| Title | మానిని మనసు యేల | mAnini manasu yEla |
| Written By | ||
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | మానిని మనసు యాల గరుగదే మనసు నిమిషమైన తాళదె | mAnini manasu yAla garugadE manasu nimishamaina tALade |
| చరణం charaNam 1 | సుదతి రో నీకెదురు చూచి నిదురల్యాక యుంటినె | sudati rO nIkeduru chUchi niduralyAka yunTine |
| చరణం charaNam 2 | సరసకు రమ్మని వేడితె తిరిగి చూడన్యాలనె | sarasaku rammani vEDite tirigi chUDanyAlane |
| చరణం charaNam 3 | ధర్మపురీశుని గూడిన మర్మము మరుపాయనె | dharmapurISuni gUDina marmamu marupAyane |
Category: Carnatic Music
#13 నా పయి ప్రేమలేని nA payi prEmalEni
| Title | నా పయి ప్రేమలేని | nA payi prEmalEni |
| Written By | ||
| రాగం rAga | ఇందుస్తాని | industAni |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | నా పయి ప్రేమలేని జాడ నాడే తెలిసెను పో పోరా | nA payi prEmalEni jADa nADE telisenu pO pOrA |
| చరణం charaNam 1 | పాపి సవతి మాయలలో జిక్కి గోపాలుని కొన గోరంతయిన | pApi savati mAyalalO jikki gOpAluni kona gOrantayina |
| చరణం charaNam 2 | యెందాక జూచిన యీ మొగజాతి యింతుల నేలేదాకా యీ ప్రీతి సందేహమా | yendAka jUchina yI mogajAti yintula nElEdAkA yI prIti sandEhamA |
| చరణం charaNam 3 | మాట ప్రఖ్యాత సరసుల లక్షణ మాయీనీతి మోహమందు గనుసమిందు యే వేళ్ళ బుధ్ధులు | mATa prakhyAta sarasula lakshaNa mAyInIti mOhamandu ganusamindu yE vELLa budhdhulu |
| చరణం charaNam 4 | నీ యందు యెలగలిగెనో యిక యేమలరు స్నేహము చేసినదే బలు పొందు | nI yandu yelagaligenO yika yEmalaru snEhamu chEsinadE balu pondu |
#12 తలచిన తాళగ talachina tALaga
| Title | తలచిన తాళగ | talachina tALaga |
| Written By | ||
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | తలచిన తాళగలేనే వోచెలియ | talachina tALagalEnE vOcheliya |
| చరణం charaNam 1 | కస్తూరి విడమిచ్చి కనికర గతి జూపి కుస్తరించి నన్ను కొసవేడిన | kastUri viDamichchi kanikara gati jUpi kustarinchi nannu kosavEDina |
| చరణం charaNam 2 | కనుర చెక్కుల మోవి చనుల కంఠము చల మున ముక్కు నాభి చుంబనము జేసినవాని | kanura chekkula mOvi chanula kanThamu chala muna mukku nAbhi chumbanamu jEsinavAni |
#11 చాలే చాలే chAlE chAlE
| Title | చాలే చాలే | chAlE chAlE |
| Written By | ||
| రాగం rAga | కన్నడ | kannaDa |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | చాలే చాలే అలవానితొ పొందిక చాలె చాలె యీ లాభము యిక | chAlE chAlE alavAnito pondika chAle chAle yI lAbhamu yika |
| చరణం charaNam 1 | కలకంఠిరో భూతలమందునయె కల్లలు బల్కెడి వారితొ చెలిమి యిక | kalakanThirO bhUtalamandunaye kallalu balkeDi vArito chelimi yika |
| చరణం charaNam 2 | విరిబోణిరో పోకిరి కుక్కలకేమె మారుని సరియని కోరి చేరుటయిక | viribONirO pOkiri kukkalakEme mAruni sariyani kOri chEruTayika |
