#475 సయ్యాటలకు sayyATalaku

Titleసయ్యాటలకుsayyATalaku
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviసయ్యాటలకు తగినదిరా నేడా
ఒయ్యారిని దయ చేకొనరా
sayyATalaku taginadirA nEDA
oyyArini daya chEkonarA
చరణం
charaNam 1
ముద్దు గారురా సుందరి మోమున
ముద్దు గాఱురా వయసు
మదన తాపమిక సైపదురా
muddu gArurA sundari mOmuna
muddu gA~rurA vayasu
madana tApamika saipadurA
చరణం
charaNam 2
కప్పు రాలురా కొప్పున కలికికి
కప్పు రాలురా తనువు చపలాక్షి
నిపుడు కనుగొనరా
kappu rAlurA koppuna kalikiki
kappu rAlurA tanuvu chapalAkshi
nipuDu kanugonarA
చరణం
charaNam 3
ధర్మము రారా చెలి మర్మ మెఱుగ
ధర్మ పురీశుడ రారా
తరుణి నేలనిది సమయమురా నేడా
ఒయ్యారిని దయ చేకొనరా
dharmamu rArA cheli marma me~ruga
dharma purISuDa rArA
taruNi nElanidi samayamurA nEDA
oyyArini daya chEkonarA
23 Jan 2022 Mudra indicates this would have been written by Sri dharmapuri subbarAya ayyar!

#474 అయ్యో విభుడు ayyO vibhuDu

Titleఅయ్యో విభుడుayyO vibhuDu
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకేదార గౌళkEdAra gauLa
తాళం tALaఆదిAdi
Previously posted at62
పల్లవి pallaviఅయ్యో విభుడు నను మఱచెనే
నేనెట్లోర్వ గలనే ఓ లలనా
ayyO vibhuDu nanu ma~rachenE
nEneTlOrva galanE O lalanA
చరణం
charaNam 1
సయ్యాటలకు రమ్మని సఖులను నే
వెయ్యాఱు తడప లంపినను ఆ
గయ్యాళి వలలో తగిలి రాడాయె ||నేనెట్లో||
sayyATalaku rammani sakhulanu nE
veyyA~ru taDapa lampinanu A
gayyALi valalO tagili rADAye ||nEneTlO||
చరణం
charaNam 2
గరాగరిక గల దొరా దొరని నే
బరాతములు పంపిన రాక
పరాముఖము సలిపి రాడాయె ||నేనెట్లో||
garAgarika gala dorA dorani nE
barAtamulu pampina rAka
parAmukhamu salipi rADAye ||nEneTlO||
చరణం
charaNam 3
తరాతరము లేని యా సవతి నా
బరాబరిక నెంచిన గాక
నిరాకరించె శ్రీ ధర్మ పురీశుడు ||నేనెట్లో||
tarAtaramu lEni yA savati nA
barAbarika nenchina gAka
nirAkarinche SrI dharma purISuDu ||nEneTlO||

#473 పోవే పోవే pOvE pOvE

Titleపోవే పోవేpOvE pOvE
Written Byధర్మపురి?dharmapuri?
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaయమునా కల్యాణిyamunA kalyANi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviపోవే పోవే పోవే పోవే చెలి ||వేగ||pOvE pOvE pOvE pOvE cheli ||vEga||
పోవే వానిటు వేగ తేవే చెలీpOvE vAniTu vEga tEvE chelI
చరణం
charaNam 1
మదనుడు పదను శరము లెదనేయ
మదన సదన మింక పదనించె గదవే
madanuDu padanu Saramu ledanEya
madana sadana minka padaninche gadavE
ననబోణి వినవె ఆ వనజ వైరి యిపుడు
నను బాధించేది న్యాయ మౌనటవే
nanabONi vinave A vanaja vairi yipuDu
nanu bAdhinchEdi nyAya maunaTavE
సరసుడైన ధర్మ పురమున నెలకొన్న
పర వాసుదేవుని తేవే చెలి
sarasuDaina dharma puramuna nelakonna
para vAsudEvuni tEvE cheli

