| Title | నాణెమైన వలపుల | nANemaina valapula |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | నాణెమైన వలపుల చెలిరా నిను జాణవనుచు పిలువమనెరా ఆణిముత్తియంబులు పలుతీరు అందమైన నూగారు పాణులు పల్లవ మది రుచులూరు వాణిని తేనెలుగారు | nANemaina valapula chelirA ninu jANavanuchu piluvamanerA ANimuttiyambulu palutIru amdamaina nUgAru pANulu pallava madi ruchulUru vANini tEnelugAru |
| 2 | కాముక హృత్కల్పము తనువల్లి మోము పండుజాబిల్లి శ్రీమించిన సుగుణ గణముతల్లి హేమగదర యిదితొల్లి | kAmuka hRtkalpamu tanuvalli mOmu panDujAbilli SrIminchina suguNa gaNamutalli hEmagadara yiditolli |
| 3 | గోరులు తారలచాలగ నేలు గోలు పల్కులవరాలు బారు కురులు నిగ నిషనీలాలు బాలవయసు నీపాలు | gOrulu tAralachAlaga nElu gOlu palkulavarAlu bAru kurulu niga nishanIlAlu bAlavayasu nIpAlu |
| 4 | తావి చనురబరిణెల బిరడాలు మోవికెంపు పగడాలు నీవు గవదయగు సఖి మెయిడాలు లేవు గదర తేడాలు | tAvi chanurabariNela biraDAlu mOvikempu pagaDAlu nIvu gavadayagu sakhi meyiDAlu lEvu gadara tEDAlu |
| 5 | కాంచిన మును నిరసించుర యొడలు అంచనేరు దానడలు మించు రంభల హసించుర తొడలు యెంచితి విరనలడలు | kAmchina munu nirasimchura yoDalu anchanEru dAnaDalu minchu rambhala hasimchura toDalu yemchiti viranalaDalu |
| 6 | మున్ను నుంచి కాపురమీయూరు ముద్దుగుమ్మరా పేరు కన్నెను జూడ తయారగు తేరు కన్నులకు కరువులేదు | munnu numchi kApuramIyUru muddugummarA pEru kannenu jUDa tayAragu tEru kannulaku karuvulEdu |
| 7 | భామా హృత్పంకజ హర్షా ద్విభాషి పుల్లకవి పోషా కామిత ఫలదాయక గత రోషా భూమిజా మనోల్లాసా | bhAmA hRtpankaja harshA dvibhAshi pullakavi pOshA kAmita phaladAyaka gata rOshA bhUmijA manOllAsA |
#314 చెలువుని తోడితేవె cheluvuni tODitEve
| Title | చెలువుని తోడితేవె | cheluvuni tODitEve |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | అట | aTa |
| 1 | చెలువుని తోడి తేవె కలహంస గమనరొ వల రాచకేళికి వలపించి పూశయ్యకు | cheluvuni tODi tEve kalahamsa gamanaro vala rAchakELiki valapimchi pUSayyaku |
| 2 | దవ్వుల జూచినానే నవ్వు మొగము వాడే జవ్వనమయిన వాడే వహ్వరి తగిన జోడే | davvula jUchinAnE navvu mogamu vADE javvanamayina vADE vahvari tagina jODE |
| 3 | కామిని వాని మోము శోమునితో సమము కాముని సుందరము కనగల్గెనే మోహము | kAmini vAni mOmu SOmunitO samamu kAmuni sumdaramu kanagalgenE mOhamu |
| 4 | తారక వేగోరులు హారాణి పల్తీరులు చేరావె కన్బారులు నీరదముల్ కురులు | tAraka vEgOrulu hArANi paltIrulu chErAve kan&bArulu nIradamul kurulu |
| 5 | తీరైన పలుకులు తేనియ లొలుకులు తోరంపు చూడ్కులు మారుని పూముల్కులు | tIraina palukulu tEniya lolukulu tOrampu chUDkulu mAruni pUmulkulu |
