| Title | అపుడేమనె | apuDEmane |
| Written By | అన్నమాచార్య | annamAchArya |
| Book | . | . |
| రాగం rAga | ఆహిరి | Ahiri |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | అపుడేమనె నేమనుమను తపమే విరహ తాపమనె | apuDEmane nEmanumanu tapamE viraha tApamane |
| చరణం charaNam 1 | పవనజ ఏమనెనె పడతి మరేమనె అవనిజ నిను నేమనుమనెను రవి కులేంద్ర భారము ప్రాణంబనె ఇవల నెట్లు ధరియించే ననె | pavanaja Emanene paDati marEmane avanija ninu nEmanumanenu ravi kulEndra bhAramu prANambane ivala neTlu dhariyinchE nane |
| చరణం charaNam 2 | యింకా యేమనె యింతి మరేమనె కొంకక యేమని కొసరు మనె బొంకుల దేహము పోదిది వేగనె చింక వేట యిటు చేసెననె | yinkA yEmane yinti marEmane konkaka yEmani kosaru mane bonkula dEhamu pOdidi vEgane chinka vETa yiTu chEsenane |
| చరణం charaNam 3 | నను నేమనె ప్రాణము మన కొకటనె తనకు నీవలెనె తాపమనె మను కులేశ ప్రేమవు మన కూటమి ఘన వేంకట గిరి గంటిననె | nanu nEmane prANamu mana kokaTane tanaku nIvalene tApamane manu kulESa prEmavu mana kUTami ghana vEnkaTa giri ganTinane |
1298 ఎక్కడ తాళుదునే ekkaDa tALudunE
| Title | ఎక్కడ తాళుదునే | ekkaDa tALudunE |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | సావేరి | sAVEri |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఎక్కడ తాళుదునే యేమని దూరుదునే | ekkaDa tALudunE yEmani dUrudunE |
| అనుపల్లవి anupallavi | మ్రొక్కిన నాడు కేగిలీడు మువ్వ గోపాలుడో చెలియ | mrokkina nADu kEgilIDu muvva gOpAluDO cheliya |
| చరణం charaNam 1 | దయ గోరింతైన లేదాయె వట్టి తచ్చనలే ఘనమాయ ప్రియముతో నను జూడడాయ ప్రేమతో చేపట్టడా వచ్చో చెలియ | daya gOrintaina lEdAye vaTTi tacchanalE ghanamAya priyamutO nanu jUDaDAya prEmatO chEpaTTaDA vacchO cheliya |
| చరణం charaNam 2 | బతిమాలిన రాడాయ నన్ను పగవాడై యల కంతుడేయ హితవని నన్నేలడాయ యెంతటి మాయయో చెలియ | batimAlina rADAya nannu pagavADai yala kantuDEya hitavani nannElaDAya yentaTi mAyayO cheliya |
| చరణం charaNam 3 | కూడియున్నదే వెగటాయ నేను విడెమిచ్చిన నీల్లుడాయ మోడిచేసి మువ్వ గోపాలుడు నా మోహ మెన్నడాయెనో చెలియ | kUDiyunnadE vegaTAya nEnu viDemicchina nIlluDAya mODichEsi muvva gOpAluDu nA mOha mennaDAyenO cheliya |
1297 నిన్ను నే మరతునా ninnu nE maratunA
| Title | నిన్ను నే మరతునా | ninnu nE maratunA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | మఠ్య | maThya |
| పల్లవి pallavi | నిన్ను నే మరతునా ఓ చెలియా | ninnu nE maratunA O cheliyA |
| అనుపల్లవి anupallavi | నిన్ను నే సొమ్ముగ జేసి వేంకట నాథ రారాయనిన జాణవు | ninnu nE sommuga jEsi vEnkaTa nAtha rArAyanina jANavu |
