| Title | ఇంతే మోహము | intE mOhamu |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | మధ్యమావతి | madhyamAvati |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | ఇంతే మోహము లేని దిపుడు తెలిసె గదరా | intE mOhamu lEni dipuDu telise gadarA |
| అనుపల్లవి anupallavi | పంతగించి మువ్వ గోపాల రావైతివి | pantaginchi muvva gOpAla rAvaitivi |
| చరణం charaNam 1 | నీవు వచ్చిన మొదలు నిమిషమే యుగముగా మా వనిత యొంటిగా మదిగుందుచు భావమున దనుదానె పలుమారు నొచ్చుచు ఈ వేళ దాక భుజియించకనె యున్నది | nIvu vacchina modalu nimishamE yugamugA mA vanita yonTigA madigunduchu bhAvamuna danudAne palumAru nocchuchu I vELa dAka bhujiyinchakane yunnadi |
| చరణం charaNam 2 | నెనరైన మమువంటి నెలతలతో చలుకక కను మూసి తానొక గడియ నిద్రింపక గొనబు సొమ్ము బెట్టక కొప్పు చుక్కమునక మనసిజుని కాకచే గనలుచు నున్నది | nenaraina mamuvanTi nelatalatO chalukaka kanu mUsi tAnoka gaDiya nidrimpaka gonabu sommu beTTaka koppu chukkamunaka manasijuni kAkachE ganaluchu nunnadi |
| చరణం charaNam 3 | వలచిన చెలి నెడబాసి యీరీతిగా జలము జేసెదవు నవ్వుల కైన దొలుత గలసిన వాడ విట్ల అలగిన దెల్ల మా నెలత చేసిన పాప ఫలమేమో అకట | valachina cheli neDabAsi yIrItigA jalamu jEsedavu navvula kaina doluta galasina vADa viTla alagina della mA nelata chEsina pApa phalamEmO akaTa |
Author: Javali Lyrics
My mother collected hundreds of jAvaLi lyrics as part of her research on the literary values in jAvaLi. Instead of publishing them as a book, which would have had limited reach, we chose to post them as a blog. Then we found many more lyrics and kept posting...
Lot more can be done - finding notation, links to audio/video, any further corrections, offer a meaning for each word / line,...
Contact us at javaliwebsite@gmail.com
1280 ఇందుకేమి సేతు indukEmi sEtu
| Title | ఇందుకేమి సేతు | indukEmi sEtu |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | పున్నాగ వరాళి | punnAga varALi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఇందుకేమి సేతునమ్మా ఎవరు తోడి తెచ్చెదరమ్మా! | indukEmi sEtunammA evaru tODi tecchedarammA! |
| అనుపల్లవి anupallavi | ఇందు వదన కడప వేంకటేశు డెంత దూరాన నున్నాడో | indu vadana kaDapa vEnkaTESu Denta dUrAna nunnADO |
| చరణం charaNam 1 | ఎక్కువ మోహమున నన్ను నేవేళ గౌగిట జేర్చువా డొక్కడే పవ్వళించి యుండ నోపు నటవె పక్క లోన వెదకి కానక ప్రాణేశుడెంత కలువరించెనో మిక్కిలి విరహ వేదన చేత జక్కని సామికి మేనెంత చిక్కెనో | ekkuva mOhamuna nannu nEvELa gougiTa jErchuvA DokkaDE pavvaLinchi yunDa nOpu naTave pakka lOna vedaki kAnaka prANESuDenta kaluvarinchenO mikkili viraha vEdana chEta jakkani sAmiki mEnenta chikkenO |
