| Title | కాశికి పొయ్యేనే | kASiki poyyEnE |
| Written By | ||
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | కాశికి పొయ్యేనే నీ వల్లనే కాశికి పొయ్యేనే వోశోశి నా | kASiki poyyEnE nI vallanE kASiki poyyEnE vOSOSi nA |
| మదియున్నదంట నీదు ఆశలెల్ల నిరాశ జేసుకుంటినే | madiyunnadamTa nIdu ASalella nirASa jEsukumTinE | |
| చరణం charaNam 1 | యే తీరునైనాను ప్రీతి సేయుదువని పాతకి నే చాలభ్రమసి తిరుగుచుంటి రాతి మనసుగల నాతి నీవనుచును నే తెలియక మోసపోతి వేసారితి | yE tIrunainAnu prIti sEyuduvani pAtaki nE chAlabhramasi tiruguchumTi rAti manasugala nAti nIvanuchunu nE teliyaka mOsapOti vEsAriti |
| చరణం charaNam 2 | చక్కగాను నీవు సంతోషముగ నాతొ వొక్క మాటాడిన తక్కువటే నాతొ ఇక్కడి భ్రాంతిచే ఇల్లాలిని బాసి దిక్కు దెసయులేక తిరిగి తిరిగి రోసి | chakkagAnu nIvu samtOshamuga nAto vokka mATADina takkuvaTE nAto ikkaDi bhrAmtichE illAlini bAsi dikku desayulEka tirigi tirigi rOsi |
| చరణం charaNam 3 | ముద్దుగుమ్మ మనమిదరముంగూడి ముద్దునటేశ్వర మూర్తికి తెలుసును నుధ్ధరించుటకైన సుదతిరో తలచక పద్దుజేసి నాతో పలుకవు మదిచెడి | muddugumma manamidaramumgUDi muddunaTESwara mUrtiki telusunu nudhdharimchuTakaina sudatirO talachaka paddujEsi nAtO palukavu madicheDi |
Tag: Telugu
#54 ఎంతొ నెరజాణుడమ్మా emto nerajANuDammA
| Title | ఎంతొ నెరజాణుడమ్మా | emto nerajANuDammA |
| Written By | ||
| రాగం rAga | చామరం | chAmaram |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | ఎంతొ నెరజాణుడమ్మా యశొదా నీ కొడుకెంతొ నెరజాణుడమ్మా | emto nerajANuDammA yaSodA nI koDukemto nerajANuDammA |
| చరణం charaNam 1 | ఎక్కడివి యీ కమ్మలు చక్కగను లేదనుచు టక్కుగ నా చెంతచేరి చెక్కిలిని నొక్కెగదె | ekkaDivi yI kammalu chakkaganu lEdanuchu Takkuga nA chemtachEri chekkilini nokkegade |
| చరణం charaNam 2 | కాటుక కన్నుల నులగడు నీటుగ లేదనుచును గోట కనుగీటి పట్టు నోట ముద్దు బెట్టెగదే | kATuka kannula nulagaDu nITuga lEdanuchunu gOTa kanugITi paTTu nOTa muddu beTTegadE |
| చరణం charaNam 3 | తామిచ్చె రమ్మని తలుపు వోరగ జేసియా బాయను నా చనుదోయి చయ్యన నను బట్టెగదె | tAmichche rammani talupu vOraga jEsiyA bAyanu nA chanudOyi chayyana nanu baTTegade |
| చరణం charaNam 4 | మానినుల నిట్టు సేయమాన్యయని పలుక మానమేది చూపుమని మానిని కొంగీడ్వాసాగె | mAninula niTTu sEyamAnyayani paluka mAnamEdi chUpumani mAnini komgIDvAsAge |
#53 అలవాని alavAni
| Title | అలవాని | alavAni |
| Written By | ||
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | అలవాని నేరాలేమే అతివరో | alavAni nErAlEmE ativarO |
| చరణం charaNam 1 | తొలుత తొలుత నే నాదను వలపించుక లేక యున్న చెలి నా బలవంతమునను చెలువుని పైకొనియుండగ | toluta toluta nE nAdanu valapimchuka lEka yunna cheli nA balavamtamunanu cheluvuni paikoniyumDaga |