| చరణం charaNam 3 | అలివేణిరొ ఆ నలినాక్షికి యెమో కాళ్ళకు మ్రొక్కేటి వారితో స్నేహము యిక | alivENiro A nalinAkshiki yemO kALLaku mrokkETi vAritO snEhamu yika |
| చరణం charaNam 4 | ధర యందున శ్రీ పరవాసుని యేమొ సరి సరి జెప్పను యెవ్వరి తరమే యిక | dhara yanduna SrI paravAsuni yEmo sari sari jeppanu yevvari taramE yika |
#10 చానరో వాని బాసి chAnarO vAni bAsi
| Title | చానరో వాని బాసి | chAnarO vAni bAsi |
| Written By | ||
| రాగం rAga | జంజూటి | janjUTi |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | చానరో వాని బాసి నే నెటువలె సయితునే దాని బోధనలను వినుట మానేడేమిసేతునే | chAnarO vAni bAsi nE neTuvale sayitunE dAni bOdhanalanu vinuTa mAnEDEmisEtunE |
| చరణం charaNam 1 | సన్నుతాంగి సరసుడని చాలనమ్మి యుంటినే నిన్న దాని యింటజేరి యున్న వగలు వింటినే | sannutAngi sarasuDani chAlanammi yunTinE ninna dAni yinTajEri yunna vagalu vinTinE |
| చరణం charaNam 2 | సదయుడు మదనుని బారికి ముదముతోనను బ్రోచెనే వదలక తన ప్రాయమెల్ల సుదతి బాలు చేసెనే | sadayuDu madanuni bAriki mudamutOnanu brOchenE vadalaka tana prAyamella sudati bAlu chEsenE |
| చరణం charaNam 3 | వాసవసుతుడైన శ్రీనివాసుడు ననుగూడెనె బాసలెల్ల మరచి యా దోసకారి గూడెను | vAsavasutuDaina SrInivAsuDu nanugUDene bAsalella marachi yA dOsakAri gUDenu |
#8 నీ మోహ మిదేన nI mOha midEna
| Title | నీ మోహ మిదేన | nI mOha midEna |
| Written By | ||
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | నీ మోహ మిదేన నెలకొక సారిందువచ్చి నిలుచుట గాన | nI mOha midEna nelakoka sArinduvachchi niluchuTa gAna |
| చరణం charaNam 1 | తీర తీర మమత మదికి దెలిసెను నాడె తీరున నే నడుచుకొందు యెప్పటి జాడా | tIra tIra mamata madiki delisenu nADe tIruna nE naDuchukondu yeppaTi jADA |
| చరణం charaNam 2 | బాళితీర మమత మదిని దానేనింక యెల బొంకితివి నాతొ ఇంత పరాక | bALitIra mamata madini dAnEninka yela bonkitivi nAto inta parAka |
#7 పో పొమ్మనే pO pommanE
| Title | పో పొమ్మనే | pO pommanE |
| Written By | ||
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | పో పొమ్మనే పొమ్మనె భామరొవాని | pO pommanE pommane bhAmarovAni |
| చరణం charaNam 1 | పొలతిరో చెలువున పోగడు దానింటికి కలకాలమునను కలసిన మోహ తలచనవాని పొందు తగదు తగదుయిక | polatirO cheluvuna pOgaDu dAninTiki kalakAlamunanu kalasina mOha talachanavAni pondu tagadu tagaduyika |
| చరణం charaNam 2 | పగదానిని నా యెదురుగ బొగదుచు జగడము చేయు వాని చెలిమి వలదుయిక | pagadAnini nA yeduruga bogaduchu jagaDamu chEyu vAni chelimi valaduyika |
| చరణం charaNam 3 | వరభీమేశుని వంచన దెలిసెను మరి మరి నాపయి మమత చాలునిక | varabhImESuni vanchana delisenu mari mari nApayi mamata chAlunika |
