| Title | ఇది నీకు మరియాదగా | idi nIku mariyAdagA |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | ఇది నీకు మరియాదగా ఏరా నా సామి ఇది నీకు మరియాదగా దానింటికి పోయి అలసి సొలసి గూడి యిందున రావైతివి అయ్యయ్యో | idi nIku mariyAdagA ErA nA sAmi idi nIku mariyAdagA dAninTiki pOyi alasi solasi gUDi yinduna rAvaitivi ayyayyO |
| 1 | పట్టి మంచము బిగి పట్టించి నా పడకింట పవళించమని వేడితే నన్ను చట్ట చేయక నందు ఆ సవతి గుడిసె కేగి పట్టిలో పవళించితివి అయ్యయ్యో | paTTi manchamu bigi paTTinchi nA paDakinTa pavaLinchamani vEDitE nannu chaTTa chEyaka nandu A savati guDise kEgi paTTilO pavaLinchitivi ayyayyO |
| 2 | గుత్తపు గుబ్బల గదియు కౌగిలించుచు వద్దికగా ముద్దియ్య వేడితే దిద్ది పోలిన పాత చిలికిన పాలించు కొత్తు నిపుడు కౌగలించ వైతి వయ్యయ్యో | guttapu gubbala gadiyu kaugilinchuchu vaddikagA muddiyya vEDitE diddi pOlina pAta chilikina pAlinchu kottu nipuDu kaugalincha vaiti vayyayyO |
| 3 | ధరను వెలయు ధర్మపురి వేణుగోపాలా మరుకేలిత మై మరువ గూడమని వేడ సారె సారెకు నాతో చలము చేయుచు చాల పర నారీ మణుల పొందను పో అయ్యయ్యో | dharanu velayu dharmapuri vENugOpAlA marukElita mai maruva gUDamani vEDa sAre sAreku nAtO chalamu chEyuchu chAla para nArI maNula pondanu pO ayyayyO |
#564 చాలు నిలుపంతట chAlu nilupantaTa
| Title | చాలు నిలుపంతట | chAlu nilupantaTa |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | చాలు నిలుపంతట నట్టి ఉపచారము లెందుకురా నిన్న రేయి చిన్న దానింటను నన్ను జూచి నవ్వినారటరా | chAlu nilupantaTa naTTi upachAramu lendukurA ninna rEyi chinna dAninTanu nannu jUchi navvinAraTarA |
| అనుపల్లవి anupallavi | అదెల్ల నా పెను సిగ్గయెరా కాంతా మణిని రాణి వనుచు కీర్తిం బొగిడికొని ఆడినా వింతలు విన చలల్ల నాయెనురా | adella nA penu siggayerA kAntA maNini rANi vanuchu kIrtim bogiDikoni ADinA vintalu vina chalalla nAyenurA |
| చరణం charaNam 1 | తారాధిప సంకాశా గంభీరా భూధారా శ్రీ ధర్మ పురీశుడు నను జేసి దూరుట మరియాద గాదటరా ఎందుకు వందన ఏలుమురా | tArAdhipa samkASA gambhIrA bhUdhArA SrI dharma purISuDu nanu jEsi dUruTa mariyAda gAdaTarA enduku vandana ElumurA |
#563 ఏమి బల్కెనో Emi balkenO
| Title | ఏమి బల్కెనో | Emi balkenO |
| Written By | దుడ్డు సీతారామయ్య (1883-1949) | duDDu sItArAmayya (1883-1949) |
| Book | సెంటినరీ మ్యాగజైన్ (1983) | Centenary Magazine 1983 |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Published At | 302 | |
| పల్లవి pallavi | ఏమి బల్కెనో శ్రీ సఖుడేమి బల్కెనో అలవా | Emi balkenO SrI sakhuDEmi balkenO alavA |
| అనుపల్లవి anupallavi | మోమాటమేమీ లేక దేల్పగదె చెలి | mOmATamEmI lEka dElpagade cheli |
| చరణం charaNam 1 | నే వ్రాయు చీటీ జూచెనా నిరసించి పారవైచెనా ఏమైన నుల్లసమ్ము లాడెనా చెలి | nE vrAyu chITI jUchenA nirasimchi pAravaichenA Emaina nullasammu lADenA cheli |
| చరణం charaNam 2 | నను బాయనంచు జెప్పెనా నిను జూచి వేరె దాగెనా నీకేమైన భూషలిచ్చెనా చెలి | nanu bAyananchu jeppenA ninu jUchi vEre dAgenA nIkEmaina bhUshalichchenA cheli |
| చరణం charaNam 3 | ఆ కాంత యింటనుండెనా అన్యాలయమున నుండెనా మనసిచ్చి మారు జాబు వ్రాసెనా చెలి | A kAnta yinTanunDenA anyAlayamuna nunDenA manasichchi mAru jAbu vrAsenA cheli |
| చరణం charaNam 4 | ఇటు తాను వత్తుననియనా అటు నన్ను రమ్మనియెనా ఎటు బల్కె సీతరామ శాస్త్రి కవినుతు | iTu tAnu vattunaniyanA aTu nannu rammaniyenA eTu balke sItarAma SAstri kavinutu |
Strangely, the lyrics of 302 and this, are almost identical – but, with a different mudra.
