Title | మ్రొక్కెద సామి | mrokkeda sAmi |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | మ్రొక్కెద సామి నీకు మ్రొక్కెద | mrokkeda sAmi nIku mrokkeda |
చరణం charaNam 1 | రేపు రమ్మని మాపు రమ్మని తేప తేపకు ద్రిప్ప బోకుర కాపురము బాసితిని నీకై యోప జాలర మారు బారి | rEpu rammani mApu rammani tEpa tEpaku drippa bOkura kApuramu bAsitini nIkai yOpa jAlara mAru bAri |
చరణం charaNam 2 | నిబ్బరంబుగ నాదు బిగి చను గుబ్బలం గొని కౌగిలింపర గొబ్బు నను నబ్బబ్బ! యామరు దెబ్బలకు నే నోర్వ జాలర | nibbarambuga nAdu bigi chanu gubbalam goni kaugilimpara gobbu nanu nabbabba! yAmaru debbalaku nE nOrva jAlara |
చరణం charaNam 3 | మల్లెలును విరి జాజి పూవులు కొల్లగా దెప్పించి యుంచితి నుల్లమిక రంజిల్ల నాపై చల్లి పాపర కాము తాపము | mallelunu viri jAji pUvulu kollagA deppinchi yunchiti nullamika ramjilla nApai challi pApara kAmu tApamu |
చరణం charaNam 4 | చాలు చాలు భుజంగ రావటు చాలగా నిను సన్నుతించిన జాలమిటు సేయంగ నౌర యేలరా యీ కోపమేలర? | chAlu chAlu bhujanga rAvaTu chAlagA ninu sannutinchina jAlamiTu sEyanga naura yElarA yI kOpamElara? |
Category: Javali
#524 మేలమా సామీ mElamA sAmI
Title | మేలమా సామీ | mElamA sAmI |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | హిందుస్థాని కాఫీ | hindusthAni kAfI |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | మేలమా? సామీ! యేమిర మేలమా? తాళజాలదు బాలరా మరు- కేళి గూడగ వేళరా తడ- వేల చేసెదు గోలరా నీ లీల నైనను దేఱి చూడవు | mElamA? sAmI! yEmira mElamA? tALajAladu bAlarA maru- kELi gUDaga vELarA taDa- vEla chEsedu gOlarA nI lIla nainanu dE~ri chUDavu |
చరణం charaNam 1 | పంతమా? సామీ! దానితో బంతమా? చెంత చేరవు కోపమా? యిసు- మంత జూడవు శాపమా? యల- కంతుడే చెర పాపమా? యా యింతి నీకయి యెంత సొక్కెర | pantamA? sAmI! dAnitO bantamA? chenta chEravu kOpamA? yisu- manta jUDavu SApamA? yala- kantuDE chera pApamA? yA yinti nIkayi yenta sokkera |
చరణం charaNam 2 | మాటరా సామీ! నీకు మాటరా సాటి దానితో గూటమా? నీ పాటి వారికి వాటమా? యా బోటికై యారాటమా – హా! సూటి కాదది మేటి వారికి | mATarA sAmI! nIku mATarA sATi dAnitO gUTamA? nI pATi vAriki vATamA? yA bOTikai yArATamA – hA! sUTi kAdadi mETi vAriki |
చరణం charaNam 3 | యంత్రమా? సామీ! యేమిర? యంత్రమా మంత్రిప్రగడ కులేంద్రుడు కవి- తంత్ర పరమానందుడు స- న్మంత్రియౌ భుజగేంద్రుడీ నీ మంత్ర మెఱగెను దంత్ర మేలర? | yantramA? sAmI! yEmira? yantramA mantripragaDa kulEndruDu kavi- tantra paramAnanduDu sa- nmantriyau bhujagEndruDI nI mantra me~ragenu dantra mElara? |