#472 వానికి మరులైతి vAniki marulaiti

Titleవానికి మరులైతిvAniki marulaiti
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviవానికి మరులైతి గదవే చెలియా
మానినీ మణి వాని మరియాదెఱుగక
vAniki marulaiti gadavE cheliyA
mAninI maNi vAni mariyAde~rugaka
చరణం
charaNam 1
మును నను గూడిన ముచ్చటలెల్ల
తన మది నెంచక దాచు
munu nanu gUDina muchchaTalella
tana madi nenchaka dAchu
చరణం
charaNam 2
మగువరో నాపై మమత దేలించక
పగతుల గుణములు పొగడు
maguvarO nApai mamata dElinchaka
pagatula guNamulu pogaDu
చరణం
charaNam 3
భామరో తానిటు బాసలు జేసి
మోమిటు చూపని మోసకారికి
bhAmarO tAniTu bAsalu jEsi
mOmiTu chUpani mOsakAriki
చరణం
charaNam 4
వర భీమేశుని వంచన లెఱుగక
సరసిజ ముఖి నే చాలా వలచి
vara bhImESuni vanchana le~rugaka
sarasija mukhi nE chAlA valachi

#471 సామిగ నాతో sAmiga nAtO

Titleసామిగ నాతోsAmiga nAtO
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
Previously posted at18
పల్లవి pallaviసామిగ నాతో మాట్లాడవెందుకురా
అరమరిక లిక నేలరా
sAmiga nAtO mATlADavendukurA
aramarika lika nElarA
చరణం
charaNam 1
చిఱుత ప్రాయమునాడే చేసిన చెలిమిని
మఱచుట తగునేమిరా
chi~ruta prAyamunADE chEsina chelimini
ma~rachuTa tagunEmirA
చరణం
charaNam 2
సొగసుగా నిన్నే చూచి సోలి వచ్చిన దాన
అగడేల చేసేవురా
sogasugA ninnE chUchi sOli vachchina dAna
agaDEla chEsEvurA
చరణం
charaNam 3
వరభీమేశ నీ వంచెన తెలిసెను
అరమరిక నేలరా
varabhImESa nI vanchena telisenu
aramarika nElarA

#470 ఈ విరహ మెటులోర్తునె I viraha meTulOrtune

Titleఈ విరహ మెటులోర్తునెI viraha meTulOrtune
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaత్రిశ్ర లఘువుtriSra laghuvu
Previously posted at4, 147
పల్లవి pallaviఈ విరహ మెటులోర్తునె చెలియాI viraha meTulOrtune cheliyA
చరణం
charaNam 1
నేనేమి సేతు నా మనోహరుండు రాడటే
నా సామి కే మిఠారి దూఱు చెప్పెనో చెలియా
nEnEmi sEtu nA manOharunDu rADaTE
nA sAmi kE miThAri dU~ru cheppenO cheliyA
చరణం
charaNam 2
ఎందాక సైతు వాని బాసి ఈ సుమ శరుని
చిగురాకు బాకుచే కుచంబు దాకెనే చెలియా
endAka saitu vAni bAsi I suma Saruni
chigurAku bAkuchE kuchambu dAkenE cheliyA
చరణం
charaNam 3
రతి కేళి నేలు వేళనో మరాళ గామిని
నే తాళజాల బాల చంద్ర సామిని బాసి
rati kELi nElu vELanO marALa gAmini
nE tALajAla bAla chandra sAmini bAsi

#469 ఏలా మనకు ElA manaku

Titleఏలా మనకుElA manaku
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously posted at 27
పల్లవి pallaviఏలా మనకు వాని జోలి చెలిElA manaku vAni jOli cheli
చరణం
charaNam 1
మాటిమాటికి ఈ రాపైతే
ఏటి మాట పోపో పోవే
నాటి బాస లేమాయె చెలి
mATimATiki I rApaitE
ETi mATa pOpO pOvE
nATi bAsa lEmAye cheli
చరణం
charaNam 2
మారుబారికి మీఱి నేను
చేరి పిలిచినందుకా
వేఱు మాటలాడెనే చెలి
mArubAriki mI~ri nEnu
chEri pilichinandukA
vE~ru mATalADenE cheli
చరణం
charaNam 3
సారోదారుడౌ సదయ భీమేశుడు
సరస జేరి నన్ను గూడి
విరసమెంతో చేసెనే చెలి
sArOdAruDau sadaya bhImESuDu
sarasa jEri nannu gUDi
virasamentO chEsenE cheli