| చరణం charaNam 1 | పొలతిరో నీ గుణ మరయ వలసి అలుక జేసి కన్నెర్ర జేసితె పలుకక యూరకుండి నపుడె పణుతురో జేరి కిలకిల నవ్వుచు సారెను చక్కిలి గింత లిడుచు నన్ను తరుణి గుబ్బల రొమ్మున గుమ్మి దక్కించు కొన్న చలపాదిని | polatirO nI guNa maraya valasi aluka jEsi kannerra jEsite palukaka yUrakunDi napuDe paNuturO jEri kilakila navvuchu sArenu chakkili ginta liDuchu nannu taruNi gubbala rommuna gummi dakkinchu konna chalapAdini |
| చరణం charaNam 2 | మొదల తరితీపు సేయ మాయ నిదుర దెచ్చున పవ్వళించితే అది తెలిసి నీవు నా కెమ్మోవి ఆన వచ్చితే పెదవులు రెండు గట్టిగ బట్టి వదన మిట్టట్టు ద్రిప్పనీయక గదిమి యదిమి మోవి యాని విదలించి వేసిన హొంతకారివి | modala taritIpu sEya mAya nidura decchuna pavvaLinchitE adi telisi nIvu nA kemmOvi Ana vacchitE pedavulu renDu gaTTiga baTTi vadana miTTaTTu drippanIyaka gadimi yadimi mOvi yAni vidalinchi vEsina hontakArivi |
| చరణం charaNam 3 | వెలయు మువ్వ గోపాలుడైన వేంకటేశ గోప భావమల నలయక పదునారు వేల గూడి ఆవయిన గానిమ్మని కలయ వేళ నేమో కొన్ను కథల చేత జాగు చేసి సాలయన రతుల గూడి నన్ను జూడర నా మార్గమనిన జాణవు | velayu muvva gOpAluDaina vEnkaTESa gOpa bhAvamala nalayaka padunAru vEla gUDi Avayina gAnimmani kalaya vELa nEmO konnu kathala chEta jAgu chEsi sAlayana ratula gUDi nannu jUDara nA mArgamanina jANavu |
1296 ఇంతిరో వరదునికి intirO varaduniki
| Title | ఇంతిరో వరదునికి | intirO varaduniki |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ధన్యాసి | dhanyAsi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఇంతిరో వరదునికి నీపై నెంత మోహమే సంతతంబని వెత జూడ జాలక యిందు వచ్చితిని | intirO varaduniki nIpai nenta mOhamE santatambani veta jUDa jAlaka yindu vacchitini |
| చరణం charaNam 1 | చెక్కిట చేయి చేర్చుకొనెను చిరు నవ్వు నవ్వుకొనెను అక్కట నే దలచినట్లే నైరాదనెను మక్కువ మును చేసిన చెలిమి మరపు రాదాయనెను చక్కని ఈ చెలిని గూడని జన్మమేటి జన్మమనెను | chekkiTa chEyi chErchukonenu chiru navvu navvukonenu akkaTa nE dalachinaTlE nairAdanenu makkuva munu chEsina chelimi marapu rAdAyanenu chakkani I chelini gUDani janmamETi janmamanenu |
| చరణం charaNam 2 | పడతి యుండుండి నేనేమి పాపము జేసితి ననెను తడవు నిన్నెడ బాసి తాళ లేననెను నడువ నోరాడదనెను నొసట చేయించుకొనెను అడిగితె మీరేమైన నార్చేరో తీర్చేరో యనెను | paDati yunDunDi nEnEmi pApamu jEsiti nanenu taDavu ninneDa bAsi tALa lEnanenu naDuva nOrADadanenu nosaTa chEyinchukonenu aDigite mIrEmaina nArchErO tIrchErO yanenu |
| చరణం charaNam 3 | పలవరించుచు మా మువ్వ గోపాలుడైన వరదుడు నళినాక్షి! యానాటి వింత నడుచునో యనెను తలచి యసురుసురు మనెను దైవమిట్ల చేసెననెను వలపనే పాపము పగ వారికైన గారాదనెను (2) | palavarinchuchu mA muvva gOpAluDaina varaduDu naLinAkshi! yAnATi vinta naDuchunO yanenu talachi yasurusuru manenu daivamiTla chEsenanenu valapanE pApamu paga vArikaina gArAdanenu (2) |
