#605 నిమిషాము యుగమాయె nimishAmu yugamAye

Titleనిమిషాము యుగమాయెnimishAmu yugamAye
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaమధ్యమావతిmadhyamAvati
తాళం tALaఅటaTa
పల్లవి pallaviనిమిషాము యుగమాయె నిలువ శక్యము
గాదు నీ వేగితివి కదవే
nimishAmu yugamAye niluva Sakyamu
gAdu nI vEgitivi kadavE
అనుపల్లవి anupallaviతమకాముచే మది తహతహ లాయేను
తడవు సేయక వేగమే నాసామి
tamakAmuchE madi tahataha lAyEnu
taDavu sEyaka vEgamE nAsAmi
చరణం
charaNam 1
పన్నుగ ప్రాణాము పాలించె దొరయా నా
ప్రాణానాధుని దేగదే వేవేగామె
pannuga prANAmu pAlinche dorayA nA
prANAnAdhuni dEgadE vEvEgAme
చరణం
charaNam 2
తడవు సేసితే నాడు తనువు దారబోసి
తరలే దానని దెల్పవే నాసామిని
taDavu sEsitE nADu tanuvu dArabOsi
taralE dAnani delpavE nAsAmini
చరణం
charaNam 3
పడతి బోధన విని పగబట్టి నిటుసేయ
బాడిగాదని దెల్పవే నాసామిని
paDati bOdhana vini pagabaTTi niTusEya
bADigAdani delpavE nAsAmini
చరణం
charaNam 4
శ్రీ నరసాపుర వాసా శీఘ్రమే రమ్మాని
చెయి బట్టి బతిమాలవే బీరాన
SrI narasApura vAsA SIghramE rammAni
cheyi baTTi batimAlavE bIrAna
నమిలాం శ్రీగణనాధ అను వర్ణమెట్టు namilAm SrIgaNanAdha anu varNameTTu

#604 చెలికాడ నినుబాసి chelikADa ninubAsi

Titleచెలికాడ నినుబాసిchelikADa ninubAsi
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaబేగడాbEgaDA
తాళం tALaఅటaTa
పల్లవి pallaviచెలికాడ నినుబాసి బలవంతమున నత్త
ఇలుజేరా నను బంపిరి నాసామి
chelikADa ninubAsi balavantamuna natta
ilujErA nanu bampiri nAsAmi
అనుపల్లవి anupallaviకలనైనా యెడబాయా జాలని మనకిట్టి
గతి గలిగె నేమందు నా సామి
kalanainA yeDabAyA jAlani manakiTTi
gati galige nEmandu nA sAmi
చరణం
charaNam 1
కాళ్ళాడకను చాలా కలవార పడి నేడు
కదలీ పోవుచు నుంటిగా నాసామి
kALLADakanu chAlA kalavAra paDi nEDu
kadalI pOvuchu nunTigA nAsAmi
చరణం
charaNam 2
వలవల కన్నీరు వరదలై పారగ
తల వ్రాసెనిటు దైవమూ నాసామి
valavala kannIru varadalai pAraga
tala vrAseniTu daivamU nAsAmi
చరణం
charaNam 3
ఎన్నాళ్ళ కొస్తునూ ఇల నరసాపుర వాసా
నన్నూ నీ మదినుంచుము నాసామి
ennALLa kostunU ila narasApura vAsA
nannU nI madinunchumu nAsAmi
నిండు పున్నమ నాడు అను వర్ణమెట్టు ninDu punnama nADu anu varNameTTu

