| Title | సామి రాడె | sAmi rADe |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | గౌరీ మనోహరి | gaurI manOhari |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామి రాడె యేమి సేతూ | sAmi rADe yEmi sEtU |
| అనుపల్లవి anupallavi | సరసుని ప్రేమ సతమని యుంటినె | sarasuni prEma satamani yunTine |
| చరణం charaNam 1 | వలచిన వారికీ వైభవ మేడదె నీలవేణి పొందు నేస్తము సతమాయె | valachina vArikI vaibhava mEDade nIlavENi pondu nEstamu satamAye |
| చరణం charaNam 2 | మదనుని బారికి మనసు సైరిసదాయ సదయుడు రాడాయ సఖియరో నేడు | madanuni bAriki manasu sairisadAya sadayuDu rADAya sakhiyarO nEDu |
| చరణం charaNam 3 | మంగళ పురి వాసుడు మరచిన మొదలు మంగళాంగి వినవె మోహము నిలుప లేను | mangaLa puri vAsuDu marachina modalu mangaLAngi vinave mOhamu nilupa lEnu |
Author: Javali Lyrics
My mother collected hundreds of jAvaLi lyrics as part of her research on the literary values in jAvaLi. Instead of publishing them as a book, which would have had limited reach, we chose to post them as a blog. Then we found many more lyrics and kept posting...
Lot more can be done - finding notation, links to audio/video, any further corrections, offer a meaning for each word / line,...
Contact us at javaliwebsite@gmail.com
#772 సరోజాక్షిరొ sarOjAkshiro
| Title | సరోజాక్షిరొ | sarOjAkshiro |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | పూర్వీ కల్యాణి | pUrvI kalyANi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | సరోజాక్షిరొ నా మాట సైసదాయ సామీ రాడాయ యింకేమి నే జేతూనే | sarOjAkshiro nA mATa saisadAya sAmI rADAya yinkEmi nE jEtUnE |
| చరణం charaNam 1 | సదా యుడవని చాలా నమ్మియుంటి మదావతిరో నేడేల రాడాయనె | sadA yuDavani chAlA nammiyunTi madAvatirO nEDEla rADAyane |
| చరణం charaNam 2 | చేరా వచ్చీ మును జేసిన చెలిమి కోరితిని గాని కోర్కె దీరదాయ | chErA vachchI munu jEsina chelimi kOritini gAni kOrke dIradAya |
| చరణం charaNam 3 | కరుణెందు బోయెనో మరువలేనే నేడు కారణ మేమి కలికిరో యీవేళ | karuNendu bOyenO maruvalEnE nEDu kAraNa mEmi kalikirO yIvELa |
| చరణం charaNam 4 | వెలదీరొ అలనాడు వుపరతి వేళలో కలసిన రీతెల్ల కలికి నే మరువాను | veladIro alanADu vuparati vELalO kalasina rItella kaliki nE maruvAnu |
| చరణం charaNam 5 | ప్రేమ మరచానే యేమి సేతు నేను మోము జూడడె మంగాళ పురీశుడు | prEma marachAnE yEmi sEtu nEnu mOmu jUDaDe mangALa purISuDu |
#771 ఏమిరా చలమేలరా EmirA chalamElarA
| Title | ఏమిరా చలమేలరా | EmirA chalamElarA |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ధేనుక | dhEnuka |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమిరా చలమేలరా యింతైన దయ లేదె | EmirA chalamElarA yintaina daya lEde |
| చరణం charaNam 1 | వలపెటు దాతును వోర్వను యీ వ్యాళ సలసిన రీతి దెలిసి కోరి యున్నానురా | valapeTu dAtunu vOrvanu yI vyALa salasina rIti delisi kOri yunnAnurA |
| చరణం charaNam 2 | మోమేల జూడవు మనసిందు లేదాయ కాముని బారికి కరగి యున్నానురా | mOmEla jUDavu manasindu lEdAya kAmuni bAriki karagi yunnAnurA |