1295 ఇంక నిన్ను inka ninnu
| Title | ఇంక నిన్ను | inka ninnu |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఇంక నిన్ను బోనిత్తునా – యిభరాజ వరదా శుక వాణి చేత నీ సుద్దు లెల్ల విన్నట్లాయె | inka ninnu bOnittunA – yibharAja varadA Suka vANi chEta nI suddu lella vinnaTlAye |
| చరణం charaNam 1 | నవ్వులంట యున్నావేమొ నా పద్దు చూడు మీసారి పువ్వు బోడుల చేత రవ్వ సయించమాన | navvulanTa yunnAvEmo nA paddu chUDu mIsAri puvvu bODula chEta ravva sayinchamAna |
| చరణం charaNam 2 | జవ్వన మెల్ల నీ పాలు చేసి చాల నమ్మ యున్నందు కెవ్వతి తోనో కూడి వచ్చి యిపుడు లేదని బొంకేవు | javvana mella nI pAlu chEsi chAla namma yunnandu kevvati tOnO kUDi vacchi yipuDu lEdani bonkEvu |
| చరణం charaNam 3 | పన్నుగ మువ్వ గోపాల బాసలచ్చి నన్ను గూడి వన్నెలాడికే లోనైన వగలెల్ల విన్నార నేడు | pannuga muvva gOpAla bAsalacchi nannu gUDi vannelADikE lOnaina vagalella vinnAra nEDu |
1294 ఈ మాట I mATa
| Title | ఈ మాట | I mATa |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ఘంటారవ | ghanTArava |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఈ మాట వలన ఫలమిక నేమి కద్దు | I mATa valana phalamika nEmi kaddu |
| అనుపల్లవి anupallavi | భామరో చాలు మువ గోపాలు పొందే మనకు వద్దు | bhAmarO chAlu muva gOpAlu pondE manaku vaddu |
| చరణం charaNam 1 | వామాక్షిరో! వాడీడకు వచ్చే మనసు లేదు రామ వాడు రాదలచితే రానిచ్చేది కాదు ఏమో నాటి కాయా ఫల మింక బని లేదు నా మేలు వానిపై నింక నాటి యండగ బోతు | vAmAkshirO! vADIDaku vacchE manasu lEdu rAma vADu rAdalachitE rAnicchEdi kAdu EmO nATi kAyA phala minka bani lEdu nA mElu vAnipai ninka nATi yanDaga bOtu |
| చరణం charaNam 2 | వనజాక్షిరో! వాని కొరకై దిన దిన మీ పోరు కని విని మీరెందరైన గాదనగ లేరు చెనకి వానితో నను మోడి చేసుకొమ్మనేరు చనువు లేని చోట యింత చలమెట్ల యీడేరు | vanajAkshirO! vAni korakai dina dina mI pOru kani vini mIrendaraina gAdanaga lEru chenaki vAnitO nanu mODi chEsukommanEru chanuvu lEni chOTa yinta chalameTla yIDEru |
| చరణం charaNam 3 | ఎంత లాలించి కూడిన హితవు మాట నున్న వింత మువ్వ గోపాలుని విధములు నేవిన్న అంతరంగము శోధించి ఊలసిత నేవిన్న రంతు సేయక చిత్తము రాయి చేసుకున్న | enta lAlinchi kUDina hitavu mATa nunna vinta muvva gOpAluni vidhamulu nEvinna antarangamu SOdhinchi ualasita nEvinna rantu sEyaka chittamu rAyi chEsukunna |
1293 ఇంత నా inta nA
| Title | ఇంత నా | inta nA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | ఇంత నా పొరుగింటనే తావు లేనట్లె | inta nA poruginTanE tAvu lEnaTle |
| అనుపల్లవి anupallavi | ఇంతనా పొరుగింటనే ఇంత విజయ రాఘవేంద్రుని మింత | intanA poruginTanE inta vijaya rAghavEndruni minta |
