#257 చెలి నేనెట్లు cheli nEneTlu

Titleచెలి నేనెట్లుcheli nEneTlu
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaఫరజ్faraj
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviచెలి నేనెట్లు సహింతునే
అలవానితో వర్ణింతునే
cheli nEneTlu sahimtunE
alavAnitO varNintunE
చరణం
charaNam 1
మనోరధకారుడే ఘన
వినోదిత ధీరుడే
పకదానింటిలో చేరడే
manOradhakAruDE ghana
vinOdita dhIruDE
pakadAnimTilO chEraDE
చరణం
charaNam 2
జవ్వన రాడాయనే
మంచి పువ్వుల ఇంకేలనే
సొగసెవ్వరు జూచెదరే
javvana rADAyanE
mamchi puvvula imkElanE
sogasevvaru jUchedarE
చరణం
charaNam 3
చేడేరు చామంతృడే కృప
చూడామణి చంద్రుడే చెలి
నేడైన రాడాయనే
chEDEru chAmamtRDE kRpa
chUDAmaNi chamdruDE cheli
nEDaina rADAyanE
Look up on youtube – could be popular

#256 ఏలరా నాపై ElarA nApai

Titleఏలరా నాపైElarA nApai
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకాపిkApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏలరా నాపై చలమేలరా నా సామిElarA nApai chalamElarA nA sAmi
అనుపల్లవి anupallaviనంచుక నన్నేలని వంచెన తెలిసి ఆ
పంచ కరుడించు విలువంచి
గురియుం చేరనే
namchuka nannElani vamchena telisi A
pamcha karuDimchu viluvamchi
guriyum chEranE
చరణం
charaNam 1
జాలము వెలయు గుణశీల నీపై మోహము
తాళజాల చామభూపాల కరుణాయవాల
jAlamu velayu guNaSIla nIpai mOhamu
tALajAla chAmabhUpAla karuNAyavAla

#255 ఇందు నిలచింది imdu nilachimdi

Titleఇందు నిలచిందిimdu nilachindi
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి pallaviఇందు నిలచింది నీ ఇందుముఖి నా సామిimdu nilachimdi nI imdumukhi nA sAmi
అనుపల్లవి anupallaviఅందము ఇందాయక పదము
నన్నేలర గల్లెనగా సుందరీమణి
amdamu imdAyaka padamu
nannElara gallenagA sumdarImaNi
చరణం
charaNam 1
రామహొయలు మీరగ
నగుమోము సోం పరాకు
చామ రాజేంద్ర తామరస నయన
కామకేళి గూడి ప్రేమతోను కోమలాంగి
rAmahoyalu mIraga
nagumOmu sOm pArAku
chAma rAjEmdra tAmarasa nayana
kAmakELi gUDi prEmatOnu kOmalAmgi

#254 ఇది యేమో idi yEmO

Titleఇది యేమోidi yEmO
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇది యేమో వలబాయెనే
ఈ వేళ రాడాయెనే
సదయుడు ఏమో ఈ వేళ రాడాయనే
idi yEmO valabAyenE
I vELa rADAyenE
sadayuDu EmO I vELa rADAyanE
అనుపల్లవి anupallaviసరోజముఖి విరోధమెంచుచు
పరాకు జేయుచు నిరాకరించే
sarOjamukhi virOdhamemchuchu
parAku jEyuchu nirAkarimchE
చరణం
charaNam 1
తామరసాక్షిరో చామరాజేంద్రుడు
ఏ మాయలాడిని కామించెనో
tAmarasAkshirO chAmarAjEmdruDu
E mAyalADini kAmimchenO