#472 వానికి మరులైతి vAniki marulaiti

Titleవానికి మరులైతిvAniki marulaiti
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviవానికి మరులైతి గదవే చెలియా
మానినీ మణి వాని మరియాదెఱుగక
vAniki marulaiti gadavE cheliyA
mAninI maNi vAni mariyAde~rugaka
చరణం
charaNam 1
మును నను గూడిన ముచ్చటలెల్ల
తన మది నెంచక దాచు
munu nanu gUDina muchchaTalella
tana madi nenchaka dAchu
చరణం
charaNam 2
మగువరో నాపై మమత దేలించక
పగతుల గుణములు పొగడు
maguvarO nApai mamata dElinchaka
pagatula guNamulu pogaDu
చరణం
charaNam 3
భామరో తానిటు బాసలు జేసి
మోమిటు చూపని మోసకారికి
bhAmarO tAniTu bAsalu jEsi
mOmiTu chUpani mOsakAriki
చరణం
charaNam 4
వర భీమేశుని వంచన లెఱుగక
సరసిజ ముఖి నే చాలా వలచి
vara bhImESuni vanchana le~rugaka
sarasija mukhi nE chAlA valachi

#471 సామిగ నాతో sAmiga nAtO

Titleసామిగ నాతోsAmiga nAtO
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
Previously posted at18
పల్లవి pallaviసామిగ నాతో మాట్లాడవెందుకురా
అరమరిక లిక నేలరా
sAmiga nAtO mATlADavendukurA
aramarika lika nElarA
చరణం
charaNam 1
చిఱుత ప్రాయమునాడే చేసిన చెలిమిని
మఱచుట తగునేమిరా
chi~ruta prAyamunADE chEsina chelimini
ma~rachuTa tagunEmirA
చరణం
charaNam 2
సొగసుగా నిన్నే చూచి సోలి వచ్చిన దాన
అగడేల చేసేవురా
sogasugA ninnE chUchi sOli vachchina dAna
agaDEla chEsEvurA
చరణం
charaNam 3
వరభీమేశ నీ వంచెన తెలిసెను
అరమరిక నేలరా
varabhImESa nI vanchena telisenu
aramarika nElarA

#470 ఈ విరహ మెటులోర్తునె I viraha meTulOrtune

Titleఈ విరహ మెటులోర్తునెI viraha meTulOrtune
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaత్రిశ్ర లఘువుtriSra laghuvu
Previously posted at4, 147
పల్లవి pallaviఈ విరహ మెటులోర్తునె చెలియాI viraha meTulOrtune cheliyA
చరణం
charaNam 1
నేనేమి సేతు నా మనోహరుండు రాడటే
నా సామి కే మిఠారి దూఱు చెప్పెనో చెలియా
nEnEmi sEtu nA manOharunDu rADaTE
nA sAmi kE miThAri dU~ru cheppenO cheliyA
చరణం
charaNam 2
ఎందాక సైతు వాని బాసి ఈ సుమ శరుని
చిగురాకు బాకుచే కుచంబు దాకెనే చెలియా
endAka saitu vAni bAsi I suma Saruni
chigurAku bAkuchE kuchambu dAkenE cheliyA
చరణం
charaNam 3
రతి కేళి నేలు వేళనో మరాళ గామిని
నే తాళజాల బాల చంద్ర సామిని బాసి
rati kELi nElu vELanO marALa gAmini
nE tALajAla bAla chandra sAmini bAsi

#469 ఏలా మనకు ElA manaku

Titleఏలా మనకుElA manaku
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously posted at 27
పల్లవి pallaviఏలా మనకు వాని జోలి చెలిElA manaku vAni jOli cheli
చరణం
charaNam 1
మాటిమాటికి ఈ రాపైతే
ఏటి మాట పోపో పోవే
నాటి బాస లేమాయె చెలి
mATimATiki I rApaitE
ETi mATa pOpO pOvE
nATi bAsa lEmAye cheli
చరణం
charaNam 2
మారుబారికి మీఱి నేను
చేరి పిలిచినందుకా
వేఱు మాటలాడెనే చెలి
mArubAriki mI~ri nEnu
chEri pilichinandukA
vE~ru mATalADenE cheli
చరణం
charaNam 3
సారోదారుడౌ సదయ భీమేశుడు
సరస జేరి నన్ను గూడి
విరసమెంతో చేసెనే చెలి
sArOdAruDau sadaya bhImESuDu
sarasa jEri nannu gUDi
virasamentO chEsenE cheli

