#522 బంగారు తండ్రి bangAru tanDri

Titleబంగారు తండ్రిbangAru tanDri
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaఅటaTa
పల్లవి pallaviబంగారు తండ్రి యటే యశోదా నీ పట్టి కొంటె కాడటేbangAru tanDri yaTE yaSOdA nI paTTi konTe kADaTE
చరణం
charaNam 1
అంగనరో యెంత నంగనాచివె నీవు
ముంగిటనే నాడు బంగరు కెంపుల
బొంగరములు కన్మొఱంగ జేసి పైట
కొంగున రవికె మఱుంగన డాచితె
దొంగ తనము నెఱింగి నాడ న-
నంగునకు దెలుపంగల నవి యొ-
సంగు మని యుప్పొంగు చనులటె
చెంగునం గొని భంగ పఱచెను
anganarO yenta nanganAchive nIvu
mungiTanE nADu bangaru kempula
bongaramulu kanmo~ranga jEsi paiTa
konguna ravike ma~rungana DAchite
donga tanamu ne~ringi nADa na-
nangunaku delupangala navi yo-
sangu mani yuppongu chanulaTe
chengunam goni bhanga pa~rachenu
చరణం
charaNam 2
ఎట్టి వాడొ నీదు పట్టి చూడవమ్మ
యెట్టు సైతుమమ్మా
పట్ట పగలందఱి యెట్ట యెదుట నొక్క
చిట్టి పూల బంతి కట్టి నాపై వైచి
కుట్టె గుట్టెనదె గట్టి తేలు నీదు
కట్టు చీరె దూరె నెట్టు లొక్కొ యని
యట్టె పైబడి పుట్ట మూడిచి
బిట్టు కౌగిట జుట్టి కుచముల
బట్టి బయలున నిట్ట నిలువుగ
బెట్టి నవ్వుచు దట్టె చేతుల
eTTi vADo nIdu paTTi chUDavamma
yeTTu saitumammA
paTTa pagalanda~ri yeTTa yeduTa nokka
chiTTi pUla banti kaTTi nApai vaichi
kuTTe guTTenade gaTTi tElu nIdu
kaTTu chIre dUre neTTu lokko yani
yaTTe paibaDi puTTa mUDichi
biTTu kaugiTa juTTi kuchamula
baTTi bayaluna niTTa niluvuga
beTTi navvuchu daTTe chEtula
చరణం
charaNam 3
బిత్తరి నీవెంత యెత్తొ కాంతునని
హత్తి కౌగిట నొత్తెనే
అత్తఱి చూచి మా యత్త గారు కోప-
మెత్తి యౌర! యోరి! మత్త దంతు నన్న
బెత్తనంబు నీకు సత్తువ లేదు నీ
చిత్తము రీతి కేలెత్తి సల్పువాడ-
గుత్తకొని నీ మత్త కాశిని
క్రొత్త గుబ్బల మత్తడంచెద
తత్తధిమి తధి తత్త యని న-
న్నెత్తి కొని పఱుగెత్తి యాడెనె
bittari nIventa yetto kAntunani
hatti kaugiTa nottenE
atta~ri chUchi mA yatta gAru kOpa-
metti yaura! yOri! matta dantu nanna
bettanambu nIku sattuva lEdu nI
chittamu rIti kEletti salpuvADa-
guttakoni nI matta kASini
krotta gubbala mattaDamcheda
tattadhimi tadhi tatta yani na-
nnetti koni pa~rugetti yADene
చరణం
charaNam 4
దండను నా నాధుడుండగా వాతెఱ-
గండి వడ నొక్కెనే
దుండగీడు వాడె వండురా? యన జను-
గొండల నడుమ నుండి నూగారను
నుండు నెపమున రానుండు రాహువు చేర-
కుండగ ముఖ శశి మండలమున నధర-
కుండమున గడు నిండిన సుధకు
గండి చేసితి వండ బాపితి
గొండెమా? యిది రండు భుజగ వి-
భుండు తీరుచు గొండు తగవనె
danDanu nA nAdhuDunDagA vAte~ra-
ganDi vaDa nokkenE
dunDagIDu vADe vanDurA? yana janu-
gonDala naDuma nunDi nUgAranu
nunDu nepamuna rAnunDu rAhuvu chEra-
kunDaga mukha SaSi manDalamuna nadhara-
kunDamuna gaDu ninDina sudhaku
ganDi chEsiti vanDa bApiti
gonDemA? yidi ranDu bhujaga vi-
bhunDu tIruchu gonDu tagavane

