1160 మొగవారిని mogavArini

TitleమొగవారినిmogavArini
Written Byమంగళ పురీశ (?)mangaLa purISa (?)
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaపూర్వి కల్యాణిpUrvi kalyANi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At754
పల్లవి pallaviమొగవారిని నమ్మరాదె మగువ సామి రాడాయmogavArini nammarAde maguva sAmi rADAya
చరణం
charaNam 1
కులకుచు నాతోను కలసి మెలసి యుండిన
పలుకు లెందు బోయనో పణతిరో నేడు
kulakuchu nAtOnu kalasi melasi yunDina
paluku lendu bOyanO paNatirO nEDu
చరణం
charaNam 2
వెలదిరో అలనాడు వుపరతి వ్యాళలో
కౌంగలించిన అక్కరెందు బోయనో
veladirO alanADu vuparati vyALalO
kaungalinchina akkarendu bOyanO
చరణం
charaNam 3
మంగళ పురీశుని వలిపెందుంచినాడో
మరియాదే వానికి మమతెందు బోయనో
mangaLa purISuni valipendunchinADO
mariyAdE vAniki mamatendu bOyanO

1159 మనసెట్ల manaseTla

Titleమనసెట్లmanaseTla
Written Byమంగళ పురీశ (?)mangaLa purISa (?)
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
Previously Posted At763
పల్లవి pallaviమనసెట్ల సైరింతు మద గజ గామినిmanaseTla sairintu mada gaja gAmini
అనుపల్లవి anupallaviపణతిరో నా సామిని పిలువావె మానినిpaNatirO nA sAmini piluvAve mAnini
చరణం
charaNam 1
విరహమెచ్చి ప్రాయము వ్యర్థ మాయను నేడు
మారుని శరములకు మగువరో తాళజాలా
virahamechchi prAyamu vyartha mAyanu nEDu
mAruni Saramulaku maguvarO tALajAlA
చరణం
charaNam 2
పంచ బాణడు వచ్చి నేడు ప్రాణ నాథుడు రాడాయ
వంచన్యాలనే సామికి వారిజాయిక్షి పిలువవే
pancha bANaDu vachchi nEDu prANa nAthuDu rADAya
vanchanyAlanE sAmiki vArijAyikshi piluvavE
చరణం
charaNam 3
మరసి పోయెనాడేమో మంగళ పురి వాసుడు
సరస మాడుటకు సఖియరో తోడిత్యావె
marasi pOyenADEmO mangaLa puri vAsuDu
sarasa mADuTaku sakhiyarO tODityAve

1158 ఎందుకు రాడాయ enduku rADAya

Titleఎందుకు రాడాయenduku rADAya
Written Byమంగళ పురీశ (?)mangaLa purISa (?)
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaకానడాkAnaDA
తాళం tALaఆదిAdi
Previously Posted At762, 402
పల్లవి pallaviఎందుకు రాడాయ ఎవరేమన్నారుenduku rADAya evarEmannAru
చరణం
charaNam 1
సరసుని ప్రేమ సతమని యుంటినె
కరుణ మరచనె కలికిరో నీడు
sarasuni prEma satamani yunTine
karuNa marachane kalikirO nIDu
చరణం
charaNam 2
చందన పరిమళ ఆనందముగా యుంటనె
సుందరాంగుడు రాడాయ మందయాన యీవ్యాళ
chandana parimaLa AnandamugA yunTane
sundarAnguDu rADAya mandayAna yIvyALa
చరణం
charaNam 3
కోరిన వ్యాళలో కోపము యాలనె
వర మంగళ పురీశుని వేగమె పిలువవె
kOrina vyALalO kOpamu yAlane
vara mangaLa purISuni vEgame piluvave

1157 వగలాడి vagalADi

TitleవగలాడిvagalADi
Written Byతిరుపతి విద్యాల నారాయణ స్వామిtirupati vidyAla nArAyaNa swAmi
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
Previously Posted At664
పల్లవి pallaviవగలాడి బోధలకు వలచితివో సామి ఆvagalADi bOdhalaku valachitivO sAmi A
అనుపల్లవి anupallaviపగటి మోసగత్తెయిని పలు మారులు విని విని ఆpagaTi mOsagatteyini palu mArulu vini vini A
చరణం
charaNam 1
పడకటింటి లోపద గురు నే పదిల పరిచి యుండెpaDakaTinTi lOpada guru nE padila parichi yunDe
చరణం
charaNam 2
సరసుని కాచాన పౌందు విరస మౌనిని యెంచి
తిరుపతి పుర వెంకటేశ తెలియక నేడు
sarasuni kAchAna poundu virasa mounini yenchi
tirupati pura venkaTESa teliyaka nEDu
Previously posted version looks to be more accurate.