#468 సామి రాడేమందునే sAmi rADEmandunE

Titleసామి రాడేమందునేsAmi rADEmandunE
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaరూపకrUpaka
Previously Posted At5, 137
పల్లవి pallaviసామి రాడేమందునే చానరో తోడితేవే
నిమిషము తామసింప లేనే
sAmi rADEmandunE chAnarO tODitEvE
nimishamu tAmasimpa lEnE
కోమలాంగి వాని కెంతటి మందు బెట్టనే
ఎంతటి మాయ చేసెనే
kOmalAngi vAni kentaTi mandu beTTanE
entaTi mAya chEsenE
ఇందుముఖీ వాని బాసి ఎట్లు సైతునే
ఈ వలపెట్లు సైతునే
indumukhI vAni bAsi eTlu saitunE
I valapeTlu saitunE
ముందు నన్ను గూడిన బాలచంద్ర నాథుడే
వాడతి సుందరాంగుడే
mundu nannu gUDina bAlachandra nAthuDE
vADati sundarAnguDE

#467 సరసకు రారా sarasaku rArA

Titleసరసకు రారాsarasaku rArA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaచాపుchApu
Previously posted at 56
పల్లవి pallaviసరసకు రారా సామి మ్రొక్కేరాsarasaku rArA sAmi mrokkErA
చరణం
charaNam 1
మరులు గొన్న నాకు మనసీయవేరా
తరుణి పెట్టిన మందు తలకెక్కె నటరా
marulu gonna nAku manasIyavErA
taruNi peTTina mandu talakekke naTarA
చరణం
charaNam 2
నిరతము నిన్ను నే నెఱనమ్మినారా
కరుణను నను నేల గారడమేలా
niratamu ninnu nE ne~ranamminArA
karuNanu nanu nEla gAraDamElA
చరణం
charaNam 3
పూజ సేయుట నీకు పొందిక లేదా
రాజస మేలరా రాజ గోపాలా
pUja sEyuTa nIku pondika lEdA
rAjasa mElarA rAja gOpAlA

#466 పోరా దానింటికి pOrA dAninTiki

Titleపోరా దానింటికిpOrA dAninTiki
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously posted at397
పల్లవి pallaviపోరా దానింటికి సామి చాల ప్రొద్దాయెరా
ఆ వారిజాక్షి విన్నను మోసము
pOrA dAninTiki sAmi chAla proddAyerA
A vArijAkshi vinnanu mOsamu
చరణం
charaNam 1
నక్క వినయములు నిజమని యెంతో నమ్మి యుంటి గదరా
పక్క జేర రావద్దుర యిక
nakka vinayamulu nijamani yentO nammi yunTi gadarA
pakka jEra rAvaddura yika
చరణం
charaNam 2
తేనెలూర నాతో బలుకుచు ఆ చాన కడకు పోనేలా
కాని వారికిది వేడుక గద
tEnelUra nAtO balukuchu A chAna kaDaku pOnElA
kAni vArikidi vEDuka gada
చరణం
charaNam 3
సరసమైన మాటలు వేరాయె చనువు దూరమాయె
మరుని కేళికి ఇక సున్నే గద
sarasamaina mATalu vErAye chanuvu dUramAye
maruni kELiki ika sunnE gada
చరణం
charaNam 4
జాజి సరము లంపిన వెగటాయె చాల కోపమాయె
రాజగోపాల చాలునిక
jAji saramu lampina vegaTAye chAla kOpamAye
rAjagOpAla chAlunika

