| Title | ఏనిదచ్చరి ప్రియా | Enidacchari priyA |
| Written By | ||
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | ఛాపు | ChApu |
| ఏనిదచ్చరి ప్రియా ఏణాంకవదనెయ నీనగలిరువుదు ఉచితవేనో మానిని మణియన్న ప్రాణపదకళెంబో ఆనందపడువే అభిమానవెల్లిహుదయ్యా | Enidacchari priyA ENAnkavadaneya nInagaliruvudu uchitavEnO mAnini maNiyanna prANapadakaLembO AnandapaDuvE abhimAnavellihudayyA | |
| నాయకియళ బిట్టు నాళిగెరడు తింగళు ఆయితెందీపరి చళీసిద్యా తోయవే నినగెయిదు శ్రేయవే కాడువుదిన్ను క్రియవే కామినియు కంపిసి కాయజన శరఘాయ కంజువళో నిన్నన్ను బయసి యాయితాంబకి బాయిబిడుతిహళో బగెబగెయ మాయోపాయగళ యోచనెయ మాడువళో మానినియ మొబ్బిన ప్రాయమదవను మీసలాకి తద్వీయ పదకోపిసి మమసఖ చిరాయునాగిరెందరసువళ నోయిసువుదొళితల్లో | nAyakiyaLa biTTu nALigeraDu tingaLu AyitendIpari chaLIsidyA tOyavE ninageyidu SrEyavE kADuvudinnu kriyavE kAminiyu kampisi kAyajana SaraghAya kanjuvaLO ninnannu bayasi yAyitAmbaki bAyibiDutihaLO bagebageya mAyOpAyagaLa yOchaneya mADuvaLO mAniniya mobbina prAyamadavanu mIsalAki tadvIya padakOpisi mamasakha chirAyunAgirendarasuvaLa nOyisuvudoLitallO | |
| సుగుణా యిరళొళు చరిప చందిరకె కుముదవు సాసిరవెంబో శాస్త్రవనరుహిదిళొ అరఘళిగె ఆదరూ మరుకేళి నెందల్‌ల్దరిదళో అన్హోకావ జరిదాళో చిన్నాదభరణ మరతాళో అరమనెయళూ బరకరెదు మాతనాడిసళో విరహాగ్ని తాపక్కె ధరధరసి మైబణ్ణ గుందిహళో ఒళఒళగె సమెయుత సొరగిసుమ్మనె యిళెయళొరెగిహళో | suguNA yiraLoLu charipa chandirake kumudavu sAsiravembO SAstravanaruhidiLo araghaLige AdarU marukELi nendal^ldaridaLO an&hOkAva jaridALO chinnAdabharaNa maratALO aramaneyaLU barakaredu mAtanADisaLO virahAgni tApakke dharadharasi maibaNNa gundihaLO oLaoLage sameyuta soragisummane yiLeyaLoregihaLO | |
| సంతైసు సాకి కరెకరెయోరొళ్ళితల్ల వేగది తెరళువుదు కారణశరది ఒడయన మనకె బేసరళాద భామిని పొడవియొళిద్దేను ఫలవెందళు కండుయవ్వనప్రాయ అడవీగాదాయ్తెందు నడిదళో బావిసియదెయా హొడెదాళో నిన్నవగుణ తడెదాళొ హాగిరువళదిగడి నడెనుడిగె తప్పిదువరెనల్లా కడుబడ నడనడువినెళ హుడిగి దొరకువ గిడిగి మాతల్లా మడదియర బెరతు వ్రతగెడసి గెళెతన బిడు హేళిద నుడియ మీరిద ఫలగళన్ను ఎన్నుడియ గట్టువనెందు సుళిదు మిడుకువళె కైపిడిదు సలహో | santaisu sAki karekareyOroLLitalla vEgadi teraLuvudu kAraNaSaradi oDayana manake bEsaraLAda bhAmini poDaviyoLiddEnu phalavendaLu kanDuyavvanaprAya aDavIgAdAytendu naDidaLO bAvisiyadeyA hoDedALO ninnavaguNa taDedALo hAgiruvaLadigaDi naDenuDige tappiduvarenallA kaDubaDa naDanaDuvineLa huDigi dorakuva giDigi mAtallA maDadiyara beratu vratageDasi geLetana biDu hELida nuDiya mIrida phalagaLannu ennuDiya gaTTuvanendu suLidu miDukuvaLe kaipiDidu salahO |
1276 యార శాపవిదు yAra SApavidu
| Title | యార శాపవిదు | yAra SApavidu |
| Written By | ||
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | యార శాపవిదు ఇదకేను కారణ తోరదు మీరి కోపది దూరబందె దారికాణదె | yAra SApavidu idakEnu kAraNa tOradu mIri kOpadi dUrabande dArikANade |
| నొందె హేగిరలి హరి నిన్నను అగలి విరహద బేగెయల్లి వంచిసి ఎన్న | nonde hEgirali hari ninnanu agali virahada bEgeyalli vamchisi enna | |
