#502 ఏలరా నాపై ElarA nApai

Titleఏలరా నాపైElarA nApai
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమిశ్రముmiSramu
Previously Posted At155
పల్లవి pallaviఏలరా నాపై చాలురా మోహముElarA nApai chAlurA mOhamu
బాలా మణితో ఏమో బాసలు చేసితివటbAlA maNitO EmO bAsalu chEsitivaTa
చరణం
charaNam 1
ఆపెను గూడి రతి అనుభవించితి వేమో
మాపటి వేళలో రాపు జేసేవట
Apenu gUDi rati anubhavinchiti vEmO
mApaTi vELalO rApu jEsEvaTa
చరణం
charaNam 2
అలరు బోణితో నీవు అలగిన దేమో
చెలికాడ నను గూడి బలిమి జేసేవట
alaru bONitO nIvu alagina dEmO
chelikADa nanu gUDi balimi jEsEvaTa
చరణం
charaNam 3
హితవుతో పార్థసారథి నన్ను గూడితే
అతివలు చూచితే అపరాధమవును
hitavutO pArthasArathi nannu gUDitE
ativalu chUchitE aparAdhamavunu

#501 ఎందుకు వాడలగి enduku vADalagi

Titleఎందుకు వాడలగిenduku vADalagi
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఎందుకు వాడలగి రాడు మందగమనenduku vADalagi rADu mandagamana
సుందర వేంకటేశుడు వాడెందు బోయెనోsundara vEnkaTESuDu vADendu bOyenO
చరణం
charaNam 1
చపల నేత్రి యనుచు నన్ను చేర కున్నాడే
అపకారికా చెలికానికి ఉపము దెలుపవే
chapala nEtri yanuchu nannu chEra kunnADE
apakArikA chelikAniki upamu delupavE
చరణం
charaNam 2
కుటిల కుంతలి యనుచు నన్ను కూడ కున్నాడే
విటునికి మఱి బాసలిచ్చి వితము దెలుపవే
kuTila kuntali yanuchu nannu kUDa kunnADE
viTuniki ma~ri bAsalichchi vitamu delupavE

#500 ఇన్నాళ్ళ వలె innALLa vale

Titleఇన్నాళ్ళ వలెinnALLa vale
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఏకEka
Previously Posted At33, 189
పల్లవి pallaviఇన్నాళ్ళ వలె గాదే వాని గుణమెంతని నే
విన్నవింతునే ఓ చెలియ
innALLa vale gAdE vAni guNamentani nE
vinnavintunE O cheliya
చరణం
charaNam 1
నన్నెడ బాయడు అన్యుల జూడడు
మన్నన విడడు మానినీ మణిరో
వన్నె కాడే ఎందున్నాడే
ఇందు రాడే వాడన్నిట నెఱజాణుడే
nanneDa bAyaDu anyula jUDaDu
mannana viDaDu mAninI maNirO
vanne kADE endunnADE
indu rADE vADanniTa ne~rajANuDE
చరణం
charaNam 2
తామస మేలనే తాళగ జాలనే
కోమలి నీ మది కోరిన సొమ్ములు
చేకొనవే వేగ రావే తోడి తేవే
నా సామి నిటు రమ్మనవే
tAmasa mElanE tALaga jAlanE
kOmali nI madi kOrina sommulu
chEkonavE vEga rAvE tODi tEvE
nA sAmi niTu rammanavE
చరణం
charaNam 3
అందముగా రతి అందము నేలిన
సుందర శ్యామల వేంకట రమణుడు
నెనరున కలసిన దాన గాన
ఓ మద గజ గమనరో
andamugA rati andamu nElina
sundara SyAmala VEnkaTa ramaNuDu
nenaruna kalasina dAna gAna
O mada gaja gamanarO

#499 ఇందుముఖీ వానికి indumukhI vAniki

Titleఇందుముఖీ వానికిindumukhI vAniki
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaరూపకrUpaka
Previously Posted At3
పల్లవి pallaviఇందుముఖీ వానికి మనసిందు లేదాయె ఏమందు నేమాయindumukhI vAniki manasindu lEdAye Emandu nEmAya
చరణం
charaNam 1
చక్కెర విలుకాని పోరు ఎక్కువ లాయె
చక్కన గాదని తెలిపే చాన లేదాయె ||ఏ ఇం||
chakkera vilukAni pOru ekkuva lAye
chakkana gAdani telipE chAna lEdAye ||E im||
చరణం
charaNam 2
ఆసతో మునుపాడినట్టి బాసలేమాయె
దోసకారి బోధన విని మోసము లాయె ||ఏ ఇం||
AsatO munupADinaTTi bAsalEmAye
dOsakAri bOdhana vini mOsamu lAye ||E im||
చరణం
charaNam 3
వేంకట రమణునికి నాపై బింకములాయె
పొంకముతో నన్ను గూడుటిం కరుదాయె ||ఏ ఇం||
vEnkaTa ramaNuniki nApai binkamulAye
ponkamutO nannu gUDuTim karudAye ||E im||

