#783 సమయమిదె samayamide

Titleసమయమిదెsamayamide
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALa
పల్లవి pallaviసమయమిదె యనుచు
నిన్ను చాల బ్రతిమాలితిర
సుమ శరుని శరములకు
సొక్కి యుంటినేర రారా
samayamide yanuchu
ninnu chAla bratimAlitira
suma Saruni Saramulaku
sokki yunTinEra rArA
చరణం
charaNam 1
మల్లె పందిరి దరిని జేరి
మలయ మారుతము వీవగ
చల్లగా బిలహరి రాగము
కోర్కె దీర పాడెద రార
malle pandiri darini jEri
malaya mArutamu vIvaga
challagA bilahari rAgamu
kOrke dIra pADeda rAra
చరణం
charaNam 2
విరి పాన్పున జేరి నీతో
విరివిగ చౌశీతి బంధముల్
జూపించి మెప్పించి
కరగించెద కఠిన మనసు
viri pAn&puna jEri nItO
viriviga chauSIti bandhamul
jUpinchi meppinchi
karagincheda kaThina manasu
చరణం
charaNam 3
వాసిగ అభినవ భూతపురి
ఈశ రామశర్మ పోష
దోసిలొగ్గి వేడెద రార
దుఃఖంబును బాపుట కిదె
vAsiga abhinava bhUtapuri
ISa rAmaSarma pOsha
dOsiloggi vEDeda rAra
du@hkhambunu bApuTa kide

#782 అన్యాయముగా anyAyamugA

Titleఅన్యాయముగాanyAyamugA
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviఅన్యాయముగా నే అపవాదు పాలైతి
అతివరో ఏమందునే
anyAyamugA nE apavAdu pAlaiti
ativarO EmandunE
అనుపల్లవి anupallaviమన్నారు రాజ గోపాల స్వామికి నాకు
కన్నెలెల్ల చెలిమి కలదని పలికేరు
mannAru rAja gOpAla svAmiki nAku
kannelella chelimi kaladani palikEru
చరణం
charaNam 1
బోటుల ఎదుటనే పొద్దు వానింటికి పోయి వచ్చినందుకా
ఆటపాటల కొరకు అతని తోడే నేను మాటలాడి నందుకా
ఏటికే ఈ గేలి ఏ పాప మెరుగను
తాటి కింద పాలు త్రావిన చందము
bOTula eduTanE poddu vAninTiki pOyi vachchinandukA
ATapATala koraku atani tODE nEnu mATalADi nandukA
ETikE I gEli E pApa meruganu
tATi kinda pAlu trAvina chandamu

#781 ఏర సామి Era sAmi

Titleఏర సామిEra sAmi
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviఏర సామి సరసకు మరి మరి
పిలిచిన పలుక వేమిరా
Era sAmi sarasaku mari mari
pilichina paluka vEmirA
చరణం
charaNam 1
చిన్న నాడే చెలిమి కోరి యున్న దానరా నాతో
పంతమేల జేసెదవురా నీ
చెంత జేరి యున్నదానరా యేర
మరుబారి కోర్వజాల
మరి మరి వేడితిరా
chinna nADE chelimi kOri yunna dAnarA nAtO
pantamEla jEsedavurA nI
chenta jEri yunnadAnarA yEra
marubAri kOrvajAla
mari mari vEDitirA
చరణం
charaNam 2
కామ శాస్త్ర విభుడవని కలసినానురా నాతో
కయ్యమేల జేసెదవురా యేర
మార్కాపుర వాస నను
కరుణించి బ్రోవరా
kAma SAstra vibhuDavani kalasinAnurA nAtO
kayyamEla jEsedavurA yEra
mArkApura vAsa nanu
karuNinchi brOvarA