#603 రొక్కామిచ్చి rokkAmichchi

Titleరొక్కామిచ్చిrokkAmichchi
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaమోహనmOhana
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviరొక్కామిచ్చితె నీయక్కా మరియొక్కాతే
నీవే శాశ్వతమటవె
rokkAmichchite nIyakkA mariyokkAtE
nIvE SASvatamaTave
అనుపల్లవి anupallaviనిక్కూచు నీలిగేవు నింత సుక్కవ
రక్కాసి వలె ముఖము ముదిబురించేవేమే
nikkUchu nIligEvu ninta sukkava
rakkAsi vale mukhamu mudiburinchEvEmE
చరణం
charaNam 1
నీ శిరసుపై నెగిరేటి చెలియా లెల్లా
నన్ను రాతిరి వేళా రమ్మని బతిమాలుచు
నాతి నా మెడ పుష్పా మాలికల్ ధరియించి
చేతికి విడెమిచ్చి చెయి బట్టి వేడుచు
nI Sirasupai negirETi cheliyA lellA
nannu rAtiri vELA rammani batimAluchu
nAti nA meDa pushpA mAlikal dhariyinchi
chEtiki viDemichchi cheyi baTTi vEDuchu
చరణం
charaNam 2
చెలియారో నేనొస్తె చేరి మాటాడవు
పలుకారించే దాకా తల యెత్తవు
కాసులు మ్రోగితే కలకల నవ్వేవు
వేశ్య కైన నీయట్టి టక్కులు దెలియవే
cheliyArO nEnoste chEri mATADavu
palukArinchE dAkA tala yettavu
kAsulu mrOgitE kalakala navvEvu
vESya kaina nIyaTTi Takkulu deliyavE
చరణం
charaNam 3
నిదుర బోవగ జూచి నిను గలసే దెరుగావు
మదనుని కొంటే మోమృదువానవు
కొదువేమి శ్రీ నరసాపుర వాసుడని
దెలిసె పదరక నికమీద వదిగి యుండవె చెలి
nidura bOvaga jUchi ninu galasE derugAvu
madanuni konTE mOmRduvAnavu
koduvEmi SrI narasApura vAsuDani
delise padaraka nikamIda vadigi yunDave cheli
నీవే నా శాస్త్రము అను వర్ణమెట్టు nIvE nA SAstramu anu varNameTTu

#602 ఇచ్చెద నిచ్చెదనని ichcheda nichchedanani

Titleఇచ్చెద నిచ్చెదననిichcheda nichchedanani
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaయదుకుల కాంభోజిyadukula kAmbhOji
తాళం tALaఅటaTa
పల్లవి pallaviఇచ్చెద నిచ్చెదనని యిన్ని దినములు జర్చి
యిచ్చితి విక చాలు మెచ్చ వచ్చునురా
ichcheda nichchedanani yinni dinamulu jarchi
yichchiti vika chAlu mechcha vachchunurA
అనుపల్లవి anupallaviమచ్చికల్ మగ నీ కన్నను చెడ్డ
తెగువా యిచ్చితివిక రూక
machchikal maga nI kannanu cheDDa
teguvA yichchitivika rUka
చరణం
charaNam 1
నాలుగు దినముల నుండి నిదురయిన బోనీక
పగలు రేయి యదిగా పనులెల్లా జర్పి
యెల్లా వారిలో నను అల్లార పరచి యొక
చెల్లాని రూక నా చేతి కియ్య వచ్చేవు
nAlugu dinamula nunDi nidurayina bOnIka
pagalu rEyi yadigA panulellA jarpi
yellA vArilO nanu allAra parachi yoka
chellAni rUka nA chEti kiyya vachchEvu
చరణం
charaNam 2
సరిసరి యిక చాలు పరులింటె బహు సిగ్గు
దారీ జూచిక నీదు యూరికి పోరా
తేరాగ వచ్చితె తెల్లవార్లును జర్పి ఇంకా
మా వాడొకడు న్నాడను సామ్యముగా
sarisari yika chAlu parulinTe bahu siggu
dArI jUchika nIdu yUriki pOrA
tErAga vachchite tellavArlunu jarpi inkA
mA vADokaDu nnADanu sAmyamugA
చరణం
charaNam 3
వేషగాడ నరసాపుర వేణుగోపాల
ఆశ బెట్టి రట్టు పరచి తెల్లవారులా
మోసగించి యెన్నో ముచ్చటల్ సల్పి
యొక సీపావు రూకా నా చెంగూన గట్టితి
vEshagADa narasApura vENugOpAla
ASa beTTi raTTu parachi tellavArulA
mOsaginchi yennO muchchaTal salpi
yoka sIpAvu rUkA nA chengUna gaTTiti
యేమిరా నీతీరు యిన్నాళ్ళవలె లేదు అను వర్ణమెట్టు yEmirA nItIru yinnALLavale lEdu anu varNameTTu

