| Title | ప్రాణ సఖుడిటు | prANa sakhuDiTu |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సెంజురుటి | senjuruTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ప్రాణ సఖుడిటు జేసెనే సఖి | prANa sakhuDiTu jEsenE sakhi |
| చరణం charaNam 1 | ఇదిగొ వచ్చెదనని ఇతవులాడి అల దానిల్లటు జేరెనే సఖి | idigo vachchedanani itavulADi ala dAnillaTu jErenE sakhi |
| చరణం charaNam 2 | నన విలుతుని కేళికి బిలిచితే వాడు అనరాని మాట్లాడెనే (సఖి) | nana vilutuni kELiki bilichitE vADu anarAni mATlADenE (sakhi) |
| చరణం charaNam 3 | మును నను కలసి మర్మము లెరిగిన ధర్మపురి వాసుడు నన్ను మరచెనే (సఖి) | munu nanu kalasi marmamu lerigina dharmapuri vAsuDu nannu marachenE (sakhi) |
| Audio Link | https://www.youtube.com/watch?v=gyKjHyfOMfY |
Author: Javali Lyrics
My mother collected hundreds of jAvaLi lyrics as part of her research on the literary values in jAvaLi. Instead of publishing them as a book, which would have had limited reach, we chose to post them as a blog. Then we found many more lyrics and kept posting...
Lot more can be done - finding notation, links to audio/video, any further corrections, offer a meaning for each word / line,...
Contact us at javaliwebsite@gmail.com
#634 ఏరా తగునటరా ErA tagunaTarA
| Title | ఏరా తగునటరా | ErA tagunaTarA |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏరా తగునటరా – సరిగాదురా | ErA tagunaTarA – sarigAdurA |
| అనుపల్లవి anupallavi | రారాపు సేయకురా – రాజ గంభీర | rArApu sEyakurA – rAja gambhIra |
| చరణం charaNam 1 | పర సతులతో పరిహాసము లాడుచు మరి మరి నొప్పించెదవు ఎట్ల సైతురా | para satulatO parihAsamu lADuchu mari mari noppinchedavu eTla saiturA |
| చరణం charaNam 2 | వర ధర్మపురమున స్థిరముగ నెలకొన్న వరదుడ మారుకేళిలో నన్ను గూడరా | vara dharmapuramuna sthiramuga nelakonna varaduDa mArukELilO nannu gUDarA |
#633 వారేమి జేసెదరే vArEmi jEsedarE
| Title | వారేమి జేసెదరే | vArEmi jEsedarE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Published At | 568 | |
| పల్లవి pallavi | వారేమి జేసెదరే – ఊరి వారేమి జేసెదరే – ప్రియుడు | vArEmi jEsedarE – Uri vArEmi jEsedarE – priyuDu |
| అనుపల్లవి anupallavi | జార చోరుడనే పేరైతే జార చోరుడనే పేరైతే ఊరి | jAra chOruDanE pEraitE jAra chOruDanE pEraitE Uri |
| చరణం charaNam 1 | ఇంతిరో నీవిపుడు – ఆడ వేసమై కుల కాంతల నేచితే – ఎట్లోర్తురే – ఊరి | intirO nIvipuDu – ADa vEsamai kula kAntala nEchitE – eTlOrturE – Uri |
| చరణం charaNam 2 | నీరజ ముఖి వాడా రమణి మగని తీరున పోయేడు – నేరము లాడితే – ఊరి | nIraja mukhi vADA ramaNi magani tIruna pOyEDu – nEramu lADitE – Uri |
| చరణం charaNam 3 | శ్రీకరుడగు శ్రీ ధర్మపురీశుడు లోకాపకీర్తికి – లోనైతే ఈ ఊరి | SrIkaruDagu SrI dharmapurISuDu lOkApakIrtiki – lOnaitE I Uri |
