#276 యేమిజేతునే చెలియ yEmijEtunE cheliya

Titleయేమి జేతునే చెలియyEmi jEtunE cheliya
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaసురటsuraTa
తాళం tALaఏకEka
1యేమిజేతునే చెలియ యేమని దెలుపుదు
సామి యెంతో మోసాబుచ్చెనే
yEmijEtunE cheliya yEmani delupudu
sAmi yemtO mOsAbuchchenE
2కామునికేళిని గలసిన దాకా
వేమరు బాసలెల్ల వింతగ జేసి
కోమలి వింటివే గుట్టు బయలుబెట్టినహా
kAmunikELini galasina dAkA
vEmaru bAsalella vimtaga jEsi
kOmali vimTivE guTTu bayalubeTTinahA
3చక్కగ బల్కుచు సరసను జేర్చి
చెక్కిలి నొక్కి యెన్నొ చేష్టలుజేసి
అక్కర దీర్చి నన్నరమర జేసునే సామి
chakkaga balkuchu sarasanu jErchi
chekkili nokki yenno chEshTalujEsi
akkara dIrchi nannaramara jEsunE sAmi
4రాజా వెంకట రామరాయా భూపతి యేరామనుగూడి యిటురాక యుండెనే
యో జలజాక్షి నా యోగ మెటులుండినదొ
rAjA vemkaTa rAmarAyA bhUpati yErAmanugUDi yiTurAka yumDenE
yO jalajAkshi nA yOga meTulunDinado

#275 మొగమాట మించుకలేక mogamATa mimchukalEka

Titleమొగమాట మించుకలేకmogamATa mimchukalEka
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaమోహనmOhana
తాళం tALaఆదిAdi
1మొగమాట మించుకలేక
పోపొమ్మన దగునా
mogamATa mimchukalEka
pOpommana dagunA
2వగకాడ నన్నింత తెగనాడుటేలరా
మగువా తావలసిన మనసూ రాదటరా
vagakADa nannimta teganADuTElarA
maguvA tAvalasina manasU rAdaTarA
3మోహము చేతను మోవి యానబోతె
మోమటు ద్రిప్పితి వేమిరా నాసామి
సాహసమున నిన్ను సందిలి బట్టబోతే
చాలు చాలునని సాములు జేసేవు
మచ్చకంటెవతైనా మందుబెట్టెనటరా
మాటలాడవదేరా
మనసు దీరగాను పచ్చవిల్తుని ఘోర
బాధల సైచక ముచ్చట దీర్చుమనగ మురసెద వేలరా
mOhamu chEtanu mOvi yAnabOte
mOmaTu drippiti vEmirA nAsAmi
sAhasamuna ninnu samdili baTTabOtE
chAlu chAlunani sAmulu jEsEvu
machchakamTevatainA mamdubeTTenaTarA
mATalADavadErA
manasu dIragAnu pachchaviltuni ghOra
bAdhala saichaka muchchaTa dIrchumanaga muraseda vElarA
4శ్రీ యినుగంటి కులజేశ శ్రీ ప్రకాశ
రాయాత్మజ వేంకట రామ రాయయేరా
బాయని ప్రేమను బ్రతిమాలుచుండిన
న్యాయముగాదు నన్నారడి సేయుట
SrI yinugamTi kulajESa SrI prakASa
rAyAtmaja vEmkaTa rAma rAyayErA
bAyani prEmanu bratimAluchumDina
nyAyamugAdu nannAraDi sEyuTa

#274 సామి జాలమేలరా sAmi jAlamElarA

Titleసామి జాలమేలరాsAmi jAlamElarA
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaహిందుస్తాని కాఫిhindustAni kAfi
తాళం tALaమధ్యాదిmadhyAdi
1సామి జాలమేలరా
సామి జాలమేలరా
sAmi jAlamElarA
sAmi jAlamElarA
2మోము మోమునందు జేర్చరా
మోవి తేనెలాననివ్వరా
mOmu mOmunandu jErcharA
mOvi tEnelAnanivvarA
3కుచములందు గోరులుంచరా
కుస్తరించి కేళి దేల్చరా
kuchamulamdu gOrulumcharA
kustarimchi kELi dElcharA
4కామబాధ కోర్వజాలరా
రామరాయ ప్రేమనేలరా
kAmabAdha kOrvajAlarA
rAmarAya prEmanElarA

