#402 ఎందుకు రాడాయె enduku rADAye

Titleఎందుకు రాడాయెenduku rADAye
Written ByవెంకటరమణvenkaTaramaNa
Book
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఎందుకు రాడాయె ఎవరేమన్నారోenduku rADAye evarEmannArO
సరసుని ప్రేమ సతమని యుంటినే
కరుణ మరచెనే కలికిరో నేడు
sarasuni prEma satamani yunTinE
karuNa marachenE kalikirO nEDu
చందన పరిమళ ఆనందముగ నుంటినే
సుందరాంగుడు రాడాయె మందయాన ఈవేళ
chandana parimaLa Anandamuga nunTinE
sundarAnguDu rADAye mandayAna IvELa
కోరిన వేళలో కోపము ఏలనే
మంగళపురీశుని వేగమె పిలుపవె
kOrina vELalO kOpamu ElanE
mangaLapurISuni vEgame pilupave

#401 తెలిసెను యిపుడు telisenu yipuDu

Titleతెలిసెను యిపుడుtelisenu yipuDu
Written ByవెంకటరమణvenkaTaramaNa
Book
రాగం rAgaకరహరప్రియ karaharapriya
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviతెలిసెను యిపుడు లేరా కులుకులాడి
పొద్దు తెలిసెనిపుడు లేరా
telisenu yipuDu lErA kulukulADi
poddu telisenipuDu lErA
మాట చూడపోతే మధురము
మనసులోని మత్సరము
ఇదేటి ప్రేమ సామి నీకు
ఇది మగవారికి తగునో
mATa chUDapOtE madhuramu
manasulOni matsaramu
idETi prEma sAmi nIku
idi magavAriki tagunO
ప్రీతి యందె ఉంచి దాని ప్రేమతో నేలిన
ప్రీతి తెలిసి వచ్చెను ఖ్యాతి పొగిడేరు సఖులు
సరస మంగళపురివాస సురత సుఖమెందుబోయె
మరచి ఇందు వచ్చితివిరా మగువ దండించును పోరా
prIti yande unchi dAni prEmatO nElina
prIti telisi vachchenu khyAti pogiDEru sakhulu
sarasa mangaLapurivAsa surata sukhamendubOye
marachi indu vachchitivirA maguva danDinchunu pOrA

#400 సామి యిందు sAmi yindu

Titleసామి యిందుsAmi yindu
Written ByవెంకటరమణvenkaTaramaNa
Book
రాగం rAgaసురభిsurabhi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసామి యిందు రాడాయె
సఖియరో తోడి త్యావే
sAmi yindu rADAye
sakhiyarO tODi tyAvE
మోహమెటు దాచునే ముదితరో ఈవ్యేళ
మోహనాంగుడు రాడే మరచునేమో చెలియా
mOhameTu dAchunE muditarO IvyELa
mOhanAnguDu rADE marachunEmO cheliyA
వలచిన వేళలో వెలదిరో నన్ను తలచక యున్నడు
తరుణిరో నేడు మగువరో నేడు
మంగళ పురీశునికి తగునే ఈ నడత రాకయున్నాడు
valachina vELalO veladirO nannu talachaka yunnaDu
taruNirO nEDu maguvarO nEDu
mangaLa purISuniki tagunE I naData rAkayunnADu

#399 యెడబాయరాని yeDabAyarAni

TitleయెడబాయరానిyeDabAyarAni
Written Byమైసూరు సదాశివరావుmaisUru sadASivarAvu
Book
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaచౌchau
పల్లవి pallaviయెడబాయరాని అడియాసలెల్ల
చెడిబోయెటుల సేయరా దొరా నే
yeDabAyarAni aDiyAsalella
cheDibOyeTula sEyarA dorA nE
చరణం
charaNam 1
తడవు జేసితె నేనుండనని
అడుగడుకు నే వేడితే
నడుచురా నీ మాట తెలివికి తేట
పొడచురా నీదనుచురా శ్రీకృష్ణ రాజేంద్ర
taDavu jEsite nEnunDanani
aDugaDuku nE vEDitE
naDuchurA nI mATa teliviki tETa
poDachurA nIdanuchurA SrIkRshNa rAjEndra
చరణం
charaNam 2
సాధించకురా మాట్లాడరా
బాధ తీర్చి నన్నేల నిదానమేల లోల
భూధర సుందర ఏదిరా మోవీయరా
సదాసివార్తి భంజనా నీ సన్నిధి పెన్నిధిరా
ముదాస్పద హృదంబుజంబుల భావము తెలుపక
sAdhinchakurA mATlADarA
bAdha tIrchi nannEla nidAnamEla lOla
bhUdhara sundara EdirA mOvIyarA
sadAsivArti bhanjanA nI sannidhi pennidhirA
mudAspada hRdambujambula bhAvamu telupaka