| చరణం charaNam 3 | మును నన్నేలిన మంగళ పురి వాస కనికర మెందు బోయ కోప మెందుకురా | munu nannElina mangaLa puri vAsa kanikara mendu bOya kOpa mendukurA |
#770 పిలచితే రాడాయా pilachitE rADAyA
| Title | పిలచితే రాడాయా | pilachitE rADAyA |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ఖరహరప్రియ | kharaharapriya |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | పిలచితే రాడాయా చెలియరో నేడూ | pilachitE rADAyA cheliyarO nEDU |
| అనుపల్లవి anupallavi | వలపెటు దాతునె వోర్వజాలను నే | valapeTu dAtune vOrvajAlanu nE |
| చరణం charaNam 1 | కలికిరో సామికి కరుణెందు బోయెనె తలచి తాళగ లేనె తరుణిరొ యీవ్యాళ | kalikirO sAmiki karuNendu bOyene talachi tALaga lEne taruNiro yIvyALa |
| చరణం charaNam 2 | సరసుని ప్రేమా సతమని యుంటినె సరస మింకేటికే చాల మనకేలనె | sarasuni prEmA satamani yunTine sarasa minkETikE chAla manakElane |
| చరణం charaNam 3 | మంగళ పురి వాసునికి మాట సైస దాయగా మంగళాంగి నాపై మోహమెటు బోయెనే | mangaLa puri vAsuniki mATa saisa dAyagA mangaLAngi nApai mOhameTu bOyenE |
#769 ఏమి సేతునమ్మా Emi sEtunammA
| Title | ఏమి సేతునమ్మా | Emi sEtunammA |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | సావేరి | sAvEri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమి సేతునమ్మా నేను సామీ రాడాయనె | Emi sEtunammA nEnu sAmI rADAyane |
| చరణం charaNam 1 | మోహము యెటులా సైతు నేను ముదితారొ నేడు రాడాయ మోహనాంగి వినవే మనసు నే నిలుపలేను | mOhamu yeTulA saitu nEnu muditAro nEDu rADAya mOhanAngi vinavE manasu nE nilupalEnu |
| చరణం charaNam 2 | సరసుడు లేని జన్మ మ్యాలే సరివారలు నవ్వనాయా మారుని బాధకు వోర్వను నేను మమతలు మరువలేను | sarasuDu lEni janma myAlE sarivAralu navvanAyA mAruni bAdhaku vOrvanu nEnu mamatalu maruvalEnu |
| చరణం charaNam 3 | మంగళపురి వాసుడు మరచినాడే నేడు శృంగారము మనకేలనె సొగసెవ్వరు జూచేరే | mangaLapuri vAsuDu marachinADE nEDu SRngAramu manakElane sogasevvaru jUchErE |
#768 సఖియా తోడి త్యావె sakhiyA tODi tyAve
| Title | సఖియా తోడి త్యావె | sakhiyA tODi tyAve |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | సఖియా తోడి త్యావె | sakhiyA tODi tyAve |
| అనుపల్లవి anupallavi | సుఖమిందు లేదాయ సుదతిరో యీవ్యాళ | sukhamindu lEdAya sudatirO yIvyALa |
| చరణం charaNam 1 | ప్రేమ మరచె నేడు ప్రియమింత లేదాయ తామస మ్యాలనె తరుణిరో పోవె | prEma marache nEDu priyaminta lEdAya tAmasa myAlane taruNirO pOve |
| చరణం charaNam 2 | మనసిందు లేదాయ ముదితారో వానికి వనజాక్షి సతమ వలపదీ కొన్నాళ్ళు | manasindu lEdAya muditArO vAniki vanajAkshi satama valapadI konnALLu |
| చరణం charaNam 3 | కరుణ యింతైన నాపై కడకు లేదాయ వర మంగళపురి వాసుడు వనితల పాలాయ | karuNa yintaina nApai kaDaku lEdAya vara mangaLapuri vAsuDu vanitala pAlAya |
#767 సామిని రమ్మనవె sAmini rammanave
| Title | సామిని రమ్మనవె | sAmini rammanave |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామిని రమ్మనవె | sAmini rammanave |
| చరణం charaNam 1 | సారసాక్షుని సరగున పిలువవె సరస మాడుటకు సమయము యిది | sArasAkshuni saraguna piluvave sarasa mADuTaku samayamu yidi |
