#109 రఘువీర రణధీర raghuvIra raNadhIra

Titleరఘువీర రణధీరraghuvIra raNadhIra
Written Byత్యాగరాజtyAgarAja
BookprAchIna-navIna
రాగం rAgaమాంజిmAmji
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
రఘువీర రణధీర రారా రాజకుమారraghuvIra raNadhIra rArA rAjakumAra
భృగు సూన మదవిదార బృందారకాధారbhRgu sUna madavidAra bRndArakAdhAra
చరణం
charaNam 1
రావణఘట కర్ణబల రాత్రించర దనుజారీ
స్థావర జంగమరూప త్యాగరాజ పాదార్చిత
rAvaNaghaTa karNabala rAtrimchara danujArI
sthAvara jamgamarUpa tyAgarAja pAdArchita

Not a jAvaLi! Available on YouTube and other web sites, but mentioned as a different rAga

#108 సామజయాన sAmajayAna

Titleసామజయాన (ప్రతి)sAmajayAna (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
సామజయాన ప్రాణసఖుని దోడి తేవేsAmajayAna prANasakhuni dODi tEvE
చరణం
charaNam 1
కాముకేళి లోనం గలసిన నాధుని
భామిని బాగుగ బ్రోవుమని
kAmukELi lOnam galasina nAdhuni
bhAmini bAguga brOvumani
చరణం
charaNam 2
చందురు వెన్నెల పొందుగ గాయగ
సుందరీ మందర ధీరుని
chamduru vennela pomduga gAyaga
sumdarI mamdara dhIruni
చరణం
charaNam 3
పవనుడు మార్కొని బాధలు బెట్టగ
యువిదరో కవి బుధలోలుని
pavanuDu mArkoni bAdhalu beTTaga
yuvidarO kavi budhalOluni
చరణం
charaNam 4
గౌరిశెట్టి కుల ఘన కమలాకర
సారసారిని శ్రీరాముని
gauriSeTTi kula ghana kamalAkara
sArasArini SrIrAmuni

#106 సుందరి నేలుముర sumdari nElumura

Titleసుందరి నేలుముర (ప్రతి)sumdari nElumura (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సుందరి నేలుముర సామిsumdari nElumura sAmi
కుందరదనమో మిందుని బోలురkumdaradanamO mimduni bOlura
చరణం
charaNam 1
అంగన కురులు సారంగము నేలు
శోభాంగిని బొగడగ పద్మజుని వశమె
amgana kurulu sAramgamu nElu
SObhAmgini bogaDaga padmajuni vaSame
చరణం
charaNam 2
చెలియ పయోధరములు లికుచ ఫలంబుల మీరును యా లలనను కలియరcheliya payOdharamulu likucha phalambula mIrunu yA lalananu kaliyara
చరణం
charaNam 3
సుమశరు బారికి సుదతి తాళనని
కమలనయన నీ కరుణను గోరిన
sumaSaru bAriki sudati tALanani
kamalanayana nI karuNanu gOrina
చరణం
charaNam 4
సరవితో శ్రీపీఠి సద్వంశజమణి
గరితనేలు చారుస్మర రాఘావాచార్య
saravitO SrIpIThi sadvamSajamaNi
garitanElu chArusmara rAghAvAchArya

#105 సామిని రమ్మనవే sAmini rammanavE

Titleసామిని రమ్మనవేsAmini rammanavE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
సామిని రమ్మనవే సఖి
కామిని వినవె శ్రీకాళహస్తీపుర
ధామునిపై మరులు దాచగలేనే
sAmini rammanavE sakhi
kAmini vinave SrIkALahastIpura
dhAmunipai marulu dAchagalEnE
చరణం
charaNam 1
అన్నము నోటికింపుగ లేదె
నానుబాలజుంటి తేనియు చేదే
annamu nOTikimpuga lEde
nAnubAlajumTi tEniyu chEdE
చరణం
charaNam 2
మారుడు తాను బల్ మమతతోను
సారెకు విల్వంచి సాహస మొనర్చెనే
mAruDu tAnu bal mamatatOnu
sAreku vilvamchi sAhasa monarchenE
చరణం
charaNam 3
నేటికి సామిని సూటిగ దెచ్చితె
బోటిరొ నీకు నె కోటిదలిత్తునే
nETiki sAmini sUTiga dechchite
bOTiro nIku ne kOTidalittunE

#104 రాఘవాచార్య నిను rAghavAchArya ninu

Titleరాఘవాచార్య నిను (ప్రతి)rAghavAchArya ninu (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
రాఘవాచార్య నిను నమ్మినాను
యీ చలికులను యింపుతోను
rAghavAchArya ninu namminAnu
yI chalikulanu yimputOnu
చరణం
charaNam 1
చిన్ననాడె నీదు చిన్నెలన్ని చూచి
యెన్నగాను వలసున్నదాన
chinnanADe nIdu chinnelanni chUchi
yennagAnu valasunnadAna
చరణం
charaNam 2
సన్నుతాంగ మది సమయమిది యనుచు
నన్ను బ్రోవకను కన్నడేల
sannutAmga madi samayamidi yanuchu
nannu brOvakanu kannaDEla
చరణం
charaNam 3
మాలిమితో నను మారుని బాధకు
చాల గాసి జేయకు జాలికుల
mAlimitO nanu mAruni bAdhaku
chAla gAsi jEyaku jAlikula
చరణం
charaNam 4
సరవితో శ్రీపీఠీ సద్వంశజుడవని
కరుణగోరినాడ కఠినమేర
saravitO SrIpIThI sadwamSajuDavani
karuNagOrinADa kaThinamEra