1156 మరియాద mariyAda

TitleమరియాదmariyAda
Written Byశ్రీ పట్టణం సుబ్రహ్మణ్యయ్యర్SrI paTTaNam subrahmaNyayyar
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At630
పల్లవి pallaviమరియాద తెలియకనే మాటలాడుట తగునటెmariyAda teliyakanE mATalADuTa tagunaTe
అనుపల్లవి anupallaviపరిహాసము జేయ తగిన వరుస కలిగియుంటి నేమిparihAsamu jEya tagina varusa kaligiyunTi nEmi
చరణం
charaNam 1
సరస సల్లాపములుకు సమయము కాగాదే యేమె
సరసిజాక్షి నావంటి సతులు గుంపు గూడి యుండగ
sarasa sallApamuluku samayamu kAgAdE yEme
sarasijAkshi nAvanTi satulu gumpu gUDi yunDaga
చరణం
charaNam 2
వెలదిరో నన్ను గూడినట్లు వెంకటేశ్వరు నీపై
బలవంతముగా నేను వలచి వచ్చినానేమి
veladirO nannu gUDinaTlu venkaTESvaru nIpai
balavantamugA nEnu valachi vachchinAnEmi
Previously posted version sounds more accurate than this!

1155 సమయమీదే samayamIdE

TitleసమయమీదేsamayamIdE
Written Byశ్రీ పట్టణం సుబ్రహ్మణ్యయ్యర్SrI paTTaNam subrahmaNyayyar
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
Previously Posted At628
పల్లవి pallaviసమయమీదే రారా నాసామి తామసించకురాsamayamIdE rArA nAsAmi tAmasinchakurA
అనుపల్లవి anupallaviకమల వైరి చను తెంచిన కాంక్ష లీడేరధురాkamala vairi chanu temchina kAmksha leeDEradhurA
చరణం
charaNam 1
మగడు ఊరలేడు నా మామగారి జోలి లేదని
వగదెగ తెలిసినదిగా వట్టి పంతమేలరా
magaDu UralEDu nA mAmagAri jOli lEdani
vagadega telisinadigA vaTTi pantamElarA
చరణం
charaNam 2
మన్ననచే నివు వచ్చి నన్ను గూడి యుండినట్లు
నిన్న రేయి కలకంఠి నీరజాక్ష వెంకటేశ
mannanachE nivu vachchi nannu gUDi yunDinaTlu
ninna rEyi kalakanThi nIrajAksha venkaTESa
Please use the previously posted version for more accurate lyrics.

1154 అపుడు మనసు apuDu manasu

Titleఅపుడు మనసుapuDu manasu
Written Byశ్రీ పట్టణం సుబ్రహ్మణ్యయ్యర్SrI paTTaNam subrahmaNyayyar
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaకమాచ్kamAch
తాళం tALaరూపకrUpaka
Previously Posted At629
పల్లవి pallaviఅపుడు మనసు నిలుచునటే అతివరో ఇదేటి మాట (లపుడు)apuDu manasu niluchunaTE ativarO idETi mATa (lapuDu)
అనుపల్లవి anupallaviచపల మేటి కిటువంటి సామర్థ్యము గులవాడైనchapala mETi kiTuvanTi sAmarthyamu gulavADaina
చరణం
charaNam 1
చొక్యపు యౌవ్వనము గల చక్కని పురుషుడు యువతుల
పక్క జేరి సరసముగా బల్కుచు కను సైగ జేయగ
chokyapu yauvvanamu gala chakkani purushuDu yuvatula
pakka jEri sarasamugA balkuchu kanu saiga jEyaga
చరణం
charaNam 2
వరద వెంకటేశ్వరుడిటు సురత కేళి సల్ప కోరిన
తరుణములో మారుడు విరసరముల బిరబిర గురియగ
varada venkaTESvaruDiTu surata kELi salpa kOrina
taruNamulO mAruDu virasaramula birabira guriyaga
I think the previous version was more accurate.

