1252 తత్తర పడనేల tattara paDanEla

Titleతత్తర పడనేలtattara paDanEla
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893dAsu1893
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఅటaTa
పల్లవి pallaviతత్తర పడనేల తాళు తాళుర సామి
అత్తింటి కోడాలరా
tattara paDanEla tALu tALura sAmi
attinTi kODAlarA
అనుపల్లవి anupallaviకొత్తగా నే వచ్చి కొన్ని నాళ్ళాయెరా
పొత్తు గడియ మరిచి పోరు మావారు
చిత్తమున నేరమెంచకురా చీకటి వేళ గాదురా
అత్త గారింట లేకున్నపుడైన రావైతిరివిర సామి ॥తత్తర॥
kottagA nE vachchi konni nALLAyerA
pottu gaDiya marichi pOru mAvAru
chittamuna nEramenchakurA chIkaTi vELa gAdurA
atta gArinTa lEkunnapuDaina rAvaitirivira sAmi ~||tattara~||
చరణం
charaNam 1
మక్కువ చెక్కిలి నొక్కకురా సామి
నొక్కులెక్కడ దాతురా
అక్కడ నున్నది యదిగో యాడబిడ్డ
యిక్కథ లెరిగిన నెగిరి పయిబడు సామి
నిక్కముగ నీకె దక్కితిరా నేటి మాపటికి రాపోరా
పక్కనీ పంచాది గది వెలుపల తలుపు మూయకుంచెదరా ॥తత్తర॥
makkuva chekkili nokkakurA sAmi
nokkulekkaDa dAturA
akkaDa nunnadi yadigO yADabiDDa
yikkatha lerigina negiri payibaDu sAmi
nikkamuga nIke dakkitirA nETi mApaTiki rApOrA
pakkanI panchAdi gadi velupala talupu mUyakunchedarA ~||tattara~||
చరణం
charaNam 2
కౌగిటికిది వేళ గాదుర
నీకింత కక్కూర్తి పని యేమిరా
బాగు బాగు రవిక బట్టి నీ గోల్లతో
లాగిన పికిలె నేలాగు బొంకెదురా
కాగలదురా నీవు కోరిన కార్య మది యొక జాము లోపల
రాగదర మాపటికి మా లోగిటికి పడమట కిటికి దారిని ॥తత్తర॥
kaugiTikidi vELa gAdura
nIkinta kakkUrti pani yEmirA
bAgu bAgu ravika baTTi nI gOllatO
lAgina pikile nElAgu bonkedurA
kAgaladurA nIvu kOrina kArya madi yoka jAmu lOpala
rAgadara mApaTiki mA lOgiTiki paDamaTa kiTiki dArini ~||tattara~||
చరణం
charaNam 3
వల్ల గాదుర తోట్ల వల్లూరి వేణు
గోపాల తగదు తగదురా
చల్లని పన్నీరు చల్లి యత్తరు
దేహ వల్లి బూసెదు మూయ వశమా వాసనలు
సల్లలిత దాసు శ్రీరాముని కృతి
నిల్ల సిల్లితివిరా మది మనమెల్ల్ల
గుంతలెవ్వారు జూచిన నల్లరికి మూలమగు సామి ॥తత్తర॥
valla gAdura tOTla vallUri vENu
gOpAla tagadu tagadurA
challani pannIru challi yattaru
dEha valli bUsedu mUya vaSamA vAsanalu
sallalita dAsu SrIrAmuni kRti
nilla sillitivirA madi manamellla
guntalevvAru jUchina nallariki mUlamagu sAmi ~||tattara~||

Somehow, chose not to post this earlier! Book refers to this as “SRngAra padyamu”