| చరణం charaNam 2 | నెలతరో నాకెమ్మెవానక నిమిషమైన దాళలేడు ఏలమి నా పొత్తునే కాని భుజియింప నీల్లుడు తెలియనైతి మా యిద్దరి వలపు దృష్టి నాకె నమ్మలార వలరాజు నన్ను బాధించినట్లనా చెలువుని నేడెంత వెతల బెట్టెనో | nelatarO nAkemmevAnaka nimishamaina dALalEDu Elami nA pottunE kAni bhujiyimpa nIlluDu teliyanaiti mA yiddari valapu dRshTi nAke nammalAra valarAju nannu bAdhinchinaTlanA cheluvuni nEDenta vetala beTTenO |
| చరణం charaNam 3 | పడతిరో మువ్వ గోపాలుడైన కడప వేంకటేశుని గూడి యెడ బాయక యాందునని యెంచుకొంటి తడయకే నొకటి తలచితే దైవమొకటి దలచి నందుకు తోడిబచినే తెగువ జేసిదనంటి తొయ్యలి వాడేమి జేసుకొనునే | paDatirO muvva gOpAluDaina kaDapa vEnkaTESuni gUDi yeDa bAyaka yAndunani yenchukonTi taDayakE nokaTi talachitE daivamokaTi dalachi nanduku tODibachinE teguva jEsidananTi toyyali vADEmi jEsukonunE |
1279 తాళజాలనే ఓ చెలియ tALajAlanE O cheliya
| Title | తాళజాలనే ఓ చెలియ | tALajAlanE O cheliya |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ఆహిరి | Ahiri |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | తాళజాలనే ఓ చెలియ నే తాళజాలనే | tALajAlanE O cheliya nE tALajAlanE |
| అనుపల్లవి anupallavi | బాలరో మువ్వ గోపాలుడ నే గాన | bAlarO muvva gOpAluDa nE gAna |
| చరణం charaNam 1 | నేరమెంచకుమీ యిందరి లోన సారెకు నెంచకుమీ యీ వేళ నన్ను నీరసించకుమీ కౌగిట నన్ను వేరు సేయకుమీ వారిజాక్షిరో నీపై వలచి యున్న నన్ను మేరదలయించ మెలత నినుబాడి | nEramenchakumI yindari lOna sAreku nenchakumI yI vELa nannu nIrasinchakumI kaugiTa nannu vEru sEyakumI vArijAkshirO nIpai valachi yunna nannu mEradalayincha melata ninubADi |
| చరణం charaNam 2 | వద్దికి దావే వేడుక మీర ముద్దు చేటివే కౌగిట నుండి సద్దులాడవే ముద్దుగుమ్మ నీ మోవి తేనె లీయవే ప్రొద్దుపోయె చలమేటికే జాగు చేయకే | vaddiki dAvE vEDuka mIra muddu chETivE kaugiTa nunDi saddulADavE muddugumma nI mOvi tEne lIyavE proddupOye chalamETikE jAgu chEyakE |
| చరణం charaNam 3 | భామలెందైన నెంతైన మది ప్రేమ లేక యుందురా యిట్లు రామ యికనైన మువ్వ గోపాల రమ్మని నన్ను కాముకేళి గూడి గలసి యేలు మీవేళ | bhAmalendaina nentaina madi prEma lEka yundurA yiTlu rAma yikanaina muvva gOpAla rammani nannu kAmukELi gUDi galasi yElu mIvELa |
1278 వేళ గాదుర గడియ vELa gAdura gaDiya
| Title | వేళ గాదుర గడియ | vELa gAdura gaDiya |
| Written By | ?? | ?? |
| Book | ||
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | వేళ గాదుర గడియ తాళుర సామి | vELa gAdura gaDiya tALura sAmi |
| అనుపల్లవి anupallavi | చాలు చాలు పది వేలకైన నిది | chAlu chAlu padi vElakaina nidi |
| చరణం charaNam 1 | పూరక నా పైని నేరమెంచక పొలరుచు మా బావ గారున్నారోయి కూరిమి నా తోడికోడలీ పడకింటి చేరిక యందుండ మేర గాదోయి | pUraka nA paini nEramenchaka polaruchu mA bAva gArunnArOyi kUrimi nA tODikODalI paDakinTi chErika yandunDa mEra gAdOyi |