#780 తెలిసెనురా నీ telisenurA nI

Titleతెలిసెనురా నీtelisenurA nI
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviతెలిసెనురా నీ తెరగెల్లను
నేడు చక్క తెలిసెనురా
telisenurA nI teragellanu
nEDu chakka telisenurA
అనుపల్లవి anupallaviఎలిమిని నన్నేలి ప్రాణేశ శ్రీ వెంకటేశ
తలపున నన్నెంచ లేదా తప్పు తంట లెల్ల నేడు
elimini nannEli prANESa SrI venkaTESa
talapuna nannencha lEdA tappu tanTa lella nEDu
చరణం
charaNam 1
మాటల పస దానింట మౌనంబు నా యింటmATala pasa dAninTa maunambu nA yinTa
చరణం
charaNam 2
ఆట పాట దానింట అలుకలు నా యింటATa pATa dAninTa alukalu nA yinTa
చరణం
charaNam 3
జూటు వగలు నా యింట సొగసెల్లను దానింటjUTu vagalu nA yinTa sogasellanu dAninTa
చరణం
charaNam 4
నాటకములు నా యింట నమ్మికెల్ల దానింటnATakamulu nA yinTa nammikella dAninTa

#779 ఇది మరియాద idi mariyAda

Titleఇది మరియాదidi mariyAda
Written By
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaధన్యాసిdhanyAsi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇది మరియాద గాదటే
సరోజ ముఖిరో దూరేటి వారికి
idi mariyAda gAdaTE
sarOja mukhirO dUrETi vAriki
అనుపల్లవి anupallaviసదయుడు నాతో సదా సరసము లాడినది
మరియాద గాదటే
sadayuDu nAtO sadA sarasamu lADinadi
mariyAda gAdaTE
చరణం
charaNam 1
కాంత మదమంత మిదే వింత మాట లాడుచును
ఇంతులెల్ల గూడి నాపై పూబంతులు వేసినది
kAnta madamanta midE vinta mATa lADuchunu
intulella gUDi nApai pUbantulu vEsinadi

#778 కరుణ జూడ karuNa jUDa

Titleకరుణ జూడkaruNa jUDa
Written Byభూసురపల్లి వేంకటేశ్వర్లుbhUsurapalli vEnkaTESvarlu
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకాపీkApI
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviకరుణ జూడ డేలనో కాంచనాంగి చెప్పి రావెkaruNa jUDa DElanO kAnchanAngi cheppi rAve
అనుపల్లవి anupallaviకలలో నైనా స్వామిని గాంచక నే నుండ లేనుkalalO nainA svAmini gAnchaka nE nunDa lEnu
చరణం
charaNam 1
మనసంతా అతడె నిండి మగువకు దాగుట తగవా
అతనికి చేతనైనచొ నా మనసు నుంచి పొమ్మనవే
manasantA ataDe ninDi maguvaku dAguTa tagavA
ataniki chEtanainacho nA manasu nunchi pommanavE
చరణం
charaNam 2
వాంఛ కాదు వనితా యిది వలపు పెంచు కొంటి విభుని
కిది తగదని చెప్పవేమె తడవు లేక రమ్మనవే
vAnCha kAdu vanitA yidi valapu penchu konTi vibhuni
kidi tagadani cheppavEme taDavu lEka rammanavE

#777 ఎరుక లేని eruka lEni

Titleఎరుక లేనిeruka lEni
Written Byభూసురపల్లి వేంకటేశ్వర్లుbhUsurapalli vEnkaTESvarlu
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఎరుక లేని వారు నాపై ఏమి చెప్పిరో గానిeruka lEni vAru nApai Emi cheppirO gAni
అనుపల్లవి anupallaviఎంత ఎదురు చూచిననూ ఏలా దయ రాకపోయెenta eduru chUchinanU ElA daya rAkapOye
చరణం
charaNam 1
అతని చేరి మనసంతా ఆనంద చేతన మయె
అతని కోరి జీవితమ్ము అడవి గాచు వెన్నెలాయె
atani chEri manasantA Ananda chEtana maye
atani kOri jIvitammu aDavi gAchu vennelAye
చరణం
charaNam 2
ఎవరి యింట చేరెనో ఎవరి ఎడద దాగెనో
అతనికి అందరు గానీ నాకు మాత్ర మతడొకడే
evari yinTa chErenO evari eDada dAgenO
ataniki andaru gAnI nAku mAtra mataDokaDE