#521 చానరొ వే చనవే chAnaro vE chanavE

Titleచానరొ వే చనవేchAnarovE chanavE
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaవసంతvasanta
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviచానరొ వే చనవే సకి పాలికిchAnaro vE chanavE saki pAliki
చరణం
charaNam 1
మానము వలదిక నా
మౌనము విడదగు నా
మనవి వినుమనవె
mAnamu valadika nA
maunamu viDadagu nA
manavi vinumanave
చరణం
charaNam 2
ఆ మగువ బిగువు చనుగవ బల్
సొగసు గనగ నెద బిగి
తటాలుననె పటాలు మను
తుటారి మిటారి వటారి కటారి యగు బలె
A maguva biguvu chanugava bal
sogasu ganaga neda bigi
taTAlunane paTAlu manu
tuTAri miTAri vaTAri kaTAri yagu bale
చరణం
charaNam 3
ఆ కలికి చిలుకల కొలికి సుమా
వలపు గెలుపు గొన గ-
ళలూర గదిసి నీ పనుపును దా-
నయముగా భయముగా
గొను భుజంగ వినుతు
రతుల కృతుల నతుల గతుల
ననగియు బెనగియు
మనుప దెలుపవె
A kaliki chilukala koliki sumA
valapu gelupu gona ga-
LalUra gadisi nI panupunu dA-
nayamugA bhayamugA
gonu bhujanga vinutu
ratula kRtula natula gatula
nanagiyu benagiyu
manupa delupave

swaram is also available for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.

#520 సామి చెలి నిను sAmi cheli ninu

Titleసామి చెలి నినుsAmi cheli ninu
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసామి చెలి నిను వలచి పిలిచెరా
సమయ మిదియ సకి గలయ
ఆ మెలత కలత కల నిను గని
కలియగ జని యులికి పడు
sAmi cheli ninu valachi pilicherA
samaya midiya saki galaya
A melata kalata kala ninu gani
kaliyaga jani yuliki paDu
చరణం
charaNam 1
ఆ పడతుక యొడలి యొడుపు నడక
వడువు దొడల బెడగు గన
జడ వడుగులు నెడదలు కడు
సడల సుడివడు దురుర
A paDatuka yoDali yoDupu naDaka
vaDuvu doDala beDagu gana
jaDa vaDugulu neDadalu kaDu
saDala suDivaDu durura
చరణం
charaNam 2
నిక్కు చనుల పయి నొక్కులు పఱచుచు
చెక్కిలి పలు మఱు నొక్కుచు వలపుల
హాళి జాలి కేళి దేలి కిల కిల నగవుల
గొలుపుచు సొగియర
nikku chanula payi nokkulu pa~rachuchu
chekkili palu ma~ru nokkuchu valapula
hALi jAli kELi dEli kila kila nagavula
golupuchu sogiyara
చరణం
charaNam 3
అంగజుడు గనయ ముంగొనయ ముంగొలి పెర
భుజంగ నర పుంగవ వరద
తాళ గలదుర వేళ గడపక లీల నేలర
angajuDu ganaya mumgonaya mumgoli pera
bhujanga nara pungava varada
tALa galadura vELa gaDapaka lIla nElara

swaram is also available for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.

#519 సారసలోచన sArasalOchana

TitleసారసలోచనsArasalOchana
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaహిందుస్థాని కాఫీhindusthAni kAfI
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసారసలోచన వేచెరా వేమారు నీ రాకకుsArasalOchana vEcherA vEmAru nI rAkaku
1కోరి వలచినదిరా మారు సతికి బ్రతిరా
చేరి కవుగలిడరా యేరిని మది గోరదు చెలి
kOri valachinadirA mAru satiki bratirA
chEri kavugaliDarA yErini madi gOradu cheli
2రాజ వదన యెదను వలరా
జుముదము కదుర శర రాజి బఱుప
బెదరి నిజ రాజ వని నిను శరణనెరా
జగతి రా జగతి రా జనవర మనపవుర
rAja vadana yedanu valarA
jumudamu kadura Sara rAji ba~rupa
bedari nija rAja vani ninu SaraNanerA
jagati rA jagati rA janavara manapavura
3ఆ మగువ నగవు మొగమలకలు వల చెలి
గెలిచెడు నా చెలి సొగసుగ నులు తొగల మిగులు
మరాళ గమన సుమా యరాళ చికుర సుమా వరాల తరువు సుమా
కడాని మిసి మిడాల్ దెలుపు బలుపు జిగి బిగి గొను చనులు
పసిడి కడవల దెగడెడుర
కలికిరా చిలుకరా నత భుజంగ పతి వినుత
A maguva nagavu mogamalakalu vala cheli
gelicheDu nA cheli sogasuga nulu togala migulu
marALa gamana sumA yarALa chikura sumA varAla taruvu sumA
kaDAni misi miDAl delupu balupu jigi bigi gonu chanulu
pasiDi kaDavala degaDeDura
kalikirA chilukarA nata bhujanga pati vinuta