| చరణం charaNam 2 | ఒద్దికతో మన మిద్దరము కూడి సుద్దులాడుట కిది ప్రొద్దు కాదోయి పద్దు మీరగ నాపవ వారి వద్దనేయీ సుద్ది విన్నంత కొద్ది కాదోయి | oddikatO mana middaramu kUDi suddulADuTa kidi proddu kAdOyi paddu mIraga nApava vAri vaddanEyI suddi vinnanta koddi kAdOyi |
| చరణం charaNam 3 | నిరతము శ్రీనాదపురి నిలయుడైన మురళి గాన లోల మువ్వ గోపాల యర విరుల పాన్పు పైని మరు కేళి నన్ను గూడి తిరుగ పొరుగింట తిరుగు కాదోయి | niratamu SrInAdapuri nilayuDaina muraLi gAna lOla muvva gOpAla yara virula pAn&pu paini maru kELi nannu gUDi tiruga poruginTa tirugu kAdOyi |
1277 ఏనిదచ్చరి ప్రియా Enidacchari priyA
| Title | ఏనిదచ్చరి ప్రియా | Enidacchari priyA |
| Written By | ||
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | ఛాపు | ChApu |
| ఏనిదచ్చరి ప్రియా ఏణాంకవదనెయ నీనగలిరువుదు ఉచితవేనో మానిని మణియన్న ప్రాణపదకళెంబో ఆనందపడువే అభిమానవెల్లిహుదయ్యా | Enidacchari priyA ENAnkavadaneya nInagaliruvudu uchitavEnO mAnini maNiyanna prANapadakaLembO AnandapaDuvE abhimAnavellihudayyA | |
| నాయకియళ బిట్టు నాళిగెరడు తింగళు ఆయితెందీపరి చళీసిద్యా తోయవే నినగెయిదు శ్రేయవే కాడువుదిన్ను క్రియవే కామినియు కంపిసి కాయజన శరఘాయ కంజువళో నిన్నన్ను బయసి యాయితాంబకి బాయిబిడుతిహళో బగెబగెయ మాయోపాయగళ యోచనెయ మాడువళో మానినియ మొబ్బిన ప్రాయమదవను మీసలాకి తద్వీయ పదకోపిసి మమసఖ చిరాయునాగిరెందరసువళ నోయిసువుదొళితల్లో | nAyakiyaLa biTTu nALigeraDu tingaLu AyitendIpari chaLIsidyA tOyavE ninageyidu SrEyavE kADuvudinnu kriyavE kAminiyu kampisi kAyajana SaraghAya kanjuvaLO ninnannu bayasi yAyitAmbaki bAyibiDutihaLO bagebageya mAyOpAyagaLa yOchaneya mADuvaLO mAniniya mobbina prAyamadavanu mIsalAki tadvIya padakOpisi mamasakha chirAyunAgirendarasuvaLa nOyisuvudoLitallO | |
| సుగుణా యిరళొళు చరిప చందిరకె కుముదవు సాసిరవెంబో శాస్త్రవనరుహిదిళొ అరఘళిగె ఆదరూ మరుకేళి నెందల్‌ల్దరిదళో అన్హోకావ జరిదాళో చిన్నాదభరణ మరతాళో అరమనెయళూ బరకరెదు మాతనాడిసళో విరహాగ్ని తాపక్కె ధరధరసి మైబణ్ణ గుందిహళో ఒళఒళగె సమెయుత సొరగిసుమ్మనె యిళెయళొరెగిహళో | suguNA yiraLoLu charipa chandirake kumudavu sAsiravembO SAstravanaruhidiLo araghaLige AdarU marukELi nendal^ldaridaLO an&hOkAva jaridALO chinnAdabharaNa maratALO aramaneyaLU barakaredu mAtanADisaLO virahAgni tApakke dharadharasi maibaNNa gundihaLO oLaoLage sameyuta soragisummane yiLeyaLoregihaLO | |
| సంతైసు సాకి కరెకరెయోరొళ్ళితల్ల వేగది తెరళువుదు కారణశరది ఒడయన మనకె బేసరళాద భామిని పొడవియొళిద్దేను ఫలవెందళు కండుయవ్వనప్రాయ అడవీగాదాయ్తెందు నడిదళో బావిసియదెయా హొడెదాళో నిన్నవగుణ తడెదాళొ హాగిరువళదిగడి నడెనుడిగె తప్పిదువరెనల్లా కడుబడ నడనడువినెళ హుడిగి దొరకువ గిడిగి మాతల్లా మడదియర బెరతు వ్రతగెడసి గెళెతన బిడు హేళిద నుడియ మీరిద ఫలగళన్ను ఎన్నుడియ గట్టువనెందు సుళిదు మిడుకువళె కైపిడిదు సలహో | santaisu sAki karekareyOroLLitalla vEgadi teraLuvudu kAraNaSaradi oDayana manake bEsaraLAda bhAmini poDaviyoLiddEnu phalavendaLu kanDuyavvanaprAya aDavIgAdAytendu naDidaLO bAvisiyadeyA hoDedALO ninnavaguNa taDedALo hAgiruvaLadigaDi naDenuDige tappiduvarenallA kaDubaDa naDanaDuvineLa huDigi dorakuva giDigi mAtallA maDadiyara beratu vratageDasi geLetana biDu hELida nuDiya mIrida phalagaLannu ennuDiya gaTTuvanendu suLidu miDukuvaLe kaipiDidu salahO |