#398 రాగముతో rAgamuto

TitleరాగముతోrAgamutO
Written By
Book
రాగం rAgaరాగమాలికrAgamAlika
తాళం tALaత్రిశ్ర ఆదిtriSra Adi
పల్లవి pallaviరాగముతో మాలిక వేయవే బాలా
అనురాగముతో
rAgamutO mAlika vEyavE bAlA
anurAgamutO
సాగర సువిశాల హృదయ చామరాజునికి
విసరి చామర రాగముతో
సామజవరదుని సమాన సారసాక్షుడే
సామిని నమ్మినవారికి భయములేలనే
కోమల సమీర తరంగ వైభోగ రంగుడై
sAgara suviSAla hRdaya chAmarAjuniki
visari chAmara rAgamutO
sAmajavaraduni samAna sArasAkshuDE
sAmini namminavAriki bhayamulElanE
kOmala samIra taranga vaibhOga ranguDai
శాంత కల్యాణ గుణాధారుడైన మా దొర
కింత ఆనందమీయ వలచి వచ్చితిరా
కుంతలములను దూపి నిలచియుంటి
SAnta kalyANa guNAdhAruDaina mA dora
kinta AnandamIya valachi vachchitirA
kuntalamulanu dUpi nilachiyunTi
కామము వర్ధిల్లిన మనములగు చుండరని
శ్శీమ సుమసౌరభము ముదమీయగ
ఏమివ్వరాళి మనసు నీదు కాదుగా
kAmamu vardhillina manamulagu chunDarani
SSIma sumasaurabhamu mudamIyaga
EmivvarALi manasu nIdu kAdugA
ఆనాటి నుండె భక్తితో ఆనాటి పూర్వికుల
మాట యెపుడు తప్పక ఎవ్వరి మాట లేటి
కాంబోది జనరంజకుని విరాట దర్బారులో
మధ్యమావృతజనుల
AnATi nunDe bhaktitO AnATi pUrvikula
mATa yepuDu tappaka evvari mATa lETi
kAmbOdi janaranjakuni virATa darbArulO
madhyamAvRtajanula

#397 పోరా దానింటికి pOrA dAninTiki

Titleపోరా దానింటికిpOrA dAninTiki
Written By
Bookగాయక లోచనముgAyaka lOchanamu
రాగం rAgaహిందుస్థాని కాఫిhindusthAni kAfi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviపోరా దానింటికి సామి
చాల ప్రొద్దాయెరా ఆ
వారిజాక్షి విన్నను మోసము
pOrA dAninTiki sAmi
chAla proddAyerA A
vArijAkshi vinnanu mOsamu
నక్క వినయములు నిజమని
యెంతో నమ్మియుంటి గదరా
పక్క జేర రావద్దుర యిక
nakka vinayamulu nijamani
yentO nammiyunTi gadarA
pakka jEra rAvaddura yika
తేనెలూర నాతో పలుకుచు ఆ
చాన కడకు పోనేలా
కాని వారికిది వేడుక గద
tEnelUra nAtO palukuchu A
chAna kaDaku pOnElA
kAni vArikidi vEDuka gada
సరసమైన మాటలు వేరాయె
చనువు దూరమాయె
మరుని కేళికి ఇక సున్నే గద
sarasamaina mATalu vErAye
chanuvu dUramAye
maruni kELiki ika sunnE gada
జాజి సరము లంపిన వెగటాయె
చాల కోపమాయె రాజగోపాల చాలునిక
jAji saramu lampina vegaTAye
chAla kOpamAye rAjagOpAla chAlunika