#562 కంటి సైగ kanTi saiga
| Title | కంటి సైగ | kanTi saiga |
| Written By | వింజమూరి వరదరాజయ్యంగారు* | viMjamUri varadarAjayyangAru* |
| Book | ||
| రాగం rAga | మణిరంగు | maNirangu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కంటి సైగ జేసెనే తుంటరికాడు ఒంటిగ నున్న నన్నింటి లోకి రమ్మని | kanTi saiga jEsenE tunTarikADu onTiga nunna nanninTi lOki rammani |
| అనుపల్లవి anupallavi | జంట పావురముల క్రీ గంటి జూపి వాడు కొంటె మాటలాడి తుంటరి పనులు సేయ | janTa pAvuramula krI ganTi jUpi vADu konTe mATalADi tunTari panulu sEya |
| చరణం charaNam 1 | నవ మోహనాంగుడే వాడు నాద వినోదుడే ధరను వెలయు శ్రీ వరకాంచి పురమున స్థిరముగ నెలకొన్న వరద రాజ విభుడు | nava mOhanAnguDE vADu nAda vinOduDE dharanu velayu SrI varakAnchi puramuna sthiramuga nelakonna varada rAja vibhuDu |
- As found in the book jAvaLIlu – mOdugula. జావళీలు – మోదుగుల పుస్తకము ఆధారముగా
#561 అగపడదే agapaDadE
| Title | అగపడదే | agapaDadE |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | ఖమాచి | khamAchi |
| తాళం tALa | త్రస్య గతి | trasya gati |
| పల్లవి pallavi | అగపడదే చోటనైన యట్టి వన్నెలాడి | agapaDadE chOTanaina yaTTi vannelADi |
| అనుపల్లవి anupallavi | సుగపడు మా పూవుబోడి జోడు కూడి యాది | sugapaDu mA pUvubODi jODu kUDi yAdi |
| చరణం charaNam 1 | ముగుర కాలి గోరినైన బోలునె నీ నాతి యగును దాని చెంత రంజయైన నాకు కోతి | mugura kAli gOrinaina bOlune nI nAti yagunu dAni chenta ramjayaina nAku kOti |
| చరణం charaNam 2 | దెబ్బున నద్దాని జిదిమి దివ్వె పెట్టినచ్చు అబ్బోటిన్జూడ నతివ కైన వలపు హెచ్చు | debbuna naddAni jidimi divve peTTinachchu abbOTin&jUDa nativa kaina valapu hechchu |
#560 బళిర నీవు baLira nIvu
| Title | బళిర నీవు | baLira nIvu |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | జంజోటి | janjOTi |
| తాళం tALa | మిశ్ర రూపక | miSra rUpaka |
| పల్లవి pallavi | బళిర నీవు పెట్టు చీవాట్లు కూడ రత్తి కట్టు | baLira nIvu peTTu chIvATlu kUDa ratti kaTTu |
| అనుపల్లవి anupallavi | అలరు చుండు నీకు నొకంత మై చిరాకు | alaru chunDu nIku nokanta mai chirAku |
| చరణం charaNam 1 | అవుర నీదు పల్కు చిఱునవ్వు ముత్తెములొల్కు సవతి యొద్ద నన్ను బల్చన సేయకు కొల్తు నిన్ను | avura nIdu palku chi~runavvu muttemulolku savati yodda nannu balchana sEyaku koltu ninnu |
| చరణం charaNam 2 | ఓరి వన్నెకాడ నన్నుంచుము నీతోడ మేఱమీదె నాసకనుమీ నాపై నీగు | Ori vannekADa nannunchumu nItODa mE~ramIde nAsakanumI nApai nIgu |
#559 జాతి నీతి jAti nIti
| Title | జాతి నీతి | jAti nIti |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | బిలహరి | bilahari |
| తాళం tALa | ఖండ గతి | khanDa gati |
| పల్లవి pallavi | జాతి నీతి తలంప కీ తీరుగా బల్కితే తోచి నట్లెల్ల నెవతెవైన న్గల్కి | jAti nIti talampa kI tIrugA balkitE tOchi naTlella nevatevaina n&galki |
