#555 విడు విడు viDu viDu

Titleవిడు విడుviDu viDu
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaజెంజోటిjenjOTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviవిడు విడు నను ముట్టకు
ప్రేమ తెలిసె చాలు
viDu viDu nanu muTTaku
prEma telise chAlu
అనుపల్లవి anupallaviకడకు నవ్వుల పాలయ్యెగా
నా బ్రతుకిట్టుల మేలు
kaDaku navvula pAlayyegA
nA bratukiTTula mElu
చరణం
charaNam 1
కౌసల్యకు వలె నాకున్ గట్టవె పుస్తె
నా సవతి కేలుబడియైన నా పని వస్తె
kausalyaku vale nAkun gaTTave puste
nA savati kElubaDiyaina nA pani vaste

#554 చీకటి గదిలో chIkaTi gadilO

Titleచీకటి గదిలోchIkaTi gadilO
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaనవరోజ్navarOj
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviచీకటి గదిలో నేమి బరుంటివి
చెప్పవే పూవు బోడి
chIkaTi gadilO nEmi barunTivi
cheppavE pUvu bODi
అనుపల్లవి anupallaviనీకేటి వంత కల్గె బల్కవా
నిద్దురా ముద్దులాడి
nIkETi vanta kalge balkavA
niddurA muddulADi
చరణం
charaNam 1
నిద్దా చెక్కుటద్దముల వేడి
కన్నీరు కాఱ్చి కొయ్యారి
పెద్ద కన్రెప్ప యెఱందీసి
జళిపించు చూపు తరవారి
niddA chekkuTaddamula vEDi
kannIru kA~rchi koyyAri
pedda kanreppa ye~ramdIsi
jaLipinchu chUpu taravAri
చరణం
charaNam 2
వెచ్చ నూర్చుచుం దొండపండు
మోవిం గందింబెదవేమి
మచ్చెకంటి మకిల దుస్తు
కట్టిన మర్మమేమి యిల్లాల
vechcha nUrchuchum donDapanDu
mOvim gandimbedavEmi
machchekanTi makila dustu
kaTTina marmamEmi yillAla

#553 క్రొక్కారు మెరుగు krokkAru merugu

Titleక్రొక్కారు మెరుగుkrokkAru merugu
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaవసంతvasanta
తాళం tALaఖండ గతిkhanDa gati
పల్లవి pallaviక్రొక్కారు మెరుగు లాగున దళుక్కున మెఱసిkrokkAru merugu lAguna daLukkuna me~rasi
అనుపల్లవి anupallaviయిక్కడ మరుగు పడడదేమొకా తమ్ముడాyikkaDa marugu paDaDadEmokA tammuDA
చరణం
charaNam 1
కెంబెదవి గఱచుకొని క్రీగంట జూపుగా
లమ్మున న్నా మనస్సు లాగుకొన నెవ్వతో
kembedavi ga~rachukoni krIganTa jUpugA
lammuna nnA manassu lAgukona nevvatO
చరణం
charaNam 2
ఆపె వనలక్ష్మియో యారాజు కూతురో
యీ పగిది నన్ను భ్రమయించి డాగెనెచటనో
Ape vanalakshmiyO yArAju kUturO
yI pagidi nannu bhramayinchi DAgenechaTanO
చరణం
charaNam 3
మళ్ళి రాడేమి నా మనసామె యెడ చిక్కి
చెల్లరే యచ్చెలి చేకొనక తప్పదిక
maLLi rADEmi nA manasAme yeDa chikki
chellarE yachcheli chEkonaka tappadika

#552 ఏడే కాన్పించడె EDE kAnpinchaDe

Titleఏడే కాన్పించడెEDE kAnpinchaDe
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaపూర్వ కల్యాణిpUrva kalyANi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఏడే కాన్పించ డెడన్నున్నాడే రాముEDE kAn&pincha DeDannunnADE rAmu
అనుపల్లవి anupallaviనేడే నా జన్మము సఫలము
వాడే హా యందగాడే
nEDE nA janmamu saphalamu
vADE hA yandagADE
చరణం
charaNam 1
పొంది యవ్వాని బల్కరించినే
మంచి సమయమేనా
pondi yavvAni balkarinchinE
manchi samayamEnA
చరణం
charaNam 2
చూడు క్రొమ్మబ్బు వన్నెకాడు వాడు
లేడా కనరాడా యయ్యయ్యో
chUDu krommabbu vannekADu vADu
lEDA kanarADA yayyayyO

#551 వెదకి రావే vedaki rAvE

Titleవెదకి రావేvedaki rAvE
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaమిశ్ర గతిmiSra gati
పల్లవి pallaviవెదకి రావే వేవేగ బోవేvedaki rAvE vEvEga bOvE
అనుపల్లవి anupallaviముదితరో యిటువంటి పురుషు డెందున్నాడోmuditarO yiTuvanTi purushu DendunnADO
చరణం
charaNam 1
రాముడంట దశరధ రాజు సుతుడట
కోమలి వీనిపై కోరిక పుట్టెనే
rAmuDanTa daSaradha rAju sutuDaTa
kOmali vInipai kOrika puTTenE
చరణం
charaNam 2
వీరుడంట గర్వితా సురాంతకుడట
యారూఢిగా ధర్మావతారమట
vIruDanTa garvitA surAntakuDaTa
yArUDhigA dharmAvatAramaTa
చరణం
charaNam 3
ఎటుల నోర్తు వీని నిప్పుడే చూడకున్న
పటము గాంచుమెంతో వన్నెకాడబ్బబ్బ
eTula nOrtu vIni nippuDE chUDakunna
paTamu gAnchumentO vannekADabbabba

