| Title | సామికి నాపై | sAmiki nApai |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 57 | |
| పల్లవి pallavi | సామికి నాపై ఇంత చలమేలనే విను కోమలాంగి ఇక నే తాళ జాలనే | sAmiki nApai inta chalamElanE vinu kOmalAngi ika nE tALa jAlanE |
| చరణం charaNam 1 | ఈడగు నా చెలికాడని విధ విధ వేడుకతో నే ప్రౌఢతగా ఆడిన పాడిన వేడిన గాని నను జూడడే నాతో ప్రతి మాట లాడడే | IDagu nA chelikADani vidha vidha vEDukatO nE prauDhatagA ADina pADina vEDina gAni nanu jUDaDE nAtO prati mATa lADaDE |
| చరణం charaNam 2 | ఇమ్ముగ తను నెఱ నమ్మితినని బలు నమ్మిక కొమ్మ నే పొమ్మని రమ్మని కోపమ్మని మ్రొక్కుచు ముమ్మర దలచిన సమ్మతించడే | immuga tanu ne~ra nammitinani balu nammika komma nE pommani rammani kOpammani mrokkuchu mummara dalachina sammatinchaDE |
| చరణం charaNam 3 | శ్రీశ తిరుపతి వాస నే నన్యుల బాసలు విని పరిహాసముగా ఆసలు బాసలు మోస పఱచడని బాసలు చేసిన సంతోష పడడే | SrISa tirupati vAsa nE nanyula bAsalu vini parihAsamugA Asalu bAsalu mOsa pa~rachaDani bAsalu chEsina santOsha paDaDE |
#494 చెలియ నీవే cheliya nIvE
| Title | చెలియ నీవే | cheliya nIvE |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | చెలియ నీవే తోడి తేవే చెలువుడైన కృష్ణుని | cheliya nIvE tODi tEvE cheluvuDaina kRshNuni |
| చరణం charaNam 1 | వలపు నిలువ ఇపుడు నాదు వశము గాదు గదవే | valapu niluva ipuDu nAdu vaSamu gAdu gadavE |
| చరణం charaNam 2 | సుందరాంగుని జూచి సుదతి మోహించెనో | sundarAnguni jUchi sudati mOhinchenO |
| చరణం charaNam 3 | ఇందు రాకయున్న వానికేమి బోధించెనో | indu rAkayunna vAnikEmi bOdhinchenO |
| చరణం charaNam 4 | మారుబారి కోర్వలేనె మగువ ఏమి సేతునే | mArubAri kOrvalEne maguva Emi sEtunE |
| చరణం charaNam 5 | మారజనకు డేల రాడె మమత ఎటుల దాతునే | mArajanaku DEla rADe mamata eTula dAtunE |
#493 ఎట్లు సైతురా eTlu saiturA
| Title | ఎట్లు సైతురా | eTlu saiturA |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 121 | |
| పల్లవి pallavi | ఎట్లు సైతురా సామి | eTlu saiturA sAmi |
| చరణం charaNam 1 | పెదవి మీద పంటి కాటు ఎదను దాని చంటి పోటు కదసి వెన్నున కీల్జడ వేటు కన్నుల చూచి నే | pedavi mIda panTi kATu edanu dAni chanTi pOTu kadasi vennuna kIljaDa vETu kannula chUchi nE |
| చరణం charaNam 2 | భయము లేక నన్ను బాసి పగలు రాత్రి ఒకటి చేసి వయసు చెలికి దార పోసి వచ్చి నిలిచితే | bhayamu lEka nannu bAsi pagalu rAtri okaTi chEsi vayasu cheliki dAra pOsi vachchi nilichitE |
| చరణం charaNam 3 | ముద్దుల సామి కృష్ణరాయ ముదిత తోను పొందు సేయ వద్దని నే మనవి సేయ వాదు చేసితే | muddula sAmi kRshNarAya mudita tOnu pondu sEya vaddani nE manavi sEya vAdu chEsitE |
#492 వాడెటు పల్కెనో vADeTu palkenO
| Title | వాడెటు పల్కెనో | vADeTu palkenO |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | మాంజి | mAnji |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 16, 183 | |
| పల్లవి pallavi | వాడెటు పల్కెనో తెల్పవే బోటిరో బూటకమేలనే | vADeTu palkenO telpavE bOTirO bUTakamElanE |