#468 సామి రాడేమందునే sAmi rADEmandunE

Titleసామి రాడేమందునేsAmi rADEmandunE
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaబ్యాగుbyAgu
తాళం tALaరూపకrUpaka
Previously Posted At5, 137
పల్లవి pallaviసామి రాడేమందునే చానరో తోడితేవే
నిమిషము తామసింప లేనే
sAmi rADEmandunE chAnarO tODitEvE
nimishamu tAmasimpa lEnE
కోమలాంగి వాని కెంతటి మందు బెట్టనే
ఎంతటి మాయ చేసెనే
kOmalAngi vAni kentaTi mandu beTTanE
entaTi mAya chEsenE
ఇందుముఖీ వాని బాసి ఎట్లు సైతునే
ఈ వలపెట్లు సైతునే
indumukhI vAni bAsi eTlu saitunE
I valapeTlu saitunE
ముందు నన్ను గూడిన బాలచంద్ర నాథుడే
వాడతి సుందరాంగుడే
mundu nannu gUDina bAlachandra nAthuDE
vADati sundarAnguDE

#467 సరసకు రారా sarasaku rArA

Titleసరసకు రారాsarasaku rArA
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaచాపుchApu
Previously posted at 56
పల్లవి pallaviసరసకు రారా సామి మ్రొక్కేరాsarasaku rArA sAmi mrokkErA
చరణం
charaNam 1
మరులు గొన్న నాకు మనసీయవేరా
తరుణి పెట్టిన మందు తలకెక్కె నటరా
marulu gonna nAku manasIyavErA
taruNi peTTina mandu talakekke naTarA
చరణం
charaNam 2
నిరతము నిన్ను నే నెఱనమ్మినారా
కరుణను నను నేల గారడమేలా
niratamu ninnu nE ne~ranamminArA
karuNanu nanu nEla gAraDamElA
చరణం
charaNam 3
పూజ సేయుట నీకు పొందిక లేదా
రాజస మేలరా రాజ గోపాలా
pUja sEyuTa nIku pondika lEdA
rAjasa mElarA rAja gOpAlA

#466 పోరా దానింటికి pOrA dAninTiki

Titleపోరా దానింటికిpOrA dAninTiki
Written Byతచ్చూరు శింగరాచార్యులుtachchUru SingarAchAryulu
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously posted at397
పల్లవి pallaviపోరా దానింటికి సామి చాల ప్రొద్దాయెరా
ఆ వారిజాక్షి విన్నను మోసము
pOrA dAninTiki sAmi chAla proddAyerA
A vArijAkshi vinnanu mOsamu
చరణం
charaNam 1
నక్క వినయములు నిజమని యెంతో నమ్మి యుంటి గదరా
పక్క జేర రావద్దుర యిక
nakka vinayamulu nijamani yentO nammi yunTi gadarA
pakka jEra rAvaddura yika
చరణం
charaNam 2
తేనెలూర నాతో బలుకుచు ఆ చాన కడకు పోనేలా
కాని వారికిది వేడుక గద
tEnelUra nAtO balukuchu A chAna kaDaku pOnElA
kAni vArikidi vEDuka gada
చరణం
charaNam 3
సరసమైన మాటలు వేరాయె చనువు దూరమాయె
మరుని కేళికి ఇక సున్నే గద
sarasamaina mATalu vErAye chanuvu dUramAye
maruni kELiki ika sunnE gada
చరణం
charaNam 4
జాజి సరము లంపిన వెగటాయె చాల కోపమాయె
రాజగోపాల చాలునిక
jAji saramu lampina vegaTAye chAla kOpamAye
rAjagOpAla chAlunika