#601 ఏనోడా ఇంద EnODA inda

Titleఏనోడా ఇందEnODA inda
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaకతంబంkatambam
తాళం tALaమిశ్రmiSra
పల్లవి pallaviఏనోడా ఇంద మోడిEnODA inda mODi
అనుపల్లవి anupallaviఎన్నయిచ్చోవా ఏన్‌డాennayichchOvA En^DA
చరణం
charaNam 1
కనివుడన్ వుందనై యెకండుకొండు ఉండుమాశైkanivuDan vundanai yekanDukonDu unDumASai
చరణం
charaNam 2
తెణ్రలై సకిక్కేనడా తేంబి సోంబు వీంబుదిన్నంteNralai sakikkEnaDA tEmbi sOmbu vImbudinnam
చరణం
charaNam 3
మారా మైయల్ మీరుదడా మారి మారి సోరుదడాmArA maiyal mIrudaDA mAri mAri sOrudaDA
చరణం
charaNam 4
కామిగడ్ కులజ్జయ్ ఏన్‌డా కాఱుం పారుం పారుం శేరుమన్నైkAmigaD kulajjay En^DA kA~rum pArum pArum SErumannai

#600 వేళగాదురా vELagAdurA

TitleవేళగాదురాvELagAdurA
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవేళగాదురా తాళుతాళరాvELagAdurA tALutALarA
అనుపల్లవి anupallaviచాలు చాలురా మేలాయెనురాchAlu chAlurA mElAyenurA
చరణం
charaNam 1
వేళ గాని వేళా ఎమిర యీగోలా
వల్లా గాదీ వేళా వాకిటుంటి వేళా
vELa gAni vELA emira yIgOlA
vallA gAdI vELA vAkiTunTi vELA
చరణం
charaNam 2
అంటరాకు రాకుర ఆవలుండర
ఇంటానున్నవారు వింటారు యీపోరు
anTarAku rAkura AvalunDara
inTAnunnavAru vinTAru yIpOru
చరణం
charaNam 3
మంకు తనమేలా మళ్లిరా గోపాలా
వెంకట స్వామిపాలా ఏమయ్యా యీ గోలా
manku tanamElA maLlirA gOpAlA
venkaTa swAmipAlA EmayyA yI gOlA
కరుణించరా కరుణానిధే అను వర్ణ మెట్టు karuNincharA karuNAnidhE anu varNa meTTu

#599 వేళ యిదేగానా vELa yidEgAnA

Titleవేళ యిదేగానాvELa yidEgAnA
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవేళ యిదేగానా వేగరావే జాణాvELa yidEgAnA vEgarAvE jANA
అనుపల్లవి anupallaviతాళజాల లేను తడవు శేయగానుtALajAla lEnu taDavu SEyagAnu
చరణం
charaNam 1
మారుని బారి మరిమారి మీరి చేరితి
నిన్ను కోరి జెయి జేర్చు దయ మీరి
mAruni bAri marimAri mIri chEriti
ninnu kOri jeyi jErchu daya mIri
చరణం
charaNam 2
తమకా మోర్వజాల తరుణి మణి యివ్వేళా
మమత చేత చాలా మరగితినే బాలా
tamakA mOrvajAla taruNi maNi yivvELA
mamata chEta chAlA maragitinE bAlA
చరణం
charaNam 3
నిలువజాల బాలా నీమీద నీవేళా
మదిగోరె చాలా మానినీ చలమేలా
niluvajAla bAlA nImIda nIvELA
madigOre chAlA mAninI chalamElA
చరణం
charaNam 4
సరసకు రావే చేరా దీసుకోవే
వర నరసాపుర వాసుడనుకోవె
sarasaku rAvE chErA dIsukOvE
vara narasApura vAsuDanukOve
నిన్ను నమ్మినాను అను వర్ణ మెట్టు ninnu namminAnu anu varNa meTTu

#598 సాహించలేనే sAhinchalEnE

TitleసాహించలేనేsAhinchalEnE
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAga
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసాహించలేనే సఖియా కూడుదాం రావెsAhinchalEnE sakhiyA kUDudAm rAve
అనుపల్లవి anupallaviకూడుదాం రావే మనమాడుదాం రావే సరికాదే సరికాదేkUDudAm rAvE manamADudAm rAvE sarikAdE sarikAdE
చరణం
charaNam 1
సరిసరి యిది కాదే మరి మరి వేడబోదే
ఇదియే వేళా ఇదియే వేళా ఇదియే వేళా సహిం
దినదినము నిన్నూ కోరి మనసునెంతో ఆశ దూరి
కరిగితి కరిగితి కరిగితి వేడుదు నే నిన్ను
sarisari yidi kAdE mari mari vEDabOdE
idiyE vELA idiyE vELA idiyE vELA sahim
dinadinamu ninnU kOri manasunentO ASa dUri
karigiti karigiti karigiti vEDudu nE ninnu