#253 కోపమెటుల kOpameTula

TitleకోపమెటులkOpameTula
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకేదారగౌళkEdAragauLa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviకోపమెటుల రాకయుండును రా
కోమలాంగ నీపై
kOpameTula rAkayumDunu rA
kOmalAmga nIpai
అనుపల్లవి anupallaviపాపియింటనే కాపురమై నీ రూపము
కంటికి జూపక యుండిన
pApiyimTanE kApuramai nI rUpamu
kamTiki jUpaka yumDina
చరణం
charaNam 1
నిన్నటి రాత్రి నిన్నిటు రమ్మని
విన్నపమిచ్చి మా కన్యను బంపితే
చిన్ననాటి నా నేస్తము నెంచకా
చిన్నది మెచ్చన నన్న మాటలు విన
ninnaTi rAtri ninniTu rammani
vinnapamichchi mA kanyanu bampitE
chinnanATi nA nEstamu nemchakA
chinnadi mechchana nanna mATalu vina
చరణం
charaNam 2
కాసుకుకాని యా దాసితోను పరిహాసమాడుచు నుల్లాసమై పయ్యెద దీసి
తిన్నగ మూసి ముద్దిడు నీ
సరసంబులు మోసము నేలిన
kAsukukAni yA dAsitOnu parihAsamADuchu nullAsamai payyeda dIsi
tinnaga mUsi muddiDu nI
sarasambulu mOsamu nElina
చరణం
charaNam 3
వేమరు వేడిన నీ మనసంత యారామపాల్ జేసి విరాముడై వేడ్కతో
కాముకేళి యాలేమగూడిన చామభూపాల
నే నీ మమతలు విన
vEmaru vEDina nI manasamta yArAmapAl jEsi virAmuDai vEDkatO
kAmukELi yAlEmagUDina chAmabhUpAla
nE nI mamatalu vina
Audio Linkhttps://www.youtube.com/watch?v=YVryeUtO9R8

#252 కాంతునికి దెల్పవే kAmtuniki delpavE

Titleకాంతునికి దెల్పవేkAntuniki delpavE
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి
pallavi
కాంతునికి దెల్పవే నా ప్రియkAmtuniki delpavE nA priya
అనుపల్లవి anupallaviఅంతరంగమందు నా చింత
వినర దాన నీ ప్రియ
amtaramgamamdu nA chimta
vinara dAna nI priya
చరణం
charaNam 1
చుక్కల దొరె తనకక్కన పూవెన్నల
నెక్కువును కించగ సొక్కితినె రక్కితిన
chukkala dore tanakakkana pUvennala
nekkuvunu kimchaga sokkitine rakkitina
చరణం
charaNam 2
తామసము ఏలనే సోమముఖి సునాసదృని
సామమెల్ల దెలిసిన మా చామ రాజేంద్రుడు ప్రియ
tAmasamu ElanE sOmamukhi sunAsadRni
sAmamella delisina mA chAma rAjEmdruDu priya

#250 మేరగాదు mEragAdu

TitleమేరగాదుmEragAdu
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaఅటాణaTANa
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మేరగాదు లేచి రారా
ఏరా నా సామి
mEragAdu lEchi rArA
ErA nA sAmi
అనుపల్లవి anupallaviనారీమణి కోరి నిన్ను
దారి చూచుచున్నదిరా
nArImaNi kOri ninnu
dAri chUchuchunnadirA
చరణం
charaNam 1
కుందకారి నిబ్బరించినంత
నేడు నొప్పింపుట అందమా నీకు చందమా
అందమని సంద నోర్వ
ఏవేళను తాళనుర
kumdakAri nibbarimchinamta
nEDu noppimpuTa amdamA nIku chamdamA
amdamani samda nOrva
EvELanu tALanura
చరణం
charaNam 2
పాప సురచాప శరచాపయుత కోప నాపై
కోపమా ప్రలాపమా
ప్రతాప శ్రీ చామభూప నీకు
pApa surachApa SarachApayuta kOpa nApai
kOpamA pralApamA
pratApa SrI chAmabhUpa nIku

#249 దాని సరిసమాని dAni sarisamAni

Titleదాని సరిసమాని (స్వరపదం)dAni sarisamAni (swarapadam)
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaతోడిtODi
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి
pallavi
దాని సరిసమాని దారిని గానరాdAni sarisamAni dArini gAnarA
అనుపల్లవి
anupallavi
మాని దాని మన్నింపమని మరి
నిన్ను కోరి శ్రీ బృహదీశ్వర
mAni dAni mannimpamani mari
ninnu kOri SrI bRhadISvara
చరణం
charaNam 1
(మధ్యమ కాలము madhyama kaalamu)
దయ కలిగిన దాతవు యనుచును
దాపున యిక తామరనయన సదా
మదిలోన ధ్యానమున దలచి
తగ్గెది మెగ దానిను కలయను
దానున్నదిర దార సమయముర
daya kaligina dAtavu yanuchunu
dApuna yika tAmaranayana sadA
madilOna dhyAnamuna dalachi
taggedi mega dAninu kalayanu
dAnunnadira dAra samayamura
చరణం
charaNam 2
(మధ్యమ కాలము madhyama kaalamu)
దయ కలిగిన దాతవు యనుచును
తా మదిని సదా నినుం కలయ
దాని వెతగు దాని కౌగిటకు
దారతమిని దాన్వ రాదురని
దానవనుచు తామనసు కలిగి
దాని గూడు ధరణీ పాల యిక
daya kaligina dAtavu yanuchunu
tA madini sadA ninum kalaya
dAni vetagu dAni kaugiTaku
dAratamini dAnva rAdurani
dAnavanuchu tAmanasu kaligi
dAni gUDu dharaNI pAla yika