| చరణం charaNam 2 | దుడుగు మనము వానిపైని ముడివడ దడబడి వానితో కడువడి నేస్తము చేసితి ఘనుని సేతలే నెరుగక | duDugu manamu vAnipaini muDivaDa daDabaDi vAnitO kaDuvaDi nEstamu chEsiti ghanuni sEtalE nerugaka |
| చరణం charaNam 3 | సందు దొరికినప్పుడు నా సరసునికీ వాసవతీ యెవతొ మందు యెందు బెట్టెనొ నీ మనసిటు గొంతయు గూడదు | samdu dorikinappuDu nA sarasunikI vAsavatI yevato mamdu yemdu beTTeno nI manasiTu gomtayu gUDadu |
#52 కామిని నిను గోరెనా kAmini ninu gOrenA
| Title | కామిని నిను గోరెనా | kAmini ninu gOrenA |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | కామినినిను గోరెనా కాదనక చేకోరా | kAminininu gOrenA kAdanaka chEkOrA |
| చరణం charaNam 1 | ఘనమగు తమిచెంది కాసిలు అలచలువ చెలువ | ghanamagu tamichemdi kAsilu alachaluva cheluva |
| చరణం charaNam 2 | మదన ప్రదరకర మెదగురి కొన విదళిత మతియయి | madana pradarakara medaguri kona vidaLita matiyayi |
| చరణం charaNam 3 | సిక రాజచంద్ర ప్రసిధ్ధి ముసరు మోహమున | sika rAjachamdra prasidhdhi musaru mOhamuna |
#51 మోడిసేయ mODisEya
| Title | మోడిసేయ | mODisEya |
| Written By | ||
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | మోడిసేయ న్యాయమా చాడి దండి సవితిమాట చవిగొని నెలరెల్ల వదలి | mODisEya nyAyamA chADi damDi savitimATa chavigoni nelarella vadali |
| చరణం charaNam 1 | మారు బారిబారి నీదు మరుగు గోరి మమత మెయిని సారె సారెకు నిను వేడిన చాలు చాలు నను గూడక | mAru bAribAri nIdu marugu gOri mamata meyini sAre sAreku ninu vEDina chAlu chAlu nanu gUDaka |
| చరణం charaNam 2 | నెలవెన్నెల వేడిమిచే విలుతతి వెదల జెంది చలువుడు రా భాగ్యమబ్బ గలద నీ మది నెంచి బల్ | nelavennela vEDimichE vilutati vedala jemdi chaluvuDu rA bhAgyamabba galada nI madi nemchi bal |
#47 కాసాని చెలి kAsAni cheli
| Title | కాసాని చెలి | kAsAni cheli |
| Written By | ||
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కాసాని చెలినే గాదటరా నీ బాసలెల్ల యే మాయనురా | kAsAni chelinE gAdaTarA nI bAsalella yE mAyanurA |
| చరణం charaNam 1 | సారెకు నా సరివారి యెదుట నిన్ను రారా రాయని బిలచి | sAreku nA sarivAri yeduTa ninnu rArA rAyani bilachi |
| చరణం charaNam 2 | ఆ సతులతో బరియాసము సలుపక రోసముతో యోరోరి యని బిలిచిన | A satulatO bariyAsamu salupaka rOsamutO yOrOri yani bilichina |
| చరణం charaNam 3 | రేపగలని భేదములెంచక నీపైగొని ఉపరతులను సలుపక | rEpagalani bhEdamulemchaka nIpaigoni uparatulanu salupaka |
| చరణం charaNam 4 | ధర్మపురిని నెలకొన్న శ్రీపరవాసు నిర్మలమగు వేంకటేశుని సాక్షిగ | dharmapurini nelakonna SrIparavAsu nirmalamagu vEmkaTESuni sAkshiga |
#46 మనకేలానె manakElAne
| Title | మనకేలానె | manakElAne |
| Written By | ||
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | మనకేలానె లేని పోని మాటలు మనకేలానే | manakElAne lEni pOni mATalu manakElAnE |