| చింతెయొళిరిసి మించి హోదళు అరసి లంచల చపలె మీరి నిన్న అంజికెయు | chinteyoLirisi minchi hOdaLu arasi lanchala chapale mIri ninna anjikeyu | |
| నిజవాయ్తు హాయై అంజికెయు నిజవాయ్తు పరమాత్మను నా ఎన్నువ ఏతకె విరహవ | nijavAytu hAyai anjikeyu nijavAytu paramAtmanu nA ennuva Etake virahava | |
| బీతియలి హాయై విరహది భాదెయలి యార శాపవిదు ఇదకేను కారణతోరదు | bItiyali hAyai virahadi bhAdeyali yAra SApavidu idakEnu kAraNatOradu | |
1275 సరసిజ గంధీ sarasija gandhI
| Title | సరసిజ గంధీ | sarasija gandhI |
| Written By | ||
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | సరసిజ గంధీ సరసాన తందు తోరె | sarasija gandhI sarasAna tandu tOre |
| అనుపల్లవి anupallavi | కరెదు తారమ్మయ్య మరదిరలారెనె హారవనీవె కరముగివె దయదోరె | karedu tArammayya maradiralArene hAravanIve karamugive dayadOre |
| చరణం charaNam 1 | ఆడువ ఆటవా కూడువ కూటవా పాడి పొగళాలళవెల్లే యేనల్లె | ADuva ATavA kUDuva kUTavA pADi pogaLAlaLavellE yEnalle |
| చరణం charaNam 2 | చంద్ర నా కిరణకె బెందు నా బళలిదే మందరధరా బారనల్లే యేనల్లె | chandra nA kiraNake bendu nA baLalidE mandaradharA bAranallE yEnalle |
| చరణం charaNam 3 | కరెదు తారమ్మయ్య మరదిరలారెను హారవనీవె వరముగివె దయదోరె సరసిజ గంధి సరసాన తందుతోరె | karedu tArammayya maradiralArenu hAravanIve varamugive dayadOre sarasija gandhi sarasAna tandutOre |
1274 కంతువిన kantuvina
| Title | కంతువిన | kantuvina |
| Written By | ||
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | ఛాపు | CHApu |
| పల్లవి pallavi | కంతువిన భాదె నానెంతు సహిసువె కాంతబారదిరలు మనవు శాంతి ఎల్లిదే | kantuvina bhAde nAnentu sahisuve kAntabAradiralu manavu kAnti ellidE |
| చరణం charaNam 1 | భాసురాంగి బేసరవాయితెనగె జన్మవు క్లేశవిదను పతి వియోగ లేశ తాళనే | bhAsurAngi bEsaravAyitenage janmavu klESavidanu pati viyOga lESa tALanE |
| చరణం charaNam 2 | నాగవేణి భోగదీశ బేగ బరదిరె సాగరదొళు ధుముకి ప్రాణ నీగువే సఖి | nAgavENi bhOgadISa bEga baradire sAgaradoLu dhumuki prANa nIguvE sakhi |
1273 ముక్కు పచ్చలారని mukku pacchalArani
| Title | ముక్కు పచ్చలారని | mukku pacchalArani |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | ముక్కు పచ్చలారని చిన్నదాన నన్నెక్కడి కంపెదరే సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే | mukku pacchalArani chinnadAna nannekkaDi kampedarE siggAye nannekkaDi kampedarE |
| అనుపల్లవి anupallavi | నిక్కము రేయెల్ల నిదుర బోయెనమ్మా తక్కిన పనులేమి నే నెరుగ నోయమ్మా | nikkamu rEyella nidura bOyenammA takkina panulEmi nE neruga nOyammA |
| చరణం charaNam 1 | వంచిన నా చేయి మంచి గంధము లోన ముంచి యెత్తెద రేలనే సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే మంచిదేరమ్మ మగవారి చేయిబట్టు మంచు దెల్పెదరు నాకలవాటు లేదమ్మా | vanchina nA chEyi manchi gandhamu lOna munchi yetteda rElanE siggAye nannekkaDi kampedarE manchidEramma magavAri chEyibaTTu manchu delpedaru nAkalavATu lEdammA |
| చరణం charaNam 2 | అందముగా నున్న మాకీనెదీసి నే నంటరాయ నేరనే అందగాని నోటి కంటీయమని యెద రిందరిలో మనసెట్టు లొప్పునోయమ్మా | andamugA nunna mAkInedIsi nE nanTarAya nEranE andagAni nOTi kanTIyamani yeda rindarilO manaseTTu loppunOyammA |
