#562 కంటి సైగ kanTi saiga

Titleకంటి సైగkanTi saiga
Written Byవింజమూరి వరదరాజయ్యంగారు*viMjamUri varadarAjayyangAru*
Book
రాగం rAgaమణిరంగుmaNirangu
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviకంటి సైగ జేసెనే
తుంటరికాడు
ఒంటిగ నున్న
నన్నింటి లోకి రమ్మని
kanTi saiga jEsenE
tunTarikADu
onTiga nunna
nanninTi lOki rammani
అనుపల్లవి anupallaviజంట పావురముల క్రీ
గంటి జూపి వాడు
కొంటె మాటలాడి
తుంటరి పనులు సేయ
janTa pAvuramula krI
ganTi jUpi vADu
konTe mATalADi
tunTari panulu sEya
చరణం
charaNam 1
నవ మోహనాంగుడే వాడు
నాద వినోదుడే
ధరను వెలయు శ్రీ
వరకాంచి పురమున
స్థిరముగ నెలకొన్న
వరద రాజ విభుడు
nava mOhanAnguDE vADu
nAda vinOduDE
dharanu velayu SrI
varakAnchi puramuna
sthiramuga nelakonna
varada rAja vibhuDu

#561 అగపడదే agapaDadE

TitleఅగపడదేagapaDadE
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaఖమాచిkhamAchi
తాళం tALaత్రస్య గతిtrasya gati
పల్లవి pallaviఅగపడదే చోటనైన యట్టి వన్నెలాడిagapaDadE chOTanaina yaTTi vannelADi
అనుపల్లవి anupallaviసుగపడు మా పూవుబోడి జోడు కూడి యాదిsugapaDu mA pUvubODi jODu kUDi yAdi
చరణం
charaNam 1
ముగుర కాలి గోరినైన బోలునె నీ నాతి
యగును దాని చెంత రంజయైన నాకు కోతి
mugura kAli gOrinaina bOlune nI nAti
yagunu dAni chenta ramjayaina nAku kOti
చరణం
charaNam 2
దెబ్బున నద్దాని జిదిమి దివ్వె పెట్టినచ్చు
అబ్బోటిన్జూడ నతివ కైన వలపు హెచ్చు
debbuna naddAni jidimi divve peTTinachchu
abbOTin&jUDa nativa kaina valapu hechchu

#560 బళిర నీవు baLira nIvu

Titleబళిర నీవుbaLira nIvu
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaజంజోటిjanjOTi
తాళం tALaమిశ్ర రూపకmiSra rUpaka
పల్లవి pallaviబళిర నీవు పెట్టు చీవాట్లు కూడ రత్తి కట్టుbaLira nIvu peTTu chIvATlu kUDa ratti kaTTu
అనుపల్లవి anupallaviఅలరు చుండు నీకు నొకంత మై చిరాకుalaru chunDu nIku nokanta mai chirAku
చరణం
charaNam 1
అవుర నీదు పల్కు చిఱునవ్వు ముత్తెములొల్కు
సవతి యొద్ద నన్ను బల్చన సేయకు కొల్తు నిన్ను
avura nIdu palku chi~runavvu muttemulolku
savati yodda nannu balchana sEyaku koltu ninnu
చరణం
charaNam 2
ఓరి వన్నెకాడ నన్నుంచుము నీతోడ
మేఱమీదె నాసకనుమీ నాపై నీగు
Ori vannekADa nannunchumu nItODa
mE~ramIde nAsakanumI nApai nIgu

#559 జాతి నీతి jAti nIti

Titleజాతి నీతిjAti nIti
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaఖండ గతిkhanDa gati
పల్లవి pallaviజాతి నీతి తలంప కీ తీరుగా బల్కితే
తోచి నట్లెల్ల నెవతెవైన న్గల్కి
jAti nIti talampa kI tIrugA balkitE
tOchi naTlella nevatevaina n&galki
చరణం
charaNam 1
నిక్కమగు మగవాని కొక్కాలి యొకమాట
పెక్కేల రక్కసీ వెళ్ళు వచ్చిన బాట
nikkamagu magavAni kokkAli yokamATa
pekkEla rakkasI veLLu vachchina bATa
చరణం
charaNam 2
కులమునకు జెడె కాని కూడు గుడవగ నౌన
సలుప గూడదు హాని జగతికే మిషనైన
kulamunaku jeDe kAni kUDu guDavaga nauna
salupa gUDadu hAni jagatikE mishanaina

#558 ఏ నీకు జిక్కి E nIku jikki

Titleఏ నీకు జిక్కిE nIku jikki
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaకాఫీkAfI
తాళం tALaచతురశ్ర గతిchaturaSra gati
పల్లవి pallaviఏ నీకు జిక్కినా నోరీ యందకాడ
యిప్పుడే నన్నేల రాయే
E nIku jikkinA nOrI yandakADa
yippuDE nannEla rAyE
అనుపల్లవి anupallaviఏనుండ వలె గాని నీకుం
దగిన జోడెబ్బె రాసిద్దేలరా
EnunDa vale gAni nIkum
dagina jODebbe rAsiddElarA
చరణం
charaNam 1
చాటు నకు రమ్ము మంతనము జెప్పెద
నీ వెట్టు లూకొట్టెదో
పూ చెండులివె సిరి కోరి వచ్చినప్డు
మోకాలడ్డు పెట్టిదో
chATu naku rammu mantanamu jeppeda
nI veTTu lUkoTTedO
pU chenDulive siri kOri vachchinapDu
mOkAlaDDu peTTidO
చరణం
charaNam 2
జగమెల్ల జూచితి న్నీవంటి సొగసుకా
డగపడ లేదద్దిరా
మగడ దాపనేల నన్ను మించిన జాణ
మఱి మఱి లేదెద్దిరా
jagamella jUchiti nnIvanTi sogasukA
DagapaDa lEdaddirA
magaDa dApanEla nannu minchina jANa
ma~ri ma~ri lEdeddirA