| 6 | కాపాడుమా దేహము కాకున్న చేద్రోహము చూపగదే స్నేహము ఆపలేనే మోహము | kApADumA dEhamu kAkunna chEdrOhamu chUpagadE snEhamu ApalEnE mOhamu |
| 7 | ద్విభాషి పుల్లకవి ప్రాభవుడౌ భారవి శోభిత గుణ పద్మనాభునీ శ్రీవిభుని | dvibhAshi pullakavi prAbhavuDau bhAravi SObhita guNa padmanAbhunI SrIvibhuni |
#313 పంతమా నాపై pamtamA nApai
| Title | పంతమా నాపై | pamtamA nApai |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | బిళహరి | biLahari |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | పంతమా నాపై వన్నెకాడా కాంతుడెంతో గాసిజేసె | pamtamA nApai vannekADA kAmtuDemtO gAsijEse |
| చరణం charaNam 1 | వలచి నిను కోరి వచ్చినందుకా పలుచ జేసి పలుకకున్నావు | valachi ninu kOri vachchinamdukA palucha jEsi palukakunnAvu |
| చరణం charaNam 2 | అల్లదాని యిల్లు చేరిన నీ యెల్ల రెరుగు నీ యుల్లాసిల్లేవు | alladAni yillu chErina nI yella rerugu nI yullAsillEvu |
| చరణం charaNam 3 | కమ్మ కెమ్మోవి కందిన గురుతులు కమ్మ దలచి యిట్లు గారడి చేసేవు | kamma kemmOvi kamdina gurutulu kamma dalachi yiTlu gAraDi chEsEvu |
| చరణం charaNam 4 | శేషశయన ద్విభాషి పుల్లకవిపోషా గోపాల పోరాటమేరా | SEshaSayana dvibhAshi pullakavipOshA gOpAla pOrATamErA |
#312 కోపమేలరా kOpamElarA
| Title | కోపమేలరా | kOpamElarA |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | కోపమేలరా నాపైని నా మనోహరా ఆపరాని మోహ విరహ తాప మందుచుంటిరా ఇంత కోపమేలరా | kOpamElarA nApaini nA manOharA AparAni mOha viraha tApa manduchunTirA inta kOpamElarA |
| చరణం charaNam 1 | సంతతంబు నిన్నె కోరి చెంత చేరి యుంటిరా వింత కౌగిలింతతో మరింత వలపుమించెరా యింత | samtatambu ninne kOri chemta chEri yunTirA vimta kaugilimtatO marinta valapumincherA yimta |
| చరణం charaNam 2 | హెవెన్ మన్యు నుండి నీకు లెటర్స్ బంపగా నెవర్ మైండ్ లవర్ ఫ్రెండ్‌ని యువర్ విల్‌గాగ వయు రావైతివి | heven manyu numDi nIku leTars bampagA nevar mainD lavar frenD^ni yuvar vil^gAga vayu rAvaitivi |
| చరణం charaNam 3 | పొదన్ పొదన్ గదల్చి తుమ్మెదల్ రొదల్ మొదల్పగా మొదల్ మరుండెదన్ శరాల్ గుదుల్ గుదుల్ గుదుల్ గదున్చెరా | podan podan gadalchi tummedal rodal modalpagA modal marunDedan SarAl gudul gudul gudul gadun&cherA |
| చరణం charaNam 4 | ఆస బాస జేసి యీని రాస నీ విలాసమా కేశవా ద్విభాషి పుల్లకవీశ మద్వికాసమా | Asa bAsa jEsi yIni rAsa nI vilAsamA kESavA dvibhAshi pullakavISa madvikAsamA |
#311 మందయాన mandayAna
| Title | మందయాన | mandayAna |
| Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
| Book | dvibhAshyamNoBook | |