| చరణం charaNam 3 | ఈ పను లాపను లేల చెప్పెదరు నేనేపని కోపలేనే ప్రాపై దాసు శ్రీరాము నేలిన వేణు గోపాల దేవుని గూడి యుండెదనమ్మా | I panu lApanu lEla cheppedaru nEnEpani kOpalEnE prApai dAsu SrIrAmu nElina vENu gOpAla dEvuni gUDi yunDedanammA |
1272 నేనెరుగనా nEneruganA
| Title | నేనెరుగనా | nEneruganA |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | దర్బారు | darbAru |
| తాళం tALa | జంపె | jampe |
| పల్లవి pallavi | నేనెరుగనా నీజాడ నాసామి నేనెరుగనా | nEneruganA nIjADa nAsAmi nEneruganA |
| అనుపల్లవి anupallavi | మాను నీ వగలెల్ల మా వద్దనా సామి | mAnu nI vagalella mA vaddanA sAmi |
| చరణం charaNam 1 | మరుపెన్నటికి రాని మంచి మాటలె చెప్పి అర చేత వైకుంఠ మట్టె చూపి పరిపూర్ణ దయ గలిగి పనులెల్ల కానిచ్చి సరసుడవు నీ వింద్రజాలములు జేసేవు | marupennaTiki rAni manchi mATale cheppi ara chEta vaikunTha maTTe chUpi paripUrNa daya galigi panulella kAnicchi sarasuDavu nI vindrajAlamulu jEsEvu |
| చరణం charaNam 2 | ముద్దు నా సామి నీ మురిపంపు సుద్దులివి ముత్యాలు పది వేలు మూట గట్టు బద్దులాడను పంచ బాణుడాన నీ వలపు మిద్దెపై నిడు పరుగు మీసాలపై తేనె | muddu nA sAmi nI muripampu suddulivi mutyAlu padi vElu mUTa gaTTu baddulADanu pancha bANuDAna nI valapu middepai niDu parugu mIsAlapai tEne |
| చరణం charaNam 3 | కనికరము పూజ్య మాకాశ పుష్పము నిజము వినవోయి మగవారి వింతలెల్ల ఘన దాసు శ్రీరామ కవి కీర్తనంబులే విన వేడుకాయె నీ పని పదిల మాయెనిక | kanikaramu pUjya mAkASa pushpamu nijamu vinavOyi magavAri vintalella ghana dAsu SrIrAma kavi kIrtanambulE vina vEDukAye nI pani padila mAyenika |
1271 అప్పటి మాటలకు appaTi mATalaku
| Title | అప్పటి మాటలకు | appaTi mATalaku |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | అప్పటి మాటలకు దుప్పటిచ్చె గాని అప్పటి గప్ప నిచ్చెనటే చెలి | appaTi mATalaku duppaTicche gAni appaTi gappa nicchenaTE cheli |
| అనుపల్లవి anupallavi | తప్ప నేనితరుల దరి జేరనని యెన్నో చెప్పిన తలచు కొంటినే ఓ చెలి | tappa nEnitarula dari jEranani yennO cheppina talachu konTinE O cheli |
| చరణం charaNam 1 | తొలినాటి వగలేయా మలునాటి వగలు మా చెలిమి కాకియు కోవెల చందమాయెనే | tolinATi vagalEyA malunATi vagalu mA chelimi kAkiyu kOvela chandamAyenE |
| చరణం charaNam 2 | పడతి మగవారు బారు పడకింట మితిమీరు గడప దాటిన వెనుక కారు మనవారు బడి బడి నాడు వారు బ్రతిమాలి పాదముల బడి వేడుకొన్న గాని పలుకే మేల్మి బంగారు | paDati magavAru bAru paDakinTa mitimIru gaDapa dATina venuka kAru manavAru baDi baDi nADu vAru bratimAli pAdamula baDi vEDukonna gAni palukE mElmi bangAru |
| చరణం charaNam 3 | కాసు వీసములిచ్చి గోస గూసల మసి బూసి నేరేడు గాయ జేసెనే చెలి వేసాల మారి మా వేణుగోపాల మూర్తి దాసు శ్రీరామ కవి డాసి యేలుచుండెనే ఓ చెలి | kAsu vIsamulicchi gOsa gUsala masi bUsi nErEDu gAya jEsenE cheli vEsAla mAri mA vENugOpAla mUrti dAsu SrIrAma kavi DAsi yEluchunDenE O cheli |
1270 ముద్దుముద్దుగ muddumudduga
| Title | ముద్దుముద్దుగ | muddumudduga |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | అఠాణ | aThANa |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ముద్దు ముద్దుగ పిలవనా నా సామిని ముదుగు ముదుగుగ పిలవనా నా సామిని | muddu mudduga pilavanA nA sAmini mudugu muduguga pilavanA nA sAmini |
