| Title | విచ్చేయవయ్య | vicchEyavayya |
| Written By | అన్నమాచార్య | annamAchArya |
| Book | ||
| రాగం rAga | లలిత | lalita |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | విచ్చేయవయ్య నీవు వేగమె యిందటనైన తచ్చి యిన్నియును సరిదాకె గదవయ్యా | vicchEyavayya nIvu vEgame yindaTanaina tacchi yinniyunu saridAke gadavayyA |
| చరణం charaNam 1 | యింటి మనో రథములు యెంచరాదు పంచరాదు కాంతుడ నీ కురులు లెక్కకు రానట్టు పొంత నాకె తలపోత బుట్టిన విరహములు వింతగా నీ శిరసున వెళ్ళె గదవయ్యా | yinTi manO rathamulu yencharAdu pancharAdu kAntuDa nI kurulu lekkaku rAnaTTu ponta nAke talapOta buTTina virahamulu vintagA nI Sirasuna veLLe gadavayyA |
| చరణం charaNam 2 | చెలి చింతాలత విలి చిక్కులాయ జీరలాయ కెలన రేకలు మైగరలినట్టు అలరి యాకె మదనానలపు బొగలెల్లాను మలికి నీ మేన జుట్టుకొనె గదవయ్యా | cheli chintAlata vili chikkulAya jIralAya kelana rEkalu maigaralinaTTu alari yAke madanAnalapu bogalellAnu maliki nI mEna juTTukone gadavayyA |
| చరణం charaNam 3 | నతికరములు నీ సతు రతుల వెనగె రతి నీ చూపులు మేన రానైనట్టు యితవై శ్రీ వేంకటేశ యిన్నిట మీ యిద్దరికీ సతమైన వలపులు జట్లాయనయ్యా | natikaramulu nI satu ratula venage rati nI chUpulu mEna rAnainaTTu yitavai SrI vEnkaTESa yinniTa mI yiddarikI satamaina valapulu jaTlAyanayyA |