103 మాణిక్య నిను mANikya ninu

Titleమాణిక్య నినుmANikya ninu
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
మాణిక్య నిను నమ్మినాను గురుmANikya ninu namminAnu guru
చరణం
charaNam 1

** Original book did NOT have the rest of the lyrics for this “prAchIna” javaLI.

#102 సరసిజ నయనరో sarasija nayanarO

Titleసరసిజ నయనరో (ప్రతి)sarasija nayanarO (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
సరసిజనయనరో సామిని దేవే
అరమరలేలనె అతివరోపోవే
sarasijanayanarO sAmini dEvE
aramaralElane ativarOpOvE
చరణం
charaNam 1
ఆసతో మునుజేసిన బాసలేమాయెనొ
యా సఖి గూడినప్పుడె మరచెనో
AsatO munujEsina bAsalEmAyeno
yA sakhi gUDinappuDe marachenO
చరణం
charaNam 2
కంతుని బారికి నెంతని సైసుదు
నింతిరో వాని కేమని తెల్పుదు
kamtuni bAriki nemtani saisudu
nimtirO vAni kEmani telpudu
చరణం
charaNam 3
రమణిరో పీఠి రాఘవాచార్యుని
కమలనేత్రుని కాముని కేళికిని
ramaNirO pIThi rAghavAchAryuni
kamalanEtruni kAmuni kELikini

#101 కోరేది నీకు kOrEdi nIku

Titleకోరేది నీకుkOrEdi nIku
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
కోరేది నీకు మరియాదె నా కోమలాంగి
ఆరడిబెట్టి నా చెలికాని మీరటు జేసినమ్మిన నామది
kOrEdi nIku mariyAde nA kOmalAmgi
AraDibeTTi nA chelikAni mIraTu jEsinammina nAmadi
చరణం
charaNam 1
యిచ్చపు చెలియింటను జేరి తత్సన జేసే తామరసాక్షిyichchapu cheliyimTanu jEri tatsana jEsE tAmarasAkshi
వేమరు సురపురి వేణుగోపాలుని కామునికేళిలో గలయరాదే vEmaru surapuri vENugOpAluni kAmunikELilO galayarAdE

#100 సారసాక్షి నీపై sArasAkshi nIpai

Titleసారసాక్షి నీపై (ప్రతి)sArasAkshi nIpai (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
సారసాక్షి నీపై మది చాల మరులు కొన్నదిరా
మారుకేళి గూడ రాక మర్మకుల సింధుధీర
sArasAkshi nIpai madi chAla marulu konnadirA
mArukELi gUDa rAka marmakula simdhudhIra
చరణం
charaNam 1
కన్నెనీదు వన్నెబన్నె అన్ని చూచి వలచి మది
యున్నదాని నెనరుబూనకున్న నోర్వజాలదుర
kannenIdu vannebanne anni chUchi valachi madi
yunnadAni nenarubUnakunna nOrvajAladura
చరణం
charaNam 2
మగువ బొమలు మరుని యిల్లు మధురవాణి పాలిండ్లు
సొగసుమీరిన పూలచళ్ళు తగుజాణర నీకు జెల్లు
maguva bomalu maruni yillu madhuravANi pAlimDlu
sogasumIrina pUlachaLLu tagujANara nIku jellu
చరణం
charaNam 3
వసుధ వెలయు శ్రీపీఠి వంశోదధి సుధాకర
రసికుడౌ దాని చేకోర రాఘవాచార్య సుధీర
vasudha velayu SrIpIThi vamSOdadhi sudhAkara
rasikuDau dAni chEkOra rAghavAchArya sudhIra

#99 నాపై ప్రేమలేని nApai prEmalEni

Titleనాపై ప్రేమలేనిnApai prEmalEni
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
నాపై ప్రేమలేని జాడ
నాడే తెలిసెను పోపోపోరా
nApai prEmalEni jADa
nADE telisenu pOpOpOrA
పాపి సవతి మాయలలో జిక్కి
గోపాలుని కొనగోరంతైనా
pApi savati mAyalalO jikki
gOpAluni konagOramtainA
చరణం
charaNam 1
ఎందాక జూచిన నీ మగజాతి యింతుల నేలేదాక ప్రీతి
సందేహమా మాటప్రఖ్యాతి సరసుల లక్షణమా యీ నీతి
emdAka jUchina nI magajAti yimtula nElEdAka prIti
samdEhamA mATaprakhyAti sarasula lakshaNamA yI nIti
చరణం
charaNam 2
మోహమందు మోసమందు యేవేళ బుధ్ధులు నీ యందు
యేలకలిగెనొ యికనేమందు స్నేహము జేసినదే బలుపొందు
mOhamamdu mOsamamdu yEvELa budhdhulu nI yamdu
yElakaligeno yikanEmamdu snEhamu jEsinadE balupomdu
చరణం
charaNam 3
యెప్పటివలెనే యెదపైజేరి తప్పులనెంచకు తాలిమి మీరి
గొప్పగు సురపురి రాజగోపాలా కాముని కేళికి మనసాయెలేరా
yeppaTivalenE yedapaijEri tappulanemchaku tAlimi mIri
goppagu surapuri rAjagOpAlA kAmuni kELiki manasAyelErA