| అనుపల్లవి anupallavi | ముద్దు ముద్దుగ పిలువ చులక సేయునేమో ముదుగు ముదుగుగ పిలువ బాగని తోచేనే | muddu mudduga piluva chulaka sEyunEmO mudugu muduguga piluva bAgani tOchEnE |
| చరణం charaNam 1 | పాటలు పాడుదునా మంచి ఆటలు ఆడుదునా వాటమైన గుబ్బ పోటు జూపింతునా గోటి కొన చెక్కిలి మీటుదునా | pATalu pADudunA manchi ATalu ADudunA vATamaina gubba pOTu jUpintunA gOTi kona chekkili mITudunA |
| చరణం charaNam 2 | ఆకు మడుపు లిత్తునా మంచి తావి అత్తరు పైబూతునా తేకువతో జడ త్రిప్పి కొట్టుదునా మోక మావి చిగురు మోవి గరతునా | Aku maDupu littunA manchi tAvi attaru paibUtunA tEkuvatO jaDa trippi koTTudunA mOka mAvi chiguru mOvi garatunA |
| చరణం charaNam 3 | కోపగించకు మందునా యేర వేణు గ్గోపాల రమ్మందునా శ్రీపూర్ణమగు దాసు శ్రీరాము మనసున ప్రాపై నివసించి పాలించమందునా | kOpaginchaku mandunA yEra vENu ggOpAla rammandunA SrIpUrNamagu dAsu SrIrAmu manasuna prApai nivasinchi pAlinchamandunA |
1269 కామాంధకారము kAmAndhakAramu
| Title | కామాంధకారము | kAmAndhakAramu |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | కామాంధకారము కప్పెనా నీవింత కనుగానక యుంటివి | kAmAndhakAramu kappenA nIvinta kanugAnaka yunTivi |
| అనుపల్లవి anupallavi | ఏమిరా తెలియదా ఇది కాదని నీకు నీ ముద్దు కోమలి నివసించిన ఇల్లు | EmirA teliyadA idi kAdani nIku nI muddu kOmali nivasinchina illu |
| చరణం charaNam 1 | పంజరమున చిలుక పగిది నేనుండగ పరులకు పని ఏమిరా సంజ చీకటి దారి జాడ తెలియ లేక కంజాత నయన ఇక్కడ వచ్చితివా లేక | panjaramuna chiluka pagidi nEnunDaga parulaku pani EmirA sanja chIkaTi dAri jADa teliya lEka kanjAta nayana ikkaDa vacchitivA lEka |
| చరణం charaNam 2 | వగకాడ నీవంటి వానికి నావంటి మగువ పొందది ఏలరా మొగలి పూజిదుమబో ముల్లా కంటిన యట్లు తగని ఈ నా యిల్లు దారి దాకెనా లేక | vagakADa nIvanTi vAniki nAvanTi maguva pondadi ElarA mogali pUjidumabO mullA kanTina yaTlu tagani I nA yillu dAri dAkenA lEka |
| చరణం charaNam 3 | భ్రమ లేల నిన్నటి రాతిరి గలసిన భామ ఇల్లిది గాదురా రమణీయ దాసు శ్రీరామ కవీంద్రుని అమల చిత్తాంబుజ మనుకొంటివా లేక | bhrama lEla ninnaTi rAtiri galasina bhAma illidi gAdurA ramaNIya dAsu SrIrAma kavIndruni amala chittAmbuja manukonTivA lEka |
1268 వలచితిరా నిను valachitirA ninu
| Title | వలచితిరా నిను | valachitirA ninu |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | దర్బారు | darbAru |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | వలచితిరా నిను వదలను సామీ జలజాక్ష నీ దర్శనమే పది వేలు | valachitirA ninu vadalanu sAmI jalajAksha nI darSanamE padi vElu |
| చరణం charaNam 1 | ఇచ్చిన సరే ఇవ్వకున్న సరే వచ్చి నాతో నొక ముచ్చటాడిన చాలు | icchina sarE ivvakunna sarE vacchi nAtO noka mucchaTADina chAlu |
| చరణం charaNam 2 | నీళ్ళనే ముంచు పాలనే ముంచు కాళ్ళకు మ్రొక్కెద కరుణించరా | nILLanE munchu pAlanE munchu kALLaku mrokkeda karuNincharA |
| చరణం charaNam 3 | వేణుగోపాలా వేడితి చాలా రాణించు దాసు శ్రీరాము నుల్లము వలె | vENugOpAlA vEDiti chAlA rANinchu dAsu SrIrAmu nullamu vale |