#396 చలమేలర నాపై chalamElara nApai

Titleచలమేలర నాపైchalamElara nApai
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaనాటకురంజిnATakuranji
తాళం tALa????
పల్లవి pallaviచలమేలర నాపై జలజ నేత్రుడ
పిలిచిన పలుకవు
chalamElara nApai jalaja nEtruDa
pilichina palukavu
కలకాలము నీ చెలిమి సేయనే
తలచి పిలచి వచ్చి యుండగ
kalakAlamu nI chelimi sEyanE
talachi pilachi vachchi yunDaga
నీ సరసముల నీటులు నీ సొగసు నీ చతురత
నీ హొయలు నీ గుణములు నీ సరిసమ రసికులు
నే నరసి జూడ దొరకలేక మరులు మించి మొరలిడ
nI sarasamula nITulu nI sogasu nI chaturata
nI hoyalu nI guNamulu nI sarisama rasikulu
nE narasi jUDa dorakalEka marulu minchi moraliDa
సారసరిపుని కోరు చకోరక దీనుల నమ్మరు
సారెకు నీ మరుగున చేరదలచి చెలులతో మన
సార విచారమెల్ల చెలియార దెలిపియు బ్రోవక
sArasaripuni kOru chakOraka dInula nammaru
sAreku nI maruguna chEradalachi chelulatO mana
sAra vichAramella cheliyAra delipiyu brOvaka
తాళని మారుబారుని బాలిక చెలిమితో
పూమాలికలు వేయు వేల నేడు సమయమిదే
యని తాళవన లోలయని పలుతరగున పిలిచితె
tALani mArubAruni bAlika chelimitO
pUmAlikalu vEyu vEla nEDu samayamidE
yani tALavana lOlayani palutaraguna pilichite

#395 ఎన్నాళ్ళు సైరింతునే ennALLu sairintunE

Titleఎన్నాళ్ళు సైరింతునేennALLu sairintunE
Written Byతచ్చూరుtachchUru
Book
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఎన్నాళ్ళు సైరింతునే ఓ చెలియనే
సామిని తోడి తేవే
ennALLu sairintunE O cheliyanE
sAmini tODi tEvE
క్రొన్నన విల్తుడు కోపముతోను
తిన్నగ నాపై శరము లేసెనే సామి
kronnana viltuDu kOpamutOnu
tinnaga nApai Saramu lEsenE sAmi
కనుల పండువై కాచెడు
వెన్నెల మనసు కెంతో గాసిని బుట్టించెనే సామి
kanula panDuvai kAcheDu
vennela manasu kentO gAsini buTTinchenE sAmi
కోకిలలెల్ల గుంపులు గూడి
ఓ కమలాక్షి రవములు గావించెనే సామి
kOkilalella gumpulu gUDi
O kamalAkshi ravamulu gAvinchenE sAmi
సింగర సుతుడు చెంగట బాసి
అంగన గూడి ఇందు రాకున్నాడె సామి
singara sutuDu chengaTa bAsi
angana gUDi indu rAkunnADe sAmi

#394 ఏమే మాయలాడి EmE mAyalADi

వైరాగ్య జావళి vairAgya jAvaLi

Titleఏమే మాయలాడిEmE mAyalADi
Written By??
Book
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏమే మాయలాడి చాలు నీ
ప్రమాదమైన మోడి
EmE mAyalADi chAlu nI
pramAdamaina mODi
సామి దాచుకున్న ధామము తెలిసినదే
కామప్రలోభము జేసి కట్టేసినావేమి మాయలాడి
sAmi dAchukunna dhAmamu telisinadE
kAmapralObhamu jEsi kaTTEsinAvEmi mAyalADi
ధాతుడు లేనింటిలో సేవకుడే
రేతిరి పడకెక్కినట్లు
ఏ తరగున నీవు నమ్మించి వారి బంధించి
గురి తప్పించి నొప్పించేవేమే
dhAtuDu lEninTilO sEvakuDE
rEtiri paDakekkinaTlu
E taraguna nIvu namminchi vAri bandhinchi
guri tappinchi noppinchEvEmE

#393 శృంగార శేఖర SRngAra SEkhara

Titleశృంగార శేఖరSRngAra SEkhara
Written Byయోగ నరసింహyOga narasim^ha
Book
రాగం rAgaనీలాంబరిnIlAmbari
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviశృంగార శేఖర బంగారు సామి
సంగీత రాజ భంగపాటాయెరా
SRngAra SEkhara bangAru sAmi
sangIta rAja bhangapATAyerA
అంగజ వర్థన అంగ సంగము పొంది
పొంగుమా పదవి భంగమాయె గదరా
angaja varthana anga sangamu pondi
pongumA padavi bhangamAye gadarA
ముందటివలె గాదు యిప్పటి విరహము
మరుబారి మితిమీరి మరి పొందు లేదాయె
mundaTivale gAdu yippaTi virahamu
marubAri mitimIri mari pondu lEdAye
ఏ పాపుల శాపమో మా పాప ఫలమో
ఆపడీ వెతల మాపాలి దేవుడు
E pApula SApamO mA pApa phalamO
ApaDI vetala mApAli dEvuDu