| Title | వింటివేమిరా | vinTivEmirA |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | వింటివేమిరా సామి | vinTivEmirA sAmi |
| చరణం charaNam 1 | తుంట విల్తు డేయు పదును తూపులెల్ల దాని యెదను జంటకత్తె ఓర్వ దను కొంటి వేమిరా సామి | tunTa viltu DEyu padunu tUpulella dAni yedanu janTakatte Orva danu konTi vEmirA sAmi |
| చరణం charaNam 2 | నిదుర లేక నీదు దారి ఎదురు చూచి వేసారి సదయుడ హాయనుచు తేఱి సైపలేదురా సామి | nidura lEka nIdu dAri eduru chUchi vEsAri sadayuDa hAyanuchu tE~ri saipalEdurA sAmi |
| చరణం charaNam 3 | రవల సొమ్ము లిచ్చి నటుల రాతిరెల్ల గూడి నటుల కువల యాక్షి పలికి నటుల గోప బాలకా సామి | ravala sommu lichchi naTula rAtirella gUDi naTula kuvala yAkshi paliki naTula gOpa bAlakA sAmi |
#514 రమణీమణి సామిని ramaNImaNi sAmini
| Title | రమణీమణి సామిని | ramaNImaNi sAmini |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | హరి కాంభోజి | hari kAmbhOji |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 1 | |
| పల్లవి pallavi | రమణీమణి సామిని తేవే ఓ | ramaNImaNi sAmini tEvE O |
| సామిని తేవే కామిని పోవే | sAmini tEvE kAmini pOvE | |
| చరణం charaNam 1 | చల్లని సోముడు పల్లవ పాణుల ఉల్లము రంజిల్ల వెన్నెల గాసెనే ఓ | challani sOmuDu pallava pANula ullamu ranjilla vennela gAsenE O |
| చరణం charaNam 2 | భామా మణి కాముని పోరున వేమఱు బాణము వేయగ తాళనే ఓ | bhAmA maNi kAmuni pOruna vEma~ru bANamu vEyaga tALanE O |
| చరణం charaNam 3 | చక్కని వాడే అక్కరో వీడే మక్కువ తోడనే పక్కకు తేవే ఓ | chakkani vADE akkarO vIDE makkuva tODanE pakkaku tEvE O |
| చరణం charaNam 4 | ధర యందు ధర్మ పురమందు నా దొరయౌ పరవాసుని వేగమే ఓ | dhara yandu dharma puramandu nA dorayau paravAsuni vEgamE O |
#513 మానావమానము mAnAvamAnamu
| Title | మానావమానము | mAnAvamAnamu |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 19, 177 | |
| పల్లవి pallavi | మానావమానము అతనిదే చెలి | mAnAvamAnamu atanidE cheli |
| చరణం charaNam 1 | మునుపటి వలె తాను తన మది నెంచక ననబోణి రాడాయెనే చెలి | munupaTi vale tAnu tana madi nenchaka nanabONi rADAyenE cheli |
| చరణం charaNam 2 | తరుణి బోధన విని తానిందు రాడాయె కరుణయు లేదాయెనే చెలి | taruNi bOdhana vini tAnindu rADAye karuNayu lEdAyenE cheli |
| చరణం charaNam 3 | వనితరో గోపాలుడు నన్నేలుట తనదే భారమనెనే చెలి | vanitarO gOpAluDu nannEluTa tanadE bhAramanenE cheli |
#512 మానినీ వాని mAninI vAni
| Title | మానినీ వాని | mAninI vAni |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 21, 181 | |
| పల్లవి pallavi | మానినీ వాని జోలి దానను నే గాదే ఓ | mAninI vAni jOli dAnanu nE gAdE O |
| కానిదాని మాట విని కరుణ మఱచి యుండెనే | kAnidAni mATa vini karuNa ma~rachi yunDenE | |
| చరణం charaNam 1 | కలికిరో నను బాయనని పలికిన దేమాయెనే అల చెలితో కలసి రాక అయిదాఱు నెల లాయెనే | kalikirO nanu bAyanani palikina dEmAyenE ala chelitO kalasi rAka ayidA~ru nela lAyenE |
| చరణం charaNam 2 | బోటిరో నను బాయనని బూటకములు చేసెనే మాట తప్పి యున్న వాని మోము జూడ రాదే ఓ | bOTirO nanu bAyanani bUTakamulu chEsenE mATa tappi yunna vAni mOmu jUDa rAdE O |
| చరణం charaNam 3 | సన్నుతాంగి చాల వలచి యిన్ని దినము లుంటినే నన్ను గూడి వేంకటేశుడన్న మాట వింటినే | sannutAngi chAla valachi yinni dinamu lunTinE nannu gUDi vEnkaTESuDanna mATa vinTinE |
#511 మనసేమో సైచదే manasEmO saichadE
| Title | మనసేమో సైచదే | manasEmO saichadE |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 25 | |
| పల్లవి pallavi | మనసేమో సైచదే మానినీ మణి నా | manasEmO saichadE mAninI maNi nA |
| చరణం charaNam 1 | వారిజ ముఖి సరివారిలో నన్నిటు దూఱి దాని యిల్లు జేరగ నా | vArija mukhi sarivArilO nanniTu dU~ri dAni yillu jEraga nA |
| చరణం charaNam 2 | మరు శరములు అతి దురుసుగ నిరతము గురు కుచములపై గురియగ | maru Saramulu ati durusuga niratamu guru kuchamulapai guriyaga |
