#181 మానిని వాని mAnini vAni

Titleమానిని వానిmAnini vAni
Written By
BookprAchIna-navIna
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
మానిని వాని జోలి దానను నే గానేmAnini vAni jOli dAnanu nE gAnE
కాని దాని మాట విని కరుణ మరచియుండెనే వోkAni dAni mATa vini karuNa marachiyumDenE vO
చరణం
charaNam 1
కలికిరొ నను బాయనని పలికినదేమాయెనే
అల చెలితో కలిశి రావే అయిదార్నెల లాయెనే వో
kalikiro nanu bAyanani palikinadEmAyenE
ala chelitO kaliSi rAvE ayidArnela lAyenE vO
చరణం
charaNam 2
బోటిరొ నను వీడనని బూటకములు జేసెనే
మాట దప్పియున్న వాని మోముజూడ రాదే వో
bOTiro nanu vIDanani bUTakamulu jEsenE
mATa dappiyunna vAni mOmujUDa rAdE vO
చరణం
charaNam 3
సన్నుతాంగి చాల వలసి యిన్ని దినములుంటినే
నిన్ను గూడి వెంకటేశుడన్న మాట వింటినే వో
sannutAmgi chAla valasi yinni dinamulumTinE
ninnu gUDi vemkaTESuDanna mATa vimTinE vO

#180 యింతలో yimtalO

Titleయింతలో (ప్రతి)yimtalO (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
యింతలో మరచితి వేమిరా సామిyimtalO marachiti vEmirA sAmi
కంతుకేళిలోనం గారవించుటkamtukELilOnam gAravimchuTa
చరణం
charaNam 1
దారిజూచి నన్ను దలచి చెలిని నా
పేరనె బిలుచుదును
సారెకు గాకున్న చాల సొమ్మసిల్లె
dArijUchi nannu dalachi chelini nA
pErane biluchudunu
sAreku gAkunna chAla sommasille
చరణం
charaNam 2
కన్నె నిన్ను బాసి ఘడియై గాకను సన్నుతాంగి యనుచు కన్నీరు నించుచు
కడుబాధ నొందిన
kanne ninnu bAsi ghaDiyai gAkanu sannutAmgi yanuchu kannIru nimchuchu
kaDubAdha nomdina
చరణం
charaNam 3
ప్రేమతో ముద్దులు బెట్టుచు నన్ను
కామించి శ్రీ రేపలె ధామ కౌగిలించి దయతోడ నెనసిన
prEmatO muddulu beTTuchu nannu
kAmimchi SrI rEpale dhAma kaugilimchi dayatODa nenasina

#178 సామిని దేగదే sAmini dEgadE

Titleసామిని దేగదే (ప్రతి)sAmini dEgadE (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సామిని దేగదే చానరో వేగమేsAmini dEgadE chAnarO vEgamE
చరణం
charaNam 1
కామజనకుడే కామిని యింటను ఘనమని యుండెనో వో చెలిkAmajanakuDE kAmini yimTanu ghanamani yumDenO vO cheli
చరణం
charaNam 2
జగతిని పురుషుల సఖియరో నమ్మగ
తగదని దెల్పిరే వో చెలి
jagatini purushula sakhiyarO nammaga
tagadani delpirE vO cheli
చరణం
charaNam 3
పడతి రేపలె గోపాలుడు మది నను
బాగని మరచెనె వో చెలి
paDati rEpale gOpAluDu madi nanu
bAgani marachene vO cheli

#177 మానాభిమానము mAnAbhimAnamu

This jAvaLi was published earlier too – from a different book. Lyrics have minor differences

TitleమానాభిమానముmAnAbhimAnamu
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మానాభిమానము లాతనిదే చెలిmAnAbhimAnamu lAtanidE cheli
చరణం
charaNam 1
మునుపటి నెనరైన తన మది నెంచక
ననబోడి రాడాయనే ఆయనె చెలి
munupaTi nenaraina tana madi nemchaka
nanabODi rADAyanE Ayane cheli
చరణం
charaNam 2
తరుణి బోధన విని తానిందు రాడాయె
కరుణయు లేదాయెనె ఆయనె చెలి
taruNi bOdhana vini tAnimdu rADAye
karuNayu lEdAyene Ayane cheli
చరణం
charaNam 3
వనితరొ గోపాలుడు నన్నేలుట
తనదె భారమనెనే అనెనె చెలి
vanitaro gOpAluDu nannEluTa
tanade bhAramanenE anene cheli

#176 రారా మేర rArA mEra

Titleరారా మేర (ప్రతి)rArA mEra (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రారా మేర నేరము లేలరrArA mEra nEramu lElara
మారునికేళికి మదనజనక యిటుmArunikELiki madanajanaka yiTu
చరణం
charaNam 1
కూరిమితో దానిగూడిటు రాకను
సారెకు నన్నేచ సరసుడ చాలుర
kUrimitO dAnigUDiTu rAkanu
sAreku nannEcha sarasuDa chAlura
చరణం
charaNam 2
యెంతసేపు నేనిటు తాళుదుర
దంతము జేసేవా పడతి బోధనేర
yemtasEpu nEniTu tALudura
damtamu jEsEvA paDati bOdhanEra
చరణం
charaNam 3
స్థిరముగ రేపలెపుర మందిర నీ
కరుణ గోరితిర కఠినము లేలర
sthiramuga rEpalepura mamdira nI
karuNa gOritira kaThinamu lElara

