#615 ఐమోళ కుదర్కే aimOLa kudarkE

Titleఐమోళ కుదర్కేaimOLa kudarkE
Written Byవేలూరు కుప్పుస్వామి మొదలారిvElUru kuppuswAmi modalAri
Bookపార్సి సభారంజిత జావళిpArsi sabhAranjita jAvaLi
రాగం rAgaపార్సి నోట్pArsi nOT
తాళం tALaఆదిAdi
ఐమోళ కుదర్కే తోం కే బేష్
మార్ బహార్ వో జీనిసార్
దూరే నియారే పియరే పరువత్తెఆర్
బహార్ అజార్ అజార్ అజార్
aimOLa kudarkE tOm kE bEsh
mAr bahAr vO jInisAr
dUrE niyArE piyarE paruvatteAr
bahAr ajAr ajAr ajAr
పూలసే పూలకే డాలి డాలి
సాదు కే బనా పూల కిలే పిరారి జియే
నిత్తర్ దిన్నా దిన్నా కూల సున్నా సున్నా
వో కుస్ కుమాస్ బహార్ అజార్ అజార్
pUlasE pUlakE DAli DAli
sAdu kE banA pUla kilE pirAri jiyE
nittar dinnA dinnA kUla sunnA sunnA
vO kus kumAs bahAr ajAr ajAr
యే దిల్లయి దిస్ కుమ్ మప్ దుమ్ వో అప్‌ సిమ్ ఐవో
కులసిం కులసిం కులసిం వచలస్కి పియా
రిస్తివో కుస్ కుంబార్ వచలస్కి
పియా రిస్కి పోకుస్ కుమయార్ పార్క్ అజార్ అజార్ అజార్
yE dillayi dis kum&^ map dum&^ vO ap^ sim&^ aivO
kulasim kulasim kulasim vachalaski piyA
ristivO kus kumbAr vachalaski
piyA riski pOkus kumayAr pArk ajAr ajAr ajAr
Lyrics need to be reviewed. Consulting a few people regarding the same

#614 కణ్ణే వరువాయ్ kaNNE varuvAy

Titleకణ్ణే వరువాయ్kaNNE varuvAy
Written Byవేలూరు కుప్పుస్వామి మొదలారిvElUru kuppuswAmi modalAri
Bookపార్సి సభారంజిత జావళిpArsi sabhAranjita jAvaLi
రాగం rAgaపార్సి దర్వుpArsi darvu
తాళం tALaఆదిAdi
కణ్ణే వరువాయ్ యెనైత్తావి వం
దొరు ముత్తం తరువాయ్
పెణ్ణె మోడి సెయ్య తగుమో
మారన్ పావి యన్ మేల్ తూపురాన్
kaNNE varuvAy yenaittAvi vam
doru muttam taruvAy
peNNe mODi seyya tagumO
mAran pAvi yan mEl tUpurAn
ఇదువు మదుపెన్ను పోదుం పోదుం యింద
మదిపు గల వందాయ్ మన్నవా
iduvu madupennu pOdum pOdum yinda
madipu gala vandAy mannavA
ఆను:
కణ్ణే వరువాయ్ యనై తావి
వందొరు ముత్తం తరువాయ్
అంద మన్మదన్ విడుం బాణత్తెయాన్
సగియేన్ అంద మారను యన్ మేల్
వారి తూపురాన్ అడి మాదరనే పెణ్ణె
యేదు యేదు యింద వాదు
సెయ్య తగాదు మన్నవా
Anu:
kaNNE varuvAy yanai tAvi
vandoru muttam taruvAy
anda manmadan viDum bANatteyAn
sagiyEn anda mAranu yan mEl
vAri tUpurAn aDi mAdaranE peNNe
yEdu yEdu yinda vAdu
seyya tagAdu mannavA

#613 పియా ఆవన piyA Avana

Titleపియా ఆవనpiyA Avana
Written Byవేలూరు కుప్పుస్వామి మొదలారిvElUru kuppuswAmi modalAri
Bookపార్సి సభారంజిత జావళిpArsi sabhAranjita jAvaLi
రాగం rAgaహిందుస్థాని దర్వుhindusthAni darvu
తాళం tALaఆదిAdi
పియా ఆవన మెర పియా రాపియారకరో ఆవన
ఆహో కవురావో తవురావో లలుసానో
piyA Avana mera piyA rApiyArakarO Avana
AhO kavurAvO tavurAvO lalusAnO
కవున పియారి దిల్ కుషాయి వారే వారే ఆవనkavuna piyAri dil kushAyi vArE vArE Avana
తడపత్పిర సకిలే కియార్ పైతం మే కుదా కుదాకే
వాస్తే సదాయురే పైతుమే
taDapatpira sakilE kiyAr paitam mE kudA kudAkE
vAstE sadAyurE paitumE
Unsure of original language. Will have it reviewed by few more people