swaram is also available for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.

#518 బాలామణి బిగి కవుగిలి bAlAmaNi bigi kavugili

Titleబాలామణి బిగి కవుగిలిbAlAmaNi bigi kavugili
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaబిళహరిbiLahari
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviబాలామణి బిగి కవుగిలి విడజాలి
జాలిమాలి కనుగొనవేరా
వినవౌరా! యనువౌరా!
కినుక యిటు చనునటర
bAlAmaNi bigi kavugili viDajAli
jAlimAli kanugonavErA
vinavaurA! yanuvaurA!
kinuka yiTu chanunaTara
చరణం
charaNam 1
నతి యనెరా గతి యనెరా
సతి కుటిల గతి నీకు
వ్రతమా? మది కఱుగదుర?
nati yanerA gati yanerA
sati kuTila gati nIku
vratamA? madi ka~rugadura?
చరణం
charaNam 2
బెదరు వారి పొదల దూరి పరుగిడు
సుదతి జేరి మదనుడ దయుడై
మదము మీఱి యెదను దూరి తెఱలెడు
ప్రదరమేఱి పదను నూరి గురి యిడె
bedaru vAri podala dUri parugiDu
sudati jEri madanuDadayuDai
madamu mI~ri yedanu dUri te~raleDu
pradaramE~ri padanu nUri guri yiDe
చరణం
charaNam 3
మంగళ మిక నంగనంగన
భుజంగ శయ భుజంగ పుంగవ
శుభంకర యళులకు రంగట
చిలుకల చెంగట కొలకుల ముంగిట
దానలంగి నలంగి తలంగి తొలంగి
మలంగి మెలంగి కలంగెనురా
మరులు కొనెరా మరతజనురా?
పరాకురా బిరాన రారా
mangaLa mika namganamgana
bhujanga Saya bhujanga pungava
Subhamkara yaLulaku rangaTa
chilukala chengaTa kolakula mungiTa
dAnalangi nalangi talangi tolangi
malangi melangi kalangenurA
marulu konerA maratajanurA?
parAkurA birAna rArA

swaram available with sAhityam for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.

#517 సామీ వేళగాదురా sAmI vELagAdurA

Titleసామీ వేళగాదురాsAmI vELagAdurA
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Posted At31, 145
పల్లవి pallaviసామీ వేళ గాదురాsAmI vELa gAdurA
చరణం
charaNam 1
ముద్దు బెట్ట వద్దు చాలురా
సద్దు సేయరాదు తాళురా
muddu beTTa vaddu chAlurA
saddu sEyarAdu tALurA
చరణం
charaNam 2
సన్న సైగ జేసేవేలరా
వెన్నుడా నే మగనాలరా
sanna saiga jEsEvElarA
vennuDA nE maganAlarA
చరణం
charaNam 3
సామి ధర గిరి నిలయా
సమయము గని కలయ
sAmi dhara giri nilayA
samayamu gani kalaya

#516 వేగ రమ్మనవే vEga rammanavE

Titleవేగ రమ్మనవేvEga rammanavE
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaతోడిtODi
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Posted At30, 133
పల్లవి pallaviవేగ రమ్మనవే వేగమే
నా సామి నిందు సఖీ
vEga rammanavE vEgamE
nA sAmi nindu sakhI
చరణం
charaNam 1
*(మదనుని బారికి) మది నోర్వ జాలనే
సదయుని కింత దయ లేదే
*(madanuni bAriki) madi nOrva jAlanE
sadayuni kinta daya lEdE
చరణం
charaNam 2
అలదాని మాయకే వలచిన సామికి
వలపనే మందు తలకెక్కె
aladAni mAyakE valachina sAmiki
valapanE mandu talakekke
చరణం
charaNam 3
అద్దిర యెవతో విభు నెడ బాసెనే
నిద్దుర కంటికి రాదు గదే
addira yevatO vibhu neDa bAsenE
niddura kanTiki rAdu gadE
చరణం
charaNam 4
వన్నెలాడిరో మైసూరి కృష్ణుని
క్రొన్నన విల్తుని కేళికి
vannelADirO maisUri kRshNuni
kronnana viltuni kELiki