#498 అంతలోనె తెల్లవారె antalOne tellavAre

Titleఅంతలోనె తెల్లవారెantalOne tellavAre
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaరూపకrUpaka
Previously Posted At24, 191
పల్లవి pallaviఅంతలోనె తెల్లవాఱె
అయ్యో ఏమి సేతునే
antalOne tellavA~re
ayyO Emi sEtunE
కాంతుని మనసెంత నొచ్చెనొ
ఇంతి యెట్లు సైతునే
kAntuni manasenta nochcheno
inti yeTlu saitunE
చరణం
charaNam 1
కొదమ గుబ్బ లెదను గదియ నదుము కొనుచు చాలా
పెదవి తేనె లాన నా మదిని దోచు వేళ
kodama gubba ledanu gadiya nadumu konuchu chAlA
pedavi tEne lAna nA madini dOchu vELa
చరణం
charaNam 2
పంతమున తటాన లేచి పైట కొంగు జారగా
కాంత దొంతర విడెమొసంగి కౌగలింపు చుండగా
pantamuna taTAna lEchi paiTa kongu jAragA
kAnta dontara viDemosangi kaugalimpu chunDagA
చరణం
charaNam 3
సోమ భూపాల రమ్మని భామ ప్రేమ మీఱగా
కాముకేళి లోన మిగుల కలసి మెలసి యుండగా
sOma bhUpAla rammani bhAma prEma mI~ragA
kAmukELi lOna migula kalasi melasi yunDagA

#497 చెలియరో cheliyarO

TitleచెలియరోcheliyarO
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviచెలియరో నేనేమి సేతు చెలువుని బాసి
అల దాని గూడి ఇందు రాడు అలసి సొలసి
cheliyarO nEnEmi sEtu cheluvuni bAsi
ala dAni gUDi indu rADu alasi solasi
చరణం
charaNam 1
మును నన్ను గూడి ముద్దు పెట్టి ముచ్చట లాడి
వినయముతోను విభుని పక్క వేగ జేర్చవే
munu nannu gUDi muddu peTTi muchchaTa lADi
vinayamutOnu vibhuni pakka vEga jErchavE
చరణం
charaNam 2
మదిరాక్షిరో నను గూడమన్న మనసు రాదాయె
మది నిన్ను మెచ్చి మమత హెచ్చి మదిని దలతునే
madirAkshirO nanu gUDamanna manasu rAdAye
madi ninnu mechchi mamata hechchi madini dalatunE
చరణం
charaNam 3
వర రత్నపురి నిలయుని నాయొద్ద జేర్పవే
సదయుని దయ వలచి చాల కలవర మాయె
vara ratnapuri nilayuni nAyodda jErpavE
sadayuni daya valachi chAla kalavara mAye

#496 ఎంత నే విన్నవింతునే enta nE vinnavintunE

Titleఎంత నే విన్నవింతునేenta nE vinnavintunE
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఎంత నే విన్నవింతునే ఓ యింతివానిenta nE vinnavintunE O yintivAni
చరణం
charaNam 1
ఎంతని నే విన్నవింతు పంతముతో నన్ను బాసి
వింత వింత రతులచే ఆ కాంత నేలుచున్న వాని
entani nE vinnavintu pantamutO nannu bAsi
vinta vinta ratulachE A kAnta nEluchunna vAni
చరణం
charaNam 2
అక్కరో నే చేసిన చెలిమెక్కడ మఱపాయెనే
టక్కులాది బోధనలకు చిక్కు పడియున్న వాని
akkarO nE chEsina chelimekkaDa ma~rapAyenE
TakkulAdi bOdhanalaku chikku paDiyunna vAni
చరణం
charaNam 3
మెత్తనైన చెలులను నోరెత్త వద్దనుచు బలికి
క్రొత్త చెలుల నేస్తము మది కోరి యేలుచున్న వాని
mettanaina chelulanu nOretta vaddanuchu baliki
krotta chelula nEstamu madi kOri yEluchunna vAni
చరణం
charaNam 4
ఈ మహిలో సురపురి సామి గోపాలుడు నను
కాముకేళి లోన కలసి ప్రేమ మఱచి యిందు రాడు
I mahilO surapuri sAmi gOpAluDu nanu
kAmukELi lOna kalasi prEma ma~rachi yindu rADu

