#452 రారా మా రమణి rArA mA ramaNi

Titleరారా మా రమణిrArA mA ramaNi
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaమిశ్ర లఘువుmiSra laghuvu
రారా మా రమణి తాళలేదురా ||సామి||rArA mA ramaNi tALalEdurA ||sAmi||
తాళలేదురా ఇది పాడి గాదురా ||సామి|| ||రా||tALalEdurA idi pADi gAdurA ||sAmi|| ||rA||
మారుబారి వేమఱు సొమ్మ సిల్లినది ||రా||mArubAri vEma~ru somma sillinadi ||rA||
చెలులతో నెప్పుడు పలుకదురా నిన్నే
తలచుచు నున్నదిరా సామి నిన్నె
chelulatO neppuDu palukadurA ninnE
talachuchu nunnadirA sAmi ninne
అన్న పానములపై ఆశయే లేదురా
కన్నె నిక నేలురా దయ యుంచి
anna pAnamulapai ASayE lEdurA
kanne nika nElurA daya yunchi
రసికుడైన శ్రీ రాజ గోపాల
రట్టు సేయుటేలరా చెలి నిటు
rasikuDaina SrI rAja gOpAla
raTTu sEyuTElarA cheli niTu

#451 చెలియ నేనెట్లోర్తునే cheliya nEneTlOrtunE

Titleచెలియ నేనెట్లోర్తునేcheliya nEneTlOrtunE
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviచెలియ నేనెట్లోర్తునే చెలువుని బాసి
నే నిలువగ జాలనె
cheliya nEneTlOrtunE cheluvuni bAsi
nE niluvaga jAlane
చరణం
charaNam 1
అలివేణి నా విభు డలగి రాడాయెనో
చెలి బోధన విని చలమును బూనెనొ
alivENi nA vibhu Dalagi rADAyenO
cheli bOdhana vini chalamunu bUneno
చరణం
charaNam 2
మరుడురమున విరి శరముల నేసెనె
సరగున సామితో సరసము లాడక
maruDuramuna viri Saramula nEsene
saraguna sAmitO sarasamu lADaka
చరణం
charaNam 3
వెన్నెల కాకల వెత జెంద లేనే
కన్నెరో చెలువుని కౌగిట జేరక
vennela kAkala veta jenda lEnE
kannerO cheluvuni kaugiTa jEraka
చరణం
charaNam 4
రమణుడైన శ్రీ రాజ గోపాలుని
నిమిషము జూడక నిదుర రాదు గదే
ramaNuDaina SrI rAja gOpAluni
nimishamu jUDaka nidura rAdu gadE

#450 మాటలేటికి పోపోరా mATalETiki pOpOrA

Titleఓరి సామి మాటలేటికి పోపోరాOri sAmi mATalETiki pOpOrA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviమాటలేటికి పోపోరా నీ వలచిన
మగువ యిల్లిది గాదురా
mATalETiki pOpOrA nI valachina
maguva yillidi gAdurA
చరణం
charaNam 1
బోటిని గూడిన నీటు దెలిసెరా
మాటిమాటికి రాకురా || ఓరి సామి||
bOTini gUDina nITu deliserA
mATimATiki rAkurA || Ori sAmi||
చరణం
charaNam 2
ఇంతి నీ రాకకు ఎదురు చూచునురా
ఎంతో ప్రొద్దాయెరా || ఓ||
inti nI rAkaku eduru chUchunurA
entO proddAyerA || O||
చరణం
charaNam 3
అతివ చూచిన నన్ను నారడి పెట్టును
హితవుగ మది నెంచరా || ఓ||
ativa chUchina nannu nAraDi peTTunu
hitavuga madi nencharA || O||
చరణం
charaNam 4
రచ్చ సేయుటేలా రాజ గోపాలా
మచ్చికతో గావరా || ఓ మాట||
rachcha sEyuTElA rAja gOpAlA
machchikatO gAvarA || O mATa||