#273 వెలదిరో veladirO

TitleవెలదిరోveladirO
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaయదుకుల కాంభోజిyadukula kAmbhOji
తాళం tALaఅటaTa
1వెలదిరో యినుగంటి వెంకట రామరాయ
విభుని తోడి తేగదే ఓ
చెలియా విభుని తోడి తేగదే తేగదే
veladirO yinugamTi vemkaTa rAmarAya
vibhuni tODi tEgadE O
cheliyA vibhuni tODi tEgadE tEgadE
2ఘోర సుమశరా సారములోబడి
ఓరువదని దెల్పవే
ఓ చెలియా ఓరువదని దెల్పవే దెల్పవే
ghOra sumaSarA sAramulObaDi
Oruvadani delpavE
O cheliyA Oruvadani delpavE delpavE
3ఆ సమీరతానధరా చుంబనమును
జేసినది యాది శేయవే ఓ చెలియా
జేసినది యాది సేయవే సేయవే
A samIratAnadharA chumbanamunu
jEsinadi yAdi SEyavE O cheliyA
jEsinadi yAdi sEyavE sEyavE
4నాదు చక్కెర మోవి మీదుగట్టితి ననవే
వాదాములిక చాలనవే ఓ చెలియా
వాదములిక చాలనవే చాలనవే
nAdu chakkera mOvi mIdugaTTiti nanavE
vAdAmulika chAlanavE O cheliyA
vAdamulika chAlanavE chAlanavE
5నా భూవిభుని వేగ నన్ను గూర్చిన
కనకాభిషేకము జేసెద ఓ చెలియా
కనకాభిషేకము జేసెద చేసెద
nA bhUvibhuni vEga nannu gUrchina
kanakAbhishEkamu jEseda O cheliyA
kanakAbhishEkamu jEseda chEseda

#272 ఏటీకె యీ తగవు ETIke yI tagavu

This is the first jAvaLi from this book

Titleఏటీకె యీ తగవుETIke yI tagavu
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaభయిరవిbhayiravi
తాళం tALaత్రిపుటtripuTa
1ఏటీకె యీ తగవు మాటిమాటికి నాతో
సాటివారు గేలి సలుపాగనూ
బోటీరొ నా ప్రియుని మాటాలు వింటివె
నీటీపై వ్రాతాయె నేనేమి సేతూ
ETIke yI tagavu mATimATiki nAtO
sATivAru gEli salupAganU
bOTIro nA priyuni mATAlu vinTive
nITIpai vrAtAye nEnEmi sEtU
2అక్కార దీర్చి నన్నాదరింతు నాని
చెక్కిలిబట్టి తాజేసిన బాస రొక్కాపు మూటాయె
లోకాపవాదాయె యెక్కడి స్నేహ మింకెక్కడి ప్రేమా
akkAra dIrchi nannAdarimtu nAni
chekkilibaTTi tAjEsina bAsa rokkApu mUTAye
lOkApavAdAye yekkaDi snEha mimkekkaDi prEmA
3తుంటవింటివాడు తూపూలు నా యెద
జంటనేయ సైచజాలానితరిని
కంటబడని వాని కాపురమిక నేలా
రెంటా జెడిన నావంటిదిలగలదా
tumTavimTivADu tUpUlu nA yeda
jamTanEya saichajAlAnitarini
kamTabaDani vAni kApuramika nElA
remTA jeDina nAvamTidilagaladA
4రాజా వేంకట రామారాయ భూపాలుడు
భోజరాజ రాజరాజ నిభుడనియా
రాజీవాయతనేత్రి రాయబారము సేయ
యాజీవమని నమ్మినందుల కిటులాయెనే
rAjA vEmkaTa rAmArAya bhUpAluDu
bhOjarAja rAjarAja nibhuDaniyA
rAjIvAyatanEtri rAyabAramu sEya
yAjIvamani namminamdula kiTulAyenE

#271 పొమ్మనవే వాని దానింటికి pommanavE vAni dAnimTiki

Titleపొమ్మనవే వాని దానింటికిpommanavE vAni dAnimTiki
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకమాస్kamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviపొమ్మనవే వాని దానింటికిpommanavE vAni dAnimTiki
చరణం
charaNam 1
సవతితో ఏ వేళను సరసములాడుచును
వలలో జిక్కిన వాని పిలచి పిలచి ఏమో
savatitO E vELanu sarasamulADuchunu
valalO jikkina vAni pilachi pilachi EmO
చరణం
charaNam 2
ప్రియముతో చామేంద్రుడు నన్ను దలచి అపుడు
మరచినాడు యెవతో బోధన చేత
priyamutO chAmEndruDu nannu dalachi apuDu
marachinADu yevatO bOdhana chEta
This is the last jAvaLi from the book of “Javalis of Sri Chinniah”