#174 రామరో rAmarO

Titleరామరో (ప్రతి)rAmarO (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaకమాచిkamAchi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రామరో సామి నిటు రమ్మనవే ఓrAmarO sAmi niTu rammanavE O
కామించి గూడుటకు కలకంఠి సమయముkAminchi gUDuTaku kalakamThi samayamu
చరణం
charaNam 1
సరసిజలోచనుడు సమయమెరుగక నను
మరుకేళి గూడుమనెనే ఓ
sarasijalOchanuDu samayamerugaka nanu
marukELi gUDumanenE O
చరణం
charaNam 2
వదలక ఈ రేయి వరునితో గూడుటకు
సదయుడై తామెచ్చునే ఓ
vadalaka I rEyi varunitO gUDuTaku
sadayuDai tAmechchunE O
చరణం
charaNam 3
వనిత రేపలె పురవాసుడు నను జూచి
కనికరముంచుమనెనే ఓ
vanita rEpale puravAsuDu nanu jUchi
kanikaramumchumanenE O

#173 రమణిరో ramaNirO

TitleరమణిరోramaNirO
Written Byతిరుమల దేవరాయలుtirumala dEvarAyalu
BookprAchIna-navIna
రాగం rAgaకమాచిkamAchi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రమణిరో సామి రాతి రేమనెనే ఓramaNirO sAmi rAti rEmanenE O
చరణం
charaNam 1
కమల నయనరొ నా కాంతుడు జూచి తా
సుముఖుడై వరియించెనే ఓ
kamala nayanaro nA kAmtuDu jUchi tA
sumukhuDai variyimchenE O
చరణం
charaNam 2
కర్పూర వీటికాగంధ పుష్పాదుల
నర్పణశాయ గైకొనెనే ఓ
karpUra vITikAgandha pushpAdula
narpaNaSAya gaikonenE O
చరణం
charaNam 3
తిరుమల దేవరాయ కరివీరకాదీయ
కరుణతో జూచి గైకొనెనే ఓ
tirumala dEvarAya karivIrakAdIya
karuNatO jUchi gaikonenE O

01 Oct 2025: Added “Written By” as tirumala dEvarAyalu – as found in the Thesis Section 4.1.2

#172 నిలువదె niluvade

Titleనిలువదె (ప్రతి)niluvade (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
నిలువదె నా మది కలకంఠి వాని
రూపు కనుల జూడగనె
niluvade nA madi kalakamThi vAni
rUpu kanula jUDagane
చరణం
charaNam 1
రతి సల్పుదును నను హితవుతో పలుమారు
బతిమాలినది నాదు భావమ్ము దలచగ
rati salpudunu nanu hitavutO palumAru
batimAlinadi nAdu bhAvammu dalachaga
చరణం
charaNam 2
రహిబుట్టగ తోడి రాగము వాని
సాహాయము చే బాడినది సరసిజాక్షి దెల్పగనే
rahibuTTaga tODi rAgamu vAni
sAhAyamu chE bADinadi sarasijAkshi delpaganE
చరణం
charaNam 3
రామ రేపలె పుర రాజగోపాలునితో
కాముని కేళిలొ కలియుటెన్నటికొ
rAma rEpale pura rAjagOpAlunitO
kAmuni kELilo kaliyuTennaTiko

#171 మరపురాదే marapurAdE

TitleమరపురాదేmarapurAdE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మరపురాదే చెలి
వరగోపాలుని హొయలు
కాంత వినవె
marapurAdE cheli
varagOpAluni hoyalu
kAmta vinave
చరణం
charaNam 1
చంద్రకాంతపు మేడలో కాంతుడు నను
యేకాంతమాడినది
chandrakAmtapu mEDalO kAmtuDu nanu
yEkAmtamADinadi
చరణం
charaNam 2
యిద్దరము నిల్వుటద్దము లోపల
ముద్దుబెట్టి రతి సుద్దులాడినది
yiddaramu nilvuTaddamu lOpala
muddubeTTi rati suddulADinadi
చరణం
charaNam 3
ఆసిగ నుపరతి జేసెడు వేళ నాయాసపు చెమటలు దీసి వేసినదిAsiga nuparati jEseDu vELa nAyAsapu chemaTalu dIsi vEsinadi

#170 సామి నిటు sAmi niTu

Titleసామి నిటు (ప్రతి)sAmi niTu (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సామి నిటు రమ్మనవే సఖిsAmi niTu rammanavE sakhi
చరణం
charaNam 1
భామామణి నేనేమని దెల్పుదు
కామినితొ యీ రేయి కాముకేళి గూడెనది
bhAmAmaNi nEnEmani delpudu
kAminito yI rEyi kAmukELi gUDenadi
చరణం
charaNam 2
సుందరి జేసిన క్రిందటి చానెలు
డెందమందు నుంచక నా
పొందు గోరకున్నాడట
sumdari jEsina krindaTi chAnelu
Demdamandu numchaka nA
pomdu gOrakunnADaTa
చరణం
charaNam 3
స్థిరముగ రేపలె పురవరునితో నిక
స్మరుకేళి గూడుట చాలు చాలు పోపోవే
sthiramuga rEpale puravarunitO nika
smarukELi gUDuTa chAlu chAlu pOpOvE