#449 వాని మాటలిక vAni mATalika

Titleవాని మాటలికvAni mATalika
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviవాని మాటలిక మనకేలే
వంచనలకు గురు పీఠము గదే
వేడుకతో నే విడెమీబోతే
జాడగా తీసి యా చాన కొసగె
vAni mATalika manakElE
vanchanalaku guru pIThamu gadE
vEDukatO nE viDemIbOtE
jADagA tIsi yA chAna kosage
చరణం
charaNam 1
మోము మోమున జేర్చి ముద్దిడ బోతే
మోమటు త్రిప్పి యా ముదిత దలచె
mOmu mOmuna jErchi muddiDa bOtE
mOmaTu trippi yA mudita dalache
చరణం
charaNam 2
అడుగులకు నే మడుగులు పరచిన
జడియక సవతికి సరిగాదనే
aDugulaku nE maDugulu parachina
jaDiyaka savatiki sarigAdanE
చరణం
charaNam 3
పణతిరో రాజగోపాలుడీ రీతిని
కనికర మెంచక గాసి బెట్టెనే
paNatirO rAjagOpAluDI rItini
kanikara menchaka gAsi beTTenE

#448 తామసమేలరా tAmasamElarA

TitleతామసమేలరాtAmasamElarA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviతామసమేలరా నా మనోహర తాళగ జాలనురాtAmasamElarA nA manOhara tALaga jAlanurA
కాముడు నాపై కరుణ దప్పెనురా
కళ లంటి నను గూడరా
kAmuDu nApai karuNa dappenurA
kaLa lanTi nanu gUDarA
మునుపటి దయ నీ మనసున లేదా
మోహము దీర్చరా
చక్కగ నాపై చనువు చూపకు మని
సవతి చెప్పెనటరా
munupaTi daya nI manasuna lEdA
mOhamu dIrcharA
chakkaga nApai chanuvu chUpaku mani
savati cheppenaTarA
అంతరంగుడవై అరమర చేయుట
వింతగ నున్నదిరా
రమణుడైన శ్రీ రాజ గోపాలా
సమయము దెలసి కోరా
antaranguDavai aramara chEyuTa
vintaga nunnadirA
ramaNuDaina SrI rAja gOpAlA
samayamu delasi kOrA

#447 ఈ విరహ I viraha

Titleఈ విరహI viraha
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని భైరవిhindusthAni bhairavi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఈ విరహ మెటుల సైతునె కామినీ
ఏవియు నా మది కింపు లేదాయెనే
భావజుడెంతో నను బాధింపగ సాగెనే
I viraha meTula saitune kAminI
Eviyu nA madi kimpu lEdAyenE
bhAvajuDentO nanu bAdhimpaga sAgenE
చరణం
charaNam 1
వెన్నెల నా మదికి వెగటుగ దోచెనే
కన్నెరో చల్లని గాలి విష మాయెనే
vennela nA madiki vegaTuga dOchenE
kannerO challani gAli visha mAyenE
చరణం
charaNam 2
బాలరో రాజ గోపాలుడు మును నను నేలిన
ప్రీతి మది నెంచి యిటు రాడాయెనే
bAlarO rAja gOpAluDu munu nanu nElina
prIti madi nenchi yiTu rADAyenE

#446 మనసిజు బారికి manasiju bAriki

Titleమనసిజు బారికిmanasiju bAriki
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviమనసిజు బారికి నెటులోర్తునే
వనితరో విభు నెడబాసిన మొదలు
దినమొక యుగమాయెనే
manasiju bAriki neTulOrtunE
vanitarO vibhu neDabAsina modalu
dinamoka yugamAyenE
చరణం
charaNam 1
ముదితరో రమణిపై మోహమగ్గలమై
నిదురయు రాదాయెనే
muditarO ramaNipai mOhamaggalamai
nidurayu rAdAyenE
చరణం
charaNam 2
కన్నెరో చెలువుని కనుల జూడమిచే
అన్నము సైచ దాయెనే
kannerO cheluvuni kanula jUDamichE
annamu saicha dAyenE
చరణం
charaNam 3
పణతిరో రాజ గోపాలుడు నాపై
కనికర మెంచ డాయెనే
paNatirO rAja gOpAluDu nApai
kanikara mencha DAyenE