| చరణం charaNam 1 | కొమ్మరో నేనంపిన కమ్మను వాడేకొననో వాని చెలి చేతి కిమ్మనెనో | kommarO nEnampina kammanu vADEkonanO vAni cheli chEti kimmanenO |
| చరణం charaNam 2 | ఇంతిరో నే బంపిన పూబంతులు వాడె కొనెనో వాని రమణి కిమ్మనెనో | intirO nE bampina pUbantulu vADe konenO vAni ramaNi kimmanenO |
| చరణం charaNam 3 | రమ్మని పిల్వగ ఈడకు వాడే వచ్చెనో వచ్చేననిన వాని చెలి పోవద్దెనెనో | rammani pilvaga IDaku vADE vachchenO vachchEnanina vAni cheli pOvaddenenO |
| చరణం charaNam 4 | బాలరో ధర్మపురి పాలుడు నన్నె లేననెనో ఏలేను పో పొమ్మనెనో | bAlarO dharmapuri pAluDu nanne lEnanenO ElEnu pO pommanenO |
#491 మరియాదనా mariyAdanA
| Title | మరియాదనా | mariyAdanA |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | శంకరాభరణము | SankarAbharaNamu |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 59 | |
| పల్లవి pallavi | మరియాదనా మానిని వానికి | mariyAdanA mAnini vAniki |
| చరణం charaNam 1 | సరసునికి సంసారియని తెలియక సరివారిలో కను సంజ్ఞను చేసేది | sarasuniki samsAriyani teliyaka sarivArilO kanu sanj~nanu chEsEdi |
| చరణం charaNam 2 | అత్త మామ లన్నదమ్ము లింటివారు ఒద్దనే యుండగ చేయి తట్టి పిలిచేది | atta mAma lannadammu linTivAru oddanE yunDaga chEyi taTTi pilichEdi |
| చరణం charaNam 3 | అక్కరో సవతి పక్క గూర్చుండగ సిగ్గు చెఱిచి నన్ను చెక్కిలి నొక్కేది | akkarO savati pakka gUrchunDaga siggu che~richi nannu chekkili nokkEdi |
#490 ప్రొద్దాయెనిక proddAyenika
| Title | ప్రొద్దాయెనిక | proddAyenika |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | జంఝూటి | janjhUTi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 35, 187 | |
| పల్లవి pallavi | ప్రొద్దాయెనిక చాలురా | proddAyenika chAlurA |
| చరణం charaNam 1 | పావడ చెఱగు చేయి పట్టు కొనేవు పోవలె మ్రొక్కేనురా | pAvaDa che~ragu chEyi paTTu konEvu pOvale mrokkEnurA |
| చరణం charaNam 2 | అత్తరు మెడ బూసి అడ్డగించేవురా అత్తింటి కోడలురా | attaru meDa bUsi aDDaginchEvurA attinTi kODalurA |
| చరణం charaNam 3 | కోపగించి పొయ్యేవు బాలచంద్ర సామి రేపు నను గూడరా | kOpaginchi poyyEvu bAlachandra sAmi rEpu nanu gUDarA |
#489 మరపు రాదే marapu rAdE
| Title | మరపు రాదే | marapu rAdE |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Posted At | 171 | |
| పల్లవి pallavi | మఱపు రాదే చెలి వర గోప బాలుని వగలు | ma~rapu rAdE cheli vara gOpa bAluni vagalu |
| చరణం charaNam 1 | కాంత వినవే చంద్ర కాంతపు మేడలో కాంతుడు నేనేకాంత మాడినది | kAnta vinavE chandra kAntapu mEDalO kAntuDu nEnEkAnta mADinadi |
| చరణం charaNam 2 | ఇద్దరు గూడి నిలువు టద్దము లోపల సుద్దులు తేలించి రతి సుద్దు లాడినది | iddaru gUDi niluvu Taddamu lOpala suddulu tElinchi rati suddu lADinadi |
| చరణం charaNam 3 | వాసిగ నను పంతి చేసెడి వేళలో నాయాసపు చెమటలు తీసి వేసినది | vAsiga nanu panti chEseDi vELalO nAyAsapu chemaTalu tIsi vEsinadi |