#270 చెలువుని రా రమ్మనవే cheluvuni rA rammanavE

Titleచెలువుని రా రమ్మనవేcheluvuni rA rammanavE
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaతిశ్రనడ ఆదిtiSranaDa Adi
పల్లవి pallaviచెలువుని రా రమ్మనవే ఓ చెలియరోcheluvuni rA rammanavE O cheliyarO
అనుపల్లవి anupallaviవారిజముఖి పగవారి బోధనచే
సారెకు నాపై నేరమెంచగ నిక
vArijamukhi pagavAri bOdhanachE
sAreku nApai nEramemchaga nika
చరణం
charaNam 1
కోరిన సామి ఈ దారి వచ్చేను గాదే
నారీమణి రారాయే పారమేమిక నిక
kOrina sAmi I dAri vachchEnu gAdE
nArImaNi rArAyE pAramEmika nika
చరణం
charaNam 2
అందరివలె నన్ను నిందలు సేయక
సుందరీ చామ రాజేంద్రుని వలచితి
amdarivale nannu nimdalu sEyaka
sumdarI chAma rAjEmdruni valachiti

#269 జానరో ఈ మోహము jAnarO I mOhamu

Titleజానరో ఈ మోహముjAnarO I mOhamu
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకమాస్kamAs
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviజానరో ఈ మోహము సహింపలేనేjAnarO I mOhamu sahimpalEnE
అనుపల్లవి anupallaviమానిని జాలమేల మారుబారి కోర్వలేనేmAnini jAlamEla mArubAri kOrvalEnE
చరణం
charaNam 1
సరసాంగి సామికేమో మరులు జేసేవు
పరవశము డెదయ జేసి పోయిరమ్ము ముద్దుగుమ్మ
sarasAmgi sAmikEmO marulu jEsEvu
paravaSamu Dedaya jEsi pOyirammu muddugumma
చరణం
charaNam 2
తరుణిరో చామ రాజేంద్రుని బుధ్ధికి తోచదు గాని
కరుణ లోలుడైన వాడు కాంతుడు నేడు గూడ రాడు
taruNirO chAma rAjEmdruni budhdhiki tOchadu gAni
karuNa lOluDaina vADu kAmtuDu nEDu gUDa rADu
See also709
Audio Linkhttps://www.youtube.com/watch?v=Txjsw3ysX-M

#268 చెలి బలవంతమేలరా cheli balavamtamElarA

Titleచెలి బలవంతమేలరాcheli balavamtamElarA
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaఫరజ్faraj
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి pallaviచెలి బలవంతమేలరా ఓ
చెలువుడు ఈ రీతి చలము జేసితే
cheli balavamtamElarA O
cheluvuDu I rIti chalamu jEsitE
అనుపల్లవి anupallaviభావజూచి కేళిలో నన్నేలినట్టి ముచ్చు
ఈ విధము జేసితే మన దేవుడున్నాడు
bhAvajUchi kELilO nannElinaTTi muchchu
I vidhamu jEsitE mana dEvuDunnADu
చరణం
charaNam 1
దాని బోధలకు లోనై యున్నాను ఇక
మానాభిమానము వానితే అలవానితే పోపో
dAni bOdhalaku lOnai yunnAnu ika
mAnAbhimAnamu vAnitE alavAnitE pOpO
చరణం
charaNam 2
చంచలాక్షి చామ రాజేంద్రుడు ఈ రీతి
వంచన జేసితే మంచిదే బలు మంచిదే
chamchalAkshi chAma rAjEmdruDu I rIti
vamchana jEsitE mamchidE balu mamchidE

#267 తెలిసే వగలెల్ల telisE vagalella

Titleతెలిసే వగలెల్లtelisE vagalella
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviతెలిసే వగలెల్ల బాగాయెరా
బల్కేవు ఏలాగు సహింతురా
telisE vagalella bAgAyerA
balkEvu ElAgu sahimturA
అనుపల్లవి anupallavi
చరణం
charaNam 1
నన్నే నిరాకరించి ఏ వేళ సవతితో
ఉల్లాస సల్లాప మోహ మాట పాట చాలు
nannE nirAkarimchi E vELa savatitO
ullAsa sallApa mOha mATa pATa chAlu
చరణం
charaNam 2
చుక్కల రవముల పిక్కల కలకల
రవ్వల నే తాళ చామరాజ ఈ పలుకు
chukkala ravamula pikkala kalakala
ravvala nE tALa chAmarAja I paluku