#632 ఎంతటి కులుకే entaTi kulukE
| Title | ఎంతటి కులుకే | entaTi kulukE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఎంతటి కులుకే? ఇంతిరో కాంతుని కిపు(డెంతటి) | entaTi kulukE? intirO kAntuni kipu(DentaTi) |
| అనుపల్లవి anupallavi | పంతము గల పరాంభోజముఖిని పెనగి నందున (కెంతటి) | pantamu gala parAmbhOjamukhini penagi nanduna (kentaTi) |
| చరణం charaNam 1 | హొయలు మీరి వీధిలోన బయలుదేరి నన్ను జూచి భయము లేక పాట పాడి కను సైగ జేయునే | hoyalu mIri vIdhilOna bayaludEri nannu jUchi bhayamu lEka pATa pADi kanu saiga jEyunE |
| చరణం charaNam 2 | వరకు లేక నిన్న రేయి ధరపురీశుడైన సామి మరుని కేళిలోను గూడి మాటలాడ డేమిది | varaku lEka ninna rEyi dharapurISuDaina sAmi maruni kELilOnu gUDi mATalADa DEmidi |
| AV Link | https://www.youtube.com/watch?v=cD6p4HedIjk |
#631 ఏరా రారా ErA rArA
| Title | ఏరా రారా | ErA rArA |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏరా! రారా! చెయి తేరా! యీ మరుబారికి తాళగలేరా | ErA! rArA! cheyi tErA! yI marubAriki tALagalErA |
| అనుపల్లవి anupallavi | మార జనక సుకుమార సుందర | mAra janaka sukumAra sundara |
| చరణం charaNam 1 | వలచి నిన్ను బిలిచిన నన్ను సల్లాపించి మరియు నుల్లసించవు | valachi ninnu bilichina nannu sallApinchi mariyu nullasinchavu |
| చరణం charaNam 2 | సరసుడని చాల కోరినార! బిరాన! నన్ను కౌగిలించవేర! వద్దకి | sarasuDani chAla kOrinAra! birAna! nannu kaugilinchavEra! vaddaki |
| చరణం charaNam 3 | పరమ దయాకరుడౌ శ్రీ ధర్మపౌరాధిప శ్రీ వేంకటేశ చేరను | parama dayAkaruDau SrI dharmapaurAdhipa SrI vEnkaTESa chEranu |
| AV Link | https://www.youtube.com/watch?v=Iq_8xR3AVeI https://www.youtube.com/watch?v=hsUxKnlIW5o |
#630 మరియాద తెలియకనే mariyAda teliyakanE
| Title | మరియాద తెలియకనే | mariyAda teliyakanE |
| Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | మరియాద తెలియకనే మాటలాడుట తగునటే | mariyAda teliyakanE mATalADuTa tagunaTE |
| అనుపల్లవి anupallavi | పరిహాసము జేయతగిన వరుస కలిగి యుంటే నేమి | parihAsamu jEyatagina varusa kaligi yunTE nEmi |
| చరణం charaNam 1 | సరస సల్లాపములకు సమయము గాదే యేమె సరసిజాక్షి నావంటి సతులు గుంపు గూడి యుండగ | sarasa sallApamulaku samayamu gAdE yEme sarasijAkshi nAvanTi satulu gumpu gUDi yunDaga |
| చరణం charaNam 2 | వెలదిరో నన్ను గూడినట్లు వేంకటేశ్వరునిపై బలవంతముగా నేను వలచి వచ్చినానేమి | veladirO nannu gUDinaTlu vEnkaTESvarunipai balavantamugA nEnu valachi vachchinAnEmi |
#629 అపుడు మనసు apuDu manasu
| Title | అపుడు మనసు | apuDu manasu |
| Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | అపుడు మనసు నిలుచునటే అతివరో ఇదేటి మాట | apuDu manasu niluchunaTE ativarO idETi mATa |
| అనుపల్లవి anupallavi | చపలమేటి కెటువంటి సామర్థ్యము కలవాడైన | chapalamETi keTuvanTi sAmarthyamu kalavADaina |