1153 బలమి ఏల balami Ela

Titleబలమి ఏలbalami Ela
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
Previously Posted At655
పల్లవి pallaviబలమి ఏల బాలామణి అలవానితో పలుమారు నీకుbalami Ela bAlAmaNi alavAnitO palumAru nIku
చరణం
charaNam 1
వాని పిలిచి బల్కెటి హీనతలెల్లను
అలివేణు లేరిగిన మనమానములు పోనె
vAni pilichi balki\eTi hInatalellanu
alivENu lErigina manamAnamulu pOne
చరణం
charaNam 2
ఏమాయని వేమరు నిన్ననె మానితే నీవు మన
నేమ మెరుగక అతి ప్రేమగా మాదొరవినుచు
EmAyani vEmaru ninnane mAnitE nIvu mana
nEma merugaka ati prEmagA mAdoravinuchu
చరణం
charaNam 3
తాళవన లోలుని ఏవేళ తలచుచు
వ్యాకుల పడనేల పలు వాలాయముగాను
tALavana lOluni EvELa talachuchu
vyAkula paDanEla palu vAlAyamugAnu

1152 పారిపోవలేరా pAripOvalErA

TitleపారిపోవలేరాpAripOvalErA
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaరూపకrUpaka
Previously Posted At653, 89
పల్లవి pallaviపారిపోవలేరా నీరజాక్షుడు వెడలరాpAripOvalErA nIrajAkshuDu veDalarA
అనుపల్లవి anupallaviనారీమణిలు దారిని గన దొరెను గనుకnArImaNilu dArini gana dorenu ganuka
చరణం
charaNam 1
దూరిపొయిన క్రూరుడౌ మగడూరు చేరియె మారడించెనె
ఆ రీతులు విచారించు కోర కేరా నీ పుడే
dUripoyina krUruDau magaDUru chEriye mAraDinchene
A rItulu vichArinchu kOra kErA nI puDE
చరణం
charaNam 2
భావమాగుణ భావముల్ తెలసే
విధమనే పాలిడించును
bhAvamAguNa bhAvamul telasE
vidhamanE pAliDinchunu
చరణం
charaNam 3
కేళితో నీ కెదయనుచుకెరానే విపుడెkELitO nI kedayanuchukerAnE vipuDe
Version at 653 is likely more accurate than this!

1151 తారుమారు tArumAru

TitleతారుమారుtArumAru
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaనాటకురంజిnATakuranji
తాళం tALaఆదిAdi
Previously Posted At654
పల్లవి pallaviతారుమారు లాడెవేమె బజారిtArumAru lADevEme bajAri
అనుపల్లవి anupallaviనేర మెంచకనే కౌగలించ మంటెnEra menchakanE kaugalincha manTe
చరణం
charaNam 1
అంబుజాక్షిరో నే సంభ్రముగ
నీడు బింబాధర చుంబనంబు లివ్వమంటె
ambujAkshirO nE sambhramuga
nIDu bimbAdhara chumbanambu livvamanTe
చరణం
charaNam 2
మోడి సేయక నా కూడ బల్కి కడువేడుర్క
కర్పూర విడమివ్వ మంటే
mODi sEyaka nA kUDa balki kaDuvEDurka
karpUra viDamivva manTE
చరణం
charaNam 3
ప్రీతి మీరగా నే సాదరంబుతో నిందు
లేత గుబ్బల నా చేతి కివ్వమంటె
prIti mIragA nE sAdarambutO nindu
lEta gubbala nA chEti kivvamanTe
చరణం
charaNam 4
తాళలేనె బాలికా మణిని
తాళవనేశుని యేలుకోమంటె
tALalEne bAlikA maNini
tALavanESuni yElukOmanTe
I feel previously posted lyrics were more accurate!