| రాగం rAga | అఠాణ | aThANa |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మందయాన నీ పొందుగోరి నను బంపింది రార సామీ | mandayAna nI pondugOri nanu bampimdi rAra sAmI |
| చరణం charaNam 1 | మందయాన నీ పొందుగోరినది పసందు మీరిన అందగత్తెర సందడించి రతులందమంద నందరసము పొలుపొందజేయ విను గొందువనుచు నీయందు చాల భ్రమ జెంది నాతొ దెల్పింది నన్ను బంపింది వహ్వ పూసింది నిన్ను రమ్మంది సుందరరాచెందొవ విందుచే కందియుందిరా నీయందు ప్రేమచే చిందర వందర చెందం పొందర | mandayAna nI pondugOrinadi pasandu mIrina andagattera samdaDimchi ratulamdamamda namdarasamu polupomdajEya vinu gomduvanuchu nIyamdu chAla bhrama jemdi nAto delpindi nannu bampindi vahva pUsindi ninnu rammandi sundararAchendova vinduchE kandiyundirA nIyandu prEmachE chindara vandara chendam pondara |
| చరణం charaNam 2 | బాలకురులు నీలాలు కనులు మీవాలు పలువరుస జాలు మంచి ముత్యాలు మోవి పగడాలు జురిడీలు గావు మురిడీలు చేతుల పిడేలు బాడగలశీల చెవులు చెక్రాలు మాటలు వరాలు చెక్కగద వీలు నెలయు కపురాలు కవకుదగు పాలు వయసు నీపాలు తనువు జిగి జాళువా సుమీ బాల నీవు రతినేల గాదగు లీలలమరిన గోలర మేలుగ నేలర కేళిని | bAlakurulu nIlAlu kanulu mIvAlu paluvarusa jAlu manchi mutyAlu mOvi pagaDAlu juriDIlu gAvu muriDIlu chEtula piDElu bADagalaSIla chevulu chekrAlu mATalu varAlu chekkagada vIlu nelayu kapurAlu kavakudagu pAlu vayasu nIpAlu tanuvu jigi jALuvA sumI bAla nIvu ratinEla gAdagu lIlalamarina gOlara mEluga nElara kELini |
| చరణం charaNam 3 | సుళ్ళు సిరులొసంకళ్ళు బొరులు దిళ్ళు దాని పాలిళ్ళు మొల్ల పూచెళ్ళు చెలువమగు వళ్ళు కెరటముల జాళ్ళు బాహువుల నీళ్ళు తామరల తూళ్ళు కిసలములు వేళ్ళు తారకలు గోళ్ళు పిక్కలు మొసళ్ళు కలికి మీగాళ్ళ సౌరు తాబేళ్ళ సరి పదారేళ్ళ వయసురా యేళ్ళ కొలది వేయి నోళ్ళ నుతించి న వల్ల గాదు పెరుమాళ్ళ కృపనయిన | suLLu sirulosamkaLLu borulu diLLu dAni pAliLLu molla pUcheLLu cheluvamagu vaLLu keraTamula jALLu bAhuvula nILLu tAmarala tULLu kisalamulu vELLu tArakalu gOLLu pikkalu mosaLLu kaliki mIgALLa sauru tAbELLa sari padArELLa vayasurA yELLa koladi vEyi nOLLa nutimchi na valla gAdu perumALLa kRpanayina |
| చరణం charaNam 4 | బోటి చక్కెరల పేటి యెల్ల రతితోవి కూటమికి సాటియై తగు వధూటి సుందరా బోటి గుబ్బలు కొనగోట మీట నెంతొ పాటమౌర నీవాటల పాటల కూటమి గూడర | bOTi chakkerala pETi yella ratitOvi kUTamiki sATiyai tagu vadhUTi sundarA bOTi gubbalu konagOTa mITa nemto pATamaura nIvATala pATala kUTami gUDara |