#248 లింగా నీకిదె limgA nIkide

Titleలింగా నీకిదె (ప్రతి) మంగళంlimgA nIkide (prati) mamgaLam
Written By
BookprAchIna-navIna
రాగం rAgaఆనందభైరవిAnandabhairavi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
లింగా నీకిదె మంగళం వృషతు
రంగా నీకిదె మంగళం
limgA nIkide mamgaLam vRshatu
ramgA nIkide mamgaLam
చరణం
charaNam 1
లింగా వృషభతురంగా చక్రవిభంగా
కరుణాంతరంగ జయశివ
limgA vRshabhaturamgA chakravibhamgA
karuNAmtaramga jayaSiva
చరణం
charaNam 2
వృత్రాసురహర స్తోత్ర భవ్యచారిత్రా
పరమపవిత్రా పురహర
vRtrAsurahara stOtra bhavyachAritrA
paramapavitrA purahara
చరణం
charaNam 3
దక్ష పాపవిమోక్షా జ్ఞానపరోక్షా
భక్త సంరక్షా ఫాలాక్ష
daksha pApavimOkshA jnAnaparOkshA
bhakta sam^rakshA phAlAksha
చరణం
charaNam 4
సోమా రేపలెధామా సంగరభీమ
నిర్జితకామ రామేశ
sOmA rEpaledhAmA samgarabhIma
nirjitakAma rAmESa
చరణం
charaNam 5
నాగభూషణ భోగనుతపాల
భాగానిలయశ్రీ భోగి కంకణ
nAgabhUshaNa bhOganutapAla
bhAgAnilayaSrI bhOgi kamkaNa
ప్రాచీన జావళీలు సంపూర్ణము

With this, we completed sharing all the works from the book – “prAchIna-navIna jAvaLIlu”
Next one will be from a different, old book.

#247 రంగా నీకిదె ramgA nIkide

Titleరంగా నీకిదెramgA nIkide
Written By
BookprAchIna-navIna
రాగం rAgaఆనందభైరవిAnamdabhairavi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
రంగా నీకిదె మంగళం జయ
రంగా ఖగరాత్తు రంగా కలుసావిభంగా
నవమోహనాంగా వయ్యారి
ramgA nIkide mangaLam jaya
ramgA khagarAttu ramgA kalusAvibhamgA
navamOhanAmgA vayyAri
చరణం
charaNam 1
హరివిభుదా విహారి ఉభయ
కావేరీ తీర విహారి వయ్యారి
harivibhudA vihAri ubhaya
kAvErI tIra vihAri vayyAri
చరణం
charaNam 2
అన్నా యితరుల నెన్నా యెవరు నీకన్నా నను బ్రోవుమన్నా వయ్యారిannA yitarula nennA yevaru nIkannA nanu brOvumannA vayyAri
చరణం
charaNam 3
లీలా శేషాంశు సీలా కరుణాలవాల
జగపరిపాల వయ్యారి
lIlA SEshAmSu sIlA karuNAlavAla
jagaparipAla vayyAri
చరణం
charaNam 4
అయ్యావరమకీయ్యా నిను నమ్మితయ్యా నను బ్రోవుమయ్యా వయ్యారిayyAvaramakIyyA ninu nammitayyA nanu brOvumayyA vayyAri
చరణం
charaNam 5
హాసా వన చిద్విలాసా శేషాచల
దాసార్చిత పరమేశా వయ్యారి
hAsA vana chidvilAsA SEshAchala
dAsArchita paramESA vayyAri