| చరణం charaNam 1 | చొక్కపు యౌవనము గల చక్కని పురుషుడు యువతుల పక్క జేరి సరసముగా బల్కుచు కనుసైగ జేయగ | chokkapu yauvanamu gala chakkani purushuDu yuvatula pakka jEri sarasamugA balkuchu kanusaiga jEyaga |
| చరణం charaNam 2 | వరద వేంకటేశ్వరుడిటు సురత కేళి సల్ప కోరిన తరుణములో మారుడు విరిశరముల బిరబిర గురియగ | varada vEnkaTESvaruDiTu surata kELi salpa kOrina taruNamulO mAruDu viriSaramula birabira guriyaga |
#628 సమయమిదే samayamidE
| Title | సమయమిదే | samayamidE |
| Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సమయమిదే రారా నా సామి! తామసించకురా! | samayamidE rArA nA sAmi! tAmasinchakurA! |
| అనుపల్లవి anupallavi | కమలవైరి చనుదెంచితే కాంక్షలీడేవుర | kamalavairi chanudenchitE kAnkshalIDEvura |
| చరణం charaNam 1 | మగడు ఊరలేడు నా మామగారి జోలి లేదని వగ తెగ తెలిసినదిగా? వట్టి పంతమేలర? | magaDu UralEDu nA mAmagAri jOli lEdani vaga tega telisinadigA? vaTTi pantamElara? |
| చరణం charaNam 2 | మన్ననచే నీవు వచ్చి నన్ను గూడి యుండినట్లు నిన్న రేయి కలగంటిని నీరజాక్ష! వేంకటేశ! | mannanachE nIvu vachchi nannu gUDi yunDinaTlu ninna rEyi kalaganTini nIrajAksha! vEnkaTESa! |
| AV Link | https://www.youtube.com/watch?v=TpicQEAzv5w |
#627 సామియే నీ sAmiyE nI
| Title | సామియే నీ | sAmiyE nI |
| Written By | వేలూరు కుప్పుస్వామి మొదలారి | vElUru kuppuswAmi modalAri |
| Book | పార్సి సభారంజిత జావళి | pArsi sabhAranjita jAvaLi |
| రాగం rAga | దర్వు | darvu |
| తాళం tALa | ||
| సామియే నీ వారాయ్ యెందనిడ చంచరిత్తై నీరాయ్ | sAmiyE nI vArAy yendaniDa chancharittai nIrAy | |
| మనమదా సామి నీ వారాయ్ కామన్ అంబినాలే సామమాయ్ వాడురేన్ | manamadA sAmi nI vArAy kAman ambinAlE sAmamAy vADurEn | |
| కలవి సెయ్య వాడా నలం తాడా వలదోడా కణ్ణాళా సామి నీ వాడా | kalavi seyya vADA nalam tADA valadODA kaNNALA sAmi nI vADA | |
#626 కోడి మనోజ kODi manOja
| Title | కోడి మనోజ | kODi manOja |
| Written By | వేలూరు కుప్పుస్వామి మొదలారి | vElUru kuppuswAmi modalAri |
| Book | పార్సి సభారంజిత జావళి | pArsi sabhAranjita jAvaLi |
| రాగం rAga | హిందుస్థాని దర్వు | hindusthAni darvu |
| తాళం tALa | ఆది | Adi |
| కోడి మనోజ సమ్మాన రూపే బగు బాజాప కుతాపిరి తాపే | kODi manOja sammAna rUpE bagu bAjApa kutApiri tApE | |
| యిస్మత్తు వాక్కు దాన్ వేస్మందు వాక్కు దాన్ | yismattu vAkku dAn vEsmandu vAkku dAn | |
| తత్వన్‌కే తీతితిలా అచ్చా మిలా తత్వాన్ కే తీతితిలా నమ్మిలా తత్వాన్ కే తీతితిలా | tatvan^kE tItitilA achchA milA tatvAn kE tItitilA nammilA tatvAn kE tItitilA | |
| ఆర్వది లేవుంగా అస్మతి తీతితిలా అచ్చమిలా అస్మతి తీతితిలా నామ మిలా తత్వాన్ కే తీతితిలా | Arvadi lEvungA asmati tItitilA achchamilA asmati tItitilA nAma milA tatvAn kE tItitilA | |