#612 ప్రియసఖి రావే priyasakhi rAvE

Titleప్రియసఖి రావేpriyasakhi rAvE
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviప్రియసఖి రావే భీరా నా శయి జేరంగpriyasakhi rAvE bhIrA nA Sayi jEranga
అనుపల్లవి anupallaviతరియిదె కౌగిట తటానా నను జేర్చంగtariyide kaugiTa taTAnA nanu jErchanga
చరణం
charaNam 1
మారుని బారికి ఓర్వగలేనే మును
నేరము లెన్నకా శీఘ్రామే శయి జేరంగ
mAruni bAriki OrvagalEnE munu
nEramu lennakA SIghrAmE Sayi jEranga
చరణం
charaNam 2
భావము లోనిక తామస మేలనే
జీవము నిలువే శీఘ్రామే శయి జేరంగా
bhAvamu lOnika tAmasa mElanE
jIvamu niluvE SIghrAmE Sayi jErangA
చరణం
charaNam 3
అంగనా మణి నే నలసి సొలసితి
చెంగట జేర్చవే శీఘ్రామే శయి జేరంగ
anganA maNi nE nalasi solasiti
chengaTa jErchavE SIghrAmE Sayi jEranga
చరణం
charaNam 4
చిలుక కటారి నీ కులుకు గుబ్బాలు నా
యురమున గ్రుమ్ముచూ శీఘ్రామే శయి జేరంగా
chiluka kaTAri nI kuluku gubbAlu nA
yuramuna grummuchU SIghrAmE Sayi jErangA
చరణం
charaNam 5
మోహనాంగిరొ నీమోవి పానాక మిచ్చి
భావము రంజిల్లా శీఘ్రామే శయి జేరంగా
mOhanAngiro nImOvi pAnAka michchi
bhAvamu ranjillA SIghrAmE Sayi jErangA
చరణం
charaNam 6
శ్రీ నరసాపురి వరదుని సాక్షిగా
చెలియరొ ప్రాణము నిలువదు వేగమే
SrI narasApuri varaduni sAkshigA
cheliyaro prANamu niluvadu vEgamE
రారా శుభాంగా అను వర్ణమెట్టు rArA SubhAngA anu varNameTTu

#611 ఆడవారిని ADavArini

TitleఆడవారినిADavArini
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఆడవారిని నంమరాదురా
వగలాడి పలుకులాడు వారిని నంమరాదురా
ADavArini nam^marAdurA
vagalADi palukulADu vArini nam^marAdurA
అనుపల్లవి anupallaviఆడజాతిని నమ్మి పురుషులు
జాడ తెలియని రోగములచే
పీడ్తులై దుదముట్ట జాలక
ఈడు ముదరకే మోసపోదురు
ADajAtini nammi purushulu
jADa teliyani rOgamulachE
pIDtulai dudamuTTa jAlaka
IDu mudarakE mOsapOduru
చరణం
charaNam 1
చేత సొమ్మున్నంత సేపేరా రాతీరి పగలని
యెంచకను మరుకేళి దేలురా
chEta sommunannta sEpErA rAtIri pagalani
yenchakanu marukELi dElurA
చరణం
charaNam 2
సతతము నిను నమ్మితి నా పతికి మించిన
ప్రాణ రక్షక బ్రతుక జాలను నిన్ను బాసితె
వెతలు బుట్టకు నీవె దిక్కను
satatamu ninu nammiti nA patiki minchina
prANa rakshaka bratuka jAlanu ninnu bAsite
vetalu buTTaku nIve dikkanu
చరణం
charaNam 3
నమ్మకముతో సొమ్ము దీసేరు
తుదకు వారిని నంమ జాలక బైట దోచేరు
దిమ్మ రానయి తిరుగ రాయని
కుంమరింటికి బోయి క్రొత్త కుండ దెచ్చి
చేతికిచ్చి చటుండ దగదని శాగ దోలేడు
nammakamutO sommu dIsEru
tudaku vArini nam^ma jAlaka baiTa dOchEru
dimma rAnayi tiruga rAyani
kum^marinTiki bOyi krotta kunDa dechchi
chEtikichchi chaTunDa dagadani SAga dOlEDu
చరణం
charaNam 4
మాటలాళిక మళ్ళి పొమ్మననూ యికమీద
నిచ్చట సొచ్చితివని పెండ్లి నిజమనునూ
వెల్లరా నీ ముండ మొయ్యా
యిల్లు చెడ్డది నిన్ను నుంచె
అల్లరేలను నరసపురి శ్రీ
వల్లభునితో జెప్పుకొంమను
mATalALika maLLi pommananU yikamIda
nichchaTa sochchitivani penDli nijamanunU
vellarA nI munDa moyyA
yillu cheDDadi ninnu nunche
allarElanu narasapuri SrI
vallabhunitO jeppukom^manu
నను బ్రోవమని జెప్పవే అను వర్ణమెట్టు nanu brOvamani jeppavE anu varNameTTu