| చరణం charaNam 5 | కంబుకౌను సుముఖంబు చందురుని సఖంబు గళము శంఖంబు కన్నుల సుఖంబు దానియందంబు మోవి బింబంబు పలుకు మధురంబు మేని నా సంబు సుతల పుష్పంబు నుదుట తిలకంబు హొయల్ గల కంబుకంఠిరా డింబుమీర సురతంబు లందు సారంబు గలది పూనంబగు చుంబునలంబ విజృంభిత | kambukaunu sumukhambu chamduruni sakhambu gaLamu Samkhambu kannula sukhambu dAniyamdambu mOvi bimbambu paluku madhurambu mEni nA sambu sutala pushpambu nuduTa tilakambu hoyal gala kambukamThirA DimbumIra suratambu lamdu sArambu galadi pUnambagu chumbunalamba vijRmbhita |
| చరణం charaNam 6 | శేష శయన ద్విభాషి పుల్లకవి పోష సుందరీ భూషితాంగ సంతోష హృదయ మృదుభాషకు ప్రియా వాసి మీద దానితో సురతములను జేసి మెలగుము వికాస ముఖాసర నాదయారస | SEsha Sayana dvibhAshi pullakavi pOsha sundarI bhUshitAmga samtOsha hRdaya mRdubhAshaku priyA vAsi mIda dAnitO suratamulanu jEsi melagumu vikAsa mukhAsara nAdayArasa |
#310 చంచలాక్షి chamchalAkshi
| Title | చంచలాక్షి | chamchalAkshi |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చంచలాక్షి నిన్వరించి నన్ను బంచెర | chamchalAkshi nin&varimchi nannu banchera |
| 2 | యెంచగ గ్రొమ్మించు మించు జెలి మంచి మేను | yemchaga gromminchu minchu jeli manchi mEnu |
| 3 | అంచలు భ్రమించు నడలంచు వచియించవచ్చు కాంచనాంబర దాని గాంచిన మోహించె ఔర | anchalu bhraminchu naDalanchu vachiyinchavachchu kAnchanAmbara dAni gAmchina mOhinche aura |
| 4 | పంచశర రూపశర పంచకముల బల్మరు పంచబాణుదించు బోడి బొంచి యేసి ముంచెనుర | panchaSara rUpaSara panchakamula balmaru panchabANudimchu bODi bonchi yEsi munchenura |
| 5 | చంచరీక వేణి దొడ్డి పంచాది గదిలో పట్టి మంచమున శయనించి తపించెను రకింతచేత | chancharIka vENi doDDi panchAdi gadilO paTTi manchamuna Sayanimchi tapinchenu rakintachEta |
| 6 | అంచితముగ నిన్ను బూజించు యజ్ఞన్నకవి గాంచి పోషించు కృష్ణ వేంచేసి కరంచుమిక | anchitamuga ninnu bUjinchu yajnannakavi gAmchi pOshinchu kRshNa vEmchEsi karamchumika |
#309 చాలు చాలు chAlu chAlu
| Title | చాలు చాలు | chAlu chAlu |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | చాలు చాలు నీదు చెల్మి జాడదెలిసె మానినీ | chAlu chAlu nIdu chelmi jADadelise mAninI |
| 2 | వ్రాలబోకు కాళ్ళపైని లేలే హంసగామినీ | vrAlabOku kALLapaini lElE hamsagAminI |
| 3 | గులాబి పువ్వు విడచి మోదుగు విరి గొన్నరీతిగా బలారె వాని గూడితిగ భామా నే నీకేటికే | gulAbi puvvu viDachi mOdugu viri gonnarItigA balAre vAni gUDitiga bhAmA nE nIkETikE |
| 4 | అల్ల వయసు ఠీపులు నీయందె మొల్చినవటే యెల్ల చానలకు లేవే యీ గోటు నీకేటికే | alla vayasu ThIpulu nIyamde molchinavaTE yella chAnalaku lEvE yI gOTu nIkETikE |
| 5 | ఇందిరేశ్వరుండ నీ నా పొందు నీకు గల్గునే అందులకే యేగు యజ్ఞనాప్తునకు తగుదువే | imdirESvarumDa nI nA pomdu nIku galgunE amdulakE yEgu yajnanAptunaku taguduvE |
#308 అయ్యయో ayyayO