#495 సామికి నాపై sAmiki nApai

Titleసామికి నాపైsAmiki nApai
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Posted At57
పల్లవి pallaviసామికి నాపై ఇంత చలమేలనే విను
కోమలాంగి ఇక నే తాళ జాలనే
sAmiki nApai inta chalamElanE vinu
kOmalAngi ika nE tALa jAlanE
చరణం
charaNam 1
ఈడగు నా చెలికాడని విధ విధ వేడుకతో నే ప్రౌఢతగా
ఆడిన పాడిన వేడిన గాని నను జూడడే నాతో ప్రతి మాట లాడడే
IDagu nA chelikADani vidha vidha vEDukatO nE prauDhatagA
ADina pADina vEDina gAni nanu jUDaDE nAtO prati mATa lADaDE
చరణం
charaNam 2
ఇమ్ముగ తను నెఱ నమ్మితినని బలు నమ్మిక కొమ్మ నే పొమ్మని
రమ్మని కోపమ్మని మ్రొక్కుచు ముమ్మర దలచిన సమ్మతించడే
immuga tanu ne~ra nammitinani balu nammika komma nE pommani
rammani kOpammani mrokkuchu mummara dalachina sammatinchaDE
చరణం
charaNam 3
శ్రీశ తిరుపతి వాస నే నన్యుల బాసలు విని పరిహాసముగా
ఆసలు బాసలు మోస పఱచడని బాసలు చేసిన సంతోష పడడే
SrISa tirupati vAsa nE nanyula bAsalu vini parihAsamugA
Asalu bAsalu mOsa pa~rachaDani bAsalu chEsina santOsha paDaDE

#494 చెలియ నీవే cheliya nIvE

Titleచెలియ నీవేcheliya nIvE
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviచెలియ నీవే తోడి తేవే
చెలువుడైన కృష్ణుని
cheliya nIvE tODi tEvE
cheluvuDaina kRshNuni
చరణం
charaNam 1
వలపు నిలువ ఇపుడు నాదు వశము గాదు గదవేvalapu niluva ipuDu nAdu vaSamu gAdu gadavE
చరణం
charaNam 2
సుందరాంగుని జూచి సుదతి మోహించెనోsundarAnguni jUchi sudati mOhinchenO
చరణం
charaNam 3
ఇందు రాకయున్న వానికేమి బోధించెనోindu rAkayunna vAnikEmi bOdhinchenO
చరణం
charaNam 4
మారుబారి కోర్వలేనె మగువ ఏమి సేతునేmArubAri kOrvalEne maguva Emi sEtunE
చరణం
charaNam 5
మారజనకు డేల రాడె మమత ఎటుల దాతునేmArajanaku DEla rADe mamata eTula dAtunE

#493 ఎట్లు సైతురా eTlu saiturA

Titleఎట్లు సైతురాeTlu saiturA
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకrUpaka
Previously Posted At121
పల్లవి pallaviఎట్లు సైతురా సామిeTlu saiturA sAmi
చరణం
charaNam 1
పెదవి మీద పంటి కాటు
ఎదను దాని చంటి పోటు
కదసి వెన్నున కీల్జడ
వేటు కన్నుల చూచి నే
pedavi mIda panTi kATu
edanu dAni chanTi pOTu
kadasi vennuna kIljaDa
vETu kannula chUchi nE
చరణం
charaNam 2
భయము లేక నన్ను బాసి
పగలు రాత్రి ఒకటి చేసి
వయసు చెలికి దార పోసి
వచ్చి నిలిచితే
bhayamu lEka nannu bAsi
pagalu rAtri okaTi chEsi
vayasu cheliki dAra pOsi
vachchi nilichitE
చరణం
charaNam 3
ముద్దుల సామి కృష్ణరాయ
ముదిత తోను పొందు సేయ
వద్దని నే మనవి సేయ
వాదు చేసితే
muddula sAmi kRshNarAya
mudita tOnu pondu sEya
vaddani nE manavi sEya
vAdu chEsitE