| చరణం charaNam 1 | ప్రొద్దు పోదు గాబోలు నమ్మ దాని వద్ద నున్న సుద్దులే అందు చేత నిద్దుర పట్టక నేనుంటా దానికి ముద్దు మీద ముద్దులే అది సద్దు వినలేక సఖియ యింట నుండి | proddu pOdu gAbOlu namma dAni vadda nunna suddulE andu chEta niddura paTTaka nEnunTA dAniki muddu mIda muddulE adi saddu vinalEka sakhiya yinTa nunDi |
| చరణం charaNam 2 | వారిజ ముఖి ననావలె నంట కేరడంపు నవ్వులె దానింట క వారి కుంకుమ కస్తూరి గాక మితి మేర లేని పువ్వులే సారెకు నా యింటి వాసన లిందు వచ్చితె ఓరువ జాలక యువిద యింటనుండిత | vArija mukhi nanAvale nanTa kEraDampu navvule dAninTa ka vAri kumkuma kastUri gAka miti mEra lEni puvvulE sAreku nA yinTi vAsana lindu vacchite Oruva jAlaka yuvida yinTanunDita |
| చరణం charaNam 3 | భావజు కేళి నా పడతి కూడే వేళ పావురంపు పలుకులే ఆ వేళ విడువుమని నమ్మిక లిమ్మని ఆమెకెంత కులుకులే నా వద్దకి రాడో నాతో మాటాడడో విజయ రాఘవుడెల మీతో నుండేది | bhAvaju kELi nA paDati kUDE vELa pAvurampu palukulE A vELa viDuvumani nammika limmani Amekenta kulukulE nA vaddaki rADO nAtO mATADaDO vijaya rAghavuDela mItO nunDEdi |
1292 వదరక పోపోవే vadaraka pOpOvE
| Title | వదరక పోపోవే | vadaraka pOpOvE |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | వదరక పోపోవే వాదేల వచ్చీని వద్ద రావద్దనవే | vadaraka pOpOvE vAdEla vacchIni vadda rAvaddanavE |
| అనుపల్లవి anupallavi | అది యొక్క యుగము వేరే జన్మ మిపుడు అతడెవ్వరో నేనెవ్వరో ఓ చెలియా | adi yokka yugamu vErE janma mipuDu ataDevvarO nEnevvarO O cheliyA |
| చరణం charaNam 1 | నిచ్చ నిచ్చలుడే వచ్చొని రేపైన వచ్చీననుచు మదిలో నిచ్చగాబలు వేడి నిట్టూర్పుల చేత యింతిరో పెదవు తిండి హెచ్చైన వెన్నెల చిచ్చుల రాత్రులు యెన్నెన్నో గడిపితినిక నేట మాటలే | niccha nicchaluDE vacchoni rEpaina vacchInanuchu madilO nicchagAbalu vEDi niTTUrpula chEta yintirO pedavu tinDi hecchaina vennela chicchula rAtrulu yennennO gaDipitinika nETa mATalE |
| చరణం charaNam 2 | వలపుకాడితే కదా వచ్చు ననుచు తెరువులు చూచి వేసారితి వెల తెరిచి యలసితి నిలువరాని ప్రేమ నెమ్మిది నడచుకొంటి కలకంఠ పిక నాదములు మించు మధు మాసములు గడపితే వట్టి ముచ్చటలికనేతే | valapukADitE kadA vacchu nanuchu teruvulu chUchi vEsAriti vela terichi yalasiti niluvarAni prEma nemmidi naDachukonTi kalakanTha pika nAdamulu minchu madhu mAsamulu gaDapitE vaTTi mucchaTalikanEtE |
| చరణం charaNam 3 | భామరో శకునము లడిగితి మువ్వ గోపాలుడు వచ్చుననుచు కామించి నాథుని గలయు చెలిల చూచి కరగి చింత నొందితి రామరామ యీ మేనితో వాని మేమి చూడవలెనా మొదటి పొందే శాలు వదరక పోపోదే | valapukADitE kadA vacchu nanuchu teruvulu chUcho vEsAriti vela terichi yalasiti niluvarAni prEma nemmidi naDachukonTi kalakanTha pika nAdamulu minchu madhu mAsamulu gaDapitE vaTTi mucchaTalikanEtE |