#4 ఈ విరహమెటులోర్తునె I virahameTulOrtune
| Title | ఈ విరహమెటులోర్తునె | I virahameTulOrtune |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | ఈ విరహ మెటులోర్తునె చెలియా | I viraha meTulOrtune cheliyA |
| చరణం charaNam 1 | నేమిసేతు నా మనోహరుండు రాడటే సామికేమిటారిదూరు విప్పెనె చెలియా | nEmisEtu nA manOharunDu rADaTE sAmikEmiTAridUru vippene cheliyA |
| చరణం charaNam 2 | యెందాక సైతు వానిబాసి యీ సుమశరుని చిగురాకు బాకుచే కుచంబుదాకెనె చెలియ | yendAka saitu vAnibAsi yI sumaSaruni chigurAku bAkuchE kuchambudAkene cheliya |
| చరణం charaNam 3 | రతికేళి వేళ నేలనో మరాళి గామిని నే తాళజాల బాలచంద్ర సామిని బాసి | ratikELi vELa nElanO marALi gAmini nE tALajAla bAlachandra sAmini bAsi |
#3 ఇందుముఖి indumukhi
| Title | ఇందుముఖి | indumukhi |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | ఇందుముఖి వానికీ మన సిందులేదాయ ఏమందునె మాయవాడిందు రాడాయ | indumukhi vAnikI mana simdulEdAya Emamdune mAyavADimdu rADAya |
| చరణం charaNam 1 | చక్కెర విలుకాని పోరు యెక్కువలాయ చక్కనగాదని దెలిసే చానలేదాయ ఏమందునె మాయ | chakkera vilukAni pOru yekkuvalAya chakkanagAdani delisE chAnalEdAya Emamdune mAya |
| చరణం charaNam 2 | ఆశతో మును పాటినట్టి బాసలేమాయ దోసకారి బోధన విని మోసములాయ యేమందునెమాయ | ASatO munu pATinaTTi bAsalEmAya dOsakAri bOdhana vini mOsamulAya yEmandunemAya |
| చరణం charaNam 3 | వెంకటరమణునికి నాపై బింకములాయ పొంకముతో నన్ను గూడ వా డింకరుదాయ యేమందు నెమాయ | venkaTaramaNuniki nApai binkamulAya ponkamutO nannu gUDa vA DinkarudAya yEmandu nemAya |
#2 చెలి మనక్యాల cheli manakyAla
| Title | చెలి మనక్యాల | cheli manakyAla |
| పుస్తకం Book | #Book1900 | |
| Written By | ||
| రాగం rAga | ఇందుస్తాని కాపి | imdustAni kApi |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | చెలి మనక్యాల వానితోను పొందు చాలునే వాని పొందు చాలునే వానితోను పొందు చాలునే | cheli manakyAla vAnitOnu pomdu chAlunE vAni pomdu chAlunE vAnitOnu pomdu chAlunE |
| చరణం charaNam 1 | అక్కర మరి తీరిన పక్కకు రానివ్వడే పక్కకు రానివ్వడలవాని పక్కకు మరిజేర్చడే | akkara mari tIrina pakkaku rAnivvaDE pakkaku rAnivvaDalavAni pakkaku marijErchaDE |
| చరణం charaNam 2 | ఎంగిలి కొనియాడువాని రంగు విడమ్యాలనే రంగువీడమ్యాలనే వాని యెంగిలి మనక్యాలనే | engili koniyADuvAni ramgu viDamyAlanE ramguvIDamyAlanE vAni yemgili manakyAlanE |
| చరణం charaNam 3 | కనికర మెంచిన కౌగలింపు యాలనే ఉగ్గలింపు యాలనే వానికవుగిట మనక్యాలనే | kanikara menchina kaugalimpu yAlanE uggalimpu yAlanE vAnikavugiTa manakyAlanE |
| చరణం charaNam 4 | మర్మమెల్ల యెరిగిన శ్రీధర్మపురీవాసుడే ధర్మపురివాసుడె ఆ కన్యల కేకాంతుడే | marmamella yerigina SrIdharmapurIvAsuDE dharmapurivAsuDe A kanyala kEkAmtuDE |