| చరణం charaNam 2 | మంద గమనరొ మదనుని కేళికి సుందరాంగుని సుదతిరొ నేడు | manda gamanaro madanuni kELiki sundarAnguni sudatiro nEDu |
| చరణం charaNam 3 | మంగళ పురీశుని మమతలు మరువను పంకజాక్షిరో ప్రేమతో నేడు | mangaLa purISuni mamatalu maruvanu pankajAkshirO prEmatO nEDu |
#766 ఎందుకు రాడాయ enduku rADAya
| Title | ఎందుకు రాడాయ | enduku rADAya |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | దేశి తోడి | dESi tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఎందుకు రాడాయ యవరే మన్నారు | enduku rADAya yavarE mannAru |
| అనుపల్లవి anupallavi | సందేహమేలనే సఖియరో యీ వ్యాళ | sandEhamElanE sakhiyarO yI vyALa |
| చరణం charaNam 1 | మందయాన నాపై మత్సర మేలనే యిందు వచ్చి నేడు పొంద వద్దంటిన | mandayAna nApai matsara mElanE yindu vachchi nEDu ponda vaddanTina |
| చరణం charaNam 2 | కలికిరొ యీ వ్యాళ కోరియున్నానే తొలి జేసిన బాస తెలుసుకో లేడాయ | kalikiro yI vyALa kOriyunnAnE toli jEsina bAsa telusukO lEDAya |
| చరణం charaNam 3 | మనసు దెలిసి రాడే మంగళపురి వాసుడు చిన్ననాటి చెలిమి చైగూడక పోయ | manasu delisi rADE mangaLapuri vAsuDu chinnanATi chelimi chaigUDaka pOya |
#765 కమలాక్షి వేగమె kamalAkshi vEgame
| Title | కమలాక్షి వేగమె | kamalAkshi vEgame |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | ఖరహరప్రియ | kharaharapriya |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | కమలాక్షి వేగమె కాంతుని తోడి త్యావే | kamalAkshi vEgame kAntuni tODi tyAvE |
| చరణం charaNam 1 | మనసు నిలువదాయ మద గజ గామిని నేనింత సైరిస లేను నారీమణి పిలువవే | manasu niluvadAya mada gaja gAmini nEninta sairisa lEnu nArImaNi piluvavE |
| చరణం charaNam 2 | నా ప్రాణనాథుడు నన్నెడబాసె నేడు నా ప్రాప్తి కేమనవచ్చు నాగావేణి రమ్మనవే | nA prANanAthuDu nanneDabAse nEDu nA prApti kEmanavachchu nAgAvENi rammanavE |
| చరణం charaNam 3 | మనసిందు లేదాయ మంగళపురి వాసునికి నిన్నటి వ్యాళ నుంచి నిదుర కంటికి రాదాయ | manasindu lEdAya mangaLapuri vAsuniki ninnaTi vyALa nunchi nidura kanTiki rAdAya |
#764 సామీ రాడాయనె sAmI rADAyane
| Title | సామీ రాడాయనె | sAmI rADAyane |
| Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
| Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
| రాగం rAga | హరి కాంభోజి | hari kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామీ రాడాయనె | sAmI rADAyane |
| అనుపల్లవి anupallavi | సరసుడు లేని ఈ సొగసెవ్వరు జూచేరే | sarasuDu lEni I sogasevvaru jUchErE |
| చరణం charaNam 1 | సారసాక్షి రమ్మనుచు సరసముతో నన్ను కరుణతో లాలించి నా కరుణెందు బోయెనో | sArasAkshi rammanuchu sarasamutO nannu karuNatO lAlinchi nA karuNendu bOyenO |
| చరణం charaNam 2 | క్షణ మాత్రమైన వుపేక్షణము చాయక నన్ను క్షణ క్షణము లాలించిన సరసమెందు బోయెనో | kshaNa mAtramaina vupEkshaNamu chAyaka nannu kshaNa kshaNamu lAlinchina sarasamendu bOyenO |
| చరణం charaNam 3 | సురత కేళిలో నను సొక్కి సోలించిన వర మంగళ పురీశుని వలపెందు బోయెనో | surata kELilO nanu sokki sOlinchina vara mangaLa purISuni valapendu bOyenO |