#776 రారా మా యింటికి rArA mA yinTiki

Titleరారా మా యింటికిrArA mA yinTiki
Written Byతెల్లాకుల వెంకటేశ్వర గుప్తtellAkula VenkaTESvara gupta
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaశహనSahana
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviరారా మా యింటికి రయమున గోపాలా
బాలుడవని నిన్ను చాలగా నమ్మితీ
rArA mA yinTiki rayamuna gOpAlA
bAluDavani ninnu chAlagA nammitI
అనుపల్లవి anupallaviఎంతని వేడినా పంతమేలరా నాపై
దంతీ రక్షక నాదు చెంతకు జేరగా
entani vEDinA pantamElarA nApai
dantI rakshaka nAdu chentaku jEragA
చరణం
charaNam 1
మల్లె పువ్వులు ఇవిగో కొల్లగ యీ రేయి
చల్లని మారుత మెల్ల వీచుచు నుండే
వల్ల జేసుక రారా పల్లవాధరి గోరి
సలలితముగా మురళీ సరళీ జూపుదు గాని
malle puvvulu ivigO kollaga yI rEyi
challani mAruta mella vIchuchu nunDE
valla jEsuka rArA pallavAdhari gOri
salalitamugA muraLI saraLI jUpudu gAni
చరణం
charaNam 2
అత్తా గారున్నారు కత్తీ వంటిది నా అత్తా గారున్నారు
కత్తీ వంటిదిరా చిత్తాము నిల్వాదు చెల్వుడా
నిను జూడ పంకజ ముఖులతో పంకాలు బలికేవు
బింక మేలర వేంకటేశ వరద నేడే
attA gArunnAru kattI vanTidi nA attA gArunnAru
kattI vanTidirA chittAmu nilvAdu chelvuDA
ninu jUDa pankaja mukhulatO pankAlu balikEvu
binka mElara vEnkaTESa varada nEDE

#775 మరులు మించేనే marulu minchEnE

Titleమరులు మించేనేmarulu minchEnE
Written Byమంగళంపల్లి బాలమురళీకృష్ణmangaLampalli bAlamuraLIkRshNa
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaచెంచురుటిchenchuruTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమరులు కొన్నానే సఖీ నిను
విడనాడగ లేనే సఖీ
marulu konnAnE sakhI ninu
viDanADaga lEnE sakhI
అనుపల్లవి anupallaviవిరసిన సుమమా కురిసినా వెన్నెలా
మరల వచ్చెదనని తరలి పోబోకే సఖీ
virasina sumamA kurisinA vennelA
marala vachchedanani tarali pObOkE sakhI
చరణం
charaNam 1
కన్నుల కరవు తీరెను కనినంత నీరూపు
మిన్నుల విహరించేను మది ఆనందము సఖీ
kannula karavu tIrenu kaninanta nIrUpu
minnula viharinchEnu madi Anandamu sakhI
AV Linkhttps://www.youtube.com/watch?v=tx6b9S4oPCg

#774 స్వామిని రమ్మనవే svAmini rammanavE

Titleస్వామిని రమ్మనవేsvAmini rammanavE
Written Byవింజమూరి వరదరాజయ్యంగారుviMjamUri varadarAjayyangAru
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaభవప్రియbhavapriya
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviస్వామిని రమ్మనవే సఖిరో కృష్ణ
ఏమో మాటలాడి పర భామను చేరబోయిన
svAmini rammanavE sakhirO kRshNa
EmO mATalADi para bhAmanu chErabOyina
చరణం
charaNam 1
నా సరసకు వచ్చిన సౌఖ్యము
నే మరువజాలనే
సతతము నే నతనినే స్మరింతు
నిరతము నా వరదరాజ స్వామిని
ఇతరుల గూడ వద్దని
nA sarasaku vachchina saukhyamu
nE maruvajAlanE
satatamu nE nataninE smarintu
niratamu nA varadarAja svAmini
itarula gUDa vaddani