1276 యార శాపవిదు yAra SApavidu
| Title | యార శాపవిదు | yAra SApavidu |
| Written By | ||
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | యార శాపవిదు ఇదకేను కారణ తోరదు మీరి కోపది దూరబందె దారికాణదె | yAra SApavidu idakEnu kAraNa tOradu mIri kOpadi dUrabande dArikANade |
| నొందె హేగిరలి హరి నిన్నను అగలి విరహద బేగెయల్లి వంచిసి ఎన్న | nonde hEgirali hari ninnanu agali virahada bEgeyalli vamchisi enna | |
| చింతెయొళిరిసి మించి హోదళు అరసి లంచల చపలె మీరి నిన్న అంజికెయు | chinteyoLirisi minchi hOdaLu arasi lanchala chapale mIri ninna anjikeyu | |
| నిజవాయ్తు హాయై అంజికెయు నిజవాయ్తు పరమాత్మను నా ఎన్నువ ఏతకె విరహవ | nijavAytu hAyai anjikeyu nijavAytu paramAtmanu nA ennuva Etake virahava | |
| బీతియలి హాయై విరహది భాదెయలి యార శాపవిదు ఇదకేను కారణతోరదు | bItiyali hAyai virahadi bhAdeyali yAra SApavidu idakEnu kAraNatOradu | |
1275 సరసిజ గంధీ sarasija gandhI
| Title | సరసిజ గంధీ | sarasija gandhI |
| Written By | ||
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | సరసిజ గంధీ సరసాన తందు తోరె | sarasija gandhI sarasAna tandu tOre |
| అనుపల్లవి anupallavi | కరెదు తారమ్మయ్య మరదిరలారెనె హారవనీవె కరముగివె దయదోరె | karedu tArammayya maradiralArene hAravanIve karamugive dayadOre |
| చరణం charaNam 1 | ఆడువ ఆటవా కూడువ కూటవా పాడి పొగళాలళవెల్లే యేనల్లె | ADuva ATavA kUDuva kUTavA pADi pogaLAlaLavellE yEnalle |
| చరణం charaNam 2 | చంద్ర నా కిరణకె బెందు నా బళలిదే మందరధరా బారనల్లే యేనల్లె | chandra nA kiraNake bendu nA baLalidE mandaradharA bAranallE yEnalle |
| చరణం charaNam 3 | కరెదు తారమ్మయ్య మరదిరలారెను హారవనీవె వరముగివె దయదోరె సరసిజ గంధి సరసాన తందుతోరె | karedu tArammayya maradiralArenu hAravanIve varamugive dayadOre sarasija gandhi sarasAna tandutOre |
1274 కంతువిన kantuvina
| Title | కంతువిన | kantuvina |
| Written By | ||
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | ఛాపు | CHApu |
| పల్లవి pallavi | కంతువిన భాదె నానెంతు సహిసువె కాంతబారదిరలు మనవు శాంతి ఎల్లిదే | kantuvina bhAde nAnentu sahisuve kAntabAradiralu manavu kAnti ellidE |
| చరణం charaNam 1 | భాసురాంగి బేసరవాయితెనగె జన్మవు క్లేశవిదను పతి వియోగ లేశ తాళనే | bhAsurAngi bEsaravAyitenage janmavu klESavidanu pati viyOga lESa tALanE |
| చరణం charaNam 2 | నాగవేణి భోగదీశ బేగ బరదిరె సాగరదొళు ధుముకి ప్రాణ నీగువే సఖి | nAgavENi bhOgadISa bEga baradire sAgaradoLu dhumuki prANa nIguvE sakhi |