| చరణం charaNam 1 | కనికరమున తా వినయము నెంచక మనసున ప్రియింప | kanikaramuna tA vinayamu nemchaka manasuna priyimpa |
| చరణం charaNam 2 | కాముని కేళిలొ సోమజ చంద్రుని తలచినదేయల | kAmuni kELilo sOmaja chamdruni talachinadEyala |
| చరణం charaNam 3 | వేమరొ సురపురి వేణుగోపాలుని కలసినదేయల | vEmaro surapuri vENugOpAluni kalasinadEyala |
#45 ఎటువలె యెటువలె eTuvale yeTuvale
| Title | ఎటువలె యెటువలె | eTuvale yeTuvale |
| Written By | ||
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | ఎటువలె యెటువలె సైచుదు నే విరహము | eTuvale yeTuvale saichudu nE virahamu |
| చరణం charaNam 1 | ఇంతిరో విరహము యెంతని యోర్తునె కాంతునీ బారికి కలయ రమ్మనుమనె | imtirO virahamu yemtani yOrtune kAmtunI bAriki kalaya rammanumane |
| చరణం charaNam 2 | కుటిలాలకి నీ కోపము మానవే విటకానిని నా విడిదిగి తేగదే | kuTilAlaki nI kOpamu mAnavE viTakAnini nA viDidigi tEgadE |
| చరణం charaNam 3 | వేమరో సురపురి వేణుగోపాలుని కాముని కేళికి కలవర మందితి | vEmarO surapuri vENugOpAluni kAmuni kELiki kalavara mamditi |
#44 సామికి తెలిపే sAmiki telipE
| Title | సామికి తెలిపే | sAmiki telipE |
| Written By | ||
| రాగం rAga | దేశీయ తోడి | dESIya tODi |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | సామికి తెలిపేవారెవరే కాముని బారికి వోరుపలేనే | sAmiki telipEvArevarE kAmuni bAriki vOrupalEnE |
| చరణం charaNam 1 | కూరిమి దానితో గూడి యుండేటి వేళ నా మాలిమితో నన్నేలిన బాలా గోపాలునకు యీ జాలము తగదని తగదని నా | kUrimi dAnitO gUDi yumDETi vELa nA mAlimitO nannElina bAlA gOpAlunaku yI jAlamu tagadani tagadani nA |
| చరణం charaNam 2 | సారెకు దానితో సరసము లాడుట మేరగాదని నా మేలువానితో నేడునా | sAreku dAnitO sarasamu lADuTa mEragAdani nA mEluvAnitO nEDunA |
| చరణం charaNam 3 | వేమరొ సురపురి వేణు గోపాలుని కామునికేళికి కలయ రమ్మనుమని నా | vEmaro surapuri vENu gOpAluni kAmunikELiki kalaya rammanumani nA |
#43 వాని యెడబాసి vAni yeDabAsi
| Title | వాని యెడబాసి | vAni yeDabAsi |
| Written By | ||
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వాని యెడబాసి నేనెటు లోర్తునే చెలి కాని వారితో గూడి కనబడడె చెలి | vAni yeDabAsi nEneTu lOrtunE cheli kAni vAritO gUDi kanabaDaDe cheli |
| చరణం charaNam 1 | ఇచ్చలతో నన్ను నిండు కౌగలించి మచ్చిక చేసినది మరచెగదే చెలి | ichchalatO nannu nimDu kaugalimchi machchika chEsinadi marachegadE cheli |
| చరణం charaNam 2 | చిన్న వయసు నుండి జేరి నాతో తన చిన్నెలు జూపినను చిన్నబుచ్చెనే చెలి | chinna vayasu numDi jEri nAtO tana chinnelu jUpinanu chinnabuchchenE cheli |
| చరణం charaNam 3 | ధరవెలయు శ్రీరంగధాముడు ననుగూడి నిరతము బాయనని ఆనబెట్టెనే చెలి | dharavelayu SrIramgadhAmuDu nanugUDi niratamu bAyanani AnabeTTenE cheli |