1194 న్యాయము గాదురా nyAyamu gAdurA

Titleన్యాయము గాదురాnyAyamu gAdurA
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaరీతిగౌళrItigouLa
తాళం tALaమిశ్ర చాపు (?)miSra chApu (?)
పల్లవి pallaviన్యాయము గాదురా తోయజాక్షnyAyamu gAdurA tOyajAksha
అనుపల్లవి anupallaviమాయలాడి మాటచే నంబాయుట నీకు (నీదు)mAyalADi mATachE nanbAyuTa nIku (nIdu)
చరణం
charaNam 1
కానుక నా చానచే పంపి నిను వేడుకొని
నే రానని నాతో నీవు పోపోవే యనుట
kAnuka nA chAnachE pampi ninu vEDukoni
nE rAnani nAtO nIvu pOpOvE yanuTa
చరణం
charaNam 2
తాళలేరా శ్రీ లలనా పాలుని బారికిక
నన్నేలుకోరా పాలక రా తాళవాధీప
tALalErA SrI lalanA pAluni bArikika
nannElukOrA pAlaka rA tALavAdhIpa
AV Linkshttps://www.youtube.com/watch?v=i59ps0TlVjI

Audio link found at https://www.sangeethamshare.org/vijayagopal/UPLOADS-001-200/121-Rama_Ravi-Vocal/ (Track URL is https://www.sangeethamshare.org/vijayagopal/UPLOADS-001-200/121-Rama_Ravi-Vocal/?track=Track%3A%2004%20-%20Nyayamugadura%20-%20Reetigaula_Javali%20-%20Sangeethapriya , and one needs to login with Google to listen to this!)

1184 చాలు చాలు చాలు పోరా chAlu chAlu chAlu pOrA

Titleచాలు చాలు చాలు పోరాchAlu chAlu chAlu pOrA
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Found Athttps://www.youtube.com/live/0deEKFe6VAg?si=Jp0_VtaW2uwVeBn7&t=6382
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALa
పల్లవి pallaviచాలు చాలు చాలు పోరా (సరసము)chAlu chAlu chAlu pOrA (sarasamu)
వాలుకంటి యైన నన్ను తాళ లేక చూచి వచ్చి
వాలుకంటి యైన నన్ను తాళ లేక చూచివి
చాల మాటలాడి కన్ను సైగ చేసి చేసినంత
vAlukanTi yaina nannu tALa lEka chUchi vachchi
vAlukanTi yaina nannu tALa lEka chUchivi
chAla mATalADi kannu saiga chEsi chEsinanta
నేను ధర్మపురీశుడని మానమెరుగ వర్ణించి
కానుకలే ఇవ్వకుండ కాన్పు సేయ వటుల చేయ
nEnu dharmapurISuDani mAnameruga varNinchi
kAnukalE ivvakunDa kAn&pu sEya vaTula chEya

1183 రా రమ్మని rA rammani

Titleరా రమ్మనిrA rammani
Written Byపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్paTnam subrahmaNya ayyar
Found Athttps://www.youtube.com/watch?v=-YAKY0w_pR4
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviరా రమ్మని పిలచితినీ బిగువాడరా (ఇటు)rA rammani pilachitinI biguvADarA (iTu)
అనుపల్లవి anupallaviమారుని శరమున బారి పడి (ఇటు)mAruni Saramuna bAri paDi (iTu)
చరణం
charaNam 1
శ్రీకరుణకు ప్రతివాది భయంకర
శ్రీ వేంకటేశా ఆశ్రిత జన పోషా (ఇటు)
SrIkaruNaku prativAdi bhayankara
SrI vEnkaTESA ASrita jana pOshA (iTu)

