEla kanaka chElA nanu vEga pAlanasEyumu
pAvanaSIlA yAlagAsarimunuku
chEluni karuNanu nElina vijaya gOpAlA gAnalOlA

#292 చలమికను chalamikanu

Titleచలమికనుchalamikanu
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaనాదనామక్రియnAdanAmakriya
తాళం tALaఆదిAdi
1చలమికను మానీ యేలరా
సామి వేగ రారా
chalamikanu mAnI yElarA
sAmi vEga rArA
2కులుకు గుబ్బలను గోరులుంచి నా
వలపు దీర కౌగిలిని యొసగరా
kuluku gubbalanu gOrulumchi nA
valapu dIra kaugilini yosagarA
3చిలుక రౌతు విరిములుకురమునను
బలముగ నాటగ సొలసితి నకటా
chiluka rautu virimulukuramunanu
balamuga nATaga solasiti nakaTA
4బలు చెలిమిని నిను గలయ గోరినను
బలుకవు కస్తురి జిలుకవు తగునా
balu chelimini ninu galaya gOrinanu
balukavu kasturi jilukavu tagunA
5మరుడు సాక్షి యీ విరహమోర్వ నా తరము గాదు బుచ్చి తమ్మయ భూపాmaruDu sAkshi yI virahamOrva nA taramu gAdu buchchi tammaya bhUpA

#291 రారా యికను rArA yikanu

Titleరారా యికనుrArA yikanu
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaఫరుజుfaruju
తాళం tALaఏకEka
1రారా యికను చాలును రాపులు మానీ
తేరిటు జూడవేర నా సామీ
rArA yikanu chAlunu rApulu mAnI
tEriTu jUDavEra nA sAmI
2కూరిమి వేళా గోరంతా రారా
ఎంతని వేడెద యేమని దెల్పెద
చింత దీర్చి నను చేకోరా
kUrimi vELA gOramtA rArA
emtani vEDeda yEmani delpeda
chimta dIrchi nanu chEkOrA
3ధరామరాధిపా తమ్మయ భూపా
విరాళిని తాళను వేవేగ
dharAmarAdhipA tammaya bhUpA
virALini tALanu vEvEga

#290 యేల చలము రార yEla chalamu rAra

Titleయేల చలము రారyEla chalamu rAra
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAga????
తాళం tALa????
1యేల చలము రారసామీ
యేల చలము రారసామీ
yEla chalamu rArasAmI
yEla chalamu rArasAmI
2బాళిమీర నిదురరాదు పంచదార తేనె చేదు
తాళిమించుకైన లేదు తామసింపవలదు వలదు
bALimIra nidurarAdu pamchadAra tEne chEdu
tALimimchukaina lEdu tAmasimpavaladu valadu
3చల్లగాలి నొల్లదాయె స్మరుని పోరు లధికమాయె
మల్లెపూలు ముల్లులాయె మాటిమాటికి నిట్టూర్పులాయె
challagAli nolladAye smaruni pOru ladhikamAye
mallepUlu mullulAye mATimATiki niTTUrpulAye
4పొలతి నిటుల నేచమేలా బుచ్చి తమ్మయ్య భూపాలా
కలసి రతుల దేల్చి చాలా కరుణబూని యేలవేరా
polati niTula nEchamElA buchchi tammayya bhUpAlA
kalasi ratula dElchi chAlA karuNabUni yElavErA

#289 చలమేలరా chalamElarA

TitleచలమేలరాchalamElarA
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaసురటsuraTa
తాళం tALaఆదిAdi
1చలమేలరా నా సామి
వలపెట్లు నిలుపగలనికను
చలమేలరా మనసు దీరగా మాటలాడగా
మానితివిది తగునా
chalamElarA nA sAmi
valapeTlu nilupagalanikanu
chalamElarA manasu dIragA mATalADagA
mAnitividi tagunA
2కోరినట్ల నీ కోర్కె దీర్చినా
కోపగించ తగునా
kOrinaTla nI kOrke dIrchinA
kOpagimcha tagunA
3కమ్మని విల్తుని గాసి దీర్చరా
తమ్మయ భూపాలా
kammani viltuni gAsi dIrcharA
tammaya bhUpAlA

#288 నేరము లెంచక nEramu lemchaka

Titleనేరము లెంచకnEramu lemchaka
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaబిళహరిbiLahari
తాళం tALaఅటaTa
1నేరము లెంచక కూరిమి తోడను
కీరవాణి నేలరా రారా సామి
nEramu lemchaka kUrimi tODanu
kIravANi nElarA rArA sAmi
2ఘోరమారుని బాధల కోరువలేకను
వారిజాక్షి బంపెరా సారెకు మ్రొక్కి
ghOramAruni bAdhala kOruvalEkanu
vArijAkshi bamperA sAreku mrokki
3మోవి యాననిచ్చి మోహతాపమార్చి
ముచ్చటలను దీర్చ రావే వేగమే
mOvi yAnanichchi mOhatApamArchi
muchchaTalanu dIrcha rAvE vEgamE
4ధరణీ నాయక బుచ్చి తమ్మయ్య ధీరా
తరుణిమణీ మదనా సరసాగ్రణి
dharaNI nAyaka buchci tammayya dhIrA
taruNimaNI madanA sarasAgraNi

#287 రమ్మని దెల్పవే rammani delpavE

Titleరమ్మని దెల్పవేrammani delpavE
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఆదిAdi
1రమ్మని దెల్పవే రమ్మని దెల్పవే
రమ్మని దెల్పవె
రామరో వేగము మారుత మొలసెనే
కీరము గూసెనే
మారుడు రాసె నేడు మానిని తాళనే
rammani delpavE rammani delpave
rammani delpavE
rAmarO vEgamu mAruta molasenE
kIramu gUsenE
mAruDu rAse nEDu mAnini tALanE
2ఆ పగరాని నా కోపము చేతను
రాపులు జేసిన రాకడ మానెనే
A pagarAni nA kOpamu chEtanu
rApulu jEsina rAkaDa mAnenE
3సమ్మతిచే బుచ్చి తమ్మయ సామికి
కమ్మని వా తెర కానుక యిచ్చెద
sammatichE buchchi tammaya sAmiki
kammani vA tera kAnuka yichcheda