Text in brackets was not found in this book. We added, based on previous two versions of lyrics.
* పక్కన బ్రాకెట్ లో పెట్టిన మాటలు ఈ పుస్తకంలో లేవు. పాత పుస్తకాలలో దొరికిన సాహిత్యం నుంచి తీసుకుని మేము ఇక్కడ కలిపాము.

#515 వింటివేమిరా vinTivEmirA

TitleవింటివేమిరాvinTivEmirA
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviవింటివేమిరా సామిvinTivEmirA sAmi
చరణం
charaNam 1
తుంట విల్తు డేయు పదును
తూపులెల్ల దాని యెదను
జంటకత్తె ఓర్వ దను
కొంటి వేమిరా సామి
tunTa viltu DEyu padunu
tUpulella dAni yedanu
janTakatte Orva danu
konTi vEmirA sAmi
చరణం
charaNam 2
నిదుర లేక నీదు దారి
ఎదురు చూచి వేసారి
సదయుడ హాయనుచు తేఱి
సైపలేదురా సామి
nidura lEka nIdu dAri
eduru chUchi vEsAri
sadayuDa hAyanuchu tE~ri
saipalEdurA sAmi
చరణం
charaNam 3
రవల సొమ్ము లిచ్చి నటుల
రాతిరెల్ల గూడి నటుల
కువల యాక్షి పలికి నటుల
గోప బాలకా సామి
ravala sommu lichchi naTula
rAtirella gUDi naTula
kuvala yAkshi paliki naTula
gOpa bAlakA sAmi

#514 రమణీమణి సామిని ramaNImaNi sAmini

Titleరమణీమణి సామినిramaNImaNi sAmini
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaహరి కాంభోజిhari kAmbhOji
తాళం tALaచాపుchApu
Previously Posted At1
పల్లవి pallaviరమణీమణి సామిని తేవే ఓramaNImaNi sAmini tEvE O
సామిని తేవే కామిని పోవేsAmini tEvE kAmini pOvE
చరణం
charaNam 1
చల్లని సోముడు పల్లవ పాణుల
ఉల్లము రంజిల్ల వెన్నెల గాసెనే ఓ
challani sOmuDu pallava pANula
ullamu ranjilla vennela gAsenE O
చరణం
charaNam 2
భామా మణి కాముని పోరున
వేమఱు బాణము వేయగ తాళనే ఓ
bhAmA maNi kAmuni pOruna
vEma~ru bANamu vEyaga tALanE O
చరణం
charaNam 3
చక్కని వాడే అక్కరో వీడే
మక్కువ తోడనే పక్కకు తేవే ఓ
chakkani vADE akkarO vIDE
makkuva tODanE pakkaku tEvE O
చరణం
charaNam 4
ధర యందు ధర్మ పురమందు
నా దొరయౌ పరవాసుని వేగమే ఓ
dhara yandu dharma puramandu
nA dorayau paravAsuni vEgamE O

#513 మానావమానము mAnAvamAnamu

TitleమానావమానముmAnAvamAnamu
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaచాపుchApu
Previously Posted At19, 177
పల్లవి pallaviమానావమానము అతనిదే చెలిmAnAvamAnamu atanidE cheli
చరణం
charaNam 1
మునుపటి వలె తాను
తన మది నెంచక
ననబోణి రాడాయెనే చెలి
munupaTi vale tAnu
tana madi nenchaka
nanabONi rADAyenE cheli
చరణం
charaNam 2
తరుణి బోధన విని
తానిందు రాడాయె
కరుణయు లేదాయెనే చెలి
taruNi bOdhana vini
tAnindu rADAye
karuNayu lEdAyenE cheli
చరణం
charaNam 3
వనితరో గోపాలుడు నన్నేలుట
తనదే భారమనెనే చెలి
vanitarO gOpAluDu nannEluTa
tanadE bhAramanenE cheli