1291 మేరగాదు రమ్మనవే mEragAdu rammanavE
| Title | మేరగాదు రమ్మనవే | mEragAdu rammanavE |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | మేరగాదు రమ్మనవే నా సామిని | mEragAdu rammanavE nA sAmini |
| అనుపల్లవి anupallavi | మోర తోపు సేయక మువ్వ గోపాల సామిని | mOra tOpu sEyaka muvva gOpAla sAmini |
| చరణం charaNam 1 | అలిగే వారలు లేరో అంతలోనే సమ్మతించి కలిసే వారు లేరో కలికిరో యిపుడు చలపట్టి యిందు రాడు చాల మ్రొక్కిన వినడు వల రాజు బారి కోర్వ వశము గాదో యమ్మ | aligE vAralu lErO antalOnE sammatinchi kalisE vAru lErO kalikirO yipuDu chalapaTTi yindu rADu chAla mrokkina vinaDu vala rAju bAri kOrva vaSamu gAdO yamma |
| చరణం charaNam 2 | నెనరున నేనొక్కటంటే నెలత యందే నెపము చేసి అనరాని మాటలాడి అలయించెనే వనిత మోహాంబుధిలో మునిగి యెట్లోర్చు దాన తనవంటి సామికిది తగవు కాదే కొమ్మా | nenaruna nEnokkaTanTE nelata yandE nepamu chEsi anarAni mATalADi alayinchenE vanita mOhAmbudhilO munigi yeTlOrchu dAna tanavanTi sAmikidi tagavu kAdE kommA |
| చరణం charaNam 3 | మమతతో జిన్ననాడే మచ్చిక చేసి నన్ను సమరతుల నేలినట్టి చనువుగ నను గమకించి మోవి పంటగంటి జేసితినని రమణి! మువ్వ గోపాలుడు రాక పరాకు జేసెనే | mamatatO jinnanADE macchika chEsi nannu samaratula nElinaTTi chanuvuga nanu gamakinchi mOvi panTaganTi jEsitinani ramaNi! muvva gOpAluDu rAka parAku jEsenE |
1289 పలుకరించిన palukarinchina
| Title | పలుకరించిన | palukarinchina |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | పలుకరించిన గాని పలుకక పొయ్యేవు పడతి నీ గర్వమేమే | palukarinchina gAni palukaka poyyEvu paDati nI garvamEmE |
| అనుపల్లవి anupallavi | తలచిన వేయారు తరుణుల చేకొన్న కలిగి గోపాలు చనవలె నటీ నా పేరు | talachina vEyAru taruNula chEkonna kaligi gOpAlu chanavale naTI nA pEru |
| చరణం charaNam 1 | తియ్యని కెమ్మైని తేనెలానగను సయ్యాటల ప్రొద్దు జరుప నోపవా పయ్యదను తొలగించి పాలిండ్లపై నొక్క చెయ్యి నేనటు వెయ్య నిచ్చెదనా | tiyyani kemmaini tEnelAnaganu sayyATala proddu jarupa nOpavA payyadanu tolaginchi pAlinDlapai nokka cheyyi nEnaTu veyya nicchedanA |
| చరణం charaNam 2 | మోము మోమున జేర్చి ముద్దు పెట్టుచు నీవు వేమారు నన్ను నవ్వించ నోపుదువా భామరో యొకసారి పలుకులు పలుకుచు ప్రేమతో రామన్న పిలుప పంపెదవా | mOmu mOmuna jErchi muddu peTTuchu nIvu vEmAru nannu navvincha nOpuduvA bhAmarO yokasAri palukulu palukuchu prEmatO rAmanna pilupa pampedavA |
| చరణం charaNam 3 | ఎక్కువగా నన్నేలుకొమ్మన్న గ్రక్కున గళబంట కౌగలించెదవా మక్కువ తోడుత మువ్వ గోపాల రమ్మని యొక్కసారైన నను నుండనిచ్చెదవా | ekkuvagA nannElukommanna grakkuna gaLabanTa kougalinchedavA makkuva tODuta muvva gOpAla rammani yokkasAraina nanu nunDanicchedavA |