#610 నమ్మరాదే nammarAdE

Titleనమ్మరాదేnammarAdE
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviనమ్మరాదే మగవారినీnammarAdE magavArinI
అనుపల్లవి anupallaviముమ్మాటికినీ మగజాతిని మదిmummATikinI magajAtini madi
చరణం
charaNam 1
ఇమ్మహి సొగసగు కొమ్మలం జూచిన
నమ్మకముగ మాది సమ్మతి పరతురు
immahi sogasagu kommalam jUchina
nammakamuga mAdi sammati paraturu
చరణం
charaNam 2
చిరుత వయస్సు గల చేడెల కెన్నడు
ఎరుగని లీలలు ఏరపటు జేతురు
chiruta vayassu gala chEDela kennaDu
erugani lIlalu ErapaTu jEturu
చరణం
charaNam 3
సరసముచే మది నీరుగ జేతురు
పరిపరి విధముల బాసలు జేతురు
వరసలు గనుగొని వన్నెల జేతురు
sarasamuchE madi nIruga jEturu
paripari vidhamula bAsalu jEturu
varasalu ganugoni vannela jEturu
చరణం
charaNam 4
వప్పకుంటె బహు త్రిప్పలు బడుదురు
తప్పక వాళ్ళకు దండము లిడుదురు
యిప్పటికీ మగజాతి కిదే జిత
vappakunTe bahu trippalu baDuduru
tappaka vALLaku danDamu liDuduru
yippaTikI magajAti kidE jita
చరణం
charaNam 5
రంగు సింగు మచంగలు జూపుచు
వంగుటు వాలుచు చెంగట జేరుచు
దొంగ బాసలచే అంగనా మణులను
భంగ పరచి మరి తొంగి చూడరట
rangu singu machangalu jUpuchu
vanguTu vAluchu chengaTa jEruchu
donga bAsalachE anganA maNulanu
bhanga parachi mari tongi chUDaraTa
చరణం
charaNam 6
పగతులయినను నమ్మవచ్చు
మగజాతిని నమ్ముట తగదు తగదు
శ్రీ నరసాపురి గోపాలుని సాక్షిగ
pagatulayinanu nammavachchu
magajAtini nammuTa tagadu tagadu
SrI narasApuri gOpAluni sAkshiga
రమ్మనవే సామిని అను వర్ణమెట్టు rammanavE sAmini anu varNameTTu