#550 ఎంత జేసితివి enta jEsitivi

Titleఎంత జేసితివిenta jEsitivi
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaసారంగsAranga
తాళం tALaఖండ గతిkhanDa gati
పల్లవి pallaviఎంత జేసితివి నిన్నే మందునో మాయి
కాంతుతో నీవునుం గలసి తోయమ్మాయి
enta jEsitivi ninnE mandunO mAyi
kAntutO nIvunum galasi tOyammAyi
చరణం
charaNam 1
కోరినానా నాకు గోతి మొగ ముంచుమని
నేరకే గడ్డి తిని నీ మాట నమ్మితిని
kOrinAnA nAku gOti moga munchumani
nErakE gaDDi tini nI mATa nammitini
చరణం
charaNam 2
మొగమాట మెక్కడిది మోసకాడా నీకు
నగుబాటు తెచ్చితివ నలుగురిలో నాకు
mogamATa mekkaDidi mOsakADA nIku
nagubATu techchitiva nalugurilO nAku

#549 నా వంటి సొగసు nA vanTi sogasu

Titleనా వంటి సొగసుnA vanTi sogasu
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaఖమాచ్khamAch
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviనా వంటి సొగసు కాడేడీ వలవదా ముద్దులాడిnA vanTi sogasu kADEDI valavadA muddulADi
అనుపల్లవి anupallaviతుంటవిల్తుడీడా నాకు దొయ్యలి నాపై బడదాtunTaviltuDIDA nAku doyyali nApai baDadA
చరణం
charaNam 1
అదిగో గన్ను వైచి నాపయి హంస నడకలన్వచ్చెడు
ముదిత నన్ను గనుకొని తన మోము ద్రిప్పె సిగ్గు కదా
adigO gannu vaichi nApayi hamsa naDakalanvaccheDu
mudita nannu ganukoni tana mOmu drippe siggu kadA
చరణం
charaNam 2
ఆ వైపు కల నృపుల గని యీ వరుసకు మళ్ళిన హహ
యీ వంక నొకడు తప్ప నేనే తుది నుండి నిహిహి
A vaipu kala nRpula gani yI varusaku maLLina haha
yI vanka nokaDu tappa nEnE tudi nunDi nihihi

#548 ఇతడెవ్వడో itaDevvaDO

Titleఇతడెవ్వడోitaDevvaDO
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaఆనంద భైరవిAnanda bhairavi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviఇతడెవ్వడో కాని యింతీ నిన్న నా కలలో
నేగుదెంచిన వీరుడే మారాకారుడే
itaDevvaDO kAni yintI ninna nA kalalO
nEgudenchina vIruDE mArAkAruDE
చరణం
charaNam 1
ప్రాణ నాయకీ చేర రమ్మని నను బిలిచి
వలచి సందిట గ్రుచ్చెనే ముద్దులిచ్చెనే
ఏను బులకించి యేమరి యుండగ
నెంతో వింత కూడ సేసెనే వీని జూడకున్న
నా యుసురు వీసమైన నిక నిల్వబోదు
prANa nAyakI chEra rammani nanu bilichi
valachi sandiTa gruchchenE muddulichchenE
Enu bulakinchi yEmari yunDaga
nentO vinta kUDa sEsenE vIni jUDakunna
nA yusuru vIsamaina nika nilvabOdu

#547 ఎవరి దానవే evari dAnavE

Titleఎవరి దానవేevari dAnavE
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaశహనSahana
తాళం tALaచతురస్ర గతిchaturasra gati
పల్లవి pallaviఎవరి దానవే తరుణీ
నీవెందుకుంటి వీకరణి
evari dAnavE taruNI
nIvendukunTi vIkaraNi
అనుపల్లవి anupallaviచివురు చేతులకు గరుకు వెదురు గడ
చెల్లునె యోడం గడుప జమన కడ
chivuru chEtulaku garuku veduru gaDa
chellune yODam gaDupa jamana kaDa
చరణం
charaNam 1
ఇమ్ము రాచ సుంకమ్ము నీ కెమ్మోవి మానికమ్ము
కొమ్మా నీ కటాక్షమ్మున దాటం గోరెద మమ్మురంపు మోహాంబుధి
immu rAcha sunkammu nI kemmOvi mAnikammu
kommA nI kaTAkshammuna dATam gOreda mammurampu mOhAmbudhi

#546 ఏర యింత Era yinta

Titleఏర యింతEra yinta
Written Byచెలివెందల గవిరంగ దాసుchelivendala gaviranga dAsu
Book
రాగం rAgaఅఠాణాaThANA
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఏర యింత నక్క వినయమేల జూపినావు ఱేడEra yinta nakka vinayamEla jUpinAvu ~rEDa
అనుపల్లవి anupallaviకోరిన పొసగెదనని వాకొనలేలేదా నా తోడkOrina posagedanani vAkonalEdA nA tODa
చరణం
charaNam 1
కల్లలాడు వాడు నిక్కముగ నొక్క మగవాడా
చెల్లరే సంపద వంతులకి సీ మాట పరువేడ
kallalADu vADu nikkamuga nokka magavADA
chellarE sampada vantulaki sI mATa paruvEDa
చరణం
charaNam 2
ఏల భయము నీ నుతుపై నీగ వాల నిచ్చెనే
చాల దెలసె నీ యోగ్యత చాలు పోయి వచ్చెదనే
Ela bhayamu nI nutupai nIga vAla nichchenE
chAla delase nI yOgyata chAlu pOyi vachchedanE