1182 ఎంతనే entanE

Titleఎంతనే entanE
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Found Athttps://www.rasikas.org/forums/viewtopic.php?p=286094#p286094
రాగం rAgaకేదారkEdAra
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఎంతనే వర్ణింతునె సఖి ఆ కాంతు కేళినిentanE varNintune sakhi A kAntu kELini
అనుపల్లవి anupallaviకాంతుడు ఏకాంతమందు గిలిగింత జేసిన వింతలెల్లనుkAntuDu EkAntamandu giliginta jEsina vintalellanu
చరణం
charaNam 1
ప్రీతి మీర నా లేత చన్నుల నాతురంబున తా ఇరు
చేత నుంచి సాతిషయము గాక దొబ్బిన రీతినెల్లను
prIti mIra nA lEta channula nAturambuna tA iru
chEta nunci sAtishayamu gAka dobbina rItinellanu
చరణం
charaNam 2
జీవరత్నము దేవి నీవంటు బాయరాదని నా తను-
నీవి నీవి దిచ్చి నా మోవి ఆనిన భావమెల్లను
jIvaratnamu dEvi nIvanTu bAyarAdani nA tanu-
nIvi nIvi dicci nA mOvi Anina bhAvamellanu
చరణం
charaNam 3
చాలు మన్న నాలకించక తాలవనేషుడు మన-
సేల నుండి రాదుడై రతికేలి సల్పిన లీలలెల్లను
cAlu manna nAlakincaka tAlavanEshuDu mana-
sEla nunDi rAduDai ratikEli salpina lIlalellanu
AV Linkhttps://www.youtube.com/watch?v=1Oav7Mn5bNU
https://www.youtube.com/watch?v=ZJ6gGgwg_EU

1178 ఓ చెలీ O chelI

Titleఓ చెలీO chelI
Written Byడా. వసంత్ కిరణ్ Dr. vasant kiraN
Found At
https://www.youtube.com/watch?v=hoSvEy-mQs0
రాగం rAgaశుధ్ధ సావేరిSuddhha sAvEri
తాళం tALa????
పల్లవి pallaviఓ చెలీ నా మాట వినవే
ఈ కోపము ఇంకేలనే
(ఈ కోపమింకేలనే)
O chelI nA mATa vinavE
I kOpamu inkElanE
(I kOpaminkElanE)
చరణం
charaNam 1
ముగ్ధవై ఆటలాడి మధ్యవై మనసునిచ్చి
ప్రగల్భవై సరసము లాడినా నాపై (ఈ కోపము)
mugdhavai ATalADi madhyavai manasunichchi
pragalbhavai sarasamu lADinA nApai (I kOpamu)
చరణం
charaNam 2
అలక నీకు సౌందర్యము కోపము అతి అందము
నీ వలలో నేనైక్యము వసంత గోపాలుడు నీ సొంతము
alaka nIku soundaryamu kOpamu ati andamu
nI valalO nEnaikyamu vasanta gOpAluDu nI sontamu

1177 బాలెంతరాలను bAlentarAlanu

TitleబాలెంతరాలనుbAlentarAlanu
Written Byపువ్వాడ శ్రీ రామదాసుpuvvADa SrI rAmadAsu
Bookమువ్వ వేణుగోపాల స్వామి కీర్తనలుmuvva vENugOpAla swAmi kIrtanalu
రాగం rAgaకమాచ్kamAch
తాళం tALaఆదిAdi
బాలింత రాలనురా కృష్ణ – అల్ల
పని కోర్వ జాలనురా
వల్లగాదు పోపోర కృష్ణ – మళ్ళి
నెల వెళ్ళితె చూతమురా
bAlinta rAlanurA kRshNa – alla
pani kOrva jAlanurA
vallagAdu pOpOra kRshNa – maLLi
nela veLLite chUtamurA
కల్లగాదు పోరా కృష్ణ – మూడు
నెల లిటు రాబోకు పదరా
వల్లగాదు పురిటిల్లు దేహము చాల
వెల్లుల్లి వాసన వేయుచున్నదిరా
kallagAdu pOrA kRshNa – mUDu
nela liTu rAbOku padarA
vallagAdu puriTillu dEhamu chAla
vellulli vAsana vEyuchunnadirA
మగనాలి కాదటరా కృష్ణ – పట్ట
పగలిటు రాబోకు పదరా
ఖగరాజ గమన! కృష్ణ! మా
మగవారు వింటేను నగుబాటు లగురా
maganAli kAdaTarA kRshNa – paTTa
pagaliTu rAbOku padarA
khagarAja gamana! kRshNa! mA
magavAru vinTEnu nagubATu lagurA
మకురు తనమేలరా కృష్ణ! నాపయి
మక్కువ నీకేలరా యింత –
అక్కున చేర్చి నన్నల్లట నొక్కిన చాలా
ముక్కులు మిగిలి పాలెక్కువగునురా స్వామి
makuru tanamElarA kRshNa! nApayi
makkuva nIkElarA yinta –
akkuna chErchi nannallaTa nokkina chAlA
mukkulu migili pAlekkuvagunurA swAmi
— (అసంపూర్ణం) — –incomplete —
AV Link
https://www.youtube.com/watch?v=K6_uTgdD_1A