#445 న్యాయమేమిరా nyAyamEmirA

Titleన్యాయమేమిరాnyAyamEmirA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviన్యాయమేమిరా నీకిది సామి
వేయి మాట లేలర నా విభుడని నెఱ నమ్మినార
మాయలాడి బోధనకే మమత జెంది యుండ నీకు
nyAyamEmirA nIkidi sAmi
vEyi mATa lElara nA vibhuDani ne~ra namminAra
mAyalADi bOdhanakE mamata jendi yunDa nIku
చరణం
charaNam 1
విరహ మోర్వరా నను వేగ నేలరా
మరుడు నా యురమునను విరి శరముల వడి నేసెనురా
కరుణ మఱవ వలదుర యీ కాయము నీ సొమ్మేర
viraha mOrvarA nanu vEga nElarA
maruDu nA yuramunanu viri Saramula vaDi nEsenurA
karuNa ma~rava valadura yI kAyamu nI sommEra
చరణం
charaNam 2
పంతమేలరా సామి పాడి గాదురా
అంతరంగ మెఱిగి నన్నిటు లారడి పెట్టేవదేర
చెంత జేరి తావులంటి వింత రతుల గూడవేర
pantamElarA sAmi pADi gAdurA
antaranga me~rigi nanniTu lAraDi peTTEvadEra
chenta jEri tAvulanTi vinta ratula gUDavEra
చరణం
charaNam 3
వలచినానురా నాపై చలము మానురా
అలగి యుండు టేలర నా యపరాధము లేమిరా
పలుకవేర రాజగోపాల నీకు మ్రొక్కేరా
valachinAnurA nApai chalamu mAnurA
alagi yunDu TElara nA yaparAdhamu lEmirA
palukavEra rAjagOpAla nIku mrokkErA

#444 సరగున నిటరారా saraguna niTarArA

Titleసరగున నిటరారాsaraguna niTarArA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaయమన్yaman
తాళం tALaత్రిశ్ర లఘువుtriSra laghuvu
పల్లవి pallaviసరగున నిటరారా మరియాదటరా వినురా
మరుని బారి కోర్వ లేక మరులైతిరా సామి నీకు
సరివారలు నవ్వగ జేయుట న్యాయము గాదుర
నేనెఱ నెమ్మిన దాననురా
saraguna niTarArA mariyAdaTarA vinurA
maruni bAri kOrva lEka marulaitirA sAmi nIku
sarivAralu navvaga jEyuTa nyAyamu gAdura
nEne~ra nemmina dAnanurA
చరణం
charaNam 1
బాస లొసగి ఇటు నను నెడబాయ నగునా
నను నెడ మోసమెందుకు చేసేవురా
మది నెంచర యీ తనువే నీ
సొమ్ముగ చేకొనరా
bAsa losagi iTu nanu neDabAya nagunA
nanu neDa mOsamenduku chEsEvurA
madi nenchara yI tanuvE nI
sommuga chEkonarA
చరణం
charaNam 2
బ్రాణనాథ రాజ గోపాల చలమా రాజగో
మాన మెంచవదేమిర నాయెడ
నేరము లేమిర నే నిను
జూడక తాళనురా
brANanAtha rAja gOpAla chalamA rAjagO
mAna menchavadEmira nAyeDa
nEramu lEmira nE ninu
jUDaka tALanurA

#443 రారా మనవి rArA manavi

Titleరారా మనవిrArA manavi
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviరారా మనవి చేకోరా
మారుని బారికి నోర్వగ లేర
rArA manavi chEkOrA
mAruni bAriki nOrvaga lEra
చరణం
charaNam 1
వలచినట్టి నను చులకన సేయుట మేరా
సామి పలుకవ దేరా
చలము మాని కలసెడు సరసులు లేరా
సుకుమారా సమయమిదేర
valachinaTTi nanu chulakana sEyuTa mErA
sAmi palukava dErA
chalamu mAni kalaseDu sarasulu lErA
sukumArA samayamidEra
చరణం
charaNam 2
చెలుల బోధనలు విని నను నాడగలేదా
నాతో పలుమాఱు వాదా సలిపినట్టి
చెలిమిని మది నిడరాదా
మరియాదా వంచన పోదా
chelula bOdhanalu vini nanu nADagalEdA
nAtO palumA~ru vAdA salipinaTTi
chelimini madi niDarAdA
mariyAdA vanchana pOdA
చరణం
charaNam 3
రాను రాను నీ గుణమిటు లాయెన దేలా శ్రీ రాజ గోపాలా
కానివారు నవ్వగ బ్రదుకిక నేలా శ్రీ లోలా తాళగ జాల
rAnu rAnu nI guNamiTu lAyena dElA SrI rAja gOpALA
kAnivAru navvaga bradukika nElA SrI lOlA tALaga jAla