| చరణం charaNam 4 | చిత్తజు కేళికి యత్నమై యున్న నాకు ముత్య సరము లిచ్చి ముద్దు పెట్టినది | chittaju kELiki yatnamai yunna nAku mutya saramu lichchi muddu peTTinadi |
#488 ఈ మరుబారికి I marubAriki
| Title | ఈ మరుబారికి | I marubAriki |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 163 | |
| పల్లవి pallavi | ఈ మరుబారికి తాళగలేనే స్మర మోహన సుందరు బాసి | I marubAriki tALagalEnE smara mOhana sundaru bAsi |
| చరణం charaNam 1 | తమినాటిన చిత్తము నెంచుచు ఈ శ్రమ నంతయు నా కరుణాగ్రణి తో సమయ మఱచుట దెల్పవే కృప సల్పవే కామినీ మణి సామి లేక యామిని నేనేమి సేయుదు | taminATina chittamu nenchuchu I Srama nantayu nA karuNAgraNi tO samaya ma~rachuTa delpavE kRpa salpavE kAminI maNi sAmi lEka yAmini nEnEmi sEyudu |
| చరణం charaNam 2 | మదిరాక్షిరొ శ్రీ హృదయేశుని నా సదనంబున కేగుదు రాయని యే సుదతి బోధన చేసెనో మది రోసెనో సదయుడై నం గదియునని నే నిదుర లేకే యెదురు చూచితి | madirAkshiro SrI hRdayESuni nA sadanambuna kEgudu rAyani yE sudati bOdhana chEsenO madi rOsenO sadayuDai nan gadiyunani nE nidura lEkE yeduru chUchiti |
| చరణం charaNam 3 | మలయాద్రి తటి నిలయా నిలునిచే కలకాలము నే చెలి యింత వెతను తలచినను కృప రాదటే పలువాదటే బాలరో శ్రీ బాలచంద్రుని కేళిలో నే నోలలాడగ | malayAdri taTi nilayA nilunichE kalakAlamu nE cheli yinta vetanu talachinanu kRpa rAdaTE paluvAdaTE bAlarO SrI bAlachandruni kELilO nE nOlalADaga |
#487 రా రమ్మనే rA rammanE
| Title | రా రమ్మనే | rA rammanE |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రా రమ్మనే రమ్మనే సామిని ఇటు | rA rammanE rammanE sAmini iTu |
| రతిపతి బాధ యిక రమణి యోర్వజాల | ratipati bAdha yika ramaNi yOrvajAla | |
| చరణం charaNam 1 | చెలి యెదురుగ నే బలిమితో బలికిన పలుకులు మదినిక తలచ వలదు ఇటు | cheli yeduruga nE balimitO balikina palukulu madinika talacha valadu iTu |
| చరణం charaNam 2 | పరిపరి విధముల పంతగించితినని విరసము సలుపుట తరము గాదు ఇటు | paripari vidhamula pantaginchitinani virasamu salupuTa taramu gAdu iTu |
| చరణం charaNam 3 | నెఱనమ్మినదని నెలత ననుచు కనికరము గలిగి శ్రీ తిరుపతీశు నిటు | ne~ranamminadani nelata nanuchu kanikaramu galigi SrI tirupatISu niTu |
#486 పో పొమ్మనే పొమ్మనే వాని pO pommanE pommanE vAni
| Title | పో పొమ్మనే పొమ్మనే వాని | pO pommanE pommanE vAni |
| Written By | ||
| Book | గాయకలోచనము | gAyakalOchanamu |
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | ఆది | Adi |
| Previously posted at | 38, 185 | |
| పల్లవి pallavi | పో పొమ్మనే పొమ్మనే వాని పొందేలనే మనకు అచటికి | pO pommanE pommanE vAni pondElanE manaku achaTiki |
| పాపపు మోహము పాలు చేసి ఆ పాపి యిల్లు చేరేనే ప్రొద్దాయెనా | pApapu mOhamu pAlu chEsi A pApi yillu chErEnE proddAyenA | |
| చరణం charaNam 1 | ఇన్ని దినములు వాడిందు రాకుండి చిన్నపుచ్చినాడే నలుగురిలో ఏమందునే | inni dinamulu vADindu rAkunDi chinnapuchchinADE nalugurilO EmandunE |
| చరణం charaNam 2 | రంగడు నాతో రంగుగా గూడి రంగము నెలకొనెనే నిర్దయుడె | rangaDu nAtO rangugA gUDi rangamu nelakonenE nirdayuDe |