| Title | అయ్యయో | ayyayO |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | హిందూస్తానీ కాఫీ | himdUstAnI kAfI |
| తాళం tALa | చాపు | chApu |
| 1 | అయ్యయో సైపగలేనే | ayyayO saipagalEnE |
| 2 | చయ్యన నేగి రమాసఖునిటు రమ్మనే | chayyana nEgi ramAsakhuniTu rammanE |
| 3 | మదిరాక్షి వినవే మకరాంకుడురువడి పదునగు శరముల నెదపై గ్రుచ్చెనే | madirAkshi vinavE makarAmkuDuruvaDi padunagu Saramula nedapai gruchchenE |
| 4 | అల్లజాబిల్లి వేడి మంతకంతకు నొడలెల్ల గ్రాగుచు విస్తరిల్లుచు నుండెనే | allajAbilli vEDi mamtakamtaku noDalella grAguchu vistarilluchu numDenE |
| 5 | వరగబ్బిట యజ్ఞన వంద్యుని బాయజాల హరినిటు దేవే మణీహారమిచ్చెదనే | varagabbiTa yajnana vandyuni bAyajAla hariniTu dEvE maNIhAramichchedanE |
#307 చిన్న ముద్దీరా chinna muddIrA
| Title | చిన్న ముద్దీరా | chinna muddIrA |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | హిందూస్తాని కాఫీ | himdUstAni kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | చిన్నముద్దీరా నాసామి | chinnamuddIrA nAsAmi |
| 2 | కన్నుల పండువుగా నిను గనగనె వెన్నవలెను మది వేగ గరగురా | kannula panDuvugA ninu ganagane vennavalenu madi vEga garagurA |
| 3 | సరసత నీవొకసారి మాటాడిన బొరి బొరి మేన బులక లెచ్చురా | sarasata nIvokasAri mATADina bori bori mEna bulaka lechchurA |
| 4 | అమ్మకచెల్ల నిన్నంటిన మాత్రనె కమ్మని కోర్కెలు గలుగుచుండురా | ammakachella ninnanTina mAtrane kammani kOrkelu galuguchumDurA |
| 5 | కమలా ప్రియ శ్రీ గబ్బిట యజ్ఞన నమిత చరణ విడనాడజాలరా | kamalA priya SrI gabbiTa yajnana namita charaNa viDanADajAlarA |
#306 ఇంత వేగపడిన imta vEgapaDina
| Title | ఇంత వేగపడిన | imta vEgapaDina |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | కమాచి | kamAchi |
| తాళం tALa | రూపక | rUpaka |
| 1 | ఇంత వేగపడిన కార్యమెట్టులౌనురా రవంతవేళజూచి ముద్దులాడ దగునురా | imta vEgapaDina kAryameTTulaunurA ravamtavELajUchi muddulADa dagunurA |
| 2 | మెత్తని పానుపున మగని మెల్లనె నిద్రింపజేసి యత్తమామ లెఱుగకుండ వత్తును పోరా | mettani pAnupuna magani mellane nidrimpajEsi yattamAma le~rugakunDa vattunu pOrA |
| 3 | మరదులు గ్రామాంతరమ్ములరిగి రాడబిడ్డలింక పొరుగిండ్లకు నాటలాడబోదురు గదరా | maradulu grAmAmtarammularigi rADabiDDalimka porugimDlaku nATalADabOduru gadarA |
| 4 | దాపున మా పూలదోట లోపల నీవుండుము గడెసేపులోనె బాగాల్ గొని చేరవత్తురా | dApuna mA pUladOTa lOpala nIvumDumu gaDesEpulOne bAgAl goni chEravatturA |
| 5 | చెన్ను మీర గబ్బిట యజ్ఞన్న కవి నేలినట్టి చిన్ని కృష్ణ మదిని నేర మెన్నబోకురా | chennu mIra gabbiTa yajnanna kavi nElinaTTi chinni kRshNa madini nEra mennabOkurA |