| చరణం charaNam 1 | నిక్కమగు మగవాని కొక్కాలి యొకమాట పెక్కేల రక్కసీ వెళ్ళు వచ్చిన బాట | nikkamagu magavAni kokkAli yokamATa pekkEla rakkasI veLLu vachchina bATa |
| చరణం charaNam 2 | కులమునకు జెడె కాని కూడు గుడవగ నౌన సలుప గూడదు హాని జగతికే మిషనైన | kulamunaku jeDe kAni kUDu guDavaga nauna salupa gUDadu hAni jagatikE mishanaina |
#558 ఏ నీకు జిక్కి E nIku jikki
| Title | ఏ నీకు జిక్కి | E nIku jikki |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | కాఫీ | kAfI |
| తాళం tALa | చతురశ్ర గతి | chaturaSra gati |
| పల్లవి pallavi | ఏ నీకు జిక్కినా నోరీ యందకాడ యిప్పుడే నన్నేల రాయే | E nIku jikkinA nOrI yandakADa yippuDE nannEla rAyE |
| అనుపల్లవి anupallavi | ఏనుండ వలె గాని నీకుం దగిన జోడెబ్బె రాసిద్దేలరా | EnunDa vale gAni nIkum dagina jODebbe rAsiddElarA |
| చరణం charaNam 1 | చాటు నకు రమ్ము మంతనము జెప్పెద నీ వెట్టు లూకొట్టెదో పూ చెండులివె సిరి కోరి వచ్చినప్డు మోకాలడ్డు పెట్టిదో | chATu naku rammu mantanamu jeppeda nI veTTu lUkoTTedO pU chenDulive siri kOri vachchinapDu mOkAlaDDu peTTidO |
| చరణం charaNam 2 | జగమెల్ల జూచితి న్నీవంటి సొగసుకా డగపడ లేదద్దిరా మగడ దాపనేల నన్ను మించిన జాణ మఱి మఱి లేదెద్దిరా | jagamella jUchiti nnIvanTi sogasukA DagapaDa lEdaddirA magaDa dApanEla nannu minchina jANa ma~ri ma~ri lEdeddirA |
#557 వీడెంతో vIDentO
| Title | వీడెంతో | vIDentO |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | వీడెంతో యందమైన వాడు సెబాసు | vIDentO yandamaina vADu sebAsu |
| అనుపల్లవి anupallavi | ఈడే ఱేడైన వీని కీరేడు జగముల ఱేడు | IDE ~rEDaina vIni kIrEDu jagamula ~rEDu |
| చరణం charaNam 1 | కూడ దగిన మంచి కోడెకాడు నేడు నా కబ్బ కబ్బినాడు నా కీడుజోడి | kUDa dagina manchi kODekADu nEDu nA kabba kabbinADu nA kIDujODi |
#556 ఎంతమాట entamATa
| Title | ఎంతమాట | entamATa |
| Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
| Book | ||
| రాగం rAga | అసావేరి | asAvEri |
| తాళం tALa | సంకీర్ణ జాతి ఏక | sankIrNa jAti Eka |
| పల్లవి pallavi | ఎంత మాట పల్కితీవు జీవితేశ | enta mATa palkitIvu jIvitESa |
| అనుపల్లవి anupallavi | ఇంతలోన విడిచితే నామీద యాశ | intalOna viDichitE nAmIda yASa |
| చరణం charaNam 1 | నిన్ను బాసి నేను నిముస మోర్వలేను మన్నుటెట్లు నీరు మానినంత మీను | ninnu bAsi nEnu nimusa mOrvalEnu mannuTeTlu nIru mAninanta mInu |
| చరణం charaNam 2 | వలదనకుము నన్ను వచ్చెద నీ తోడ నిలువ దరమె నా యుసుఱు నీకు బుడమి ఱేడ | valadanakumu nannu vachcheda nI tODa niluva darame nA yusu~ru nIku buDami ~rEDa |
| చరణం charaNam 3 | అలవికాని కార్య మాచరింప లేవు తొలగ ద్రోసెదే నాతోడి నీడ నీవు | alavikAni kArya mAcharimpa lEvu tolaga drOsedE nAtODi nIDa nIvu |