#465 రమణిరో సామిని ramaNirO sAmini

Titleరమణిరో సామినిramaNirO sAmini
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaనాదనామక్రియnAdanAmakriya
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously posted at
పల్లవి pallaviరమణిరో సామిని రమ్మనవే
రమ్మనవే మనవి చేకొమ్మనే వేగ
ramaNirO sAmini rammanavE
rammanavE manavi chEkommanE vEga
చరణం
charaNam 1
సుమ శరుడలరుల సూటిగా వేసెనే
సమయ మిదేయని సామికి దెలుపవే
suma SaruDalarula sUTigA vEsenE
samaya midEyani sAmiki delupavE
చరణం
charaNam 2
సవతిల్లు వానికి సతమాయె గదవే
ఎవతె బోధించెనో హితవుగ వానికి
savatillu vAniki satamAye gadavE
evate bOdhinchenO hitavuga vAniki
చరణం
charaNam 3
రాజగోపాలుడా రమణిని గూడి
తేజరిల్లుచు చెలిమి దిటవుగ మఱచెనే
rAjagOpAluDA ramaNini gUDi
tEjarilluchu chelimi diTavuga ma~rachenE

#464 మాయలాడి బోధనచే mAyalADi bOdhanachE

Titleమాయలాడి బోధనచేmAyalADi bOdhanachE
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaమిశ్ర లఘువుmiSra laghuvu
Previously posted at37, 193
పల్లవి pallaviమాయలాడి బోధనచే మైమఱచితి వేమో
మాటలాడ రావదేమిరా
mAyalADi bOdhanachE maima~rachiti vEmO
mATalADa rAvadEmirA
చరణం
charaNam 1
కాయజు బారికి తాళగా లేరా
కౌగిట జేర్చి నను గారవించరా
న్యాయమటర నీకిది తగదుర సరగున
kAyaju bAriki tALagA lErA
kaugiTa jErchi nanu gAravincharA
nyAyamaTara nIkidi tagadura saraguna
చరణం
charaNam 2
కలకాలము నన్ను గాసి బెట్టకురా
కాంతల నేచుట కార్యము గాదుర
చెలువుడ వని నిను నేఱ నమ్మినందు కిక
kalakAlamu nannu gAsi beTTakurA
kAntala nEchuTa kAryamu gAdura
cheluvuDa vani ninu nE~ra namminandu kika
చరణం
charaNam 3
సరివారిలో నను చౌక సేయకురా
చాల నమ్మితి రతి కేళిని గూడరా
వరదుడౌ మువ్వపురి నిలయుడ చనువున
sarivArilO nanu chauka sEyakurA
chAla nammiti rati kELini gUDarA
varaduDau muvvapuri nilayuDa chanuvuna

#463 ఎన్నాళ్ళు సైరింతునే ennALLu sairintunE

Titleఎన్నాళ్ళు సైరింతునేennALLu sairintunE
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaచాపుchApu
Previously at 395
పల్లవి pallaviఎన్నాళ్ళు సైరింతునే ఓ చెలియ నే సామిని తోడితేవేennALLu sairintunE O cheliya nE sAmini tODitEvE
చరణం
charaNam 1
క్రొన్నన విల్తుడు కోపము తోను తిన్నగ నాపై శరము లేసెనే ||సా|| ||ఎ||kronnana viltuDu kOpamu tOnu tinnaga nApai Saramu lEsenE ||sA|| ||e||
చరణం
charaNam 2
కనుల పండువై కాచెడు వెన్నెల మనసు కెంతో గాసిని బుట్టించెనే ||సా|| ||ఎ||kanula panDuvai kAcheDu vennela manasu kentO gAsini buTTinchenE ||sA|| ||e||
చరణం
charaNam 3
కోకిల లెల్ల గుంపులు గూడి ఓ కమలాక్షి రవములు గావించెనే ||సా|| ||ఎ||kOkila lella gumpulu gUDi O kamalAkshi ravamulu gAvinchenE ||sA|| ||e||
చరణం
charaNam 4
శింగర నుతుడు చెంగట బాసి అంగన గూడి ఇందు రాకున్నాడె ||సా|| ||ఎ||Singara nutuDu chengaTa bAsi angana gUDi indu rAkunnADe ||sA|| ||e||