#492 వాడెటు పల్కెనో vADeTu palkenO

Titleవాడెటు పల్కెనోvADeTu palkenO
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaమాంజిmAnji
తాళం tALaచాపుchApu
Previously Posted At16, 183
పల్లవి pallaviవాడెటు పల్కెనో తెల్పవే
బోటిరో బూటకమేలనే
vADeTu palkenO telpavE
bOTirO bUTakamElanE
చరణం
charaNam 1
కొమ్మరో నేనంపిన కమ్మను వాడేకొననో
వాని చెలి చేతి కిమ్మనెనో
kommarO nEnampina kammanu vADEkonanO
vAni cheli chEti kimmanenO
చరణం
charaNam 2
ఇంతిరో నే బంపిన పూబంతులు వాడె
కొనెనో వాని రమణి కిమ్మనెనో
intirO nE bampina pUbantulu vADe
konenO vAni ramaNi kimmanenO
చరణం
charaNam 3
రమ్మని పిల్వగ ఈడకు వాడే వచ్చెనో
వచ్చేననిన వాని చెలి పోవద్దెనెనో
rammani pilvaga IDaku vADE vachchenO
vachchEnanina vAni cheli pOvaddenenO
చరణం
charaNam 4
బాలరో ధర్మపురి పాలుడు నన్నె లేననెనో
ఏలేను పో పొమ్మనెనో
bAlarO dharmapuri pAluDu nanne lEnanenO
ElEnu pO pommanenO

#491 మరియాదనా mariyAdanA

TitleమరియాదనాmariyAdanA
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaశంకరాభరణముSankarAbharaNamu
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Posted At59
పల్లవి pallaviమరియాదనా మానిని వానికిmariyAdanA mAnini vAniki
చరణం
charaNam 1
సరసునికి సంసారియని తెలియక
సరివారిలో కను సంజ్ఞను చేసేది
sarasuniki samsAriyani teliyaka
sarivArilO kanu sanj~nanu chEsEdi
చరణం
charaNam 2
అత్త మామ లన్నదమ్ము లింటివారు
ఒద్దనే యుండగ చేయి తట్టి పిలిచేది
atta mAma lannadammu linTivAru
oddanE yunDaga chEyi taTTi pilichEdi
చరణం
charaNam 3
అక్కరో సవతి పక్క గూర్చుండగ
సిగ్గు చెఱిచి నన్ను చెక్కిలి నొక్కేది
akkarO savati pakka gUrchunDaga
siggu che~richi nannu chekkili nokkEdi

#490 ప్రొద్దాయెనిక proddAyenika

Titleప్రొద్దాయెనికproddAyenika
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaఆదిAdi
Previously Posted At35, 187
పల్లవి pallaviప్రొద్దాయెనిక చాలురాproddAyenika chAlurA
చరణం
charaNam 1
పావడ చెఱగు చేయి పట్టు కొనేవు
పోవలె మ్రొక్కేనురా
pAvaDa che~ragu chEyi paTTu konEvu
pOvale mrokkEnurA
చరణం
charaNam 2
అత్తరు మెడ బూసి అడ్డగించేవురా
అత్తింటి కోడలురా
attaru meDa bUsi aDDaginchEvurA
attinTi kODalurA
చరణం
charaNam 3
కోపగించి పొయ్యేవు బాలచంద్ర సామి
రేపు నను గూడరా
kOpaginchi poyyEvu bAlachandra sAmi
rEpu nanu gUDarA

#489 మరపు రాదే marapu rAdE

Titleమరపు రాదేmarapu rAdE
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Posted At171
పల్లవి pallaviమఱపు రాదే చెలి
వర గోప బాలుని వగలు
ma~rapu rAdE cheli
vara gOpa bAluni vagalu
చరణం
charaNam 1
కాంత వినవే చంద్ర కాంతపు మేడలో
కాంతుడు నేనేకాంత మాడినది
kAnta vinavE chandra kAntapu mEDalO
kAntuDu nEnEkAnta mADinadi
చరణం
charaNam 2
ఇద్దరు గూడి నిలువు టద్దము లోపల
సుద్దులు తేలించి రతి సుద్దు లాడినది
iddaru gUDi niluvu Taddamu lOpala
suddulu tElinchi rati suddu lADinadi
చరణం
charaNam 3
వాసిగ నను పంతి చేసెడి వేళలో
నాయాసపు చెమటలు తీసి వేసినది
vAsiga nanu panti chEseDi vELalO
nAyAsapu chemaTalu tIsi vEsinadi
చరణం
charaNam 4
చిత్తజు కేళికి యత్నమై యున్న నాకు
ముత్య సరము లిచ్చి ముద్దు పెట్టినది
chittaju kELiki yatnamai yunna nAku
mutya saramu lichchi muddu peTTinadi