#609 ఇద్దారితో పొందు iddAritO pondu

Titleఇద్దారితో పొందుiddAritO pondu
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaమధ్యాది ఏకmadhyAdi Eka
పల్లవి pallaviఇద్దారితో పొందు వద్దూర నాసామిiddAritO pondu vaddUra nAsAmi
అనుపల్లవి anupallaviబుధ్ధి దెచ్చుక దాని యొద్దాకె పోపోర
రాపేల దానితో రాబోకు రాబోకు
budhdhi dechchuka dAni yoddAke pOpOra
rApEla dAnitO rAbOku rAbOku
చరణం
charaNam 1
మగనాలి నాతోను వగలేల జేసేవు
అగరు గంధము బూసి అంట రాకు సామి
మగవారు జూచితె యిక లేదు నా బ్రతుకు అయ్యయ్యో
maganAli nAtOnu vagalEla jEsEvu
agaru gandhamu bUsi anTa rAku sAmi
magavAru jUchite yika lEdu nA bratuku ayyayyO
చరణం
charaNam 2
రావేల నాతోను రాజాగోపాల
రేపయిన వకసారీ రారాద పోరేల సరిసారి
rAvEla nAtOnu rAjAgOpAla
rEpayina vakasArI rArAda pOrEla sarisAri
చరణం
charaNam 3
ఓరీ నాసామి యీ ఊరిలోగ వయసు
వనితాలెల్లా నీకు వదినా మరదిండ్లెన
వన్నెకాడ నరసాపుర వాస సరిసరి యిక చాలు
OrI nAsAmi yI oorilOga vayasu
vanitAlellA nIku vadinA maradinDlena
vannekADa narasApura vAsa sarisari yika chAlu
నీతోటి నూమాలు నాకేలరా అను వర్ణమెట్టు nItOTi nUmAlu nAkElarA anu varNameTTu

#608 ఏడు నాళాయే EDu nALAyE

Titleఏడు నాళాయేEDu nALAyE
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఅటaTa
పల్లవి pallaviఏడు నాళాయే ఈ వేళాకు ననుబాసిEDu nALAyE I vELAku nanubAsi
అనుపల్లవి anupallaviవేదూకగత్తెలు ఎందారయినారోvEdUkagattelu endArayinArO
చరణం
charaNam 1
ఏవేళ రతి మాన యెరుగావు ననుబాసి
యీవేళ వరకు నీవట్టే యుంటివ సామీ
EvELa rati mAna yerugAvu nanubAsi
yIvELa varaku nIvaTTE yunTiva sAmI
చరణం
charaNam 2
చిన్ననాడె నాకా చిన్నెలన్నియు నేర్పి
నీరీతి విడనాడుటిది న్యాయమగునే వన్నెకాడ
నాతో వాదు చేసితె గాని వనితాలిండ్లకు
బోవా వల్లగాదని యెంచి
chinnanADe nAkA chinnelanniyu nErpi
nIrIti viDanADuTidi nyAyamagunE vannekADa
nAtO vAdu chEsite gAni vanitAlinDlaku
bOvA vallagAdani yenchi
చరణం
charaNam 3
బొంకు లేటికి నీవు పోయినప్పటి నుండి
మంకు పనులు జేయ మరిగితివి స్వామి
జంకులెల్లా మాని యా జలజాక్షులను గూడి
చెలగి యా పనులెల్లా చెల్లించుటకు బోయి
bonku lETiki nIvu pOyinappaTi nunDi
manku panulu jEya marigitivi swAmi
jankelellA mAni yA jalajAkshulanu gUDi
chelagi yA panulellA chellinchuTaku bOyi
చరణం
charaNam 4
మరచి యుండుదమంటె మర్లు మించుచునుండె
మరుని బారిని నోర్వజాలరా సామీ
వరదుడౌ శ్రీ నరసాపుర వేణుగోపాల
అరమరలిక మాని ఆదారించవే సామి
marachi yunDudamanTe marlu minchuchununDe
maruni bArini nOrvajAlarA sAmI
varaduDau SrI narasApura vENugOpAla
aramaralika mAni AdArinchavE sAmi
ఏమిరా నీతీరు అను వర్ణమెట్టు EmirA nItIru anu varNameTTu