| చరణం charaNam 3 | గోపాలుడు నను రాపు జేసె పరితాపములకు నెటులోపుదు నే | gOpAluDu nanu rApu jEse paritApamulaku neTulOpudu nE |
#510 పోయి రమ్మనే pOyi rammanE
| Title | పోయి రమ్మనే | pOyi rammanE |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 26 | |
| పల్లవి pallavi | పోయి రమ్మనే పొలతిరో సామిని పొగడే చెలి యింటికి | pOyi rammanE polatirO sAmini pogaDE cheli yinTiki |
| చరణం charaNam 1 | ఒంటిగా నిన్న దానింటిలో జూచి నా వంటి చెలి దెల్పెనే కంటినని నాతో | onTigA ninna dAninTilO jUchi nA vanTi cheli delpenE kanTinani nAtO |
| చరణం charaNam 2 | వెలదిరో మును వనజాసను డేమని వ్రాసెనో ఏ పెనుగొనుటేలను | veladirO munu vanajAsanu DEmani vrAsenO E penugonuTElanu |
| చరణం charaNam 3 | వెలదిరో చక్కని సురపురి సూనుతో మదనుని కేళిలో మనసీయ నంటే | veladirO chakkani surapuri sUnutO madanuni kELilO manasIya nanTE |
#509 పోపోవే చెలియా pOpOvE cheliyA
| Title | పోపోవే చెలియా | pOpOvE cheliyA |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 22, 161 | |
| పల్లవి pallavi | పోపోవే చేలియా రాపేలే | pOpOvE chEliyA rApElE |
| చరణం charaNam 1 | అక్కర వేళలో దక్కిన విటుల కెక్కడి మమత | akkara vELalO dakkina viTula kekkaDi mamata |
| చరణం charaNam 2 | జారులు సమరతి తీఱిన వెనుక దూఱేదే మరియాద | jArulu samarati tI~rina venuka dU~rEdE mariyAda |
| చరణం charaNam 3 | వాసిగ నను శ్రీనివాసుడు గూడి మోసము చేసెనే | vAsiga nanu SrInivAsuDu gUDi mOsamu chEsenE |
#508 నాపై ప్రేమ nApai prEma
| Title | నాపై ప్రేమ | nApai prEma |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 99 | |
| పల్లవి pallavi | నాపై ప్రేమ లేని జాడ నాడే తెలిసెను పోపో పోరా | nApai prEma lEni jADa nADE telisenu pOpO pOrA |
| పాపి సవతి మాయలలో జిక్కి గోపాల నీ కొనగోరంతైన | pApi savati mAyalalO jikki gOpAla nI konagOrantaina | |
| చరణం charaNam 1 | ఎందాక జూచిన ఈ మగజాతి ఇంతుల నేలేదాక ఈ ప్రీతి సందేహమా మాట ప్రఖ్యాతి సరసుల లక్షణమా యీ రీతి | endAka jUchina I magajAti intula nElEdAka I prIti sandEhamA mATa prakhyAti sarasula lakshaNamA yI rIti |
| చరణం charaNam 2 | మోహమందు మోసమిందు ఏ వేళ బుద్ధులు నీయందు ఏల కలిగెనో ఇక నేమందు స్నేహము జేసినదే బలు పొందు | mOhamandu mOsamindu E vELa buddhulu nIyandu Ela kaligenO ika nEmandu snEhamu jEsinadE balu pondu |
#507 తలచి తాళగ talachi tALaga
| Title | తలచి తాళగ | talachi tALaga |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 12 | |
| పల్లవి pallavi | తలచి తాళగ లేనే ఓ చెలియ నే | talachi tALaga lEnE O cheliya nE |
| చరణం charaNam 1 | కస్తూరి విడెమిచ్చి కరికర గతి చూపి కుస్తరించి నన్ను కొసరి వేడిన లీల | kastUri viDemichchi karikara gati chUpi kustarinchi nannu kosari vEDina lIla |
| చరణం charaNam 2 | కనుల చెక్కుల మోవి చనుల కంఠము బలమున ముక్కు నాభి చుంబనము జేసిన వాని | kanula chekkula mOvi chanula kanThamu balamuna mukku nAbhi chumbanamu jEsina vAni |
#506 చెలియా కాంతుడు cheliyA kAntuDu
| Title | చెలియా కాంతుడు | cheliyA kAntuDu |
| Written By | ||
| Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 34 | |
| పల్లవి pallavi | చెలియా కాంతుడు నన్నెడ బాసి చాల నన్నిటు చేసెనే గాసి | cheliyA kAntuDu nanneDa bAsi chAla nanniTu chEsenE gAsi |
| మరుడు నా యురమునను శరము లేయ | maruDu nA yuramunanu Saramu lEya | |
| చరణం charaNam 1 | మందమగు మారుతము డాయ విరహము నేనెటు సైతునే సఖియ ఒంటిగా నేనుండనాయె | mandamagu mArutamu DAya virahamu nEneTu saitunE sakhiya onTigA nEnunDanAye |
| చరణం charaNam 2 | వెన్నెల గాయగ మిగుల తాపమాయెనే అన్నమని సైచ దాయెనే కన్నులకు నిదుర రాదే ఓ మగువా కామిని బోధన లాయెనే | vennela gAyaga migula tApamAyenE annamani saicha dAyenE kannulaku nidura rAdE O maguvA kAmini bOdhana lAyenE |
| చరణం charaNam 3 | మరుని కేళిలో నన్ను గూడెనే మానినిరో దానితో గూడెనే ధరగిరి సామికి న్యాయము నటవే తాళను వానిక రమ్మనవే ఓ | maruni kELilO nannu gUDenE mAninirO dAnitO gUDenE dharagiri sAmiki nyAyamu naTavE tALanu vAnika rammanavE O |