1172 నేర మోర nEra mOra

Titleనేర మోరnEra mOra
Written By
Found Athttps://www.youtube.com/watch?v=OOj0eujG14M
రాగం rAgaహంసధ్వనిhamsadhwani
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviనేర మోర జార చోర మారుబల్కరాnEra mOra jAra chOra mArubalkarA
అనుపల్లవి anupallaviసారె సారెకు సారసాక్షుని
దారిని జూచిన అందము వినరా
sAre sAreku sArasAkshuni
dArini jUchina andamu vinarA
చరణం
charaNam 1
చెంత రా రా అని ఎంత నే వేడిన
పంతము-లాడితివీ?
చెంత జేరి బలవంతముగా
గిలిగింతలు జేసిన అందము వినరా
chenta rA rA ani enta nE vEDina
pantamu-lADitivI ?
chenta jEri balavantamugA
giligintalu jEsina andamu vinarA

1162 మరియాద mariyAda

TitleమరియాదmariyAda
Written Byశ్రీ చామరాజేంద్రSrI chAmarAjEndra
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At1156, 630
పల్లవి pallaviమరియాద తెలియకనె మాటలాడ తగునాmariyAda teliyakane mATalADa tagunA
అనుపల్లవి anupallaviపరిహాసము చేయతగునా వరస గలిని యుంటినేమి
మరియాద తెలియకనె
parihAsamu chEyatagunA varasa galini yunTinEmi
mariyAda teliyakane
చరణం
charaNam 1
సరస సల్లాపమునుకు సమయము లేదేమో
సరసీజాక్షి నావంటి సతులు గూడియుండి
నపుడు మరియాద తెలియకనె
sarasa sallApamunuku samayamu lEdEmO
sarasIjAkshi nAvanTi satulu gUDiyunDi
napuDu mariyAda teliyakane
చరణం
charaNam 2
తరుణిరో చామరాజ ధరణీపుడెంతో
పరవశమై నా సామి మాటాడించినపుడు
taruNirO chAmarAja dharaNIpuDentO
paravaSamai nA sAmi mATADinchinapuDu

1161 చలినెట్ల chalineTla

Titleచలినెట్లchalineTla
Written Byశ్రీ చామరాజేంద్రSrI chAmarAjEndra
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaజంజూటిjanjUTi
తాళం tALaఆదిAdi
Previously Posted At677, 257
పల్లవి pallaviచలినెట్ల సైరింతునె అలవాడెంత గావించనెchalineTla sairintune alavADenta gAvinchane
చరణం
charaNam 1
మనోహర కారుడే ఘనం వినోదియు
ధీరడె పోగిదా నాంటిలో చేరనె
manOhara kAruDE ghanam vinOdiyu
dhIraDe pOgidA nAnTilO chErane
చరణం
charaNam 2
జవ్వని రాడాయనే మంచి పూవ్వాలు యింకేలనె
సొగసెవ్వారు జూచేరే
javvani rADAyanE manchi poovvAlu yinkElane
sogasevvAru jUchErE
చరణం
charaNam 3
శ్రీమేరు చామేంద్రుడె నృప చూడామణి చంద్రుడె
సఖి నెడైన రాడాయనె
SrImEru chAmEndruDe nRpa chUDAmaNi chandruDe
sakhi neDaina rADAyane
May need to review all 3 versions to get better.