#557 వీడెంతో vIDentO

TitleవీడెంతోvIDentO
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaమోహనmOhana
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviవీడెంతో యందమైన వాడు సెబాసుvIDentO yandamaina vADu sebAsu
అనుపల్లవి anupallaviఈడే ఱేడైన వీని కీరేడు జగముల ఱేడుIDE ~rEDaina vIni kIrEDu jagamula ~rEDu
చరణం
charaNam 1
కూడ దగిన మంచి కోడెకాడు
నేడు నా కబ్బ కబ్బినాడు నా కీడుజోడి
kUDa dagina manchi kODekADu
nEDu nA kabba kabbinADu nA kIDujODi

#556 ఎంతమాట entamATa

TitleఎంతమాటentamATa
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaఅసావేరిasAvEri
తాళం tALaసంకీర్ణ జాతి ఏకsankIrNa jAti Eka
పల్లవి pallaviఎంత మాట పల్కితీవు జీవితేశenta mATa palkitIvu jIvitESa
అనుపల్లవి anupallaviఇంతలోన విడిచితే నామీద యాశintalOna viDichitE nAmIda yASa
చరణం
charaNam 1
నిన్ను బాసి నేను నిముస మోర్వలేను
మన్నుటెట్లు నీరు మానినంత మీను
ninnu bAsi nEnu nimusa mOrvalEnu
mannuTeTlu nIru mAninanta mInu
చరణం
charaNam 2
వలదనకుము నన్ను వచ్చెద నీ తోడ
నిలువ దరమె నా యుసుఱు నీకు బుడమి ఱేడ
valadanakumu nannu vachcheda nI tODa
niluva darame nA yusu~ru nIku buDami ~rEDa
చరణం
charaNam 3
అలవికాని కార్య మాచరింప లేవు
తొలగ ద్రోసెదే నాతోడి నీడ నీవు
alavikAni kArya mAcharimpa lEvu
tolaga drOsedE nAtODi nIDa nIvu

#555 విడు విడు viDu viDu

Titleవిడు విడుviDu viDu
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaజెంజోటిjenjOTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviవిడు విడు నను ముట్టకు
ప్రేమ తెలిసె చాలు
viDu viDu nanu muTTaku
prEma telise chAlu
అనుపల్లవి anupallaviకడకు నవ్వుల పాలయ్యెగా
నా బ్రతుకిట్టుల మేలు
kaDaku navvula pAlayyegA
nA bratukiTTula mElu
చరణం
charaNam 1
కౌసల్యకు వలె నాకున్ గట్టవె పుస్తె
నా సవతి కేలుబడియైన నా పని వస్తె
kausalyaku vale nAkun gaTTave puste
nA savati kElubaDiyaina nA pani vaste

#554 చీకటి గదిలో chIkaTi gadilO

Titleచీకటి గదిలోchIkaTi gadilO
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaనవరోజ్navarOj
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviచీకటి గదిలో నేమి బరుంటివి
చెప్పవే పూవు బోడి
chIkaTi gadilO nEmi barunTivi
cheppavE pUvu bODi
అనుపల్లవి anupallaviనీకేటి వంత కల్గె బల్కవా
నిద్దురా ముద్దులాడి
nIkETi vanta kalge balkavA
niddurA muddulADi
చరణం
charaNam 1
నిద్దా చెక్కుటద్దముల వేడి
కన్నీరు కాఱ్చి కొయ్యారి
పెద్ద కన్రెప్ప యెఱందీసి
జళిపించు చూపు తరవారి
niddA chekkuTaddamula vEDi
kannIru kA~rchi koyyAri
pedda kanreppa ye~ramdIsi
jaLipinchu chUpu taravAri
చరణం
charaNam 2
వెచ్చ నూర్చుచుం దొండపండు
మోవిం గందింబెదవేమి
మచ్చెకంటి మకిల దుస్తు
కట్టిన మర్మమేమి యిల్లాల
vechcha nUrchuchum donDapanDu
mOvim gandimbedavEmi
machchekanTi makila dustu
kaTTina marmamEmi yillAla

#553 క్రొక్కారు మెరుగు krokkAru merugu

Titleక్రొక్కారు మెరుగుkrokkAru merugu
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaవసంతvasanta
తాళం tALaఖండ గతిkhanDa gati
పల్లవి pallaviక్రొక్కారు మెరుగు లాగున దళుక్కున మెఱసిkrokkAru merugu lAguna daLukkuna me~rasi
అనుపల్లవి anupallaviయిక్కడ మరుగు పడడదేమొకా తమ్ముడాyikkaDa marugu paDaDadEmokA tammuDA
చరణం
charaNam 1
కెంబెదవి గఱచుకొని క్రీగంట జూపుగా
లమ్మున న్నా మనస్సు లాగుకొన నెవ్వతో
kembedavi ga~rachukoni krIganTa jUpugA
lammuna nnA manassu lAgukona nevvatO
చరణం
charaNam 2
ఆపె వనలక్ష్మియో యారాజు కూతురో
యీ పగిది నన్ను భ్రమయించి డాగెనెచటనో
Ape vanalakshmiyO yArAju kUturO
yI pagidi nannu bhramayinchi DAgenechaTanO
చరణం
charaNam 3
మళ్ళి రాడేమి నా మనసామె యెడ చిక్కి
చెల్లరే యచ్చెలి చేకొనక తప్పదిక
maLLi rADEmi nA manasAme yeDa chikki
chellarE yachcheli chEkonaka tappadika