#607 సారెసారెకు వాని sAresAreku vAni

Titleసారెసారెకు వానిsAresAreku vAni
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఅటaTa
పల్లవి pallaviసారెసారెకు వాని చరితాముల్ నా ముందూ
చెల్లాదు పొమ్మానవె
sAresAreku vAni charitAmul nA mundU
chellAdu pommAnave
అనుపల్లవి anupallaviపోరు జేసి రాత్రి పోయి చేరిన
పొలతి ఇల్లిది గాదనవె
pOru jEsi rAtri pOyi chErina
polati illidi gAdanave
చరణం
charaNam 1
ఎన్నాడైన వాని నెదిరించి నే
చిన్నామెత్తు మాటన్నానటే
వన్నెలాడి వలపులెన్ని దిట్టిన గాని
వెన్న ముద్దులు గావటె
ennADaina vAni nedirinchi nE
chinnAmettu mATannAnaTE
vannelADi valapulenni diTTina gAni
venna muddulu gAvaTe
చరణం
charaNam 2
వాని రాకా జూడగనె నేనే భీతిని
పడకటిల్లూ జేరుట లేదటే
యేకమయిన ప్రొద్దు యడ లేని
సౌఖ్యము లెల్లా జెప్పగ లేదటె వాదటె నాతో
vAni rAkA jUDagane nEnE bhItini
paDakaTillU jEruTa lEdaTE
yEkamayina proddu yaDa lEni
saukhyamu lellA jeppaga lEdaTe vAdaTe nAtO
చరణం
charaNam 3
గూటా చిలుక వలె కుదిరి నేనుండంగా
కుటిలాము దలపోసే నే మాటా మాత్రమే పోయి
మగనాలితో చేరె మంచిది యిక చూతునే
gUTA chiluka vale kudiri nEnunDangA
kuTilAmu dalapOsE nE mATA mAtramE pOyi
maganAlitO chEre manchidi yika chUtunE
చరణం
charaNam 4
ఇల నరసాపుర వాసుడింతా జేసెనటంటే
ఈ తీరుగాకుందునే
సలలీతముగ వెంకటస్వామి వరదూని
చాగి పోనీయకుందునే
ila narasApura vAsuDintA jEsenaTanTE
I tIrugAkundunE
salalItamuga venkaTaswAmi varadUni
chAgi pOnIyakundunE
వారివారి జోలి నాకేరా అను వర్ణమెట్టు vArivAri jOli nAkErA anu varNameTTu

#606 అంతలో మాయ antalO mAya

Titleఅంతలో మాయantalO mAya
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఅటaTa
పల్లవి pallaviఅంతలో మాయ నిదుర వచ్చెనె చెలి
కొంతైన మరుకేళి తమి దీరలేదే
antalO mAya nidura vachchene cheli
kontaina marukELi tami dIralEdE
అనుపల్లవి anupallaviఎంతెంతో లాలించి వత్తి కౌగిట జేర్చి
సంతోషమున సామి కేళి సల్పిన దెరుక
ententO lAlinchi vatti kaugiTa jErchi
santOshamuna sAmi kELi salpina deruka
చరణం
charaNam 1
వరుడు నా పడకింటి కొచ్చుట గని
లేచి యెదురుగ జని మ్రొక్కి వడి కౌగలించి
వడిలో జేర్చుక ఆకు మడిచి యిచ్చి
పానుపు నడుమ జీరి నాధుడదిమి పట్టిన వేళ
varuDu nA paDakinTi kochchuTa gani
lEchi yeduruga jani mrokki vaDi kaugalinchi
vaDilO jErchuka Aku maDichi yichchi
pAnupu naDuma jIri nAdhuDadimi paTTina vELa
చరణం
charaNam 2
మరుని జనకుడు నాదు మందిరమున కొచ్చి
సరుగున చందోయి సవరించ గానే
పరిపరి విధమూలా రంజిల్లా
పటపట రవికే ముడి వీడి జారాగా
maruni janakuDu nAdu mandiramuna kochchi
saruguna chandOyi savarincha gAnE
paripari vidhamUlA ranjillA
paTapaTa ravikE muDi vIDi jArAgA
చరణం
charaNam 3
తమకా మగ్గల మాయె తాళాదే నామది
నిమిషమేడౌచుంది నిలువ నా తరమా
ఏమయిన గానిమ్ము సామిని దెమ్మాని
భామరో నేనంత బంగా పోతినే చెలి
tamakA maggala mAye tALAdE nAmadi
nimishamEDauchundi niluva nA taramA
Emayina gAnimmu sAmini demmAni
bhAmarO nEnanta bangA pOtinE cheli
చరణం
charaNam 4
నమ్మీతి నా సామి కమ్మితి నా మేను
సొమ్మూగ నేలు వెంకటస్వామి బాలుడి
మ్మాహిలో మిమ్ము రమ్మాని మొరలిడ
మమ్ము చేరిన మదన గోపాలుడని
దెలిసి నంతలోనే మాయ నిదురా
nammIti nA sAmi kammiti nA mEnu
sommUga nElu venkaTaswAmi bAluDi
mmAhilO mimmu rammAni moraliDa
mammu chErina madana gOpAluDani
delisi nantalOnE mAya nidurA
ఏమిరా నీ తీరు అను వర్ణమెట్టు EmirA nI tIru anu varNameTTu