1273 ముక్కు పచ్చలారని mukku pacchalArani
| Title | ముక్కు పచ్చలారని | mukku pacchalArani |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | ముక్కు పచ్చలారని చిన్నదాన నన్నెక్కడి కంపెదరే సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే | mukku pacchalArani chinnadAna nannekkaDi kampedarE siggAye nannekkaDi kampedarE |
| అనుపల్లవి anupallavi | నిక్కము రేయెల్ల నిదుర బోయెనమ్మా తక్కిన పనులేమి నే నెరుగ నోయమ్మా | nikkamu rEyella nidura bOyenammA takkina panulEmi nE neruga nOyammA |
| చరణం charaNam 1 | వంచిన నా చేయి మంచి గంధము లోన ముంచి యెత్తెద రేలనే సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే మంచిదేరమ్మ మగవారి చేయిబట్టు మంచు దెల్పెదరు నాకలవాటు లేదమ్మా | vanchina nA chEyi manchi gandhamu lOna munchi yetteda rElanE siggAye nannekkaDi kampedarE manchidEramma magavAri chEyibaTTu manchu delpedaru nAkalavATu lEdammA |
| చరణం charaNam 2 | అందముగా నున్న మాకీనెదీసి నే నంటరాయ నేరనే అందగాని నోటి కంటీయమని యెద రిందరిలో మనసెట్టు లొప్పునోయమ్మా | andamugA nunna mAkInedIsi nE nanTarAya nEranE andagAni nOTi kanTIyamani yeda rindarilO manaseTTu loppunOyammA |
| చరణం charaNam 3 | ఈ పను లాపను లేల చెప్పెదరు నేనేపని కోపలేనే ప్రాపై దాసు శ్రీరాము నేలిన వేణు గోపాల దేవుని గూడి యుండెదనమ్మా | I panu lApanu lEla cheppedaru nEnEpani kOpalEnE prApai dAsu SrIrAmu nElina vENu gOpAla dEvuni gUDi yunDedanammA |
1272 నేనెరుగనా nEneruganA
| Title | నేనెరుగనా | nEneruganA |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | దర్బారు | darbAru |
| తాళం tALa | జంపె | jampe |
| పల్లవి pallavi | నేనెరుగనా నీజాడ నాసామి నేనెరుగనా | nEneruganA nIjADa nAsAmi nEneruganA |
| అనుపల్లవి anupallavi | మాను నీ వగలెల్ల మా వద్దనా సామి | mAnu nI vagalella mA vaddanA sAmi |
| చరణం charaNam 1 | మరుపెన్నటికి రాని మంచి మాటలె చెప్పి అర చేత వైకుంఠ మట్టె చూపి పరిపూర్ణ దయ గలిగి పనులెల్ల కానిచ్చి సరసుడవు నీ వింద్రజాలములు జేసేవు | marupennaTiki rAni manchi mATale cheppi ara chEta vaikunTha maTTe chUpi paripUrNa daya galigi panulella kAnicchi sarasuDavu nI vindrajAlamulu jEsEvu |
| చరణం charaNam 2 | ముద్దు నా సామి నీ మురిపంపు సుద్దులివి ముత్యాలు పది వేలు మూట గట్టు బద్దులాడను పంచ బాణుడాన నీ వలపు మిద్దెపై నిడు పరుగు మీసాలపై తేనె | muddu nA sAmi nI muripampu suddulivi mutyAlu padi vElu mUTa gaTTu baddulADanu pancha bANuDAna nI valapu middepai niDu parugu mIsAlapai tEne |
| చరణం charaNam 3 | కనికరము పూజ్య మాకాశ పుష్పము నిజము వినవోయి మగవారి వింతలెల్ల ఘన దాసు శ్రీరామ కవి కీర్తనంబులే విన వేడుకాయె నీ పని పదిల మాయెనిక | kanikaramu pUjya mAkASa pushpamu nijamu vinavOyi magavAri vintalella ghana dAsu SrIrAma kavi kIrtanambulE vina vEDukAye nI pani padila mAyenika |