#488 ఈ మరుబారికి I marubAriki

Titleఈ మరుబారికిI marubAriki
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaచాపుchApu
Previously Posted At163
పల్లవి pallaviఈ మరుబారికి తాళగలేనే
స్మర మోహన సుందరు బాసి
I marubAriki tALagalEnE
smara mOhana sundaru bAsi
చరణం
charaNam 1
తమినాటిన చిత్తము నెంచుచు ఈ
శ్రమ నంతయు నా కరుణాగ్రణి తో
సమయ మఱచుట దెల్పవే కృప సల్పవే
కామినీ మణి సామి లేక
యామిని నేనేమి సేయుదు
taminATina chittamu nenchuchu I
Srama nantayu nA karuNAgraNi tO
samaya ma~rachuTa delpavE kRpa salpavE
kAminI maNi sAmi lEka
yAmini nEnEmi sEyudu
చరణం
charaNam 2
మదిరాక్షిరొ శ్రీ హృదయేశుని నా
సదనంబున కేగుదు రాయని యే
సుదతి బోధన చేసెనో మది రోసెనో
సదయుడై నం గదియునని నే
నిదుర లేకే యెదురు చూచితి
madirAkshiro SrI hRdayESuni nA
sadanambuna kEgudu rAyani yE
sudati bOdhana chEsenO madi rOsenO
sadayuDai nan gadiyunani nE
nidura lEkE yeduru chUchiti
చరణం
charaNam 3
మలయాద్రి తటి నిలయా నిలునిచే
కలకాలము నే చెలి యింత వెతను
తలచినను కృప రాదటే పలువాదటే
బాలరో శ్రీ బాలచంద్రుని
కేళిలో నే నోలలాడగ
malayAdri taTi nilayA nilunichE
kalakAlamu nE cheli yinta vetanu
talachinanu kRpa rAdaTE paluvAdaTE
bAlarO SrI bAlachandruni
kELilO nE nOlalADaga

#487 రా రమ్మనే rA rammanE

Titleరా రమ్మనేrA rammanE
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviరా రమ్మనే రమ్మనే సామిని ఇటుrA rammanE rammanE sAmini iTu
రతిపతి బాధ యిక రమణి యోర్వజాలratipati bAdha yika ramaNi yOrvajAla
చరణం
charaNam 1
చెలి యెదురుగ నే బలిమితో బలికిన
పలుకులు మదినిక తలచ వలదు ఇటు
cheli yeduruga nE balimitO balikina
palukulu madinika talacha valadu iTu
చరణం
charaNam 2
పరిపరి విధముల పంతగించితినని
విరసము సలుపుట తరము గాదు ఇటు
paripari vidhamula pantaginchitinani
virasamu salupuTa taramu gAdu iTu
చరణం
charaNam 3
నెఱనమ్మినదని నెలత ననుచు
కనికరము గలిగి శ్రీ తిరుపతీశు నిటు
ne~ranamminadani nelata nanuchu
kanikaramu galigi SrI tirupatISu niTu