#597 తననన తందిరనాని tananana tandiranAni

Titleతననన తందిరనానిtananana tandiranAni
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAga
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviతననన తందిర నాని తోందాదాని దింతాtananana tandira nAni tOndAdAni dintA
తనదిమి కుకుందరిత నదిందిమి థీం ఏల్లి ఏల్లి థీంతా తోంతా థీంత్తాన తననtanadimi kukundarita nadindimi thIm Elli Elli thImtA tOmtA thImttAna tanana
నిమిషము నిన్ను బాసి నిలుప జాలరా సామిnimishamu ninnu bAsi nilupa jAlarA sAmi
ఆలస్యమేలా నిదే సమయామురా
దిన దినము నిన్నే మనమున దలచితి
అలచితిరా సొలచితిరా బిలిచితి రారా ఏరా
AlasyamElA nidE samayAmurA
dina dinamu ninnE manamuna dalachiti
alachitirA solachitirA bilichiti rArA ErA
చేర దీసి నను గారవించకchEra dIsi nanu gAravinchaka
తామసమేలరా తాళజాలరా సామి కామముచే
మది కరగి కరగేనిక జాలమేలా నిలజాలానురా
tAmasamElarA tALajAlarA sAmi kAmamuchE
madi karagi karagEnika jAlamElA nilajAlAnurA
నిది వేళారా వలచితిరా సొలచితిరా
దలచితిరా బిలచితి రారా ఏరా
శ్రీధర నరసాపుర విహార
సపనిసారి గరి సారిగరి సనిధగరిని సానిసరి
సగరిరిస నిసరిగరిరిస గరిరి గరిససారిగ
సారిగరి సనిధ మగరిరిస గరిసగరిస నిధస నిధపమ
nidi vELArA valachitirA solachitirA
dalachitirA bilachiti rArA ErA
SrIdhara narasApura vihAra
sapanisAri gari sArigari sanidhagarini sAnisari
sagaririsa nisarigaririsa gariri garisasAriga
sArigari sanidha magaririsa garisagarisa nidhasa nidhapama

#596 మామయలే ఓడి mAmayalE ODi

Titleమామయలే ఓడిmAmayalE ODi
Written Byమంగం వేంకట స్వామిmangam vEnkaTa swAmi
Bookవిచిత్ర జావళీలుvichitra jAvaLIlu
రాగం rAgaకామాసుkAmAsu
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమామయలే ఓడి వాడి మరువి యొరు ముత్తం తాడిmAmayalE ODi vADi maruvi yoru muttam tADi
అనుపల్లవి anupallaviకామియాగి నానుమిదొ కలంగు రెనెన్న శైవేన్kAmiyAgi nAnumido kalangu renenna SaivEn
చరణం
charaNam 1
కామమదు మీరుదడి కన్నిగై యే మున్నవా
మా జామమదు బోగుదడి జాలం శెయ్యాలామో వాడీ
kAmamadu mIrudaDi kannigaiy E munnavA
mA jAmamadu bOgudaDi jAlam SeyyAlAmO vADI
చరణం
charaNam 2
అండ్రు ఉన్నై కండ ముదలు ఆవలు మీరుదడి
ఇండ్రు యెన్నై చ్చోనియుం ఇన్న మేండి మోడి కణ్నే
anDru unnai kanDa mudalu Avalu mIrudaDi
inDru yennai chchOniyum inna mEnDi mODi kaNnE
చరణం
charaNam 3
ఆవితడు మారుదడి అన్నమే నాన్ యెన్న శెయ్‌వేన్
పావి మారన్ ఎందన్ మీదు బాణ మెయ్‌గిరానే వోదు
AvitaDu mArudaDi annamE nAn yenna Sey^vEn
pAvi mAran endan mIdu bANa mey^girAnE vOdu