#486 పో పొమ్మనే పొమ్మనే వాని pO pommanE pommanE vAni

Titleపో పొమ్మనే పొమ్మనే వానిpO pommanE pommanE vAni
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaనాదనామక్రియnAdanAmakriya
తాళం tALaఆదిAdi
Previously posted at38, 185
పల్లవి pallaviపో పొమ్మనే పొమ్మనే వాని పొందేలనే మనకు అచటికిpO pommanE pommanE vAni pondElanE manaku achaTiki
పాపపు మోహము పాలు చేసి ఆ పాపి యిల్లు చేరేనే ప్రొద్దాయెనాpApapu mOhamu pAlu chEsi A pApi yillu chErEnE proddAyenA
చరణం
charaNam 1
ఇన్ని దినములు వాడిందు రాకుండి
చిన్నపుచ్చినాడే నలుగురిలో ఏమందునే
inni dinamulu vADindu rAkunDi
chinnapuchchinADE nalugurilO EmandunE
చరణం
charaNam 2
రంగడు నాతో రంగుగా గూడి
రంగము నెలకొనెనే నిర్దయుడె
rangaDu nAtO rangugA gUDi
rangamu nelakonenE nirdayuDe

#485 పో పొమ్మనే పొమ్మనే pO pommanE pommanE

Titleపో పొమ్మనే పొమ్మనేpO pommanE pommanE
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
Previously Posted at 7
పల్లవి pallaviపో పొమ్మనే పొమ్మనే భామరో వానిpO pommanE pommanE bhAmarO vAni
పొలతిరో చెలువుని పొగడే దానింటికిpolatirO cheluvuni pogaDE dAninTiki
చరణం
charaNam 1
కలకాలము నను కలిసిన స్నేహము
తలచని వాని పొందు తగదు తగదు వాని
kalakAlamu nanu kalisina snEhamu
talachani vAni pondu tagadu tagadu vAni
చరణం
charaNam 2
పగదానిని తా పొగడుచు నాతో
జగడము సేయువాని చెలిమి చాలు చాలు
pagadAnini tA pogaDuchu nAtO
jagaDamu sEyuvAni chelimi chAlu chAlu
చరణం
charaNam 3
వర భీమేశుని వంచన తెలిసెను
మఱి మఱి నాపై వట్టి మమత యికేల
vara bhImESuni vanchana telisenu
ma~ri ma~ri nApai vaTTi mamata yikEla

#484 మమత మరవకురా mamata maravakurA

Titleమమత మరవకురాmamata maravakurA
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviమమత మఱవకురా నా సామిmamata ma~ravakurA nA sAmi
చరణం
charaNam 1
మును నను గూడిన మోహమిదేరా
కనికర మెంత లేదురా సామిగా నీ
munu nanu gUDina mOhamidErA
kanikara menta lEdurA sAmigA nI
చరణం
charaNam 2
తలచితే మదిలో తాళగ లేరా
వలపు నిలుప చాలరా సామిగా నీ
talachitE madilO tALaga lErA
valapu nilupa chAlarA sAmigA nI
చరణం
charaNam 3
సదయ భీమేశ నా సరసకు రారా
ఇది మంచి సమయమురా సామిగా నీ
sadaya bhImESa nA sarasaku rArA
idi manchi samayamurA sAmigA nI

#483 చక్కని సామి chakkani sAmi

Titleచక్కని సామిchakkani sAmi
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Posted At41
పల్లవి pallaviచక్కని సామి మాట్లాడవదేరా
చలమిటు నాతో సేయకురా
chakkani sAmi mATlADavadErA
chalamiTu nAtO sEyakurA
చరణం
charaNam 1
కలకాలము సలిపిన నేస్తము
చెలువుడ మఱచుట తగునేరా
kalakAlamu salipina nEstamu
cheluvuDa ma~rachuTa tagunErA
చరణం
charaNam 2
రారా నన్నిటు రాపు జేసేవురా
రచ్చకు మది నేనోర్వనురా
rArA nanniTu rApu jEsEvurA
rachchaku madi nEnOrvanurA
చరణం
charaNam 3
ఏలిన ప్రీతి నీకేమాయెనురా
ఎంతని నిన్ను నే వేడుదురా
Elina prIti nIkEmAyenurA
entani ninnu nE vEDudurA
చరణం
charaNam 4
ఏనా సవతి నీకేమి బోధించెరా
ఎందుకు నాపై కోపమురా
EnA savati nIkEmi bOdhincherA
enduku nApai kOpamurA
చరణం
charaNam 5
సారోదారుడౌ సదయ భీమేశ
సరసతో నన్ను గూడవదేమిరా
sArOdAruDau sadaya bhImESa
sarasatO nannu gUDavadEmirA